శర్మ కాలక్షేపంకబుర్లు-పృష్ట తాడయ …….

పృష్ట తాడయ………

పృష్ట తాడయ దంత భంగః, అంటే “తుంటి కొడితే పళ్ళు రాలినట్టని” భావం. తుంటి మీద కొడితే పళ్ళు రాలతాయా! ఇది అసంబద్ధం, సమయానికి, సందర్భానికి, బద్ధం కాని దానిని చెప్పడాన్నే తాళాధిరోహణ న్యాయమన్నారు కదా! కాని నిజంగానే తుంటి మీద కొడితే పళ్ళే రాలతాయి, ఇది మరీ విడ్డూరమంటారా? అయితే చదవండి.

ఈ మధ్య సంతకెళ్ళి చాలా రోజులయింది, నాలుగు నెలలు. కూరగాయల మార్కెట్ ని సంత అంటాం. సంత అంటే మరో అర్థమూ ఉంది, చదివిన దానిని మననం చేసుకోవడం, దీనిని వేదానికి మాత్రమే చెబుతారు. కొద్దిగా చినుకులు పడుతున్నాయి, చాలా కాలం తరవాత వాతవరణం చాలా అహ్లాదకరంగా ఉంది, ఇల్లాలు కాస్త అడుగులేస్తోంది,నాలుగు నెలల తరవాత, ఈ శుభ సందర్భం పురస్కరించుకుని సంతకి బయలుదేరేం, ఇద్దరమూ. ఎందుకోగాని ఈ రోజు జన సమ్మర్దం ఎక్కువగానే ఉంది. మేము సాధారణంగా కూరలు కొనే కొట్టు ఈ రోజు మరింత సమ్మర్దంగా ఉంది, మాకు కావలసినవేమో చూద్దా మనుకుంటున్నాము.

ఒక్క సారిగా మా ముందున్న ఒకమ్మాయి పక్కనే ఉన్న ఒక అబ్బాయి జుట్టు పట్టుకుని, పళ్ళు రాలేలా, వాయించేస్తోంది, రెండు దవడలూ వాచేలా. కుర్రడు బిక్క చచ్చిపోయి దెబ్బలు తింటున్నాడు. ఏమయిందన్నారు, విడతీశారు, అప్పుడు చెప్పిందా అమ్మాయి పృష్టతాడనం సంగతి, ఈ మాట విన్న కొంతమంది మరి రెండు తగిలించారు, ఈలోగా ఒక గల్లీ పెద్ద దిగిపోయి “అసలు నిన్ను అబ్బాయి ముట్టుకున్నట్టు సాక్ష్యమేదని” లా పాయింట్ లాగాడు. కొంతమందటు కొంతమందిటు చేరిపోయారు, గల్లీ గారు పంచాయతి తీరుస్తున్నాడు, అమ్మాయికి సమాధానం చెప్పేందుకు సావకాశం లేదు, సిగ్గు మూలంగా.  అంతలో ఒక ముసలమ్మ చెప్పింది, “నేను చూశాను, ఈ కుర్ర వెధవ ఏంచేశాడో! అసలీ అమ్మాయి చేసిన పని నేను చెయ్యాలనుకున్నా!! ఈ లోగా అమ్మాయే పూనికుంది కనక, ఊరుకున్నా!!! ఏరా చెప్పమన్నావా నువ్వు చేసినది, ఆ పిల్ల సిగ్గుపడి చెప్పలేకపోతోంది, నేను కనక, నువ్వు చేసినది చెబితే ఇక్కడున్నవాళ్ళంతా నిన్నేం చేస్తా”రంది, “చంపేస్తార”న్నాడు, “నీ తల్లికి, చెల్లికి, భార్యకి మరొకడు, నువ్వు చేసినట్టు చేస్తే, బుద్ధి తెచ్చుకో” అని, “ఈ పిల్లని పట్టుకుని…..ఇంక చెప్పలేను, ఆ పిల్ల పూర్తిగా చెప్పలేకపోయింది,సిగ్గుతో, వీణ్ణి పళ్ళూడేలా అమ్మాయి కొట్టింది, అమ్మాయి తప్పులేదు….తప్పు వీడిది కాదు వీణ్ణి ఇలా తయారు చేసిన తల్లి తండ్రులది, ఇక చాలు దయచేయండని” పంచాయితీ ముగించింది. ఒక్కడంటే ఒక్కడు నోరెత్తితే ఒట్టు, ఎవరి మటుకు వారు జారుకున్నారు.ఈ పద్యం గుర్తొచ్చింది.

స్త్రీలు గల్గుచోట చెర్లాటములు గల్గు
స్త్రీలు లేని చోట చిన్నబోవు
స్త్రీలచేత నరులు చిక్కుకున్నారయా
విశ్వదాభిరామ వినుర వేమ.

