రజ్జువు అంటే తాడు సర్పం అంటే పాము. తెనుగులో ‘తాడుని పామనుకోడ’మనమాట.
తెల్లవారుగట్ల నాలుగుకు లేవడం అలవాటు, అలాగే పెరటి గేట్ కు రాత్రి తాళం వేయడం, ఉదయం లేచిన వెంఠనే తాళం తీయడం అలవాటు. ఒక రోజు తాళం తీసివస్తుంటే కాలికింద ఏదో పడింది, మెత్తగా ఉంది, నొక్కు కున్నట్టూ అనిపించింది, పామేమో అనుకుని కాలు గబుక్కున తీసి ఒక్క దూకులో లోపలికి చేరి, లైట్ వేసి రెండు కర్రలు పుచ్చుకు బయటికి వెళితే, అక్కడ కనపడింది, నిన్న సాయంత్రం మొక్కలకి నీళ్ళు పోసి వదిలేసిన రబ్బర్ గొట్టం. అరె! నీళ్ళ గొట్టాన్ని పామనుకుని ఎంత భయపడ్డాను, అనుకుని సిగ్గు పడ్డాను.దీనినే రజ్జు,సర్ప భ్రాంతి అన్నారు.
అక్కడ నిజంగా పాముందా?
లేదు. కాని పాముందని భ్రాంతి మాత్రం కలిగింది.
ఎందుచేత?
అది తాడని తెలియకపోడం చేత.
ఎందుకు తెలియలేదు తాడని?
చీకటిలో కనపడకపోడం మూలంగా.
అంటే అజ్ఞానమా?
తెలియని తనం అజ్ఞానమేగా.
కలిగిన అనుభవమేంటి?
భయం.
అంటే తెలియని తనం అజ్ఞానంతో కలిగేది భయమైతే జ్ఞానం వల్ల కలిగినదేంటి?
అది తాడని తెలిసిన తరవాత కలిగినది నిర్భయం.
చీకటి అంటే అజ్ఞానమూ, వెలుగు అంటే జ్ఞానమూ అంటావా?
అవును కదా! అది తాడని తెలియనపుడు కలిగినది భయం, పాము కాదని తెలిసినపుడు కలిగినది నిర్భయం.
రెండూ మానసిక స్థితులేనా?
అవును.
అంటే నీవు ఏమానసిక స్థితిలో ఉంటే అదే నీకు కనపడిందా, ఆ వస్తువులో? అవునా?
అవును.
కాని అక్కడి వస్తువులో మార్పు వచ్చిందా?
లేదు.
అంటే వస్తువులో మార్పులేదు కాని నీమనసులో మార్పువచ్చి, అజ్ఞానంతో పామని, విజ్ఞానంతో తాడని తెలుసుకోగలిగావు కదా?
అవును.
అంటే జీవితం లో కావలసినదేమిటీ?
విజ్ఞానం.
అంటే వెలుగు అనే విద్య, వెలుగులేనపుడు పాముగానూ, వెలుగులో అదితాడుగానూ కనపడింది కదా! నిజం తెలిస్తే భయం పోయింది కదా. అందుచేత కావలసినది నిజం తెలియడం అనే విజ్ఞానం, అదే విద్య.
అమ్మయ్య! విద్యతోనే విజ్ఞానం వస్తుందా?
రాదు.
మరేం కావాలి.
విద్యతో కావలసినది వివేకం. విచక్షణా జ్ఞానం, అది కలిగినపుడు మాత్రం ఆనందం కలుగుతుంది.
ఆనందం అంటే?
అమ్మో! పెద్ద ప్రశ్న మరోసారి చూద్దాం.
మీ ‘ ఆత్మ తర్క సంభాషణ ‘ చదివాక , ధర్మ రాజు , నహుషుడి సంభాషణ ఒకటి ఉన్నట్టు స్మరణ కు వచ్చింది , వివరించ గలరు.
తాడును పామనుకొని తప్పుకు పోయినా పరవాలేదు కానీ , పామును తాడుకొని తొక్కడం ప్రమాద కరం కదా !
పాములు సహజం గా చరించేది రాత్రిళ్ళ లోనే !
సుధాకర్జీ,
నెట్ ఇబ్బంది, ఆలస్యానికి మన్న్ంచాలి.
మంచి సంగతి గుర్తు చేశారు, కాని ఆ సంభాషణ్ వేరు
ధన్యవాదాలు.
🙂 🙂
ధాత్రి
నెట్ ఇబ్బంది, ఆలస్యానికి మన్న్ంచాలి.
చాలా రోజుల తరవాత కనపడ్డావు, ఎల్లరున్ కుశలమే కదా!
ధన్యవాదాలు.
బాగా వ్రాసారండి!కానీ,
రజ్జు సర్ప భ్రాంతి కదండీ,
ఇందులో న్యాయాన్న్యాయ ప్రసక్తి లేదేమో!
ఇక్కడ న్యాయం అంటే ఆ రీతి, ఆవిధంగా అనే అర్థం అండి.ఇలాంటి న్యాయాలు చాలా ఉన్నాయి- కాకతాళీయ న్యాయం,మర్కటకిశోర న్యాయం,కాకదంత న్యాయం,బీజవృక్ష న్యాయం,మృగతృష్ణ న్యాయం ఇలాగన్నమాట.
కల్యాణి గారు,
నెట్ ఇబ్బంది, ఆలస్యానికి మన్న్ంచాలి.
చాలా బాగా విశ్దీకరించారు, మీలా నేను చెప్పి ఉండలేకపోయేవాణ్ణనుకుంటా.
ధన్యవాదాలు.
మోహన్జీ,
నెట్ ఇబ్బంది, ఆల్స్యానికి మన్నించాలి.
కల్యాణిగారు చెప్పినట్టుగా న్యాయం అంటే సంస్కృతంలో, తెలుగులో అర్ధాలు వేరు. నిజానికి దీనిని రజ్జు సర్ప భ్రాంతి న్యాయమనే చెప్పాలి. లోకవాచకంగానే చెప్పేను. సరి చెస్తున్నాను.
ధన్యవాదాలు.
దీక్షితులు గారు,
మీరూ పడ్డారు !!??
విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం !!
వెల్కం బెక బెక !!!
చీర్స్
జిలేబి
జిలేబిగారు,
నెట్ ఇబ్బంది, ఆలస్యానికి మన్నించాలి.
ప్రమదో ధీమతామపి 🙂
ధన్యవాదాలు.