శర్మ కాలక్షేపంకబుర్లు- రెడ్డొచ్చె మొదలాడమని

b.patel

Courtesy:Bhavana Patel                                                        Pl wait n see

 

” రెడ్డొచ్చె మొదలాడమని”

ఈ సామెతని తెనుగునాట బాగానే చెబుతారు. అసలు దీని కధా కమమీష్ ఏమంటే!

నాటిరోజుల్లో పల్లెలలో వినోదమంటే తోలుబొమ్మలాటే ప్రధమం, ఆ తరవాతవే నాటకమైనా, హరికథయినా! ఇటువంటి ఆట ఆ పల్లెలో చేయాలంటే, ఆ ఊరి మోతుబరి అనుమతి అవసరం. ఈ తోలుబొమ్మలాడేవారు బళ్ళు కట్టుకుని పిల్లాపాపలతో, ఊరూరూ తిరుగుతూ, ప్రదర్శనలిస్తూ,వర్షాకాలం లో తమ వ్యవసాయం చూసుకుంటూ కాలక్షేపం చేసేవారు. అలా బయలుదేరిన ఒక తోలుబొమ్మలాట బృందం, ఒక పల్లె చేరి అక్కడి మోతుబరిని కలిసి అనుమతి తీసుకుని, ఊళ్ళో దండోరా వేయించి, ఆట మొదలు పెట్టడానికి తగిన హంగులు సమకూర్చుకున్నారు. రాత్రి భోజనాలైన తరవాత ఆట మొదలుపెట్టమని, మోతుబరి చెప్పేడు, ఉదయం కలిసినపుడు. సాయంత్రమయింది, రాత్రీ అయింది,  మోతుబరిగారి జాడ లేదు. ఇంటిదగ్గర లేరు, ఎక్కడకెళ్ళేరని ఆరా తీస్తే ఊరికెళ్ళేరు, వచ్చేస్తారన్నారు. కొంత సేపు చూశారు. మోతుబరి జాడలేదు, నెమ్మదిగా గుసగుసలు ప్రారంభమయ్యాయి చేరిన జనంలో, పెద రెడ్డి, తనకు పక్క ఊరిలో రెడ్డి ఉంచుకున్న సాని ఇంటికెళుతూ కనపడ్డాడని, గుసగుసలుగా ప్రారంభమయిన వార్తకొంచం గట్టిగానే చెప్పుకునే పరిస్థితి వచ్చేటప్పటికి, అప్పటి వరకూ ఆట ఆపు చేసిన పెదరెడ్డి మనుషులు, ప్రజాభిప్రాయాన్ని ధిక్కరించి ఆట ఆపుచేయలేకపోయారు. ఆట మొదలయింది, కొంత నడిచింది కూడా. అదిగో! అప్పుడు దిగేడు పెదరెడ్డి, తన సాని ఇంటినుంచి. ఇంకేముంది అంతేవాసుల హడావుడికి, వెంఠనే తోలుబొమ్మలాట ఆపుచేసేరు, ”పెద రెడ్డొచ్చాడు మొదలాడ”మన్నారు, అంటే రెడ్డిగారొచ్చాడు కనక బొమ్మలాట మళ్ళీ మొదటినుంచి ప్రదర్శించమన్నారు. రెడ్డి మాటాడలేదు, ఆట మళ్ళీ మొదలయ్యింది….ఇదిగో అలా ఈ మాట, తెనుగునాట, కొంత కథ జరిగి ఉన్నా మళ్ళీ మొదలుకు రావడాన్ని, దీనితో ఉదహరిస్తారు.

bridge

రోజులు మారేయి, పాత ప్రభుత్వం సోదిలోకి కూడా రాకుండా తుడిచిపెట్టుకుపోయిందా,కొత్త ప్రభుత్వాలొచ్చాయి, మరి సమస్యలు తుడిచిపెట్టుకుపోలేదే! వచ్చిన ప్రభుత్వాలు పెదరెడ్డొచ్చె మొదలాడమంటున్నట్టుందేమోనని అనుమానం. ప్రతి విషయంలోనూ ఎక్కడి గొంగడి అక్కడే ఉంటోంది, మా తూగోజి ప్రజల కోరిక మొదటి రైలు బ్రిడ్జి విషయం పెద రెడ్డొచ్చె మొదలాడవలసిందేనా?

 

DSCN3584

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- రెడ్డొచ్చె మొదలాడమని

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s