శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మకి ఇల్లు కడదాం!

అమ్మకి ఇల్లు కడదాం!

download

పగోజిలో భీమవరం దగ్గర గునుపూడి అనే ఊరుంది. ఈ ఊరు జంగమదేవరలకి ప్రసిద్ధి అని అంటారు. నాడు పల్లెలలో జంగమదేవరలు,గంగిరెద్దులవారు,కొమ్మదాసరులు, బుడబుక్కలవారు, ఇలా బహు వృత్తులవారుండేవారు. వీరు వ్యవసాయమూ చేస్తూ ఈ వృత్తులను చేస్తుండేవారు. వీరంతా చదువుకోనివారనుకోనక్కరలేదు. నాటి కాలానికి వారు రామాయణ,భారత,భాగవతాలు బాగా చెప్పగలిగి ఉండేవారు కూడా. ఈ జంగమదేవరలు, వీరినే బుడగ జంగాలని కూడా అంటారనుకుంటా. ఉదయమే ఏటిలో స్నానం చేసి ఒంటినిండా భస్మం పూసుకుని నుదుట పెండికట్లతో, పెద్దబొట్టుతో, నెత్తిమీద పెట్టెలాటిది (దీనినే దేవరపెట్టి అని అంటారు), పెట్టుకుని ఒంటినిండా బట్ట కట్టుకుని, మోచేతులకు రెండిటికి చిన్న గంటలు కట్టుకుని, కాళ్ళ వెనక పిక్కలకు తగిలేలా గంటలు రెండు కాళ్ళకూ కట్టుకుని, ఎడమ చేత ఒక పెద్ద గంట వాయించుకుంటూ, కుడి చేత శంఖం పుచ్చుకుని పూరిస్తూ, ఈ రెండిటిని ఒక తాటితో బంధించి మెడలో వేసుకుని, ఉదయమే బయలుదేరి ఊళ్ళోనూ పొరుగూళ్ళలోనూ ఇలా తిరుగుతూ ఉండేవారు, భిక్షాటన చేస్తూ…అదుగో అటువంటి కుటుంబంలో ఒక తల్లికి ఏడుగురు కొడుకులు,భర్త కాలం చేశాడు, ఇల్లు లేదు, చెట్టుకింద కాపరం నడిచింది, నడుస్తూ ఉంది…..

ఇలా చెట్టుకింద కాపరంలో పుట్టిన ఈ ఏడుగురు అన్నదమ్ములూ ఉదయమే లేచి ఏటిలో స్నానం చేసి ఆహార్యం ధరించి చేత గంట పట్టుకుని భిక్షాటనకి పోయేవారు, ఉదయమే తల్లి పెట్టిన చద్ది కూడు తిని. మరలా రాత్రికే చెట్టుకిందకి చేరేవారు. పాపం ఈ ముసలమ్మ అలా చెట్టుకిందనే ఎండా వానలకు బాధపడుతూ కాలం వెళ్ళదీస్తూ ఉండేది. ఒక రోజు వారిలో ఒక కొడుకుకి తల్లి తమ తండ్రి ఉండగానూ, ఆ తరవాత తమ హయాం లోనూ కూడా చెట్టుకింద ఉండటం, బాధలు పడటం చూసి అమ్మకి ఇల్లు కడదాం, ఎప్పుడూ బాధలే అనుభవించింది, ఇల్లు లేక అని ఒక ఉద్దేశం చెప్పేడు. దానికి మిగిలినవారంతా ఆమోదించి మరునాడు ఉదయమే లేవగానే అదే పని మీద ఉండాలని నిర్ణయించుకుని కునుకు తీశారు. ఉదయం లేచి ఒక్కొకరే ఏటిలో స్నానం చేసి వచ్చి వేషం తగిలించుకుని జోలె భుజాన వేసుకుని భిక్షాటనకి బయలుదేరిపోయారు. తల్లికి ఆశ కలిగింది, కొడుకులు ఇల్లు కడతారేమోనని, కాని ఏమీ మాటాడక ఉండిపోయింది, రేపు మొదలు పెడతారేమో ఇంటి పని అనుకుంటూ. సాయంత్రానికి అందరూ చేరేరు, ఎవరికో ఇంటి సంగతి గుర్తొచ్చింది, మరలా అందరూ విచారించారు, మరుసటిరోజు ఉదయం ఆ అపని మొదలెట్టాలనుకున్నారు. ఉదయమే లేచి ఎవరి జోలి వారు చంకనేసుకుని బయలుదేరిపోయారు, అమ్మ మాట మరచిపొయారు. ప్రతిరోజు సాయంత్రం రాగానే అమ్మకి ఇల్లు కట్టాలనుకోడం, ఉదయమే ఎవరి పనుపునవారు పోవడమూ జరుగుతోంది తప్పించి ఇంటి పని చిన్నమెత్తు కూడా జరగలేదు, ఎన్నాళయినా. తల్లికి విసుగూ కలిగింది కాని ఏమీ చేయలేనిది, కొన్నాళ్ళ తరవాత అడుగుతూ వచ్చింది ఇల్లు నాయనా! ఇల్లు లేక మీకు పిల్లనిచ్చేవారు కూడా ఎవరూ రావటం లేదని ఒక బెదురు కూడా పెట్టింది. కాని వీరిలో చైతన్యం మాత్రం రాలేదు, ఇల్లూ కట్టలేదు, కాదు మొదలే పెట్టలేదు, ప్రయత్నమూ చెయ్యలేదు. ఇలా ఇల్లో, ఇల్లో అనుకుంటూనే ఆ ఇల్లాలు కాస్తా కాల గర్భం లో కలిసిపోయింది. ఆ తరవాత ఆ కొడుకులు అమ్మకి ఇల్లు కట్టనందుకు విచారించారు, అమ్మ చచ్చిపోయింది ఇక ఇల్లెందుకులే అని ఇల్లు కట్టుకోడమే మానేశారు…..చెట్టుకిందే గడిపేశారు.

