శర్మ కాలక్షేపంకబుర్లు-జున్ను

జున్ను

జున్ను,వెన్న, నెయ్యి నేటి కాలం వారికి నిషిద్ధ వస్తువులయిపోయాయి.ఏ డాక్టర్ దగ్గర కెళ్ళినా ఉప్పు మానెయ్యండి, నెయ్యి, నూనె మానెయ్యండి, సన్ ఫ్లవర్ వాడండి వగైరా చెబుతున్నారు. నిజానికి డబల్ రిఫైన్డ్ నూనెలో ఉన్నదంతా విషతుల్యమే. అదే ఆనందంగా ఆరోగ్యమని తింటున్నాం. నిజానికి నువ్వుల నూనె గానుగ నుంచి వచ్చినది కొద్దిగా బెల్లం ముక్క వేసి ఉంచుకున్నది వాడుకుంటే చాలా బాగుంటుంది, నిజానికి నువ్వుల నూనె చాలా వాత రోగాలికి మందు. ఇది ఈ మధ్య మాకు ప్రత్యక్షంగా అనుభవం లోకి కూడా వచ్చింది. ఈ గానుగ నుంచి వచ్చిన నూనె కొద్దిగా వాసన ఉంటుంది, అదే మంచిది కూడా, ఇక జున్ను అన్నది పట్నవాసులెప్పుడో మరచిపోయారు. దీనిని కస్టర్డ్ అనికాబోలు అమ్ముతారు బజారులో, కాని ఇది ఇంట్లో చేసుకుని, వేడి వేడిగా మిరియాల కారం నోటికి తగులుతుండగా తియ్యగా తింటే ఆ మజాయే వేరు.దారి తప్పి పోయామా?

మొన్న నొక రోజు రాత్రి జున్ను తినండి అని తెచ్చింది ఇల్లాలు, జున్నెక్కడిదీ అంటే, మా మేనల్లుడు తెచ్చాడు కదూ మధ్యాహ్నం అని సాగతీసింది. ఇప్పుడొద్దులే రేపు తింటనన్నా! అలా ఐతే ఉండదు లెండి అని తినేశారు. అసలీ జున్ను ఎలా తయారు చేసారు? గేదె కాని ఆవు కాని ఈనిన రోజే పాలిస్తుంది. ఆ పాలను ముఱ్ఱు పాలు అంటాం, ఇలా ఇచ్చే పాలు మూడు రోజులపాటు జున్ను చేసుకోడానికి పని కొస్తాయి, ఆ తరవాత పనికి రావు. జున్ను తయారు చేసుకోడం.

1.ముఱ్ఱు పాలు
2.మామూలు పాలు వీటిని తోడు పాలు అంటాం.
3.మిరియాలు.
4.పంచదార.
5.ఏలకులు.

ముఱ్ఱుపాలు గ్లాసుడైతే తోడుపాలు రెండు గ్లాసులుండాలి. తోడు పాలంటే మనం వాడుకునే పాలు.ముఱ్ఱుపాలు బాగా చిక్కగా ఉంటాయి. ఆ చిక్కదనాన్ని పట్టి తోడుపాలు పోసుకోవాలి. ఇలా కలిపిన పాలను ఒక పాత్రలో పోసి నీరుపోసిన పెద్ద పాత్రలో ఉంచి పెద్ద పాత్రను స్టవ్ మీద పెట్టి సన్నటి సెగను కాచాలి. పాత్ర మీద మూత వేయకండి. ఇలా కాగేటపుడు తగిన పంచదార,ఏలకిపొడి, మిరియపుపొడి కలపాలి. కొద్ది సేపటికి జున్ను తయారయిపోతుంది. కొంతమంది బెల్లం వేసుకుంటారు, పంచదార బదులు. నిజానికి బెల్లం తో చేసిన జున్ను చాలా బాగుంటుంది. బజారులో తయారు చేసిన జున్ను దొరుకుతుందంటారు, బాగోదనుకుంటాను. వేడిగా ఉండగా తినడం మంచిది. ఫ్రిజ్ లో నిలవ చేసినది తినద్దు. ఈ జున్నులో అనేకమైన పోషక పదార్ధాలున్నాయట. జున్ను తింటే జబ్బు చేస్తుందనే అపోహ కూడా చాలామందిలో ఉంది. ఎక్కువైతే ఏదయినా మంచిది కాదు కదా!

