శర్మ కాలక్షేపంకబుర్లు-శేషం.

శేషం.

శేషం అంటే మిగిలినది అని అర్ధం. లెక్కలలో ఒక పూర్ణాంకాన్ని మరొక పూర్ణాంకంతో భాగిస్తే మిగిలేది శేషం. ఈ శేషం భాగించే సంఖ్యకంటే చిన్నదిగానే ఉంటుంది, కాని ఉపేక్ష చెయ్యవలసినది మాత్రం కాదు.

పెద్దలు ఋణ శేషం, రణశేషం ( శత్రు శేషం ) అగ్ని శేషం ఉంచకూడదన్నారు.

రణ శేషమంటే భారతం దగ్గరకి పోతే దుర్యోధనుడు అందరూ మరణించగా నడచి వచ్చి ఒక కొలనులో దాగున్నాడు, అక్కడికి చేరుకున్నారు పాండవులు, కృష్ణుడు,  ధర్మ రాజు కొలనులో దాగున్న దుర్యోధనునితో ఇలా అంటాడు.

“సుయోధనా! నీకోసం ఎంతోమంది బంధు మిత్రులు, రాజులు యుద్ద0 లో ప్రాణాలు వదిలేశారే! ఇలా దాక్కుంటే నీ ప్రాణాలు దక్కుతాయనుకున్నావా? ఇటువంటి దైన్యం ప్రపంచంలో ఎక్కడా చూడమయ్యా! శూరుడినని గొప్పలు చెప్పుకుంటావు, ఇప్పుడా శూరత్వం ఎక్కడికిపోయింది, ఇటువంటి నికృష్టపు చావు తెచ్చుకున్నావు, లోకం నవ్వేలా ఇలా దాక్కుంటారా?క్షత్రియ ధర్మం వదలిపెడితే ఇహపరాలు లేవు. తమ్ముళ్ళు, కొడుకులూ అందరూ చచ్చారా, నువు చూస్తుండగా, అలా చూసికూడా నువ్వు ఇలా ప్రాణం కోసం దాక్కున్నావే, ప్రాణం కంటే మానం గొప్పదికదయ్యా! అయ్యో విధి నిన్నే స్థితికి తెచ్చింది? ‘పాండవులు చంపేస్తారని నీళ్ళలో దాగున్నాడటయ్యా రారాజు’ అని ప్రజలు చెప్పుకుని నవ్వరూ?కర్ణుడు దుశ్శాశనుడు గొప్పవాళ్ళని నమ్మి మాతో వైరం తెచ్చుకున్నావు. నీ సంగతి తెలిసింది, ఎక్కడికిపోగలవు? భయం వదలిపెట్టెయ్యి, వీరగుణం పాటించు,యుద్ధం చెయ్యి పేరయినా నిలబడుతుంది. రా యుద్ధం లో మమ్మల్ని గెలిస్తే రాజ్యం ఏలుకోవచ్చు,లేదంటావా స్వర్గ సుఖం అనుభవించు, వీరుడివనిపించుకో, ఇలా దాక్కుంటే  నగుబాటే తప్పించి ప్రాణాలు దక్కవు.తెగువ చేసి మామీద యుద్ధానికి రా! మొగాడివయితే” అన్నాడు.

అందుకు దుర్యోధనుడు, “ప్రాణం కోసం పాకులాడటం లేదు, రధంకాని గుర్రం కాని, ఆయుధం కాని ఏమీ లేనివాడిని,అలసిపోయాను సేదతీరుతున్నానంతే, మీరుకూడా సేద తీరండి యుద్ధం చేద్దా”మన్నాడు.

