శర్మ కాలక్షేపంకబుర్లు-ఇదం బ్రాహ్మ్య మిదం……

ఇదం బ్రాహ్మ్య మిదం……                                                                             సుశోభన.-2

జరిగిన కథ.
అయోధ్యా రాజ్య పాలకుడు పరిక్షితనేవాడు వేటకి పోయి, ఒకమ్మాయి మోహంలో పడ్డాడు. ఆమెను నగరికి తీసుకొచ్చాడు. ఒక రోజు స్నానానికి నీటిలో దిగిన సుశోభన కనపడలేదు. రాజు వెతికించి కప్పలమీద కోపం తీర్చుకుంటే కప్పల రాజు కనపడి విషయం చెప్పి, కూతురు రాజునే వరిస్తే కూడా పంపుతూ శాపం ఇచ్చాడు. ఆ శాపానికి రాజుకు శలుడు, దలుడు, వలుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు, సుశోభన యందు. పెద్దవాడు శలునికి రాజ్యమిచ్చి అడవికిపోయాడు, పరిక్షితు…………

నిన్నటి తరువాయి…
శలుడు రాజ్యం చేస్తూ ఒకనాడు వేటకి వెళ్ళి ఒక మృగాన్ని వేటాడాలని వెనకపడ్డాడు, కాని అది తప్పించుకుపోతూ ఉంది. అప్పుడు సారధి “రాజా! మన గుర్రాలు ఆ మృగాన్ని చేరగలిగిన వేగంతో పరుగు పెట్టలేవు” అన్నాడు. “అయితే ఆ మృగంతో పరిగెట్టగల గుర్రలెక్కడున్నా”యంటే “వామదేవ మహాముని దగ్గరున్నాయ”ని చెప్పేడు. “అయితే ఆ వామ దేవ ముని దగ్గరకే రధం నడప మన్నాడు”………….

వామదేవ మహాముని దగ్గరకిపోయి, నమస్కరించి తాను వేట చేస్తుండగా మృగం తప్పించుకుపోయిందని, తన గుర్రాలు వడిగా పరుగుపెట్టలేకపోవడం మూలంగా మృగం దొరకలేదని, వామదేవుని గుర్రాలు కావాలని అడిగాడు. వామదేవుడు గుర్రాలిస్తూ, పని పూర్తి అయిన తరవాత తన గుర్రాలను తనకు ఒప్పచెప్పమని చెప్పేడు. రాజందుకు సమ్మతించి, తప్పిపోయిన మృగాన్ని వేటాడి, గుర్రాలతో సహా కోటకి పోయి “బ్రాహ్మడికి ఇంత మంచి గుర్రాలెందుకని” ఆలోచించి గుర్రాలను అంతఃపురం లో కట్టించేసేడు. కాలం గడిచింది, “రాజు బలవంతుడు, గుర్రాలను వేడుకగా తీసుకెళ్ళేడు తిరిగి ఇవ్వలేదు, నెల దాటింది” అని ఆలోచించి, వామదేవుడు తన శిష్యుడు గౌతముని పిలిచి “రాజు శలుడు మన గుఇర్రాలను తీసుకెళ్ళేడు, వేటకి కావాలని, నెల రోజులయింది, నువు వెళ్ళి గుర్రాలను అడిగి తీసుకురా” అని చెప్పేడు. గౌతముడు రాజు దగ్గరకెళ్ళి గురువు చెప్పినట్టే చెప్పేడు. రాజుకి కోపం వచ్చి, “ఆయన పంపడానికి తగును, నువ్వు తీసికెళ్ళడానికి తగుదువు, ఇటువంటి పిచ్చి మాటలు మాటాడకండి”,అని చెప్పి పంపేసేడు. గౌతముడు వచ్చి గురువుకి జరిగినది చెప్పేడు. వామ దేవుడు, తనే స్వయంగా బయలుదేరి రాజు దగ్గరికి పోయి, “గుర్రాలను ఇచ్చెయ్యి, నీ పనయిపోయింది కదా! బాగున్నాయని దాచుకుంటే ఎరువు సొమ్ము స్వంతం అవుతుందా? ఇలా చేయడం మూలంగా పాపం లో పడతావ”ని హెచ్చరించాడు. దానికి శలుడు, “రెండు ఎద్దులనిస్తాను తీసుకుపో, లేదా రెండు బలిసిన గాడిదలనిస్తాను తీసుకుపో, గుర్రాల గురించి ఆశపెట్టుకోవద్ద”న్నాడు. దానికి వామదేవుడు, “ఎవరేనా వింటే నవ్వుతారు, నా గుర్రాలను తెచ్చుకుని దానికి బదులుగా మరేదో పుచ్చుకోమనడం బాగోలేద”న్నాడు. రాజుకి కోపం వచ్చి “ఈ బ్రాహ్మడిని శూలాలతో పొడవండని” ఆజ్ఞాపించాడు. వామదేవునికి కోపం వచ్చి తీక్షణంగా చూడగా బలమైన రక్కసులు పుట్టి శలుని పరలోకానికి పంపేసేరు. వామ దేవుడు ఆశ్రమానికి వెళిపోయాడు.

శలుని తమ్ముడు దలుడు రాజ్యానికి వచ్చాడు, కొంతకాలం తరవాత వామదేవుడు దలుని దగ్గరకెళ్ళి నువు మంచివాడవు, నా గుర్రాలను నాకు ఇచ్చెయ్యమన్నాడు,అందుకు దలుడు పక్కనే ఉన్న సారధితో, “ఈ బాపనాయన కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు, అసందర్భంగా మాటాడుతున్నాడు, విషం పూసిన ములుకు వున్న బాణం విల్లు తీసుకురా, ఈయన గుండె చీల్చేస్తాను” అన్నాడు. “నువ్వు ఏ బాణం తో నా గుండె బద్దలు చేదామనుకున్నావో ఆ బాణం అంతఃపురం లో నిశ్చింతగా ఉన్న నీ కొడుకుకే తగులుగాక” అన్నాడు, వామదేవుడు. మరుక్షణం అంతఃపురం నుంచి గోలుగోలున ఏడుస్తూ స్త్రీ జనాలు రాజు కొడుకుని చేతులలో ఎత్తుకుని వస్తున్నారు. దలుడికి కోపం పెరిగి సారధి తెచ్చిన విల్లులో బాణం సంధించి వేయబోతే, చేతులు బాణం విల్లుతో సహా స్తంభించిపోయాయి. అప్పటికి తెలివి తెచ్చుకుని చాలా పొరపాటు మాటలు మాటాడేను,బ్రాహ్మణ శక్తి గొప్పది అని వామదేవుని కాళ్ళ మీద పడి గుర్రాలని తెప్పించి వామదేవునికిచ్చి వేడుకుంటే, దలుని కొడుకుని బతికించాడు, అతని చేతుల స్థంభన కూడా తొలగింది. వామదేవుడు గుర్రాలు తీసుకుని వెళిపోయాడు……..

ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం, శరాదపి శపాదపి.

టపా పెద్దదయిపోయింది..
మిగతా రేపు….

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఇదం బ్రాహ్మ్య మిదం……

  • జిలేబి గారు,
   ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం, శరాదపి శపాదపి.
   శాపం వేరే లేదు, సత్యవాక్కుకి ఆ శక్తి ఉంది
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s