శర్మ కాలక్షేపంకబుర్లు-తిలా పాపం తలా పిడికిడు పంచుతున్నారు.

తిలా పాపం తలా పిడికిడు పంచుతున్నారు.

ఇంద్రుడు వృత్రాసురుడనే బ్రహ్మ రాక్షసుడిని చంపేడు. బ్రహ్మహత్యా పాతకాన్నుండి తప్పించుకోడానికి ఎవరికి చెప్పక, తపస్సుకి వెళిపోయాడు. ఈ లోగా నహుషుని రాజుగా చేసేరు. నహుషుడు శచీదేవిని చేపట్టబోయి భంగపడ్డాడు, ఈలోగా ఇంద్రుడు మానస సరోవరంలోని కమలంలో, తపస్సు చేసుకుంటూ దొరికాడు, దేవతలకు. దేవతలు ఇంద్రుని మరల తీసుకొచ్చారు.

ఈ బ్రహ్మ హత్యాపాతకాని వదల్చుకోవాలంటే, ఏం చేయాలో తోచక బ్రహ్మగారికి మొరపెట్టుకుంటే ఆయన అగ్ని,వృక్ష ఓషధి తృణాలు (ఉద్బుజాలు,అంటే భూమిని చీల్చుకుని పైకొచ్చేవి.) స్త్రీలు,జలాన్ని, పిలిచి బ్రహ్మ హత్యాపాతకాన్ని నాలుగు భాగాలు చేసి, మీరు సమానంగా తీసుకోమన్నారు. బ్రహ్మగారి మాట మన్నిస్తూనే, మేము దీనిని వహించడం ఎలాగ? మాకు నిష్కృతి చూపమని వేడితే బ్రహ్మగారు, అగ్నికి, ”నిన్ను ప్రజ్వలింపచేయక హవిస్సు సమర్పించేవానికి ఈ పాతకాన్ని పంచిపెట్ట”మన్నారు. అలాగే వృక్ష ఓషధి తృణాలకి, ”మిమ్ములను పర్వదినములలో ఛేదించేవానికి దీనిని పంచ”మన్నారు.  స్త్రీలను, ”ఋతుమతిగా ఉన్నపుడు ఎవరైతే సంగమిస్తారో, వారికి ఈ పాపాన్ని పంచ”మన్నారు, చివరికి జలంలో ”మూత్రము, పురీషము వదలిపెట్టేవారికి, జలాన్ని ఈ పాపాన్ని పంచ”మన్నారు. ఇలా బ్రహ్మ హత్యాపాతకం తిలా పాపం తలా పిడికిడూ పంచి పెట్టేరు. అగ్ని సర్వ భక్షకుడు ఆయననేంచేయలేకపోతున్నారు తప్పించి, మిగిలిన పాపాలన్నీ వదిలిపెట్టక చేస్తూనే ఉన్నారు,ఇప్పటికీ ఈ నలుగురూ వృత్రాసురుని చంపిన బ్రహ్మహత్యాపాతకాన్ని పంచుతూనే ఉన్నారు.

ఇక వృత్రుని రక్తం నుంచి బుడగలుగా పుట్టినవి పుట్టగొడుగులు అందుకు వాటిని ఆహారంగా తీసుకోరాదని బ్రహ్మ శాసనం.ఇప్పుడు వీటినే లొట్టలేసుకుని మరీ తింటున్నాం.

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తిలా పాపం తలా పిడికిడు పంచుతున్నారు.

  1. హన్నా ! పుట్ట గొడుగుల కి అడ్డు పెట్టేరా విధాత గారు ఎంత మాట ఎంత మాట ! పుట్ట గొడుగుల సూప్ ఎంత ప్రసిద్ధి ఐనదాయే మరి !

    జిలేబి

    • జిలేబి గారు,
      విధాత పుట్టగొడుగులికి ఆంక్ష విధించేరు మరి. వద్దన్న పని చెయ్యడమే కదా మనకిష్టం.
      ధన్యవాదాలు.

  2. వృత్రాసురుని చంపడానికి నురుగు రూపంలో విష్ణువు వస్తే ఆ నురుగునే ఆయుధంగా చేసుకుని ఇంద్రుడు చంపాడని నేను చిన్నప్పుడు కథలలో విన్నట్టు గుర్తు.

    • రహ్మనుద్దీన్ గారుగారు,
      స్వాగతం.
      బ్రహ్మగారు చాలా వరాలిచ్చేరు, వృత్రుడికి. తడి, పొడి గా ఉండే శస్త్రాలతో చావు రాకుండా కోరుకున్నాడు. తడిగా కాని పొడిగా కాని ఉండని వస్తువుండదు. అందుకు సముద్ర ఫేనం లో వజ్రాయుధాన్ని ముంచి వృత్రుడిని తెగటారుస్తాడు.ఫేనము అంటే నురుగు, మీకు తెలియదని కాదు నా చాదస్తం, ఫేనము తడిగానూ ఉంటుంది పొడిగానూ ఉంటుంది.. వజ్రాయుధంలో హరి ప్రవేశిస్తారు.
      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s