మీరు దేని మీద పడితే దాని మీద టపా రాసేస్తారా? మీ వాళ్ళ బుఱ్ఱలు తినకండి అని సలహా ఇచ్చింది ఇల్లాలు, నిజమేనా?

ప్రకటనలు

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జున్ను

 1. అయ్యా శర్మగారూ,మా యింట్లో కూడా అప్పుడప్పుడు జున్ను చేసుకుని తింటాము.మాయింట్లో ముగ్గురు డాక్టర్లం ఉంటం చేత ఎవరో ఒక పాడిఉన్నవారు జున్నుపాలు తెచ్చి ఇస్తూఉంటారు.మీరన్నట్లు అందులో మిరియాలు ఏలకులు ,పంచదార,లేక బెల్లం వేస్తేనే చాల బాగుంటుంది.occassional గా తింటే ఆరోగ్యానికి హాని చెయ్యదు.

  • మిత్రులు రమణారావు గారు,
   సంవత్సరానికి రెండు మూడు సార్లు తినచ్చు. ఎక్కువ తింటే జలుబు చేస్తుంది. మీకు అలా తెచ్చి ఇస్తారు. ఇక్కడ మాకూ పాలు పోసేవాళ్ళు తెచ్చి ఇస్తారు, మేమే వద్దంటాం. ఉంటే తినేస్తాం ఆ తరవాత బాధ పదతామని భయం.

   నెనరుంచండి.

 2. ఈ టపా ఇంకా ఏ గిందిమళ్ల కరిజ ఎత్తుకుపోలేదేమిస్మీ?

  జున్నా? ఎవరక్కడ? ఈ శర్మ గార్ని జైల్లో పెట్టండ్రా నేను మళ్ళీ చెప్పేదాకా? మాది అయిద్రాబాదు. జున్నూ మన్ను గవి ఎట్టగుంటై? సీమాంధ్రాదా ఇది? అయితే గియితే ఇది అయిద్రాబాద్ లో కుదర్దు. సీమాధ్రా జున్ను పేడలా గుంటది. చాల్నా?

  • మిత్రులు నేనునేనే గారు,
   ముహుర్తం కుదరలెదనుకుంటానండి.

   దొరా!
   నువ్వు పేడ తినద్దుగాని, నన్ను లోపలేయించెయ్యి! నాతో పాటో ముసల్దీ ఉంది దాన్నీ లోపలెయించెయ్యి దొరా! బయట ఉండి బతకలేక ఛస్తున్నాం, చావలేక బతుకుతున్నం. 🙂

   నెనరుంచండి.

 3. పింగుబ్యాకు: aashika.vankadari@gmail.com,anushaketepalle@yahoo.com | settyvvs

 4. చిన్నప్పుడు జున్ను విరివిగా తినే అవకాశం ఉండేది,
  (మా నాన్న గారు డైరీ ఫార్మ్ లో పని చేసేవారు)
  మా పిల్లలకు రుచి కూడా చూపించ లేక పోయాము.
  చిన్ననాటి ముచ్చట్ట్లు గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు.

  • మోహన్జీ,
   దగ్గరలో పశువుల సంత ఎక్కడేనా జరుగుతుందేమో కనుక్కోండి. అక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి, పాలు. మాకు దగ్గరలో ద్వారపూడి అనే ఊరులో ప్రతివారం సంత జరుగుతుంది, మాకు అక్కడ దొరుకుతాయి.
   నెనరుంచండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s