శర్మ కాలక్షేపంకబుర్లు-పరుపు.

పరుపు.

పరుపు అంటే పడుకోడానికి పక్కకి ఉపయోగించే సాధనం. నేడు తెనుగు అర్థంకావాలంటే ఇంగ్లీషులో చెప్పాల్సివస్తోందనుకుంటా, బెడ్ అని.

ఒకప్పుడు పందిరిపట్టెమంచాలూ, నులకమంచాలూ, నవారు మంచాలూ వాడేవాళ్ళం వాటి మీద పడుకున్నపుడు మెత్తగా ఉండేందుకుగాను పరుపు వేసుకునేవారం కదా! అది ఆ రోజులలో దూది పరుపే అయి ఉండేది. బూరుగు దూదితో కూడా పరుపులు కుట్టించుకునేవారు, కాని ఇది మామూలు దూది అంత బాగోదు. హంసల ఈకలతో పడక ఏర్పాటు చేసుకునేవారట. వాటినే హంసతూలికా తల్పం అనేవారు. ఇప్పుడు తల్పాలు లేవు గాని గిల్పాలే ఉన్నాయి. దూది పరుపులూ పోయాయి. వాటిని రెండు మూడేళ్ళకి ఒక సారి దూది ఏకించి మళ్ళీ కుట్టించుకునేవారం. తలగడలకి బూరుగుదూది వాడేవారం. గోదారి లంకలో బూరుగు చెట్లుండేవి. వాటినిండా ఎండిన కాయలుండేవి. ఎండిన కాయలు రోజూ రాలేవి. వాటిని ఏరుకొచ్చి, కాయల్ని ఎండబెట్టి, చితకకొట్టి, గింజలని వేరు చేసి దూది తయారు చేయడం చిన్నప్పటి సరదాలలో ఒకటి.

ఇప్పటికి పల్లెలలో చొక్కామీద  చొక్కా తొడుగుతారు,చలికాలం, అవి కూడా పల్చటి నూలుచొక్కాలే,ఎందుకో తెలుసా? వెచ్చగా ఉంటుంది, ఎందుకనీ? పల్లెటూరివాళ్ళకి సయిన్స్ ను ఉపయోగించుకోడం తెలుసు 🙂 రెండు చొక్కాల మధ్య ఉన్న గాలి ఉష్ణాన్ని బయటికి పోనివ్వదు బయటిదాన్ని లోపలికి రానివ్వదు, (adiabatic) అదీ సంగతి. ఇక పల్చగా ఉండే పరుపులూ ఉండేవి, బూర్నీసులని, రజాయిలని అనేవారు. వీటిని శీత కాలంలో వాడేవారు, కప్పుకుంటే బలే వెచ్చగా ఉండేది. ఇవి కాక బొంతలని కుట్టేవారు, పాత చీరలు, దుప్పట్లు, పంచెలని పారేయక, ఒక దాని మీద ఒకటి పరచి బొంత సూదితో కుట్టేవారు. బలే మెత్తగా ఉండేవి.

ఇప్పుడు బొంతలు కుట్టడానికి నేత చీరలు కట్టేవారూ కనపడటం లేదు, 70 ఏళ్ళవాళ్ళు కూడా సింథటిక్ చీరలే కడుతున్నారు, చిన్నవారు పంజాబీల మీదే ఉంటున్నారు, ఇంకా ఎందుకు అవస్థ అని నైటీలతోనే కాలమూ గడిపేస్తున్నారు.. మగవారు, పంచె కట్టిన మగాడు కనపడటం లేదు. పంచె కట్టిన వాడు పెద్ద మనిషనీ, మోసగాడనే అభిప్రాయం ప్రజలలో స్థిరపడిపోయింది. చెప్పొచ్చేదేమoటే, మమతలు లేవు, బొంతలూ లేవు. ఇప్పుడన్ని రగ్గులే, మంచాలన్నీ డబల్ కాట్ లే,పరుపులన్నీ సింథటిక్ పరుపులే. పడుకుంటే కిందనుంచి వేడి కొడుతోంది. పరుపు మీద పడుకోడం ఎప్పుడో మానేశాం. హాయిగా ఒక బొంత వేసుకుని ఒక పల్చటి దుప్పటి దానిపై వేసుకుని రెండు దిళ్ళు వేసుకుని, ఒక దుప్పటితో కాలక్షేపం జరిగిపోతోంది,నవారు నేసిన పట్టెమంచం మీద. ఇంత కంటే గచ్చు మీద కింద పడుకోడం నయం, డాక్టర్లు నడుము నెప్పి అంటే కింద పడుకోమంటున్నారు, ఎందుకో తెలుసా, గొయ్యి లాటిఆ మంచం లోనూ సింథటిక్ బెడ్ మీదా వెనుపాము నిటారుగా ఉండటం లేదు, నేల మీద చక్కహా ఉంటుంది కదూ!.

