శర్మ కాలక్షేపంకబుర్లు-కంది కట్టు

కంది కట్టు

శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలలో ముఖ్యమైనవి మాంసకృత్తులు. మాంసం నుంచి నేరుగా పొందవచ్చు కాని శాకాహారం లో నుండి వాటిని తీసుకుంటేనే మంచిదని నేటి వైద్యులూ చెబుతున్నారు. ఈ మాంసకృత్తులు అందించే ద్విదళ బీజాలలో ముఖ్యమైనవి, కందిపప్పు, పెసరపప్పు,మినపపప్పు, శనగపప్పు, బొబ్బరి పప్పు ముఖ్యంగా చెప్పుకోవాలి. అన్నిటిలోనూ మాషం అనగా మినుము రాజులాటిది. అందులో మాలాటి పూర్తి శాకాహారులకి కందిపప్పే శరణ్యం. పప్పులేని భోజనం ఉండదంటే చిత్రం కాదు. నాటి రోజులలో పప్పు వండుకోడానికి చిన్న పప్పు గిన్నె దానిలోకి ఒక చిన్న పప్పు గరిటె ప్రతి ఇంటిలోనూ ఉండేవి. పప్పు, కంద కనక ఉడికిన నీళ్ళయితే చాలా మంచివని చెప్పేవారు. ఇవి రెండూ నీళ్ళు మంచివి కాకపోతే ఉడకవు పూర్తిగా. నీ పప్పుడకదిక్కడ అంటే నీళ్ళు సాఫ్ట్ వాటర్ కాదని అర్ధం, నీ పెత్తనం ఇక్కడ చెల్లదని చెప్పడమనమాట.మరో సంగతి నేడు కుక్కరు గిన్నెలో బియ్యం కడిగిపోసి నీళ్ళు పోసి, దాని పైన మూత పెట్టి దాని మీద కందిపప్పు పోసి కొద్దిగా నీళ్ళ చుక్కలేస్తే కుక్కరు పెట్టేస్తే పనయిపోతోంది. కాని నిజానికి ఇలా వండు కున్న ఆహారం లో మైక్రో న్యూట్రియంట్స్ అనబడే పోషక పదార్ధాలు ఏడు శాతమే మిగులుతున్నాయట. పప్పును మామూలు గా గిన్నెలో ఉడికించి, ఉడికించేటపుడు నీరు మరి కొద్దిగా ఎక్కువ పోసి ఉడికిన తరవాత ఆ నీటిని వేరుగా ఒక పాత్రలోకి తీసుకొని దానిలో తగు ఉప్పు వేసి, పోపు పెడితే దాని పేరే కంది కట్టు. నిజానికి దీనిలో పప్పులో కంటే ఎక్కువ పోషక విలువలూ ఉన్నాయి, అంతే కాక చాలా సులువుగా శరీరంలోకి చేరతాయి. మరో ముఖ్యమైన సంగతి జబ్బుపడి లేచిన వారికి ఇలా కంది కట్టుతో భోజనం పెడితే చాలా ఇష్టం గా తింటారు. శక్తి కూడా చాలా తొందరగా చేరుతుంది. ఇలాగే పెసరకట్టు కూడా చేసుకోవచ్చు. మరో చిన్న చిట్కా, శనగపప్పును కొన్ని కొన్ని తీపి పదార్ధాలు చేయడానికి ఉడకపెడ్తాము. అలా ఉడకపెట్టినపుడు పైన ఉండే నీళ్ళు పారపోయక చారులో పోసి తిని చూడండి. చారు బలే కమ్మహా ఉంటుంది.

తయారు చేసుకుని తిని చూడండి.నన్ను భోజనానికి పిలవద్దులెండి.

దేవుడా! ఈ టపా ఎవరూ ఎత్తుకుపోకుండా చూడూ!!

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కంది కట్టు

 1. శర్మగారూ,

  మీ వ్యాసాన్ని కాపీ కొట్టటం‌ దేనికీ, తప్పు! కావలిస్తే ఈ‌ కందికట్టు చేసుకోమనండి మీ‌ పేరుచెప్పుకొని.

