శర్మ కాలక్షేపంకబుర్లు-గారికి చిల్లి ఎందుకు?

”గారి, వడ లకి తేడా ఏంట”న్నాడు మా సత్తి బాబు, ”గారి వేరు వడ వేరూనయ్యా! గారిని మాషచక్రమని అంటాం. వీటి తయారి గురించి మీ చెల్లెమ్మ చెబుతుంది విను.”

”గారికి పొట్టు మినప పప్పు నాన బోయాలి. పప్పు నానిన తరవాత పొట్టు తీయాలి, గాలించాలి, ఆ తరవాత రుబ్బాలి. ఈ రుబ్బడంలో నే అసలు టెక్నిక్ ఉంది. పిండి పల్చగా రుబ్బు కుంటే నూని లాగేస్తుంది, గారినుంచి నూని వదలదు, మెత్తగానే ఉంటాయి. అలా కాక మెత్తగా ఉండాలి, నూని తక్కువ పీల్చాలంటే గట్టిగా, మెత్తగా పిండి రుబ్బుకోవాలి. ఆ తరవాత ఉప్పు కలుపుకోవాలి. ఈ పిండిని కాగిన నూనితో ఉన్న బూరెల మూకుడులో వేసుకోవాలి. వేయడం కూడా టెక్నిక్. చిన్న అరటాకు ముక్కకి కొద్దిగా నూని రాసుకుని పిండి ముద్ద తీసుకుని సమానంగా వత్తి మధ్యలో చిల్లిపెట్టిన తరవాత కొద్దిగా అకుని వంచితే గారి రెండోచేతిలోకి జారి వస్తుంది, దానిని నూనెలో వేస్తే ఎర్రగా వేగుతుంది. తీయడం కూడా టెక్నిక్, సన్నపాటి అట్లకాడను గారి చిల్లులో దూర్చి నాలుగైదు గారెల్ని ఒక సారి తీయచ్చు. కొద్ది సేపు పట్టుకుని ఉంటే నూనె కారిపోతుంది. బయట ప్లేట్ లో వేసుకోవచ్చు. ఆవడ వేసుకోవాలంటే మాత్రం రుబ్బిన పిండిలో ఉప్పు వేయకూడదు. ఉప్పులేని పిండితో గారెలు వేసి తీసిన వెంటనే మంచి నీళ్ళలో వేసి ఆ తరవాత పోపు పెట్టి ఉంచిన పెరుగులో వేసుకోవాలి. అలా కాకపోతే ఆవడలు గట్టిగా ఉంటాయి. గారెకు కావలసిన ఉప్పు కూడా ఈ పెరుగులోనే వేసుకోవాలి. ఇది గారె, ఆవడల తయారీ విధానం.

మరి వడ అంటే మినపపప్పు పొట్టు పప్పే నాన బోయక్కరలేదు. పప్పు నానిన తరవాత కచ్చా పచ్చాగా రుబ్బుకుని, ఉప్పుతో దంచి ఉంచుకున్న పచ్చి మిర్చి అల్లం పిండిలో కలుపుకుని చిన్న ఉండలు చేసి ఆకుమీద సమానంగా వత్తి నూనెలో వేసి వేయించడమే. ఇందులో మసాలా వేసుకుంటే అది మసాలా వడ. ఇదీ గారెకి వడకి తేడా,” అని వివరించింది ఇల్లాలు.

మరి గారెకి చిల్లు ఎందుకు పెడతారన్నాడు?

నాకూ తెలియదు కాని, మొన్న నీ మధ్య చదివాను, ఒక మేధావి, గారికి చిల్లెందుకు పెట్టాలి అన్నదాని మీదపరిశోధన చేసి కనుగొన్నారటా. రుబ్బిన పిండిని ఒకే రూపుగా వేస్తే పూర్తిగా ఉడకలేదటా, అదే చిల్లి పెట్టిన గారి మాత్రం చక్కగా ఉడికిందటా, ఇందులో ఏదో సయిన్స్ సూత్రం ఉన్నదని సెలవిచ్చేరని చెబితే, ఐతే మన మామ్మ,మామ్మ…….మామ్మకి అదే మొదటి సారిగా గారికి చిల్లి పెట్టిన మన  గ్రే ట్   గ్రాండ్   మదర్ కి ఈ సయిన్స్ సూత్రం తెలుసన్న మాటేగా అంటే సమాధానo  లేకపోయింది నా దగ్గర.

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గారికి చిల్లి ఎందుకు?

 1. శంకర్ గారు,
  అయ్యా మిమ్మల్నే! ఆ ఆ అమ్మయ్య, పూనకం వచ్చినట్టు ఊగిపోయారేంటండి బాబు! నాది గారెలటపా కదూ, ఎక్కడో కామెంట్ చెండు నా మీద పడేశారా! వామ్మో! ఎంత ఘాటుగా ఉంది, ఆవాల పచ్చడిలాగా! వామో, వామ్మో!
  ధన్యవాదాలు.

