శర్మ కాలక్షేపంకబుర్లు-నల్లేరు పచ్చడి, నల్ల పచ్చడి

NalleruDSCN4877

నల్లేరు పచ్చడి, నల్ల పచ్చడి

మీరు పైన చూస్తున్నదే నల్లేరు.పెరటిలో వేసి పెంచుతున్నా. లేత కాడలు పచ్చడి చేసుకోవచ్చు, రుచిగా ఉంటుంది, అంతే కాక వాతాన్ని వచ్చే కీళ్ళ నెప్పులు తగ్గిస్తుంది. ముదురు ముక్కలైతే కొద్దిగా పీచు వస్తాయని భయం. నల్లేరుని, దాని ఆకులతో సహా వాడచ్చు. చిన్న చిన్న ముక్కలుగా తరగండి, కొద్ది సేపు ఉప్పు నీటిలో వేసి ఉంచండి. వేయించేటపుడు పూర్తిగా వేగేదాకా చూడండి, లేకపోతే నాలిక దురద పుట్టచ్చు, పాటి కందలాగా. ఇప్పుడు మనం వాడుతున్న కందని తీయ కంద అంటాం.

కావలసినవి.

నల్లేరు ముక్కలు.
చింతపండు.
మిరపకాయలు
శనగపప్పు
మినపపప్పు
జీల కర్ర.
నూనె
ఉప్పు
పసుపు

నల్లేరు ముక్కలని మూకుడులో నూనెవేసి వేయించండి. పచ్చి లేకుండా చూడండి. కొద్దిగా నూనెవేసి పోపు వేయించండి. ముక్కలపై కొద్దిగా పసుపేయండి. తగిన ఉప్పు చేర్చండి. అన్నిటిని కలిపి మిక్సీలో వేయండి. నల్లేరు పచ్చడి తయార్.

నల్లపచ్చడి.

నల్ల పచ్చడి అనేది మన రాచ ఉసిరికాయ పచ్చడి, ఇది ఎంతకాలం నిలవుంటే అంత బాగుంటుంది. మేము ఇప్పుడు పదమూడు సంవత్సరాల కితం పచ్చడి వాడుతున్నాం. ఇందులో చెడిపోయే పదార్ధం ఏమీ లేదు. ఉసిరికాయలని తీసుకోండి. మూడు నాలుగురోజులు నిలవ ఉంచండి. మగ్గు తాయి. వీలు కుదిరితే ఎండలో పెట్టండి కాయలని. ఆ తరవాత తరగండి, చాలా తేలికగా తరగబడతాయి. ఇప్పుడు తగిన ఉప్పు కలపండి. ఒక జాడీలో నిలువచేయండి. నిలువ చేసేముందు ఒక సారి కచ్చా పచ్చాగా రోటిలో వేసి కుమ్మండి. ఈ నిలువ పచ్చడిని అప్పుడపుడు వీలును బట్టి ఎండలో పెట్టండి.నిలవ పచ్చడిలో ఉప్పు సరిగా సరిపోకపోతే బూజు పడుతుంది. దానిని వాడ కూడదు. ఈ పచ్చడిని ఆ తరవాత ఎన్ని రకాలుగా నైనా ఉపయోగించుకోవచ్చు. మామూలుగా కొద్దిగా పోపు కలిపి వాడుకోవచ్చు, లేదా కొద్దిగా పెరుగు చేర్చి పోపు వేసి పెరుగు పచ్చడిగా వాడుకోవచ్చు. ఇష్టాన్ని బట్టి పొపులో ఇంగువేసుకుంటే బలే బాగుంటుంది. ఇంగువ కూడా మంచి ఔషధం.ఈ పచ్చడి రోజూ, ఆదివారం తప్పించి, పగలు భోజనంలో మొదటి ముద్దగా తింటే చాలా రోగాలు దరి చేరవు, సాధారణంగా డాక్టర్ అవసరమే పడదు.

ఇందులో విటమిన్ సి, ఇతర అవసరమైన  ఆరోగ్యసాధకాలు, పోషకాలూ ఉన్నాయి.ఆయుర్వేదం ప్రథమంగా చెప్పేవి త్రిఫలాలు, అవి ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. ఈ ఉసిరికాయ నేను చెప్పిన ఉసిరికాయ ఒకటే అమలక అంటారు కూడా. నేడు త్రిఫల చూర్ణం కేన్సర్ కి కూడా మందు అంటున్నారు. ఉసిరికాయలు తరిగితే గింజలొస్తాయి పారెయ్యకండి, వాటిని చితక్కొడితే చిన్న నల్లని గింజలొస్తాయి, వీటన్నిటిని కొబ్బరి నూనెలో వేసి కాచుకుంటే జుత్తు నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. అది మరోటపాలో….