  ఈ‌ కందికట్టునే మా యింట్లో కట్టుచారు అనే వాళ్ళం.
  కాని నాకు కట్టుచారు అస్సలు యిష్టం‌ కాదు.
  …….. ఇప్పుడు ఏమైనా ఇష్టం అవుతుందేమో చూడాలి.
  నాకు బెండకాయ యిష్టం‌ ఉండదు.
  ……… కాని హైదరాబాదు వచ్చిన క్రొత్తలో మా మేనమామగారింట్లో ఉన్నప్పుడు
  ……… ఆయనకిష్టం ఐన బెండకాయను నోర్మూసుకొని తిన్నాను బోల్డుసార్లు.
  నాకు చేమకూడా యిష్టం ఉండదు.
  ……. అందుకనే కాశీలో వదిలేసాను, మా అమ్మగారు చెబితే! గయలోనే లెండి.
  ……. కాని వదిలేయటం అంటే అలా ఇష్టం‌ లేనివాటినా?
  నాకు కొత్తిమీర కూడా యిష్టం ఉండదు.
  ……. కాని మాశ్రీమతికి యిష్టం కదా. అందుకని తినేస్తున్నాను.
  ……. పాపం కొంచెం వేయించే చేస్తారు లెండి.
  నాకు కాకరకాయ యిష్టం ఉండదు.
  ……. అది మాత్రం తినటం నా వల్ల కాదు.
  అదేమిటీ ఆరోగ్యానికి మంచివీ అని చెప్పే యివన్నీ నాకు ఎందుకిష్టం కావో నాకు అర్థంకాదు.
  ……. ఒకవేళ ఇవన్నీ యిష్టమై ఉంటే తెలివి మరీ మీఱిపోయి ఏమన్నా పిచ్చెక్కేదని దేవుడు మానిపించాడేమో!

  • మిత్రులు శ్యామలరావు గారు,
   చాలా పనులు మనకి ఇష్టం లేకపోయినా ఇతరులకోసం చేస్తాం, అదో విచిత్రం. కందికట్టు కమ్మగా ఉంటుందండి, తిని చూడండి,
   నెనరుంచాలి
   దేవుడా ఈ కామెంట్ ఎత్తుకుపోకుండా చూడూ.

  • శ్రీనివాస్ జీ,
   కందికట్టుని తయారు చేసుకుని తినమనే చెప్పేనండి.టపా కాపీ కొట్టద్దన్నానండి.అందుకే దేవుడిని వేడు కున్నానండి, టపా ఎత్తుకుపోకుండా చూడమని.
   నెనరుంచాలి
   దేవుడా ఈ కామెంట్ ఎత్తుకుపోకుండా చూడూ.

 2. కందికట్టు చారు రుచి అమోఘం – అంతేకాక ఆరోగ్యదాయని కూడా, ఆహార జీర్ణక్రియలో బాగా పనిచేస్తుంది. మంచి విషయాలు తెలిపారు, ధన్యవాదాలు.

  • స్వామీజీ,
   మన పెద్దలు వీటిని ఉపయోగించినపుడు ఒక ఫ్లితం ఆశించారు. జబ్బు పడి లెచినవారికి మాంసకృత్తులు అందాలి, అవి త్వరగా జీర్ణమూ కావాలి, రుచిగా నుండాలి. అందుకు ఈ ప్రక్రియని చేపట్టేరు.
   నెనరుంచాలి.
   దేవుడా ఈ కామెంట్ ఎత్తుకుపోకుండా చూడూ.

 3. కుక్కర్ వాడకం పెరిగాక కందికట్టు తగ్గిపోయింది. మా అమ్మకారు వెల్లుల్లి పాయల పోపు పెట్టేవారు భలే రుచిగా ఉంటుంది.

  • సుమగారు,
   పెద్దవాళ్ళు చెప్పినమాట వినడం మానేసేం కదండీ. ఆధునికులమనుకుంటూ కుక్కర్లో వండుకుంటూ టీ.వీ లకి, కంప్యూటర్లకి, సెల్ ఫోన్లకి అతుక్కుపోతున్నాం.
   వెల్లుల్లి పాయ వేసుకుంటే వేడి చేస్తుంది.
   నెనరుంచాలి.
   దేవుడా ఈ కామెంట్ ఎత్తుకుపోకుండా చూడూ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s