శర్మ కాలక్షేపంకబుర్లు-బంగారు పళ్ళానికి కూడా..

బంగారు పళ్ళానికి కూడా…..

“బంగారుపళ్ళానికి కూడా గోడచేరుపుకావాలి” అంటారు. ఇది అనుభవంలోకొస్తే కాని తెలీదు.

నిరుడు పదిమంది కలిసి తిరుమలవెళ్ళేం, వేంకన్నబాబు దర్శనానికి. ఒక రోజు మూడు గంటల వేళ ఎక్కడికో వెళ్ళడానికి ప్లాన్ చేసి అందరిని తయారవమన్నారు, మావాళ్ళు. నేనూ ఇల్లాలు తయారయి రూం నుంచి కిందకి వస్తూ ”మేం కిందవుంటాం మీరు రండని” వచ్చి బయట నిలబడ్డాం.

ఒకాయనెవరో పట్టుపంచకట్టి ఒక పట్టు పంచకప్పుకుని నా దగ్గరకొచ్చి ”ఇక్కడ దగ్గరలో పి.టీ ఉందా?” అన్నారు, ఇంగ్లీష్ లో. “ఈపక్కనే ఉందని” చెయ్యి చూపేను. ఆయన “కార్ పార్క్ ఇదేనా మరొకటి ఉందా?” అన్నారు, ఎదురుగా ఉన్న కార్ పార్క్ కేసి చెయ్యి చూపుతూ. ”నాకు తెలిసి ఇది ఈ కాటేజ్ ల వాళ్ళకి, ఆ పైన మరొక పెద్ద కార్ పార్క్ ఉంద”న్నా. ఆయన ”ఉదయం కార్ లో వచ్చేమండి బెంగుళూరు నుంచి,భార్య,కూతురు, అల్లుడుతో, ఇక్కడ దిగేం, కార్ ఇక్కడే పార్క్ చేసి ఉంచమని డ్రయివర్ తో చెప్పేం. వాడెక్కడా కనపడటం లేదు కారూ కనపడలేద”న్నారు. ”ఫోన్ చేయండయితే” అన్నా. ”మీ సెల్ ఒక సారిస్తారా! మా సెల్ పోన్ లన్నీ కార్లో వదిలేసేం. దర్శనానికి వెళ్ళివచ్చేలోగా డబ్బులక్కరలేదని కూడా ఏమీ ఉంచుకోలేదు” అన్నాడు, పాపం ఈ మాట చెప్పడానికి కొద్దిగా సిగ్గుపడినట్టనిపించింది, మాట తీరునుబట్టి. సెల్ పోన్ ఇచ్చా! ఈ లోగా మావాళ్ళంతా కిందకి దిగేరు, నేను ఆయనకి సెల్ ఇచ్చేను తీసుకుంటే కాని కదలలేని స్థితి. వాళ్ళని ఎదురు చూడమనడం బాగోదని మీరు నడవండి, మేము వెనక వచ్చి కలుస్తామని చెప్పి పంపేసేం, ఇల్లాలు నేనూ నిలబడ్డాం.
ఆయన డ్రయివర్ కి ఫోన్ చేసేడు పలకలేదు, తనఫోన్ నంబరు కి చేసేడు పలకలేదు, ఇంక వరసగా భార్య, కూతురు, అల్లుడు సెల్ నంబర్లకి కూడా చేసేడు, ”పనికిరాని వెధవ ఒక ఫోనూ ఆన్సర్ చెయ్యటం లేద”ని విసుగు, కోపం ప్రదర్శించాడు. ”కంగారు పడకండి, వాడే కాఫీ తాగడానికో పోయి ఉండచ్చు, ఫోన్ లన్నీ బండిలో ఉండి ఉండచ్చు, బండి కూడా తీసుకుపోయి ఉండచ్చు, ఐదు నిమిషాలు చూసి మరలా చేయ”మన్నా! నిజమే ఈ సారి ఫోన్ చేసిన వెంఠనే పలికేడు, వాడిని తిట్టి కార్ అక్కడకు తీసుకు రమ్మని చెప్పి నా ఫోన్ నాకిచ్చేసేడు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేను, ఫోన్ వాడుకోడమే కాక మిమ్మల్ని ఒక అరగంట దాకా నిలబెట్టేసేనని ధన్యవాదాలు చెబుతూ శలవు తీసుకున్నాడు. అప్పటికే చాలా ఆలస్యం కావడంతో మా వాళ్ళు ఎక్కడికెళ్ళేరో, వాళ్ళని వెతుకుతూ పోతే దారి తప్పిపోతాం, దగ్గరలోనే గుడి దగ్గర ఊంజల్ సేవ జరుగుతున్నట్లు ఉంది రండని ఇల్లాలంటే అక్కడికి వెళ్ళి స్వామివారి సాయం ప్రదక్షిణ సేవ, ఊంజల్ సేవ చూశాం. ఇది ఇలా జరగవలసి ఉంది కనక స్వామి వారు మనలని అక్కడ ఆ రూపంలో ఆపు చేసి ఉంటారనుకున్నాం, చాలా బాగా జరిగింది సేవ అప్పుడు ఫోటోలు కూడా తీసేను.