ఆసుపత్రిలో పడుకుంటాం తప్పించి,తెగుళ్ళు రాకుండా,ఇదంతా ఎవరు చేయగలరంటారా? శరీరం మీది, ఆరోగ్యం మీది, ఆ తరవాత మీ ఇష్టం……..

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నల్లేరు పచ్చడి, నల్ల పచ్చడి

 1. మా ఇంటిచుట్టూ ఉండే పొదల్లో ఉండేవి ఈ నల్లేరు చెట్లు పెద్ద చెట్టును ఆసరా చేసుకుని పైకి ఎగబాకి పోయేవి. పాము పుట్టలు ఎక్కువ ఉండటం వలన పాములు ఎక్కువగా తిరిగేవి వాటి చుట్టూ. పచ్చడి గురించి తెలిపినందుకు ధన్యవాదాలు. ఉసిరి గురించి పెద్దలు ఇలా చెప్పారు:

  అభుక్త్వామలకం పథ్యం, భుక్త్వాతు బదరీఫలం !
  కపిత్థం సర్వదా పథ్యం, కదళీనకదాచన !!

  పరగడుపున ఉసిరికాయను, భోజనం చేసిన తరువాత రేగు పండును, వెలగ పండును ఎల్ల వేళలా తినన శరీర ఆరోగ్యం కలుగును. అరటిపండును అప్పుడప్పుడు తినవచ్చును.

  • స్వామీజీ,
   నమస్కారం, స్వాగతం నా బ్లాగుకు. మీ పేరు కుదించినందుకు కోపగించద్దని మనవి.
   మీ రాక ఎంతో సంతోషాన్నించిందంటే, మీ పరిచయం మరింత ఆనందం కలగచేసిందంటే అతిశయోక్తి కాదు.మీ వ్యాఖ్యకి
   ధన్యవాదాలు.

 2. శర్మగారూ, మీరు చెప్పినట్లుగా, ఈ ఉసిరికే సంస్కృతంలో అమలకం అని పేరు. హస్తామలకం అంటే అరచేతిలో ఉసిరికాయ అన్నమాట. అదొక నానుడి. అదటుంచుదాం. ఆయుర్వేదంలో అతిప్రసిధ్ధమైన చ్యవనప్రాశ లేహ్యం తయారీలో ప్రధానమైన సరుకు ఈ ఉసిరికాయేను. చ్యవనమహర్షికి పునర్యౌవనం ప్రసాదించటానికి అశ్వినీదేవతలు ప్రత్యేకంగా తయారు చేసి సేవింపజేసినది ఈ లేహ్యం అని ఐతిహ్యం. ఈ అమలకం గొప్ప చెప్పనలవి కాదనుకోండి. దీనికి అమృతఫలం అని పేరుకూడా ఉందట. పదమూడేళ్ళక్రిందటీ ఉసిరికాయపచ్చడి తింటున్నారని చదివి భలే ఆశ్చ్యర్యం కలిగింది. పౌరాణికం ఐపోయిందన్నమాట. బహుప్రశస్తం. ఒకప్పుడు పచ్చళ్ళను కుండల్లో నిలవ ఉంచేవారు. అందువల్ల పచ్చళ్ళు నల్లగా మారేవి – ఉసిరి ఐతే మరీను – అందుకే దానికి నల్లపచ్చడి అన్న పేరనుకుంటాను.

  • శ్యామలరావు గారు,
   రిటయిర్ అయి వచ్చే ముందు సంవత్సరం, ఇల్లాలు ఉసిరికాయ కావాలని అడిగింది. మా జనాభాతో చెబితే ఇద్దరు పట్టుకొచ్చేసేరు, ఏం చేసేది? పెట్టుకున్నాం. రెండు జాడీలనిండా. అలా అది ఉండిపోయింది. పాడు కాలేదు, వాడుతున్నాం.ఉసిరికాయ పెట్టిన జాడీలు మరొకందుకు పనికిరావు. కుండలో పెట్టడం మూలంగా నల్లబడదు. అసలు ఉసిరికాయ తరిగితేనే నలుపొస్తుంది, చెయ్యి. భృ0గామల కతైలం మరిచినట్లుంది. నిలవ ఉన్న మీదట మరికాస్త నల్లబడుతుంది.
   ధన్యవాదాలు.

 3. చిన్నప్పుడు నల్లేరు పచ్చడి,వుసిరి ఊర పచ్చడి
  చేసిన మా అమ్మమ్మని గుర్తుకు తెచ్చారు.
  మరి నల్లేరు మీద బండి నడకేమిటో సెలవివ్వండి

  • మోహన్జీ,
   బహుకాల దర్శనం, కుశలమే కదా! న్స్ల్లేరు మెత్తగా ఉంటుంది, దాని మీద నడిస్తే చాలా సుఖం గానూ ఉంటుంది, సుఖంగా ఉన్న చోట అడుగు తొందరగా పడుతుంది కదా! అదీ సంగతి.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s