శర్మ కాలక్షేపంకబుర్లు-గొప్ప సౌందర్య సాధనం.

గొప్ప సౌందర్య సాధనం.

అరె అరె అలా వెంట్రుకలు పీకేస్తున్నారేంటీ! తెల్లబడిపోతున్నాయనా? తలలో చుండ్రు వగయిరా ఇబ్బందులు, ఐతే ఒక చిటకా ప్రయత్నించి చూడండి, ఇది గొప్ప సౌందర్య సాధనం కూడా.

కావలసిన వస్తువులు.
1.ముడి కొబ్బరి నూనె. ( మడ్డి తేరాలనుకుంటే కొద్దిగా బెల్లం ముక్క పడేసి ఉంచండి ఒక వారం, మడ్డి కిందకి చేరిపోతుంది)
2.మందార పువ్వులు.
3.గోరింటాకు.
4.కచ్చూరాలు.
5.వట్టి వేళ్ళు
6.ఉసిరిగింజలు,పప్పు

కొబ్బరినూనెతీసుకోండి, గానుగలోకాని మిషన్లో కాని ఆడినది, కొద్ది జిడ్డుగానూ కొద్ది వాసనతోనూ ఉంటుంది. అదే అసలైన కొబ్బరి నూనె. దీనికి ఎండబెట్టుకున్న గోరింటాకు, మందారపువ్వులు, మొన్నను అనుకున్నాం చూడండి ఉసిరికాయలు తరగ్గా వచ్చే గింజలు,వీటిని బాగా చితక కొట్టండి, చిన్న గింజలొస్తాయి, వాటినీ చితక కొట్టి ముద్దగా చేయండి. లేదంటే ఉసిరి పప్పు అని అడిగితే బజారులోదొరుకుతుంది.

కొబ్బరినూనెలో, ఉసిరిపప్పు,మందారాలు,గోరింత ముద్దని సన్నటి బట్టని మూటకట్టి, నూనెలో వేసి ఒక రాత్రి ఉంచండి. ఆ తరవాత ఆ నూనెను సన్నటి సెగమీద కాచండి, మూట అలాగే ఉండనివ్వండి.. కాగిన తరవాత(బాగా కాచండి, రంగు నల్లగా అవుతుంది)అప్పుడు బజారులో దొరికే కచ్చూరాలు,వట్టి వేళ్ళు నూనెలో వేయండి,( ఈ కచ్చూరాలు, వట్టి వేళ్ళు ఇబ్బందిగా ఉన్నాయనుకుంటే తీసెయ్యండి, లేకపోతే అలాగే ఉంచుకోవచ్చు) మీకు ఇంకా సువాసన కావాలంటే మల్లిలాటి పువ్వులను తెచ్చుకుని కొద్ది వేడిగా ఉన్న నూనెకు చేర్చి ఒక రోజు ఉంచి తీసేయండి. ఇప్పుడు మంచి ఔషధాలతో కూడిన మంచి నూనె తలకి రాసుకోడానికి తయారయింది. వీటికి కొలతలు వగైరాలతో నిమిత్తం తక్కువ. మీ వీలుబట్టి వేయండి. ఇది ఒక రకంగా తలకి వేసుకునే రంగే, ఎందుకంటే, ఉసిరికాయ మెత్తన చేస్తే వచ్చే రంగు నలుపు, మందారం నలుపు, గోరింట ఎరుపు. ఇవన్నీ ఔషధాలే. ఇంత బాధ ఎవరుపడతారంటారా? మీ చిత్తం, సింథటిక్ రంగులేసుకుంటే కేన్సరొస్తుందిట. అసలు నూని రాసుకోమంటారా? అది చలి దేశాల వాళ్ళకి, మనకి కాదు.

బజార్లో భృంగామలక తైలం అని అమ్ముతారు, అందులో ఇవిగాక ఇంకా ఏవేవో వేస్తారు, నాకు పూర్తిగా తెలీదు. ఇది మేము ఇంటిలో తయారు చేసుకునే పద్ధతి, కొట్టుకొచ్చింది కాదు.

 

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గొప్ప సౌందర్య సాధనం.

  • స్వప్నాజీ,
   పెద్ద పనేం కాదండీ!.
   కొబ్బరి ముక్కలు ముదురువి ఎండినవి మాత్రమే ఆడి మన ఎదురుగా ఇమ్మంటే ఇస్తాడు, సంవత్సరానికి కావలసిన నూనె తెచ్చుకోడం, కచ్చూరాలు, వట్టి వేళ్ళు తెచ్చుకోడం, ఇవే పనులు. గోరింట, మందారం, ఉసిరి పప్పూ, ఇంట్లో దొరికేవే,ఇప్పుడే గోరింట మందారం బాగా ఉంటాయి కనక, ఇప్పుడే తయారు చేస్తాం. మొన్న చేసుకున్నాం. అందుకు గుర్తొచ్చి టపా లో రాసేను. మల్లె కాని, మొగలి కాని అవి వచ్చే కాలంలో తీసుకుని నిలవ ఉన్న నూనెలో వేసి రెండురోజులు మూత పెట్టి ఉంచుకుంటే చాలు. ఇదంతా మనకోసమే కదండీ.
   నెనరుంచాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s