శర్మ కాలక్షేపంకబుర్లు-నేను మేధావిని కాను

నేను మేధావిని కాను

గడ్డం ఉన్నవాళ్ళంతా మేధావులన్నాడు మా సత్తిబాబు.
”అదెలాగా?” ప్రశ్నించాను.
“మన ఋషులు మునులు అందరూ గడ్డాలతో ఉన్నవారే, విదేశాలలో కూడా మేధావులందరికి గడ్డాలున్నాయి,” అన్నాడు
“ఐతే చిరుగడ్డం వాళ్ళు సగం మేధావులు, గడ్డాలు లేనివారంతా, రానివారంతా మేధావులు కారని నీ ఉద్దేశమా?” అని ప్రశ్నించా.
“ఇదుగో! ఇలా లా పాయింట్లు లాగద్దు. అంటే మీ ఉద్దేశం గడ్డాలు లేనివాళ్ళూ, రానివాళ్ళూ అంతా నా మీదకి యుద్ధానికి రావలనేగా మీ పన్నాగం, కుట్ర, కుతంత్రం” అంటూ వెళిపోయాడు.

ఇంతలో ఇల్లాలొచ్చి “గడ్డం పెంచుతున్నారు, సంన్యాసులలో కాని కలుస్తారా ఏంటీ?” అని సాగతీసింది.
“అమ్మో! సంన్యాసులలో కలవను కాక కలవను, గడ్డం ఉన్నవాళ్ళంతా మేధావులని…” ఆగాను.
“గడ్డం ఉన్నవాళ్ళు మేధావులని ఎవరన్నారు?” ప్రశ్నించింది.
“ఇంతకు ముందే మీ అన్నయ్య అనివెళ్ళాడోయ్.”
“మా అన్నయ్యా! అన్నాడంటే అది నిజమే, ఇంకా అనుమానమా? అసలు గడ్డాలు లేని ఆడాళ్ళంతా మేధావులు కాదనా మీ ఉద్దేశం?” యుద్ధానికొచ్చింది.
“బాబోయ్! నేననలేదు మీ అన్నయ్యే అన్నాడు అలాగని” సద్ది చెప్పుకున్నా.
“మావాళ్ళూ గడ్డాలు మీసాలు పెంచుకుంటున్నారు లెండి. పసుపు ముఖానికి రాసుకుంటే బాగోదని మానేశారు, అప్పటినుంచి మావాళ్ళూ మేధావులలో జేరిపోతున్నారు, గడ్డాలూ మీసాలూ పెంచుకుంటూ…. పాతరోజులలో పసుపును ఆవు పేడ తో శుద్ధి చేసి వాడేవారు. అంటే పేడని నీళ్ళలో వేసి కలిపి ఆ నీళ్ళలో పచ్చి పసుపు కొమ్ములు వేసి ఉడకపెట్టేవారు. ఆ కొమ్ములు ఎండపెట్టేవారు, వాటిని పసుపు కొట్టుకుంటే ఎన్నాళయినా పసుపు నిలవుండేది. ఇప్పుడు పసుపుకీ పురుగు పడుతోంది. ఇప్పుడు పసుపు అలా తయారు చేయటం లేదట, ఆ పసుపు రాసుకుంటే ముఖం మీద అలర్జీ వస్తోంది. అందుకు పసుపు రాసుకోడం మానేస్తే గడ్డాలూ, మీసాలు వచ్చి మేధావులలో చేరిపోయారు. అవాంఛిత రోమాల నిర్మూలనకి ఇప్పుడు క్రీములు వాడుతున్నాంగా, అదేంటో గాని ఆ క్రీములు రాసినచోట మాత్రం అవాంఛిత రోమాలు ఇతోధికంగా వృద్ధి చెందుతున్నాయి, కంపెనీల వాళ్ళు బాగుపడుతున్నారు లెండి. ఇంతకీ మీరు గడ్డం గిసుకుంటారా లేదా?” నిలదీసింది.
“నా గడ్డం తో నీకేం బాధా?” ప్రశ్నించా.
“నిజమే! మీ గడ్డం మీ ఇష్టం, ఉంచుకున్నా పెంచుకున్నా! నాకేం బాధా? మీ వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తున్నాను.మరి ఒకప్పుడు రోజూ గడ్డం గీకేవారెందుకో?” ఎత్తిపొడిచింది.
“మరి.. మరి అప్పుడు… ఆఫీసు …. మరెందుకో చెబితే బాగోదులే…..” అని నాన్చేశాను.
“ఐతే గెడ్డం పెంచి మేధావులలో కలిసిపోతారనమాట” అని నవ్వింది.
బాబోయ్! నేను మేధావిని కాదు, కాదుగాక కాదు, ఈ వేళ ఏకాదశి కదా? రేపు గీసుకుంటానని చెప్పి తప్పించుకున్నా. అసలు నాకో అనుమానం గడ్డం ఉన్నవాళ్ళంతా మేధావులా? నాకీ ప్రశ్నకి సమాధానం దొరకలేదు కాని ఆవిడో ప్రశ్న సంధించింది.
“దీనికి సమాధానం చెప్పండి మీరు మేధావులవునో కాదో తేల్చేద్దాం.
ఒక రధికుడు, ఐదు గుఱ్ఱాలు పూన్చిన రధమెక్కేడు. సారథి చేతిలో ఐదు గుఱ్ఱాల కళ్ళేలూ ఉంటాయి. రధికుడు నిద్రపోతే రథం బోల్తా పడుతుంది, సారథి మెలకువగా ఉన్నా. ఏంటో చెప్పండి” అని వెళిపోయింది.
ఇదేంటండీ బాబూ! నాకు పరీక్ష. దీని గురించి మీకేమయినా తెలిస్తే చెప్పరూ, ఆవిడ దగ్గర నా పరువు నిలుస్తుంది…..