ఈ పరుపు పురాణంఏంటీ? అన్నారొకరు, ఈ మధ్య ఒక వార్త చూశాను, ఒక యువతి బెడ్ పుచ్చుకుని తిరిగిందిట, ఎక్కడికెడితే అక్కడికి, ఇంతకీ సంగతేమంటే ఆ యువతిని ఆ బెడ్ మీద అత్యాచారం చేసేరట, అది కూడా ఒక విశ్వవిద్యాలయంలో,తన గోల ఎవరూ పట్టించుకోకపోతే ఇలా బెడ్ పుచ్చుకుని తిరిగిందిట, ఆ ఆ కంగారు పడిపోకండి మన దేశం లో కాదు లెండి..

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పరుపు.

  • మితృలు శ్యామలరావు గారు,
   శ్రీపాదవారు యతోభ్రష్టః తతో భ్రష్టః అన్నారండి, మనదైనదేదో మనకి తెలియదు, కొత్తగా వచ్చినదీ తెలియదు. నిజానికి మీరు చెప్పిన మాట తెలియదు బెడ్ అనడం తప్పించి.
   నెనరుంచండి.

 1. శర్మ గారూ ,

  నమస్తే .

  మీ టపాలలో ఆరోగ్య సూత్రాలు చక్కగా వుంటున్నాయి . తెలుసుకొని మసులుకొనే వారికి ఆరోగ్యం , ఆనందం కొనుక్కునే అవసరం వుండబోదు .

 2. అబ్బబ్బా, ఈ మధ్య ఈ మగాళ్ళ కి ఏమైంది చెప్మా ??

  ఒక డాడీ దాసు ఆయ్ జీన్సు శోభాయమానం కాదంటాడు .

  మరి కష్టే ఫలే వారేమో – ఇట్లా వాపోతున్నారు — , “70 ఏళ్ళవాళ్ళు కూడా సింథటిక్ చీరలే కడుతున్నారు, చిన్నవారు పంజాబీల మీదే ఉంటున్నారు, ఇంకా ఎందుకు అవస్థ అని నైటీలతోనే కాలమూ గడిపేస్తున్నారు.. ”

  ఇట్లా అందరూ ఆండాళ్ళు ఏమి కట్టు కోవాలో చెప్పేస్తూ పోతూం టే అసలు ఈ ఆండోళ్ళ సంఘాలు ఏమి చేస్తున్నాయో తెలీకుండా పోతోంది ! ! అసలు ఇట్లా అందరూ తలో అభిప్రాయం చెబ్తో బోతూంటే ఇక మిగిలినది ఏమి డ్రెస్సు ??

  అందరూ ఇక్కడ వచ్చి ఓ ప్రొటెస్ట్ రాసి పోవాలె !!

  జిలేబి
  (నారదా ఇవ్వాల్టి కి వాతాపి అజీర్ణం!)

  • ఎవరు ఎప్పుడు ఏమి వేసుకోవాలో,
   వారి వారి చిత్తానికి వదిలివేయడం మంచిదేకాని,
   కాలం లో వచ్చిన మార్పుల గురించి చెప్ప కూడదంటే ఎలా?

   • మోహన్ జీ,
    వారేం కట్టుకోవాలో మనకెందుకండి? వారిష్టం వారిది కదా. అసలు బట్టలే కట్టుకోమన్నా ఏమీ అనమండి.మనం బట్టలు కట్టుకునేది మనకోసమా చెప్పండి, ఎదుటివారు భయపడతారేమోనని బట్టలు కట్టుకుంటాం! అలవాటయిపోతే భయమూ పోతుంది కదండీ 🙂
    నెనరుంచండి.

  • జిలేబిగారు,
   అసలు ఏవో ఒకటి బట్టలు కట్టుకుంటున్నందుకు ధన్యవాదాలండి, కట్టుకోకపోవడం మా జన్మ హక్కు అన్నా! టు పీసులే కట్టుకున్నా ఏమీ అనమండి, కాదండి అనలేమండి, అతివల స్వాతంత్ర్యాన్ని కాదనే దమ్ము లేదండి, ఎవరికి.
   నెనరుంచండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s