శర్మ కాలక్షేపంకబుర్లు-అందరూ వామదేవులు కాలేరు కాని………

అందరూ వామదేవులు కాలేరు కాని………                                                       సుశోభన-౩

భారతం చాలా సార్లు చదివినా ఈ కథ చదవలేదు, ఆ( మార్కండేయుడు చెప్పే విషయం, ఏమంత ఉంటుంది అనిపించి. మొన్ననెందుకో భారతం తిరగేస్తూ ఈ కథ చదవడం మొదలెట్టి చదివేసేను, అప్పుడు నాకు నా అనుభవం గుర్తొచ్చింది. నిన్నటి కథని విశ్లేషణ చేయడం కంటే నా అనుభవమొకటి రాస్తే బాగుంటుందనిపించి,ఇలా మొదలెట్టేను. పేదవారి దగ్గరున్న మంచి వస్తువేదయినా కలిగినవారు స్వంతం చేసుకోవాలని తాపత్రయపడటం కొత్తకాదనిపించింది. అవధరించండి.

రిటయిరయి ఇంటికి తిరిగొచ్చిన కొత్తలో, ఒక రోజు, ఒక కలిగిన పెద్ద మనిషి, తెలిసినవాడు మరొకరితో కలిసివచ్చి, తన మోటార్ సైకిల్ పక్క వూరిలో టయిర్ చెడిపోవడం మూలంగా నిలిచిపోయిందనీ, నా స్పేర్ టయిర్ కనక ఇస్తే బండి తెచ్చుకుంటానని, టయిర్ కావాలని అడిగాడు. నా బండి నున్న టయిర్ విప్పి ఇస్తూ ‘టయిర్ కొత్తది, మీ పని అయిపోయిన వెంటనే తెచ్చెయ్యండి’ అని ఇచ్చాను. ‘నా దగ్గర రెంచ్ కూడా లేదు, ఈ రెంచ్ కూడా తీసుకెళతానని’ పట్టుకెళ్ళేడు. నేనతనిని మరొక సారి హెచ్చరించాను, మీ పని అయిన వెంటనే టయిర్ ఇచ్చెయ్యమని. అతను సరే అని టయిర్ తీసుకుని, రెంచ్ పట్టుకు వెళ్ళాడు. వారమయింది, నెలయింది, టయిర్ తిరిగివ్వలేదు. మా అబ్బాయిని పిలిచి ఫలానా ఆయన మన టయిర్ రెంచ్ పట్టుకెళ్ళి   , తిరిగి ఇవ్వలేదు,నెల దాటింది, అడిగి తీసుకురా అని చెప్పేను. అబ్బాయి మూడు సార్లు తిరిగినా అతను కనపడలేదని చెప్పేడు, నాలుగో సారి దొరికితే టయిర్ అడిగితే “ఏం పంతులూ! మీ నాన్న టయిర్ కోసం అంత కంగారు పడిపోతున్నాడా, చూస్తాలే, వెళ్ళు” అన్నాడని వచ్చి చెప్పేడు. నాకు కోపం వచ్చింది, రెండు సార్లు అతనికోసం తిరిగితే దొరకలేదు, మూడవ సారి దొరికితే “టయిర్ పట్టుకెళ్ళేరు, తిరిగివ్వలేదు, ఇవ్వండి, పట్టుకెళతా”నన్నా. అతను కుర్చీ లో కూచుని ఉన్నాడు, నన్ను కనీసం కూచో మని కూడా అనలేదు, తను కుర్చీలోంచి లేవలేదు, సిగరెట్టు విలాసంగా తాగుతూ, “అయితే టయిర్ కావాలనమాట, చూస్తాలే, వెళ్ళు” అన్నాడు. “ఇదేంటయ్యా! నా టయిర్ తెచ్చుకుని, చూస్తాలే వెళ్ళు అంటావు, చూడమని చేతికిస్తే శుక్రవారమని ఇంట్లో పెట్టుకున్నట్లు, ఇది బాగో లేదు, నా టయిర్ ఇచ్చెయ్యి” అని వత్తిడి చేశాను. అతను పక్క నున్న వాడితో “ఈ పంతులు రెచ్చిపోతున్నాడు, ఒరే చూసి పంపెయ్యండిరా” అని చెప్పి తన మనుషులకి చెప్పిలోపలికెళ్ళిపోయాడు. అక్కడున్నవారు కొంచం సభ్యత తెలిసినవారే “పంతులుగారు, ఇంక టయిర్ మీద ఆశ వదులుకోండి, అసలు మీరు టయిర్ ఇవ్వడమే తప్పు” అంటూ అంతే తొందరగా మాట మారుస్తూ “మీరు టయిర్ ఇచ్చరని నమ్మకమేంటీ? చూస్తాం లెండి, బాస్ చెప్పేరు కదా! ఇక వెళ్ళండి” అన్నారు. తీరా చూస్తే అతను లోపలనుంచి వస్తూ కనపడ్డాడు. “ఏరా పంపెయ్యమని చెప్పేను కదా, ఈ పంతుల్ని, సన్మానం చేసి పంపండి” అన్నాడు. నాకు ఉక్రోషమూ, ఏడుపూ కూడా వచ్చెయి, ఏమీ చేయలేని తనానికి బాధా కలిగిఉంది. నా నోటి వెంట అప్రయత్నంగా ఈ మాటలొచ్చాయి. “నువ్వు కలిగినవాడివి, బలవంతుడివి, మాలాటి పేదవారి సొమ్ము పడేసుకోడానికి ప్రయత్నం చేస్తే మట్టికొట్టుకుపోతావు, నా టయిర్ ఖరీదు నాలుగొందలే,ఊరి వాళ్ళకొడుకుల్ని రాజు కొడితే రాజు కొడుకుని దేవుడు కొడతాడంటారు, జాగ్రత! ఇంతకి ఇంతా అనుభవిస్తావు” అన్నాను. “ఒరే! శాపాలెడతన్నాడురా! పిల్లి మాంత్రాలకి ఉట్లుతెగవు లెగవయ్యా, ఎల్లు, ఎల్లు,” అని వెళిపోయాడు. నేను చేయగలది లేక ఈ విషయం మరికొంతమందికి చెప్పుకుని బాధ పెంచుకోవడం ఇష్టం లేక ఊరుకున్నాను.

