శర్మ కాలక్షేపంకబుర్లు-బ్లాగుకు మూడేళ్ళు నిండాయి

బ్లాగుకు మూడేళ్ళు నిండాయి

ఓం

అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతం గమయః

హే భగవాన్!  అసత్యం నుంచి సత్యం వైపు,చీకటినుంచి వెలుతురు వైపు,మృత్యువునుంచి అమృతత్వానికి నడిపించు.

ఓం శాంతి శాంతి శాంతిః

tatagaru

ప్రకటనలు

33 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బ్లాగుకు మూడేళ్ళు నిండాయి

 1. బాబాయ్ గారూ !నమస్తే .అభినందనలు. మీ బ్లాగు జ్యోతి లాంటిది .అది నిత్యం వెలుగులు విరజిమ్మాలని ఆశిస్తున్నాను .

  • అమ్మాయ్ నాగరాణి,
   నీ అభిమానానికి నోట మాట రావటం లేదమ్మా! ఏం చెప్పాలో తెలియటం లేదు. నవరాత్రులొచ్చేశాయి, ఇంకన్నీ పండగలే 🙂
   దీర్ఘసుమంగళీ భవ, దీర్ఘాయుష్మాన్భవ
   దయ ఉంచండీ.

 2. శర్మ గారూ ,

  నమస్తే .

  ముచ్చటగా మూడేళ్ళు అచ్చట ముచ్చటలతో హాయిగా గడిచింది . కానీ కొన్ని అపశృతులు ఆవహించటంతో కొంచెం మనసును కష్టానికి గురి చేశాయి . అదొక్కటే బాధ .

  మీరు యిలా ముందు తరాల వారికి మార్గదర్శకంగా వుండాలని మనసారా కోరుకుంటున్నాను .

  • పద్మాజీ,
   అభినందన మందారాలికి పాదాల చెంత కృతజ్ఞతా కుసుమాలు.మిమ్మల్ని చూస్తే నాకూ కవితలొచ్చేస్తున్నాయి 🙂
   దయ ఉంచండీ.

 3. అభినందనలు.
  కేవలం మూడేళ్ళలో ఇన్ని స్వంత టపాలు వ్రాసిన బ్లాగర్లు తెలుగులో చాలా తక్కువమందే అనుకుంటాను.

  • మిత్రులు బోనగిరిగారు,
   తాడితన్నేవాడి తల తన్నేవాడుంటాడు, అని సామెత.నా కంటే బాగా ఎక్కువ రాసిన వారూ ఉంటారండి. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుడిని.
   దయ ఉంచండీ.

 4. అభినందనలు శర్మ గారూ !
  టపాలను ఎప్పటిలాగే పోస్ట్ చేస్తూ, మిగతా బ్లాగర్లకు ప్రేరణ అవుతూ ,
  అంతర్జాలం లో, మీ టపాలతో వెలుగు నింపుతూ ఉంటారని ఆశిస్తున్నా !

  • సుధాకర్ జీ,
   ఒక క్షణం లో అంతా మూట కట్టేసి చాప చుట్టేసినమాట నిజం. అమ్మ అనుమతి లెదు.
   మీ అభిమానానికి కృతజ్ఞుడిని.
   దయ ఉంచండీ.

 5. subhakanshalu meeku mee blogku. sir, nado request. mee rasina aneka sametalu, nanardhalu, like andhapangu nyamu, sakhachnoramana nyamu nenu diary lo rasi pettukonnanu. nenu rase kathalolo upayoginchukovalani na asa. daniki mee angikaram kosam kosamu request chesukontunna. namaskaram.
  a.v. ramana.

  • రమణాజీ,
   చాలా కాలం తరవాత కలిశాం. కుశలమే కదా!
   నానుడులు, సామెతలు,జాతీయాలు, సంస్కృత న్యాయాలు మన తెనుగువారి సొత్తు. అది నా ఒక్కడిదీ కాదు, మనందరిది. అయితే వీటిని విరివిగా సందర్భాన్ని బట్టి వాడేను. చిన్నప్పటినుంచి తల్లుల దగ్గర వీటిని నేర్చుకున్నా. అస్థిగతమైపోయాయి. న్యాయాలు తెనుగు లో చెబుతున్నా. వీటిని మీరు ప్రత్యేకంగా రాసుకుంటున్నాన్నాందుకు నాకు చాలా ఆనందం కలిగింది.వాటిని ఉపయోగించుకోడానికి నా అనుమతి అనవసరం. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞత తెలుపుతున్నా.
   దయ ఉంచండీ.

 6. మీ బ్లాగుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
  నేను మీ తరం వాడి నైనా, నాకు తెలియని విషయాలు చాలానే తెలుసుకున్నాను మీ బ్లాగు ద్వారా.
  మీ బ్లాగు మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

  • మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యం గారు,
   చదువులేని మట్టి మనిషిని, మీరు పెద్ద చేస్తున్నారు, అది మీ ఔదార్యానికి నిదర్శనం. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుడిని
   దయ ఉంచండీ.

 7. మిత్రులు భాస్కరశర్మగారికి,

  వ. ప్రతి ఉదయమూ మీరేమి వ్రాసారా యీరోజున అని చూడటం అలవాటైనది. కాబట్టి

  ఉ. చీకటి పొట్టచీల్చుకొని చిందులువేయుచు వచ్చు కాంతులన్
  వేకువ తెచ్చు నంచు పృధివిం జను లెల్లరు వేచియుండు శో
  భాకరమైన వేళ ప్రియమారగ నాలుగు మంచిమాటలన్
  మాకు ప్రసన్నుడై పలుకు మాన్యుని భాస్కరశర్మ నెన్నెదన్

  వ. అయ్యా భాస్కరశర్మగారూ, మీ మాటలుమాకు చాలా విలువైన వెలుగులు.

  కం. ఆకాశంబున సూర్యుడు
  మా కిచ్చెడు వెలుగు పవలు మాత్రం బనగా
  శ్రీకరమౌ మీ మాటలు
  మాకు దివారాత్రములును మంచి వెలుంగుల్

  మీకు మా నమోవాకములు.

  • మిత్రులు శ్యామలరావు గారు,
   మీ అభిమానానికి నాకు నోట మాట రావటం లేదు. నా పరిస్థితి శ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమైనపుడు ధ్రువుని పరిస్థితిలా ఉంది.
   దయ ఉంచండీ.

 8. అభినందనలండి.
  మీ ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాము.
  మరెన్నో చక్కటి విషయాలను తెలియజేస్తారని అందరమూ ఆశిస్తున్నామండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s