అందుకు ధర్మరాజు “నీకు ఏ ఆయుధం కావాలంటే అది తీసుకో ఇస్తాను, రధమో, గుర్రం, ఏం కావాలన్నా తీసుకో! యుద్ధం చెయ్యి, నీతో మాలో ఒకరే యుద్ధం చేస్తారు, మిగతావారు చూస్తుంటారు. నువ్వు వాడిని గెలిస్తే రాజ్యం ఏలుకో, మేం గెలిస్తే రాజ్యం ఏలుకుంటాం,” అన్నాడు. దానికి కృష్ణుడు లో గొంతులో ‘ధర్మరాజా! ఇదేం మాటయ్యా! ఇప్పుడు దుర్యోధనుడు మంచి ఉద్ధతి మీదున్నాడు, భీముడు కూడా సరిపోలేడు సుమా’ అంటాడు. అప్పుడు దుర్యోధనుడు ఒక్కసారిగా కొలనులోంచి లేస్తాడు. దానికి నివ్వెరపోయిన పాండవ పరివారం ఒక్క క్షణం లో తేరుకుని నవ్వుతారు. ‘నవ్వండి నవ్వండి మీ అందరిని ఈ గదతో మోది చంపేస్తా’నంటాడు. చివరికి భీమునితో గదా యుద్ధానికి సిద్ధమవుతాడు. పోరు ఘోరంగా జరుగుతోంది. ఆ సమయంలో ‘బావా! ఈ ఇద్దరి యుద్ధంలో ఎవరి నైపుణ్యం ఏమిటి?’ అని అడుగుతాడు అర్జునుడు. దానికి కృష్ణుడు ‘పదమూడు సంవత్సరాలుగా తీవ్రమైన సాధన చేస్తున్నవాడు దుర్యోధనుడు, కౌశలం హెచ్చు. భీమునిది భుజబలమే’ అని ఊరువుల కింది భాగంలో కొడితే! అని అర్జునునితో అంటాడు. అప్పుడు అర్జునుడు భీమునికి సైగ చేసి ఊరువుల కింద కొట్టమని సైగ చేస్తాడు. కాకతాళీయంగా దుర్యోధనుడు ఎగిరి భీమునిపైకి దూకుతుండగా ఆత్మ రక్షణకై భీముడు తొడలమీద కొడతాడు. అక్కడితో యుద్ధమూ ఐపోతుంది. ఆ తరవాత బలరాముడు ఇలా తొడలమీద కొట్టినందుకు కోపిస్తాడు, కృష్ణుడు సద్ది చెబుతాడు. దుర్యోధనుడు”అందరూ చనిపోయారు,  తపస్సు చేసుకోడానికి పోతాను, రాజ్యం ఏలుకో’మని చెబుతాడు, పాండవులతో, కాని పట్టుబట్టి యుద్ధం చేసి దుర్యోధనుని హతమార్చారు. ఎందుకు? అగ్ని శేషం ఉంచితే అనుకూల పరిస్థితులేర్పడితే చిన్న అగ్ని కణం పెద్ద దావానలమై ప్రమాదం కొని తెస్తుంది. అలాగే దుర్యోధనుడొక్కడే అని వదిలేస్తే? మళ్ళీ కొఱవితో తలగోక్కున్నట్టే, అందుకు పట్టుబట్టి కడతేర్చారు. ఇప్పుడు తెలిసింది కదా శత్రుశేషం, అగ్ని శేషం ఎందుకుంచకూడదో. ఇహ మిగిలింది ఋణ శేషం, అప్పు తీసుకున్నపుడు పత్రం రాసిస్తాం, జమ చేసినపుడు ఇచ్చిన మొత్తం రాసి పూర్తిగా చెల్లు వేసి, చెల్లు రాయించుకుని పత్రం వెనక్కి తీసుకోవాలి. వంద రూపాయలు తక్కువొచ్చాయి, ఋణం తీర్చేటపుడు, తరవాత తీరుద్దాం, అని ఉపేక్ష చేస్తే ఆ వందకి వడ్డీ ఆ తరవాత మరోటి మరోటి చేరి ఆ అప్పు అలాగే ఉండి ఏదో ఒకరోజు పదివేలయి మనం తీర్చక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు ఋణ శేషం ఉంచకూడదు.బేంకుల్లో అప్పులు తీసుకునేటపుడు అసలు కాగితాలిస్తాము, అప్పు పూర్తిగా తీరకపోతే కాగితాలు తిరిగివ్వరు. మన కాగితాలు బేంక్ లో భద్రంగా ఉంటాయి, చిల్లర అప్పు తీర్చద్దు అనుకుంటారు కొందరు, ఇది తప్పు, బేంక్ వారు అసలు కాగితాలని చిత్తుకాగితాలలో పడేసిన సంఘటనలు కోకొల్లలు, ఆ తరవాత అప్పు తీర్చినా కాగితాలురావు, అవసరానికి, చావు కబురు చల్లగా చెబుతారు ఎప్పటికో! తస్మాత్ జాగ్రత.

