శర్మ కాలక్షేపంకబుర్లు-రామాయణం చదవకండి.

శ్రీ గురుభ్యోనమః సమస్త సన్మంగళాని భవంతు

రామాయణం చదవకండి…..ఆగండి, ఆగండి ఈ మాట నేననలేదు. ఉష శ్రీ గారే అన్నమాట. అది కూడా వారి వచన రామాయణ0 లో చివరిపేజీలో ఉంది. దీనిని చాలా కాలం కితమే చూశాను, కింద మాట చాలా సార్లు చదివాను కూడా. కింద మాటకి పైన రాసిన దానికి సంబంధం కనపడలేదు. ఇదిగో దీనిని మీరే చదవండి. 

dscn4295
వారు చెప్పిన మాట నిజమే! ఎవరికైనా, వగనైనా, పగనైనా రామాయణమే శరణ్యం.రాముని సత్య సంధతని చూసి భరించలేక ఈర్ష్యతోనూ, సీత సౌశీల్యాన్ని చూసి భరించలేక, రామాయణం మీద అవాకులు చవాకులు పలుకుతూనే వున్నారు, ఇక ముందు కూడా పలుకుతారు. ఏ రకంగా నైనా రామనామం జపించకుండా ఉండలేని స్థితి. గతి తార్కికులు కూడా రామాయణాన్ని పారాయణ చేస్తున్నారు. మన దేశం లో రాముడంటే బూతుమాటలా ఉంది తప్పించి చాలా దేశాలలో రామాయణాన్ని అనేక రకాలుగా ఉపాసిస్తున్నారు.ఏందుకు ఇంత మంది రామాయణాన్ని పారాయణ చేస్తున్నారు, ఈ ద్వేషించే వారు కూడా రామాయణాన్నే ఎందుకు ఎంచుకుంటున్నారు? ఇది ఆలోచించవలసినది. అసలు రామాయణం లో ఏముంది? కట్టె, కొట్టే, తెచ్చె ఇంతేకదా మూడు ముక్కలలో, రామాయణం.ఇదీ నిజమే కధాపరంగా.

గురువుగారన్నమాటకి అర్ధం రామాయణాన్ని చదవకండి, చదివితే మనకు అర్ధమయ్యేది ఉట్టి కధ మాత్రమే. ఈ కధని నెన్ని సార్లు విని ఉంటాము? మరయితే ఏం చేయాలి? రామాయణాన్ని పారాయణ చేయాలి, అంటే

రామాయణం ఒక మనస్తత్వ శాస్త్రనిధి,శకున శాస్త్ర నిధి, మేనేజిమెంట్ మార్గదర్శి, ఇలా రామాయణాన్ని ఎన్ని విధాల ఎన్ని కోణాలలో చూస్తే అన్ని కోణాలలో మనకు సమాధానం చెబుతుంది. రాముని వ్యక్తిత్వాన్ని అందరూ గొప్పగానే చెబుతారు, ఎందుకని రాముడిని నమ్ముతారు కనక. కాని రాముడి శత్రువు రావణుని మంత్రి సాక్షాత్తు మారీచుడు ఇలా అంటాడు రావణునితో,

రామో విగ్రహవాన్ ధర్మః

సాధుః సత్యపరాక్రమః

రాజా సర్వస్య లోకేస్య

దేవానామివ వాసవః…….రామాయణం..అరణ్య కాండ…సర్గ..37..13

రాముడు మూర్తీభవించిన ధర్మం, సాధువు, సత్యము పరాక్రమము కలవాడు.దేవతలకు ఇంద్రుని వలె అన్నిలోకాలకు రాజైనవాడు.

రాముడు శత్రువుచే కూడా కీర్తింపబడినవాడు. ఇక రామాయణం లో సుందరకాండ పారాయణ చేయమంటారు సమస్యలు వచ్చినపుడు, ఎందుకు? సుందరకాండ పారాయణ చేస్తే హనుమ వచ్చి కష్టాలు తొలిగించడు. మీకు మీరే ఆ కష్టాలను తొలగించుకుంటారు, ఎలా? మీ సమస్యకు పరిష్కారం మీకు దొరకటం లేదు, సుందరకాండ పారాయణ చేస్తే మీ సమస్యకు పరిష్కారం మీకే తడుతుంది, అదీ చిత్రం, లేదూ? సన్నిహితులు సలహా ఇస్తారు అయాచితంగా! ఇది అనుభవం మీద కాని కలగదు. ప్రయత్నించి చూడండి.

మేనేజిమెంట్ గురించిన ఒక చిన్న ఉదాహరణతో ముగిస్తా. దక్షణ దిక్కుగా అంగదునినాయకునిగా చేసి హనుమను తోడిచ్చి సీతని వెతకడానికి పంపేడు, సుగ్రీవుడు. స్వయంప్రభ గుహలో చిక్కుకున్నారు, బయట పడే మార్గం కనపడలేదు, ఏమి చెయ్యాలో తెలియని సన్నివేశం, హనుమ కలగచేసుకుని స్వయంప్రభతో సమయోచితంగా మాటాడి అందరిని సముద్రపు ఒడ్డుకు చేరుస్తాడు. ఎదురుగా మహా సముద్రం, లంకకి వెళ్ళి తిరిగి రాగలవాడు దొరకలేదు, మంత్రులంతా తలో మాటా మాటాడేరు. ఆఖరికి స్వయంప్రభ గుహలోకి పోదామని కొంతమంది తీర్మానించారు. పరిస్థితి చెయ్యిదాటిపోయేలా ఉంది అప్పుడు హనుమ కలగచేసుకుని నిష్ఠురమైన సత్యం చెప్పి అందరిని కార్యోన్ముఖుల్ని చేస్తాడు. ఈ టపా రాయాలని చాలా కాలం గా ఉద్దేశం ఉంది కాని ఓపికలేక రాయలేదు. వివరంగా రాయాలి పెద్ద టపా అవుతుంది.