కాలం గడిచింది, ఒక రోజు విషయం మరొకరి ద్వారా విని ఉన్న మా సత్తిబాబొచ్చి, “పంతులుగారూ, మీ శాపం తగిలిందండోయ్” అన్నాడు. ”నేను శాపం ఇవ్వడమేంటీ, అది తగలడమేంటీ” అన్నా. దానికతను, మీ టయిర్ పట్టుకెళ్ళి, టయిర్ ఇవ్వక మిమ్మల్ని అవమానం చేసినతన్ని ఏమన్నారు మట్టికొట్టుకుపోతావన్నారు కదా! అదే జరిగింది. మీతో మాటనిపించుకున్న కొద్ది కాలానికి కొత్త కారు కొన్నాడు. ఆ కారు ఎక్కడో పెట్టేడట, ఒక రోజు రాత్రి. ఆ రాత్రి దొంగలెవరో కారు నాలుగు టయిర్లూ, ఇంజనులో కొన్ని ముఖ్యమైనవీ ఎత్తుకుపోయారట. పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. అవి దొరకలేదు. మరొ కంత కాలానికి ఇన్కం టాక్స్ వారు సోదా చేసేరు, ఏదో చాలానే దొరికిందిట. టాక్స్ వగైరాలు కట్టాలట, కట్టకపోతే ఇంతే సంగతులు, కట్టగలిగేలాలేడు, ఎవరూ ఆదుకునేలాగానూ లేదు అన్నాడు. వాడి కర్మకి నేను కర్తను కాను, వాడి లోభమే వాడిని వంచించిందన్నా, ఊరుకున్నా.

ఏమయిందో తెలియదు కాని ఒక రోజు సాయంత్రం అతను నా టయిర్ పట్టుకుని వచ్చాడు, అది పూర్తిగా బోడి గుండులాగా అరిగిపోయి ఉంది, అప్పటికే నేను నా బండిని మరో మిత్రునికి ఇచ్చేసేను. అతను బండిలేక ఇబ్బంది పడుతున్నాడు, పిల్లు కలవాడని పిలిచి ‘సి’ బుక్ తో సహా ఇచ్చేసేను. టయిర్ తెచ్చినతను, “మీ శాపమే తగిలిందండి మీటయిర్ తీసుకోండి” అన్నాడు. అతనిని కూచోబెట్టి “ఇప్పుడు నాకు బండిలేదు, టయిర్ తో కూడా అవసరమూ లేదు, అదీకాక ఆ టయిర్ పూర్తిగా అరిగిపోయి ఉంది, నాకు అక్కరలేదు, తిరిగి తీసుకుపొమ్మని” చెప్పి టయరుతో సహా సాగనంపేసేను. నిజంగానే నా మనసు తృప్తి పడింది. నేనూ పిచ్చివాడినే!

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అందరూ వామదేవులు కాలేరు కాని………

  • ఫాతిమాజీ,
   ఆయన నా దగ్గర టయిర్ పట్టుకెళ్ళిన సంగతి నలుగురికి తెలిస్తే నామోషీ అనుకున్నాడు. ఆ తరవాత ఇవ్వకపోతే ఏం అనుకున్నాడు. అదీ సంగతి.
   ధన్యవాదాలు.

  • పండు గారు,
   స్వాగతం. నిజమే దేవుని సర్వర్ కూడా బిసీ అయిపోతోందిట, ఇటువంటివి స్టోర్ చేయడానికి స్పేస్ లేక, అందుకు వెంట వెంటనే రిసల్ట్స్ ఇచ్చేస్తున్నారు. 🙂 చాలా ఇంగ్లీష్ మాటలొచ్చేశాయి కదా! సమానమైన తెలుగు మాటలున్నాయి కదూ!!
   ధన్యవాదాలు.

 1. సుశోభన కధ, వామదేవుని గురించి చెప్పిన విషయాలు బాగున్నాయండి. ఇంతకుముందు ఈ కధలు నాకు తెలియవు.

  వామదేవుని కధ చదివితే, వశిష్టుని వద్ద నుండి ఆవును ఇమ్మని రాజు ( తరువాత విశ్వామిత్రుడు ) అడిగిన కధ కూడా గుర్తుకొస్తోంది.

  • అమ్మాయ్ అనురాధ,
   ఇది తామసం, మీరు గుర్తు చేసిన కధ రాజసం. అది దౌర్జన్యం, ఇది మోసం.
   ధన్యవాదాలు.

 2. ‘చెరపకు రా చెడేవూ
  ‘ఎవరు చేసిన పనికి
  వారనుభవింపక తప్పదన్నా’
  నిజం చేసిన అనుభవం–బాగుంది!

 3. True….life is stranger than fiction…….indeed.
  I had similar experience with a guy in hyderabad.
  he claimed himself to be a political bum those days , way back in 1970.
  contested elections as MLA from TPS(mind you not TRS)later joined congress etc etc…..now a chaprasi in a party office.
  I was cheated for just Rs100/ those days.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s