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నేను మేధావిని కాను

 1. మరేమో మరీ…. తాతయ్యా.. దాని అర్ధం నాకు అసలే తెలియదు కానీ, బామ్మ గారికీ మీకు మధ్య నడిచిన సంభాషణ, అలాగే ఆవిడ చెప్పిన పసుపు డీటెయిల్స్ మాత్రం బాగా నచ్చాయి.

  నా బ్లాగ్ లో మీ కామెంట్ కి రిప్లై ఇస్తూ నేనడిగిన దానికి మీరేమని స్పందిస్తారోనని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.

 2. మీరు చెప్పిన దాంట్లో ఎంతో సత్యం దాగి ఉంది – ఇది అతి ప్రాచీన తత్త్వం. అప్పట్లో విరివిగా వినిపించేది ఈ పంచేంద్రియతత్త్వం. దీనికొరకే సిద్దులు, యోగులు, మహర్షులు ఏళ్లతరబడి ప్రాపంచిక జీవనాననికి దూరమై తపస్సు సాగించింది. ఈ పంచేంద్రియతత్వాన్ని పూర్తిగా తెలుసుకుని వాటిని అదుపులో పెట్టినవాడే అసలైన మేధావి.

  • మిత్రులు బోనగిరిగారు,
   మీరు ఆ ప్రయత్నమైనా చేసేరు అదీ నా వల్ల కాలా. ఇల్లాలి దగ్గర కాకా పట్టి తెలుసుకుని చెబుతా.
   ధన్యవాదాలు.

  • జిలేబిగారు,
   మీకు సమాధానం తెలుసని నాకు తెలుసు. చెప్పడానికి మొదలెట్టి, చిత్రంగా మనసు మార్చేసుకున్నారు కదూ…..
   నాకు మీరు చెప్పేస్తే, నేను ఇల్లాలి దగ్గర కాలరెగరెయ్యచ్చనుకున్నా. కుట్ర చేసి, ఎంతయినా మీరూ మీరూ ఒకటే, మేమే పిచ్చివాళ్ళం 🙂 అయ్యయో! ఇల్లాలి దగ్గర మేధావినని నిరూపించుకోలేకపోయానే!! ఉహు ఉహు. మరెలాగా ఇల్లాలినే అడిగి బతిమాలి చెబుతాకదా.
   ధన్యవాదాలు.

  • చిరంజీవి కృత్తిక,
   స్వాగతం, కాకినాడ అమ్మయివి కదూ. నీ బ్లాగులో ఒకటి రెండు సార్లు కామెంట్ కూడా పెట్టిన గుర్తు…అవునా?

   బాగా ప్రయత్నం చేశావు, నాకూ తెలియదు కదా! ఎవరూ చెప్పలేదు, ఇల్లాలిని అడిగి రేపు చెబుతానేం.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s