ఇలా విషయాలను గురించి తరచి తరచి రామాయణం పారాయణ చెయ్యాలి కాని ఊరకనే చదివి ఉపయోగం లేదని గురువుగారి మాట.
స్వస్తి

16 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-రామాయణం చదవకండి.

 1. ఇంతకూ ఆ ఫోటో లో కనిపించేది. ఉషశ్రీ రామాయణమా?
  లేక రంగనాయకమ్మ రామాయణమా?
  ఆ రెండు బుక్స్ చదవకపోయినా..
  వాల్మీకి రామాయణం మాత్రం చదవండి

 2. శర్మ గారికి నమస్కారం,

  మీ బ్లాగు ను సందర్శించే అదృస్య సందర్శకులలో నేను కూడా ఒకడిని,
  మా బొటి జిఘ్నాసకులకు కల్పవ్రుక్షము మీరు.
  రామాయనము ను తెలుగు లో ఎవరి అనువాదము చదవటానికి బాగుంటుందో మా
  యందు దయ తలచి సూచించ గలరు .. మా అబ్బాఇ కి బాల్యం నుంచే అలవాటు చేస్తే
  మంచిదని నా భావన .

  ధన్యవాదాలు,
  కిరణ్ ప్రసాద్

  • కిరణ్ ప్రసాద్ గారు,
   దీర్ఘాయుష్మాన్భవ
   స్వాగతం. నేనూ సామాన్యుడినే! ఏదో తోచినది గిలుకుతుంటాను.
   రామాయణం ఎవరిదైనా బాగానే ఉంటుంది. ఉషశ్రీ గారి వచన రామాయణం, రేడియో లో వారు చెప్పినది చెప్పినట్లుగా పుస్తకం వేశారు, ఆ రచనలో ఒక తూగు, చదవాలనే కుతూహలం రేకెత్తించే గుణం ఉంది, ఆ శైలిలో. నాకది నచ్చింది. ముఖే ముఖే సరస్వతి. మీకు నచ్చితే ఆ పుస్తకం కొని చదవండి. మార్కెట్ లో దొరుకుతాయనుకుంటా. నేను నాదగ్గర పుస్తకం 25.06.1979 లో తిరుమలలో కొన్నాను.
   న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్ విజయవాడ వారు పబ్లిష్ చేశారు.
   ధన్యవాదాలు.

   • గురువు గారికి ధన్యవాదాలు,

    ఆ ప్రచురన పేరు చెప్పి పుణ్యం కట్టుకొండి.
    ఇంకో రెండు ఆప్షన్స్ ఇవ్వగలరు.

  • ప్రసాద్ గారు,

   ఉషశ్రీ రామాయణం అంటే షాప్ వాడు ఇస్తాడు. మరొకటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాత్రిగారి అనువాదం రామాయణం మార్కెట్ లో దొరుకుతోందో లేదో తెలీదు. ప్రయత్నం చేస్తే దీనిని నెట్ నుంచి డవున్ లోడ్ చేసుకోవచ్చు. ఇవి నేను చూచినవి. మిగిలినవీ బాగానే ఉండచ్చు. వాల్మీకి రామాయణం మూడు సంపుటాలు గీతా ప్రెస్ వారి ప్రచురణ, సంస్కృత శ్లోకం తెలుగు లిపిలో, అర్ధం పక్కన ఇచ్చారు. ఇవి నేను చూచిన రామాయణాలు. ఏదో ఒకటి మొదలుపెట్టండి.
   ధన్యవాదాలు.

  • రావుగారు,
   రామాయణ భారత భాగవతాలనుంచి బ్లాగు మొదటినుంచి చాలా టపాలలో నేటి కాలానికి అన్వయిస్తూ చాలా టపాలున్నాయి. దయచేసి బ్లాగు మొదటినుంచి తిరగెయ్యకోర్తాను. మరికొన్ని రాయాలనే కోరికైతే ఉంది, అనూకులించినపుడు తప్పక.
   ధన్యవాదాలు.

 3. హమ్మయ్య ! ఏమిటో శర్మ గారు ఇట్లా రాస్తున్నారు అనుకున్నా – టపా హెడ్ లైన్ చూసి !!

  జిలేబి

 4. రామాయణం ఊరికే చదవకండీ, పారాయణం చేయండి!!
  మహా బాగా సెలవిచ్చారు!! ధన్యవాదాలు!!
  మా ముత్తాత గారు, శ్రీ చదలవాడ సుందర రామ శాస్త్రి గారు,
  19 వ శతాబ్దం చివరలో వాల్మికీ రామాయణ
  టీకా తాత్పర్యం నెల నెలా వ్రాసారట, ఆ కాలంలో చాలా ప్రశస్థ్యంగా
  దాని కోసం ఎదురుచూసేవారని మా చిన తాత గారు చెప్పే వారు.
  నా దురదృష్టం దానిని కనీసం కనులారా చూడ లేక పోయాను.

  • మోహన్జీ,
   పెద్దల పుణ్యఫలం మనకు మిగలబట్టే ఇలా ఉన్నాము. నిజంగా ఆ ప్రతి మీరు కనులారా చూడలేకపోయినందుకు తప్పని సారిగా విచారించవలసినదే, మరెవరి దగ్గరయినా ఉందేమో విచారించండి. నేటివారు పారాయణ చేయలేరు, తపస్సూ చేయలేరు పూర్వీకులలాగా, కొంతలో కొంత మేలు ఇలాగైనా తర్కించుకుని బాగుపడమని గురువుగారి ఆదేశంఅనుకున్నాను.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s