శర్మ కాలక్షేపంకబుర్లు-చిత్తం శివుని మీద……

చిత్తం శివుని మీద……

చిత్తం శివుని మీద ధ్యానం చెప్పుల్లోనూ అంటారు. అంటే శివుణ్ణి చిత్తం లో ఉంచుకున్నా ధ్యానం చెప్పుల మీదనే ఉండిపోతుంది, చిత్తం దేనిని మననం చేస్తుందో దాని మీదనే దృష్టి కేందీకరించాలి, అంటే మనసూ అక్కడే ఉండాలి. అలాకాకుండా చేయ కూడదన్నదే ఈ కథ యొక్క ఉద్దేశం.

మనసుకి నాలుగు స్థాయిలున్నాయన్నారు, మనవారు, అవి మనసు,బుద్ది,చిత్తం, అహంకారం. మనసు ఎప్పుడూ సంకల్ప వికల్పాలు చేస్తూనే ఉంటుంది. బుద్ది, మనకి ఊహ తెలిసినప్పటినుంచి ఉన్న అనుభవాలు, ఇతరులనుంచి నేర్చుకున్నది,చదువుకున్నది, ఇలా రకరకాలుగా వచ్చిన విషయాలను ఒక చోట పదిల పరచి ఉంచుతుంది. మనసు చేసిన సంకల్పాన్ని నియంత్రిస్తూ ఉంటుంది, ఇది తప్పు, ఇది మంచిది, ఈ పని చేస్తే చెయ్యి కాలుతుంది, ఈ పని చేస్తే అమ్మాయి మూతిపళ్ళు విరక్కొడుతుంది, మొన్న మన పక్కవాడికి అలాగే జరిగింది కదా! అని చెబుతూ ఉంటుంది. మనసు కోతిలాటిది, బుద్ది ఇన్ని చెప్పినా, వద్దన్న పనే చేస్తుంది, ఆ తరవాత ఏడుస్తుంది, ఇదీ అసలు చిత్రం. ఇక చిత్తం, ఇది బుద్దికి పై స్థాయిది, ఇది ఒక విషయాన్ని పదే పదే చింతిస్తూ, మననం (ధ్యానం) చేస్తూ ఉంటుంది, ఉపమానాలు నేను చెప్పక్కరలేదనుకుంటా :). ఇక అహంకారం అన్నది మనసు యొక్క చివరి స్థాయి, ఈ స్థాయిలో ప్రతి విషయం తనకు తానుగా చేసినదని, తానే గొప్పని, ఎవరిమటుకు వారు భావించే స్థాయి. ఇది కొద్ది మోతాదులో అందరికి ఉంటుంది, ఉండాలి, అప్పుడే అందంగానూ ఉంటుంది, కాని ఇది పెరిగితే మాత్రం……… అసహ్యంగా ఉంటుంది.

