శర్మ కాలక్షేపంకబుర్లు-గడ్డిమేటి దగ్గర కుక్క.(కుక్క కేపిటలిస్టా? కాకి కమ్యూనిస్టా ?)

గడ్డిమేటి దగ్గర కుక్క.(కుక్క కేపిటలిస్టా? కాకి కమ్యూనిస్టా ?)

మన పల్లెలలో గడ్డిని మేటిగా వేయడం అలవాటు. ఇది వేసేటపుడు మధ్యలో జనపకట్టెను పెట్టి వేయాడమూ అలవాటే. ఇలా జనుము కలిపి నిలవ చేసిన గడ్డిని పశువులు చాలా ఇష్టంగా తింటాయి. ఈ గడ్డిమేట్లని పశువుల శాలల్లోనూ పొలంలో నూ ఎత్తయిన ప్రదేశాలలో వేస్తారు. ఆ రైతు పశువులు కాని పై రైతు పశువులు కాని గడ్డిని మేటినుంచి పీకి తినకుండా, మేటిని పాడు చేయకుండా ఉండేందుకుగాను, కుక్కని కాపలా పెడతారు. కుక్కకెపుడూ ఒక పూటే భోజనం. రాత్రి కుక్కకి ఆహారం ఇవ్వరు, ఎందుకనీ? రాత్రి కనక కుక్కకి ఆహారమిస్తే తిని చక్కగా పడుకుని నిద్ర పోతుంది. మరి కాపలా కాయాలంటే కడుపు మాడాలిసిందే! రైతు పగలు భోజనం పొలంలో చేస్తాడు, మిగిలినది కుక్కకి పెడతాడు. కుక్క గడ్డి తినదు, గడ్డినితినే పశువునీ తిననివ్వదు. కుక్కలు భోజనం చెయ్యడం చూశారా? ఒక కుక్క కనక ఎంగిలి విస్తరిలో మిగిలినది తింటుంటే మరొక కుక్క కనక వస్తే రెండిటికీ ఆహారం సరిపోయినా మొదటి కుక్క రెండవదానిని తిననివ్వదు. రెండవకుక్కని తరిమేసేదాకా తనూ తినదు. ఈ కొట్లాటలో విస్తరి కాస్తా చిరిగి ఉన్న ఆహారం నేలపాలవుతుంది. అలా నేల పాలయినా  బాధపడవు కాని కుక్కలు కలిసి భోజనం చెయ్యవు.  అందుకే ‘కుక్కలు చింపిన విస్తరి’ అన్నారు. మరి కాకి ఆహారం తీసుకోడం చూశారా? నాలుగు మెతుకులు కనపడగానే కాకి ‘కావ్ కావ్ కావ్’ మని అరిచి ఆ మెతుకులికి కాపలా ఉండి పది కాకులొచ్చిన తరవాత పంచుకుతింటాయి, సరిపోక పోయినా సరే! కాకులు భోజనం దగ్గర దెబ్బలాడుకోవు 🙂

“కాకి కమ్యూనిస్ట్ కదండీ! మరయితే కుక్కో” అన్నాడు మా సత్తి బాబు. “కాకి కమ్యూనిస్ట్ అయితే కుక్క కేపిటలిస్ట్. ఒక ఫెక్టరీ యజమాని, మరొక వారితో పోటీలో, వారిని, వారి ఉత్పత్తిని మార్కెట్ లో లేకుండా చేయడానికే ప్రయత్నం చేస్తాడు కదా! మరో సంగతి ఇలా సంపద కూడబెట్టి కూడా పట్టుకుపోతాడా? ఇక్కడే వదిలేసిపోతాడోయ్! సంపదకి కుక్క కాపలా కాస్తాడంతే!!”అన్నాడు మా సుబ్బరాజు. “మరి కమ్యూనిస్టులో” అని టొకాయించాడు సుబ్బరాజు, “కాకిలాగా ఇతరుల సొమ్ము పంచిపెట్టడానికి ముందుంటారు” అని ముగించాడు మా సత్తిబాబు. 

కుక్క కేపిట్లిస్టూ, కాకి కమ్యూనిస్టూ అయితే మనమేంటన్నాడు మా సత్తి బాబు. అంతా విన్న మా సుబ్బరాజు ‘మనం మడుసులం కదూ’ అని ప్రశ్నించాడు.

“ఓ సంగతి గుర్తించారా? ఇప్పుడు మీరు దారిలో కొచ్చారు. ఇలా ఎవరూ పట్టుకుపోని టపాలు రాసుకోవాలి తెలిసిందా?” అంటూ వెళిపోయారు.

నిజమేనంటారా?

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గడ్డిమేటి దగ్గర కుక్క.(కుక్క కేపిటలిస్టా? కాకి కమ్యూనిస్టా ?)

    • రావుగారు,
      ఒకందుకు మొదలెట్టిన టపా మరోలా ముగిసింది నా ప్రమేయం లేకనే, అందుకే తలకట్టు కూడా మారిపోయింది.దడిగాడు వానసిరా అంటారా! బాగుందే తలకట్టేదో! 🙂
      నెనరుంచాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s