శర్మ కాలక్షేపంకబుర్లు-.”అడుగులకు మడుగులేయడం”Red carpet Welcome

”అడుగులకు మడుగులేయడం”

మొన్ననొక రోజు పక్కవారెవరో అల్లుని గురించి చెబుతుంటే ఇల్లాలు “ఎంతల్లుడయితే మాత్రం మరీ అంత అడుగులకు మడుగులొత్తేస్తారా?” అంది. అసలీ అడుగులేంటీ, మడుగులొత్తడమేంటీ అని అనుమానమొచ్చింది.

అడుగు అంటే సంభాషణలో ప్రశ్నించడమనీ, ఒక కొలతనీ, కాలి పాదమనీ నానార్ధాలున్నాయి. మడుగు అంటే కూడా నీటి కొలననీ, శుభ్రమైన వస్త్రమనీ నానార్ధాలున్నాయి. మరి ఈ అడుగులకు మడుగులొత్తడమేమని కదా అనుమానం.

ఏనుగునెక్కించడం, పల్లకీ ఎక్కించడం,నడచే ప్రతి అడుగుకు శుభ్రమైన వస్త్రం పరచడం గౌరవసూచకాలు, మన భారత సంస్కృతిలో. దీనినుంచి వచ్చినదే ఈ రెడ్ కార్పెట్ వెల్కం. ప్రపంచానికి ఈ సంస్కృతి నేర్పినది భారతీయులే. రాజవ్యవహారాలలో Red Carpet welcome, ఎఱ్ఱతివాచీ పరచి స్వాగతం చెప్పేరంటారు అంటే ఎక్కువగా గౌరవించారని కదా భావం, నేడు  అమెరికావారు మొన్న చైనావారు, అటుమొన్న జర్మనీవారు, తొలుతగా జపాన్ వారు,మన ప్రధాని మోదీగారికి స్వాగతం చెప్పినట్టు. అలాగే ఈ అడుగులకు మడుగులొత్తడం, అది మడుగులొత్తడం కాదు,”అడుగులకు మడుగులేయడం”. ఎందుకంటే!  

భారత సంస్కృతిలో సామాన్యుడు కూడా తను ఎక్కువగా గౌరవించేవారిని ఆహ్వానించేటపుడు శుభ్రమైన వస్త్రాన్ని పరచి దానిపై స్వాగతం అందుకున్నవారు నడచి వస్తుంటే,  వస్త్రాల్ని  ముందు పరవడం. అనగా అమిత గౌరవం చూపడమని అర్ధం. కాని లోకవ్యవహారం లో ’అడుగులకు మడుగులేయడం’ కాస్తా ’అడుగులకు మడుగులొత్తడం’ అయి ఊరుకుంది.

“ఇంతకి ఇన్ని దేశాలవారు మన ప్రధానికి ఇంతగా అడుగులకి మడుగులేయడం ఎందుకో తెలుసా? వారి వ్యాపారాన్ని మన దేశం లో వృద్ధి చేసుకోడానికే. వారి వ్యాపారం వృద్ధిచెందితే మన వారికి ఉద్యోగాలొస్తాయి కదా! అన్నారొకరు. ఏమో! అదంతా తెల్లోడి మాయేమో తెలియదు, వేచి చూడాల్సిందే, ఒక సామెత గుర్తొచ్చింది, “లాభం లేనిది ….వరదనపోడని”వీరందరిది మనమీద ప్రేమకాదు, లాభాపేక్ష.”

ఇదంతా నిన్నటి మాట. నేడు Make in INDIA సాకారం చేద్దాం. వ్యాపారి లాభం కోసమే చేస్తాడు, వ్యాపారం, దోపిడీ నుంచి రక్షించుకుందాం.మనమూ వస్తువులు తయారు చేద్దాం, ప్రపంచం లో అమ్ముదాం, నాణ్యమైన వస్తువులు భారతదేశం లోనే దొరుకుతాయన్నది నిజం చేద్దాం. ఒకప్పుడు ఆ నాణ్యమైన వస్తువులకోసమే మన దేశమొచ్చారు తెల్లవాళ్ళు. ఇప్పుడు రోజు మనది, వారితో వ్యాపారం చేద్దాం, మనమేo తక్కువ వాళ్ళం కాదని నిరూపిద్దాం, అంగారక యాత్రతో సఫలంతో ఇప్పటికే ప్రపంచానికి నిరూపించాం, మనమేంటో.

“స్థిరంగా నిలబడు ప్రపంచంలో ఏ శక్తీ నిన్ను కదల్చలేదు” ఋగ్వేదం చెబుతున్న మాట. బలమైనవాడే స్థిరంగా నిలబడగలడు. బలంగా నిలబడదాం. బలం కలవాణ్ణి మాత్రమే లోకం గౌరవిస్తుంది. అప్పుడే ఎదుటివాడు  గౌరవిస్తాడు, అడుగులకి మడుగులూ వేస్తాడు , అదే 

RED CARPET WELCOME

TO

BHARAT

BY

UNITED STATES OF AMERICA.

జయహో భారత్. ….జయ జయహో భారత్……జయ జయ జయహో భారత్

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-.”అడుగులకు మడుగులేయడం”Red carpet Welcome

 1. మీరు చెప్పిన “అడుగులకి మడుగులేయటం” సామెతతో బాటు “అడుగులకు మడుగులొత్తటం” అనే సామెత కూడా బహుళ ప్రాచుర్యంలో ఉన్నదే. రెండూ దాదాపు సమానార్థాలే.

  “అడుగులకు మడుగులొత్తటం” అంటే వేసే అడుగులకి ముందున్న మార్గాన్ని రాజమార్గంగా మార్చటం అనగా ముందున్న మడుగులు (గుంటలు లాంటివి) పూడ్చటం. ఇప్పటికీ ఎవరైనా పెద్ద రాజకీయనాయకుడు వస్తున్నాడంటే గుంతలన్నీ పూడ్చేస్తుంటారు. అడుగులకు మడుగులొత్తి మీరు చెప్పినట్టు ఎదుటి వారిని ప్రసన్నం చేసుకుంటారు.

  మీరన్నట్టు కాలం మారిపోయింది, తెలివి తెల్లోడి సొంతమనేది పాత నానుడి. ఇప్పుడు ప్రపంచమంతా తెలివిమీరి పోయింది, ఈ పోటీలో ఎవరు ముందుకు వెళతారనేది కాలమే నిర్ణయించాలి.

  • స్వామీ జీ,
   మడుగులొత్తడం అనేదే సామాన్య జనం లో ఉన్న మాట. మడుగులేయడమన్నది అసలు మాటనీ దానిని సామాన్యులౌ ఇలా మదుగులొత్తడం గా మార్చేసేరనీ అనుకున్నా. రెండూ వాడుకలో లేవు.మన రాజకీయనాయకులకోసం గుంతలే ఖర్మ నదులే పూడ్చేయగలరు 🙂
   నెనరుంచండి.

  • Atal జీ,
   మీకు వెంటనే ఆ సినిమాలోది దొరకడం బలేగా ఉంది. నిజమే. మన సంప్రదాయాలకి నిలువెత్తు నిదర్శనం ఈ చిత్రం. బాపూగారు చిరంజీవి.
   నెనరుంచండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s