తిరిగొస్తుండగా, “వామ్మో! అంతకోపమా?” అన్నా! ఇల్లాలితో, “అసలిటువంటి వెధవలని కొట్టాలా ?కొయ్యాలా? ఈ ఆడముండలకీ బుద్ధిలేదు, చున్నీ ఎందుకేసుకుంది కుర్రముండ? అంత ప్రదర్శన అవసరమా?”  అంటే “దానికెందుకు చెప్పలేదు? బుద్ధి” అన్నా! “ఇది సమయంకాదు , కాకపోయినా తప్పు కుర్రదానిది కాదు, దాని తల్లిది”.అని ముగించింది.  అమ్మో! మనం మాటాడటానికిది సమయం కాదని నోరు మూసుకున్నా.ఈ పద్యం గుర్తొచ్చింది.

అనువుగాని చోట అధికులమనరాదు
కొంచమైన నదియు గొదువగాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా
విశ్వదాభిరామ వినుర వేమ

అదండి సంగతి, పృతాడయః దంత భంగః అంటే అబద్ధం కాదు, తుంటి మీదకొడితే పళ్ళే రాలతాయి, నిజంగా రాల కొట్టాలి కూడా. ఇలా జనసమ్మర్ద ప్రదేశాలలో ఆడవారిని ఇబ్బంది, పెట్టి వేయకూడని చోట్ల చేతులేసి, పొందే ఆనందమేంటో కాని, వారి తల్లులు, చెల్లెలి, భార్యలకిలా జరిగితే సహించగలరా?పెద్దలు మీరే చెప్పాలి.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పృష్ట తాడయ …….

 1. మేడం చెప్పినట్లు … పిల్లలు తప్పుగా ప్రవర్తిస్తుంటే అందుకు పిల్లల తల్లితండ్రుల బాధ్యతా ఎంతో ఉంటుంది.
  ఈ రోజుల్లో చాలామంది తల్లి తండ్రి… కుటుంబవిలువల కన్నా తమ వ్యక్తిగత హక్కులు , కోరికలకే ఎక్కువ ప్రాధాంతనిస్తున్నారు.. పిల్లల్ని కనటమే కానీ, తల్లితండ్రి పిల్లలతో మాట్లాడే సమయమే తగ్గిపోయింది.

  పూర్వం రోజుల్లో తండ్రి కుటుంబపోషణ కొరకు ధనాన్ని సంపాదించటం కోసం బైట ఎక్కువ సమయాన్ని గడిపినా ఇంట్లో తల్లి పిల్లల సంరక్షణకు ఎక్కువ సమయాన్ని కేటాయించేది. పిల్లలూ తమ కష్టసుఖాలను తల్లితో చెప్పుకునేవారు. ఏది మంచి, ఏది చెడు అనే విషయాలను తల్లి పిల్లలకు నేర్పించేది. ఇప్పుడు కొందరు తల్లులు పిల్లలతో సరిగ్గా మాట్లాడటానికి తీరికలేనంతగా బిజీ అయిపోయారు.

  ఈ రోజుల్లో చాలామంది యువత బాగా చదివి , ఉద్యోగాలు చేస్తూ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు కానీ, కుటుంబ జీవితంలో ఫెయిలవుతున్నారు.

  అయితే, ఈ మధ్య కొందరు యువత తమ వ్యక్తిగత హక్కులు, కోరికల కన్నా కుటుంబ విలువలకు ప్రాధాన్యత నివ్వటం కనిపిస్తోంది. ఇది శుభసూచకం.

  • అమ్మాయ్ అనురాధ,
   పిల్లలని అలా తయారు చేస్తున్నది మనమే. ఇక ఇద్దరూ సంపాదించాలి, కాదనలేదు, రోజులలా ఉన్నాయి కనక తప్పదు, అయినంతలో విలువలు పోగొట్టుకోనక్కరలేదేమో!
   ధన్యవాదాలు.

 2. Aa na moham….ekkada leni t ime veella tuitions ki EAMCET, IIT vagaira coaching la ke saripodu.
  inka atalakee patalakee asalu prapancham telusukune time ekkadaa?
  Ee pillalu nijanga duradrushtavanthulu.
  morals nerpe teachers vunnaaraa asalu veellu nerchukovadaaniki.

 3. చిన్నప్పుడు నీతి శాస్త్రం(మోరల్ సైన్స్)అని వారానికి రెండు క్లాసులు ఉండేవి. మళ్ళీ ప్రవేశ పెడితే బాగుండును.

  • మోహన్జీ,
   పిల్లలని సమగ్రంగా పెరగనివ్వక ఊదర కొడుతున్నది మనమే. నీతీ శాస్త్రం వినడానికి చదవడానికి సమయమేదీ?
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s