  • ఆ శంకర్ గారు ఇక్కడ రాసిందే వారి కామెంటు ని మీరు తీసి వెయ్యరన్న నమ్మకం తో సుమండీ దీక్షితులు గారు !!

   గారెల బుట్టల లో తెలబన్ల ‘తీత’ అన్న మాట !

   జిలేబి

 2. గారె లూ , ఆవడల వివరాలతో, మీ టపాకు భలే రుచి వచ్చింది !
  శాకాహారులకు పుష్టి కరమైన వంటకం గారె ! చూడడానికి కొందరికి నచ్చక పోయినా , పొట్టు పప్పు తో చేసిన గారెలు కూడా రుచికరమూ , ఆరోగ్యకరమూ కూడా !
  ఇక ఏ గారెలైనా అల్లప్పచ్చడి తో ‘ లాగించడం ‘ , అదో రుచి ! పైత్య హరం కూడా !
  అట్లాగే కమ్మటి పెరుగు ఆవడ ల తో పాటుగా , కరకర లాడే లా వేయించిన ఆవాలూ , కరివేపాకు , ఎండు మిరపకాయ ఘాటు , ఒక చక్కటి రుచుల ‘ కలగలుపు ‘ ( కాంబినేషన్ ) !
  ‘ ఔరౌర గారెలెల్ల ‘ !
  మీ తరువాతి టపాలో దోశ లు ‘ రుచి చూడ వచ్చా’ ? !!

  • సుధాకర్జీ,
   పాత కాలంలో అందరూ మాంసాహారులే, బ్రాహ్మణులతో సహా. ఆబ్దీకానికి మాంసం తప్పని సారిగా పెట్టేవారు. ఐతే కాలక్రమేణా చాలా మార్పులొచ్చాయి. ఆబ్దీకంలో మాంసం పెట్టడం మానేశారు, దానికి మింజుమలె గారెలు పెట్టడం మొదలు పెట్టేరు. అదనమాట చరిత్ర.
   ఆవడల రుచే వేరు. దోశలంటారా, కానివ్వండి.
   ధన్యవాదాలు.

 3. గారి, ఆవడలు గురించి వివరంగా తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలండి.

  పొట్టు మినప్పప్పు కడగటం, పొట్టును పారబొయ్యటం కష్టం …అని ఈ రోజుల్లో చాలామంది చాయ మినపప్పు వాడుతున్నారు కానీ, పొట్టు మినప పప్పు నానబెట్టి , పొట్టు తీసి రుబ్బిన పిండితో చేసిన గారెలు మృదువుగా ఉంటాయని అంటారు.

  పొట్టు మినప పప్పుకు జిగురు ఉంటుందట. అందువల్ల గారెలు మృదువుగా వస్తాయట. చాయ మినప్పప్పులో జిగురు ఉండదట.

  అయితే , మీరు వ్రాసినట్లు పొట్టు మినప్పప్పు వాడటంతో పాటు పిండిని రుబ్బే విధానం, నూనెలో వేసే, వేపే టెక్నిక్ బట్టి కూడా గారెలకు చక్కటి రుచి , రంగు వస్తుంది.

  మీరన్నట్లు గారెకు చిల్లి పెడితే మధ్యలో కూడా చక్కగా వేగుతుందని అలా పెడతారేమో.

  • అమ్మాయ్ అనూరాధ
   పొట్టు కూడా పారేసేవారు కాదు. దానితో పొట్టు వడియాలు పెట్టేవారు.చాలా మంచిది కూడా.
   అసలు గారెకు చిల్లెందుకుపెట్టాలి అన్న దాని మీద పరిశోధనలు చేసేరట, చిల్లి పెట్టని గారె సరిగా ఉడకలేదట, మధ్యలో, కొద్దిగా ఎక్కువ వేయిస్తే చివరలు మాడిపోయాయట. అందుకు మన గ్రేట్ గ్రాండ్ మదర్ చిల్లి పెట్టి సమంగా వేగేలా చేసింది, అదే అలవాటు మనమూ చేస్తున్నాం.
   Hats off to our great grand mother
   ధన్యవాదాలు.

 4. చిల్లి గారెల రుచే వేరు!
  చదివిన వెంటనే గారెలు,
  ఆవడలు తలపుకు వచ్చి
  నోరు ఊరని వారు ఉండరేమో!
  అద్భుతః,అద్భుతః,అద్భుతః!!!

  • మోహన్జీ,
   సరిగా వేస్తే గారి రుచే వేరు. అందుకే తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలన్నారు.
   చిట్టిగారెలని బాగా చిన్నవి వేస్తారు, వీటిని హనుమకి దండగా గుచ్చి మెడలో వేయడమూ ఆచారమే, ఆ తరవాత ఫలహారం చేయడమూ!!!
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s