శర్మ కాలక్షేపంకబుర్లు-పుణ్యమంటే? పాపమంటే?

అసలు పుణ్యమంటే? పాపమంటే?

“పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.”
ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, ఇతరులను పీడించడం పాపం. ”అయ్యో! ఆవిడ దొడ్డ ఇల్లాలండి, ఆవిణ్ణి వదిలేశాడా దుర్మార్గుడు,” బాబూ! ఆవిడ పాపం ఈ జన్మది కాదు. ”వాడో దుర్మార్గుడండీ కాని భోగాలనుభవిస్తున్నాడు,” నిజమే వాడి కాతాలో పుణ్యం అనుభవిస్తున్నాడు, ఆ తరవాత ఇప్పటిది అనుభవిస్తాడు. “ఎవరు చేసిన కర్మ వారనుభవించకా ఏరికైనా తప్పదన్నా! ఏనాడు ఏగతీ ఎవరు చెప్పాగలరు అనుభవింపక తప్పదన్నా!”

కరచరణ కృతంవా కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసంవాపరాధం !
విహిత మవిహితం వా సర్వమే తత్ క్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహదేవ శంభో !!

అనగా కాళ్ళూ చేతులతో చేసినది, వాక్కు, శరీరంతో చేసినది,చెవులు, కళ్ళతోనూ చేసినది, మనస్సుతో చేసినది అపరాధాలను, ఇష్టమైనవి, అయిష్టమైనవి చేసిన అన్ని అపరాధాలనూ క్షమించు మహాదేవా అని.

కాళ్ళూ చేతులతో చేసేపాపాలు మచ్చుకు కొన్ని. కుక్క కనపడితే కొడతాం. చూసుకోకుండా నడిచి మరొకరి పాదాలు, శరీరం తొక్కేస్తాం. ఇక నోటి తో చేసేపాపాలు, అబద్ధం చెప్పడం, లేనివి కల్పించి చెప్పడం, ఉన్నవి లేనట్లు చెప్పడం, అపవాదులెయ్యడం , తిట్టడం కొన్ని మాత్రమే. ఇక కళ్ళతో చేసేపాపాలు, చూడకూడని వారిని, చూడకూడని సమయంలో పని కట్టుకుని చూడటం. అశ్లీల దృశ్యాలు చూడటం, కళ్ళతో చేసే పాపాలలో కొన్ని. ఇహ చెవులతో వినకూడని మాటలు వినడం. ఇక శరీరంతో చేసే పాపాలు చెప్పడం కూడా పాపమేనేమో! పరనారి/పురుష సంగమం వగైరా.గాంధీగారి మూడు కోతులు ఇవే, పాపం చూడకు, వినకు, మాటాడకు.

పాపం చేసేవాడినే కాదు మరికొంతమందిని కూడా అనుభవింపచేస్తుంది. వారు కర్తా, కారయితా, అనుమోదకః అనగా కర్త అనగా పాపం చేసేవాడు, కారయిత అనగా సహాయకుడు, అనుమోదకః అనగా బాగుందని మెచ్చుకుని లైక్ లు కొట్టేవాడు. ఈ ముగ్గురూ పాపంలో భాగస్వాములే.

ప్రార్ధనచేస్తే క్షమిస్తాడు కదా దేవుడు!. ప్రార్ధనేగా చేసేద్దాం అంటే కుదరదు, మనసా,వాచా, కర్మణా త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఇవన్నీ ఎవడు చూడొచ్చాడు అంటారా?

మనం చేసే ప్రతి పని చూసేందుకు సాక్షులున్నారు, వారు ఉదయ, సాయం సంధ్యలు, సూర్య, చంద్రులు, వేదం, అంతరాత్మ వీరు ఎల్లపుడు మనం చేసే పనులు చూస్తుంటారు, వీరే సాక్ష్యం. మనం మనసుతో చేసే పాపాన్ని కూడా చూస్తారు. ఎవరికి తెలియక పాపం చేయడం కుదరదు. ఇప్పుడు ఫెస్ బుక్ కూడా ఇందులో చేరిపోయిందిట.  మనం చేసే పని కూడా.ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు అనుభవం వదులుకోనా? అగ్ని శలభన్యాయంగా మంటలో దూకుతానంటే నేనెవరు కాదనడానికి? అస్తు.
మీ చిత్తం
శుభం.

బోర్ కొట్టేనా మన్నించండి.

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పుణ్యమంటే? పాపమంటే?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s