DSCN2358

మొన్ననోరోజు మిత్రుడొకరు ఫోన్ చేసి చాలా అర్జంటు ఒక్కసారి రావాలని చెప్పి ఫోన్ పెట్టేసేడు. కంప్యూటర్ దగ్గరున్నా, పక్కనే ఇంట్లో వేసుకునే చొక్కా ఉంటే వేసుకుని ఇలా వెళ్ళివస్తానని ఇల్లాలికో కేక వేసి బండి దింపుకుని వెళిపోయాను, వెనకనుంచి ఆమె అరుస్తున్నా లెక్క చేయక. మిత్రుని దగ్గరకెళ్ళేను, పని చూసేను, గంట తరవాత బయలుదేరేను. రెండు కిలోమీటర్లు వచ్చేను, బజారులో ఉండగా ఇల్లాలు ఆ రోజు బజారుకు వెళ్ళి తేవలసినదేదో చెప్పినది గుర్తొచ్చింది. విషయం గుర్తొచ్చింది కాని వస్తువేంటో గుర్తురాలేదు. జేబులో చూస్తే సెల్ ఫోన్ లేదు, చిల్లిగవ్వ లేదు. అరె ఇలా అయిందేంటి అనుకుని ఏం చేద్దామని ఆలోచించాను. ఏ కొట్లోకి వెళ్ళి అడిగినా ఫోన్ కావాలని అడిగితే ఇస్తారు, కాని అదేంటో అడగబుద్ధి కాలేదు,సిగ్గేసింది, వెనక్కి వెళ్ళి మిత్రుని దగ్గనుంచి ఇంటికి ఫోన్ చేయచ్చు, మళ్ళీ ఫోన్ కోసం రెండుకిలో మీటర్లు వెనక్కి ఏం వెళతామనిపించింది. ఇంటికే వెళిపోదాం! అవసరమైతే మళ్ళీ వద్దాం, ఇల్లాలు పెట్టే ”తట్టవరస”కి సిద్ధపడి ఇంటికే చేరేను, ఏం జరిగిందన్నది అప్రస్థుతమే కాని, ఒక్కోసారి ఇలా అవసరానికి ఒక రూపాయి కూడా జేబులో, పి.టి నుంచి మాటాడుకోడానికి కూడా లేకపోవడం ఒక వింత అనుభవమే!ఎంతటివారికైనా ఇటువంటి అనుభవాలు, మరొకరి సాయం తప్పవేమో!

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బంగారు పళ్ళానికి కూడా..

  • మిత్రులు బోనగిరిగారు,
   ఆయన సంభాషణా విధానం నన్ను ఆకట్టుకుంది. ఆయనకేం కావాలో నా నోటితో చెప్పించి అప్పుడు సెల్ అడిగేడు చూడండి. ఆయన ఒక పొజిషన్ లో ఉన్నవాడిలాగే కనపడ్డాడు, పెద్దవారు చాలా చిన్న విషయాలు కూడా జాగ్రత్తగా పట్టించుకుంటారు, డ్రైవర్ సెల్ నంబర్ లాటివి కూడా. అందుకే వారు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటారు
   ధన్యవాదాలు.

 1. నమస్తే శర్మగారూ!”
  మన భాష లొని పలుకుబడులకి చక్కటి వివరణ ఇస్తున్నందుకు చాలాథాంక్స్.
  ” శీత కన్ను వేశారు” ఆంటారు కదా
  “శీత” అంటె సీతాదెవి అనా? చలి అనా?
  ……దానిని వివరిస్తారా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s