ఏదయినా పనిని వాయిదా వేస్తూ పోతూ ఉంటే మా వాళ్ళు గునుపూడి జంగాలు అమ్మకి ఇల్లు కడదామనుకున్నట్టుందిరా నీ పని అనేవారు, అదే ఈ కథ….నేటి రాజకీయాలలో ఏదయినా మీకు గుర్తొస్తే మాత్రం నాకు బాధ్యత లేదు 🙂

 

 

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మకి ఇల్లు కడదాం!

 1. శర్మగారినుంచి మరో మంచి సామెత వెనుక కధ తెలిసికున్నాం. చాలా బాగుంది. స్పందనలూ బాగున్నయి,కానీ, స్వచ్చమైన ప్రేమే కరువవుతున్న ఈ కలి కాలంలో తల్లిదండ్రుల ప్రేమలుకూడా స్వార్ధపూరితంగా మారిపొతున్నయి.. మరీ విపరీతంగా వ్రాసిన ఈమెవరు అనుకోకండి.అందుకు తార్ఖాణాలు నాదగ్గరే చాలా వున్నాయ్. త్వరలో నా “లక్ష్మీస్ మయూఖ” బ్లాగులో చదువుదురు.ప్రస్తుతానికింతే. ఏమైనా మంచి కధనందించిన శర్మగారికి మరోమారు ధన్యవాదాలు.

  • mallampalli swarajya lakshmi గారు,
   మీరన్నమాటా నిజమే, తల్లి ప్రేమలో కల్తీ లేనిది ఒకప్పటి మాటే అనుకుంటా. తల్లి పాలలోనే కల్తీ వచ్చేసింది కదండీ.
   మీ బ్లాగులో తొందరగా రాయడం మొదలు పెట్టండి, మాకో మాట చెబుతారు కదూ!
   ధన్యవాదాలు.

 2. sir,
  bavundi. meeru permission ishtahra ee mata vadukovadaniki.ekkadaina eppudaina,

  ఏదయినా పనిని వాయిదా వేస్తూ పోతూ ఉంటే మా వాళ్ళు గునుపూడి జంగాలు అమ్మకి ఇల్లు కడదామనుకున్నట్టుందిరా నీ పని అనేవారు,
  a.v. ramana.

  • రమణాజీ,
   ఇవన్నీ తెనుగువారి ఉమ్మడి ఆస్థి, నా స్వంతం కాదు. బడికెళ్ళి వచ్చి ఏమయినా పెట్టూ అని అమ్మని వేధిస్తుంటే, మరిపించడానికి ఇటువంటి కథలు చెప్పేది, నేను అమ్మ పని చేసుకుంటూ ఉంటే కూడా తిరిగి ఈ కథలు వినేవాడిని.
   ధన్యవాదాలు.

 3. అంతే. అంతే. ఇప్పుడంతా బుడగజంగాలనే ఆదర్శంగా తీసుకుంటున్నారు. వాగ్ధానాలను మరవడంలో రాజకీయనాయకులుండగా ఇక బుడగజంగాలెందుకు గుర్తుకొస్తారు. పోస్టు బాగుంది శర్మగారు.

  • కొండలరావు గారు,
   రాజకీయనాయకులు వాగ్దానాలు చేస్తూ పోతుంటే, విని విని విసుగెత్తి ఈ కథ గుర్తొచ్చింది.నచ్చినందుకు
   ధన్యవాదాలు.

 4. >>>అమ్మ చచ్చిపోయింది ఇక ఇల్లెందుకులే అని ఇల్లు కట్టుకోడమే మానేశారు…..

  ఈ కాలం లో అమ్మ అయ్య బతికుంటే చూసే వారేవరండి !

  చస్తే ఖచ్చితం గా మణిహార్మ్యమే కట్టె రోజులాయె తమ ‘ప్రేమ, భక్తీ ని ప్రకటించు కోడానికి !!

  నేటి రాజకీయాలలో ఏదయినా మీకూ గుర్తొస్తే మాత్రం నాకు బాధ్యత లేదు 🙂

  జిలేబి

  • జిలేబిగారు,
   మీరన్నది నిజమే! బతికుండగా మంచినీళ్ళు పోయనివాడు చచ్చేకా కాట్లోకి పరమటావుని తోలేడని నానుడి ఉంది,దానికో చిన్న కథా ఉంది,వెంఠలే చెప్పలేను.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s