అనగనగా ఒక ఊళ్ళో ఒకడు చెప్పులు కొనుక్కున్నాడు. చెప్పుల్ని మోజుపడి కొన్నాడు, అందంగా ఉన్నాయని. ఎక్కడికెళ్ళినా వదలకుండా వేసుకుంటున్నాడేమో, శివాలయానికీ వేసుకు బయలుదేరాడు. శివుని మీద భక్తి ఉన్నవాడే, శివుణ్ణే స్మరిస్తూనూ వచ్చేశాడు, శివాలం దగ్గరకి. అప్పుడు గుర్తొచ్చింది, ఆలయంలోకి చెప్పులేసుకుని పోకూడదని, ఏం చెయ్యాలి? తప్పక చెప్పులు ఆలయం బయట వదిలేసి శివుణ్ణి దర్శించడానికి లోపలికి పోయాడు. ముందుగా కనపడేది నంది కదా! నంది కొమ్ములలోంచి శివ దర్శనం చెయ్యాలి, నంది దగ్గరకొచ్చి, ఒక చెయ్యి నంది ప్రుష్టం మీద వేసి తడుముతూ మరొకచేతిని కొమ్ముల మీదుంచి శివుణ్ణి దర్శిస్తూ, అయ్యో! కొత్త చెప్పులు, అందంగా ఉన్నాయి, ఖరీదయినవి, కొత్తవయినా కరవలేదు, చాలా మెత్తనితోలు…బయట వదలి వచ్చాను ఎవడైనా తొడుక్కుపోతాడేమోననే భయం మొలకగా ప్రారంభమయింది, మనసులో, ఇది సంకల్పం. ఎప్పుడూ నువ్వింతే చెప్పుల్ని జాగ్రత చేయక లోపలికొచ్చావు, తప్పుచేశావంది,అసలు గుడి కొచ్చేటపుడు చెప్పులేసుకొస్తారా? ఇప్పుడేడిస్తే ఉపయోగం లేదు కదా అని నిలదీసింది, బుద్ది.. ఇది నెమ్మదిగా ప్రారంభమై పెద్దదై మహా వట వ్రుక్షంలా పెరిగిపోయి ఊడలు కూడా దిగిపోయి, ప్రదక్షిణం చేస్తూ,శివుణ్ణి దర్శిస్తూ కూడా చిత్తం శివుని మీద ఉంచి చెప్పులనే స్మరిస్తూ,మనసు చెప్పులమీదే ఉంచి ధ్యానిస్తూ, శివదర్శనం పూర్తి చేసి బయటకొచ్చాడు. ఆతృతగా చెప్పులకోసం వెదికాడు…………

చిత్తం శివుణ్ణే మననం చేస్తున్నా, మనసు మాత్రం చెప్పుల మీదే ఉంది, బుద్ది సతాయిస్తూనూ ఉంది. ఇక్కడ మనసు,బుద్ది,చిత్తం ఏకోన్ముఖం కాలేదు. అలా ఏకోన్ముఖం కాకుండా ఏపనీ చేయవద్దని మన పెద్దల మాట. ఇలా చేయడం మూలంగా రెండు పనులూ చెడిపోయి ఇతో భ్రష్ట తతో భ్రష్టః అవుతుందన్నారు.

(చాలా కాలంగా చిత్తులో ఉన్న టపా.)

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-చిత్తం శివుని మీద……

 1. చిత్తం !!

  జిలేబి

  ఇంతకీ, చిత్తం శివుని మీద ఉంటె, ఇక ధ్యానం దేని మీద ఉంటె ఏమిటండి !! జేకే !!

  అట్లాగే, ధ్యానం శివుని మీద ఉండా లంటే, మరి శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదాయే !!

  చీర్స్
  జిలేబి

  (మీ బ్లాగు లో ఏమైనా వైరసు చేరిందా అట్లా నక్షత్రాల్లా స్టార్ లు పైనించి క్రిందకి ఫైరవీ లు జేస్తున్నాయి ??)

  • జిలేబిగారు,
   అంతేనండి, అంతా గందరగోల(ళ)మే.
   ఈ మధ్య నా బ్లాగు మీద ప్రేమ ముదిరిపోయి, 🙂 బ్లాగు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నాలు చాలా సార్లు జరిగాయి, ఎవరో తెలియలేదు. కోపం తో ఎవరినా వైరస్ ప్రవేశపెట్టేరేమో చెప్పలేను. నేను మాత్రం అది వర్డ్ ప్రెస్ వారు ప్రవేశపెట్టిన హేమంత సూచిక అనుకుని ఆలోచించడం మానేశాను. చాలా కాలం కితం రాసి వదిలేసిన టపాలు ఇంకా ఉన్నాయి, కొత్తగా రాయబుద్దీ లేదు, వాటి తరవాత చూదాం……బ్లాగు కనక కబ్జా చేయబడితే బాధే లేదు…..
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s