శర్మ కాలక్షేపంకబుర్లు-దేవతలెంత మంది?

దేవతలెంత మంది?

ముఫైమూడు కోట్ల దేవతలంటారు, నిజమా, కాదు దేవతలందరూ కలిసి ముఫైమూడు మందే. వారెవరంటే ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, అశ్వనీ దేవతలు ఇద్దరు. మొత్తం ముఫైమూడు మందే! దీనికి ఋజువు ఇదిగో,

ఆదిత్యాం జజ్ఞిరే దేవాః త్రయస్త్రింశదరిందమ!
ఆదిత్యా వసయో రుద్రా హ్యశ్వినౌ చ పరంతప…రామా..అరణ్య కాం..సర్గ.14..14

రామా! అదితి యందు ద్వాదశాదిత్యులు,అష్ట వసువులు,ఏకాదశ రుద్రులు, ఇరువురు అశ్వినీ దేవతలు మొత్తము ముప్పది మూడు మంది దేవతలు జన్మించిరి…

జటాయువు తన పుట్టు పూర్వోత్తరాలు రామునికి చెప్పిన సందర్భంలో….తాను శ్యేని అనూరుల (అరుణ)సూర్య రథ సారధి, గరుత్మంతుని అన్న, పుత్రునిగాను చెప్పాడు, అప్పుడు మొత్తం ప్రాణికోటి ఉత్పత్తి క్రమం చెప్పేడు, అందులో దేవత ప్రస్తావనా వచ్చింది, దైత్యుల ప్రస్తావనా వచ్చింది.

ఆదిత్యులు 12
రుద్రులు    11
వసువులు  8
అశ్విని దేవతలు 2

అశ్వినీ దేవతలు దేవ వైద్యులు ఐనా వారికి అమృత పానానికి అర్హత లేకపోయింది, వారికి ఆ అర్హతను చ్యవన మహర్షి కల్పించారు.

ప్రకటనలు

9 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-దేవతలెంత మంది?

 1. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

  టపాలో కొంతమంది మిత్రులు అడిగినట్లు ఈ 33 మంది దేవతలు కాకుండా, మరి ఆది పరాశక్తి, త్రిమూర్తులు మొదలైనవారాందరూ ఏ శాఖ క్రిందకు వస్తారు? అసలు వీరేకదా మూలమైనవారు. వివరాలు ఏమైనా వున్నాయా?

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

 2. పార్వతీ అమ్మవారి శాపం పుణ్యమా అని దేవతలకు శాపాదిగా సంతాన భాగ్యం లేదు
  Sri Subrahmanya vruttantama emiti? telusukovalani vundi.Sharma garu telupagalarani abhyarthana.

 3. మోహన్జీ,మహేష్ జీ, శ్యామలరావు గారు,

  దేవతలెప్పుడూ ముఫై మూడు మందే! మిత్రులు శ్యామలీయం వారు చెప్పినట్టు వారికి సంతతి లేకపోవడం చేత ఆ సంఖ్య అక్కడే ఆగిపోయింది. మరి దేవతలు చాలా మంది ఉన్నారు కదా! అదీగాక పుణ్యం చేసుకున్న ప్రతివారు దేవలోకంలో సుఖాలనుభవించి మళ్ళీ భూలోకానికొస్తారు కదా! మరి లెక్క ఎలా సరిపోయిందని అనుమానం రావచ్చు. దేవతలు ముఫై మూడు సమూహాలు, వారెంతమందైనా కావచ్చు. అందుచేత దేవతలు ముఫై మూడు మందీ నిజమే! ముఫై మూడు సమూహాలూ నిజమే! ఆ సంఖ్య అనంతమూ అన్నదీ నిజమేనని నా ఊహ.
  నెనరుంచాలి.

 4. ధన్య వాదాలు.మొదటి లెక్క అది. దితి పుత్రులు దేవతలు అనే సూత్రానికి బధ్ధమై.
  త్రిమూర్తులు,వారి సంతానము,దత్తాత్రేయులు,శక్తి దేవతలు ఇత్యాదులు మనము కొలిచే దేవతలు ఈ దేవ జాతి కన్న ఇతరమైన వారు అన్నమాట.
  కాని అప్పటికి ఇప్పటికి ఎంతో మంది పుట్టి వుండొచ్చుగ.
  పుణ్యం చేసుకున్న వారు దేవతలౌతారు కదా.ఎన్నో యుగాలు గడచినాయి.లెక్క మారే వుంటుంది.

  • >దితి పుత్రులు దేవతలు అనే సూత్రానికి బధ్ధమై.
   టైపో అనుకుంటాను. దితి సంతానం దైత్యులు అంటే రాక్షసులు. అదితి సంతానం ఆదిత్యులు అంటే దేవతలు.
   పార్వతీ అమ్మవారి శాపం పుణ్యమా అని దేవతలకు శాపాదిగా సంతాన భాగ్యం లేదు.
   పుణ్యం చేసుకున్నవారు దేవతలు కారు. దేవలోక నివాసం మాత్రం పొందగలుగుతారు. అదికూడా తాత్కాలికమే. క్షీణేపుణ్యే మర్త్యలోకం విశంతి అని ఆ పుణ్యం‌బాంకిబేలెన్స్ లాగా దేవలోకనివాససుఖం అనుభవించినకొద్దీ ఖర్చు ఐపోయి మళ్ళా భూలోకం వచ్చిపడతారు.
   యగాలు కాదు కానీ మన్వంతరాలు మారే కొద్దీ దేవతలూ మారతారు. అది వేరే సంగతి.

 5. ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ జనాబా మూడు కోట్లు ఉన్నప్పుడు,
  ముక్కోటి దేవతలు ఒక్కటైయ్యారు అనే పాట వచ్చింది
  ఇప్పుడు జనాబా పెరిగింది, క్రొత్త మతాలు పుట్టుకొని వచ్చాయి,
  క్రొత్త దేవుళ్ళు, దేవతలు ఎందరో తెలియవస్తున్నారు
  మరీ రేషన్ పెట్టకండీ, ప్లీస్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s