ఇప్పుడు తెలిసినదేమంటే ఋణశేషం, రణ శేషం,అగ్ని శేషం ఉంచకూడదు. తల్లి తండ్రులున్నవారు పితృశేషం భుజించకూడదంటారు.

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-శేషం.

 1. ‘దీనినే ‘టపా’ అవశేషము లని అందు రేమో !!

  కాపీ కౌపీనం హుళు హుళుక్కి అయినా, పీసు కౌపీనం శేష మైనదని బ్లాగ్విత !!!

  చీర్స్
  జిలేబి

 2. ధర్మ సందేహం :

  టపాలు కాపీ కొట్టేక అవి ఇంకా అలా బ్లాగులో ఉంచుకుని ఏదో “రిజిశ్టర్డ్ యూజర్స్ కి మాత్రమే” అని పెట్టేస్తే అది శేషమా కాదా?

  ఇదెక్కడి “దొంగముండా” వ్యవహారం? కాపీ చేయడం తప్పని తెల్సీ చేయడం, దాన్ని తీయకపోవడం, మళ్ళీ కాపీ చేసినదాన్ని రక్షించుకోడానికో ఎత్తూ, దీనిభావమేమి సిగ్గూ లజ్జా లేని కాపీ?

  దేముడా ఈ కమెంటు అందరూ ఎత్తుకుపోయేటట్టు చూడూ…:-)

  • nEnunEnE గారు,
   ధర్మ సందేహానికి సమాధానం.

   మోసానికి మెట్లివీ

   నా టపాలలా ఉన్నాయి ఇదేంపనండీ అని తమ బ్లాగులో అడిగితే నాలుగురోజులా కామెంట్ ఉంచి తీసేశారు.

   మనం ఇలా చెబితే వినరని మళ్ళీ కామెంట్లు పెడితే ఈ టపాలన్నీ పుస్తకాలనుంఛి గూగుల్ నుంచి తీసుకున్నామని ఒక ప్రకటన పెట్టేరు.నా బ్లాగు నుంచి కాక గూగుల్ కి నా టపాలెలా వస్తాయో తెలీదు, చెవిలో పువ్వులు పెట్టడమంటే ఇదే కదూ?

   నా బ్లాగులో వివరాలతో ఋజువులతో టపా వేస్తే అందరూ చూసి తమని తిట్టేరని కోపగించుకుని నా మీద ద్వేషం పెంచుకుని నేను మిత్రులకి ఇటువంటి వారు చేసే మోసం డెమో ఇవ్వబోతుంటే నేను కాపీ చేసేనని గోల చేసేరు.

   అందరూ తిడుతున్నారని తమ బ్లాగులో ఓ కామెంట్ పెట్టేరు అన్నయ్యగారూ! మీ మనసు కష్టపెట్టాలని కాదు, ముందు నా మాట వినండి, మీకు ఫోన్ నంబర్ పంపేనన్నారు.
   నాకు ఫోన్ నంబర్ పంపడమేంటి మోసానికి మరో మెట్టు. నిజం చెప్పదలుచుకున్నది నా బ్లాగులోనే చెప్పచ్చుగా.

   చూసినవారంతా తెగ తిడుతున్నారని ఆ తరవాత బ్లాగులను కొంతమందికే కనపడేలా చేశారు. ఇదీ పని చెయ్యలేదు.
   ఆ తరవాత తమకు మాత్రమే కనపడేలా చేసేరు. ఇలా చేస్తే చోరీ సొత్తు అలాగే ఉంటుంది, గూగుల్ పుణ్యమా అని చూసేవారికి బ్లాగు తీసేసినట్టు కనపడుతుంది. బ్లాగులు తీసేసేమని ప్రకటన ఎందుకు చేయలేదో?

   వీరికి మొత్తం ఆరు బ్లాగులున్నాయి, ఇటువంటి చోరీ సొత్తుతో.బయట ప్రపంచానికి తెలియక ఎంత చోరీ సొత్తయినా దాచుకోవచ్చు.

   మరి చివరికి మిగిలినది శేషమే కదండీ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s