శర్మ కాలక్షేపంకబుర్లు-ఇదీ సమస్య

ఇదీ సమస్య

మనమంతా మధ్య తరగతి మేథావులమని మిగిలినవారునుకుంటారు. మనం ప్రపంచంలో ఉన్న ప్రతి దాని గురించీ చర్చించేస్తాం, తప్పేం కాదులెండి. మీకు చర్చ కావాలి కదా ఇదుగో సమస్య, అది కూడా ప్రస్తుతకాలానిది.

లోక్ పాల్ చట్టంలో తీసుకొస్తున్న మార్పులపై పార్లమెంటరీ స్థాయీసంఘం ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది.

సమస్య:- లోక్ పాల్ ఛైర్మన్, ఇతర సభ్యులను నియమించే పేనల్ లో పార్లమెంట్ లోని అతి పెద్ద ప్రతిపక్ష రాజకీయ పార్టీ నేతకు చోటు కల్పించాలా? వద్దా?

నిష్పక్షపాతంగా చెప్పండి,ఎందుకు కల్పించాలి? ఎందుకు వద్దు? వ్యక్తిగత ఆరోపణలు చెయ్యద్దు.

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఇదీ సమస్య

 1. శర్మ గారూ మంచి ఆలోచన. ప్రశాంతత కన్నా కావలసినదేముంది.

  P.S:- మీరు కూడా ఆ పద్మవ్యూహంలోకి అడుగు పెడుతున్నారేమిటనిపించింది. అది వ్యక్తపరచటానికి పై వ్యాఖ్యలో నేను మొదట టైప్ చేసినది మీరు చెప్పిన ఆ షేక్స్పియర్ వాక్యమే:) మళ్ళా ఆలోచిస్తే అలా అనటం బాగుండదేమోననిపించి, దాన్ని చెరిపేసి, తెలుగులో వాక్యం వ్రాసాను. అయినా మీరు నా కవిహృదయం గ్రహించేసారు !

  • మిత్రులు విన్నకోట నరసింహారావు గారు,
   కవి హృదయం కనిపెట్టేసేనంటారా? అది మీగొప్పతనం. 🙂
   మానసిక ప్రశాంతతకన్న మిన్న ఐన ధనం మరొక్కటి లేదు. ఇక్కడ ఈ విషయం మన తరాలనే కాదు తరవాత తరాల రాతలు కూడా మారుస్తుంది, అందుకు కొద్దిగా జోక్యం చేసుకున్నా. నా జాగ్రతలో నేనున్నా 🙂
   ఇదెవరికి అవసరమున్నట్టూ కనపట్టంలేదండీ. జిలేబీ గారన్నమాట నిజం.
   ధన్యవాదాలు.

  • మిత్రులు విన్నకోట నరసింహారావు గారు,
   Your question is just like you too Brutus 🙂
   వాదన అనేది నా నైజానికే వ్యతిరేకం. ఈ అంశం టపాగా రాసేటపుడే అదీ అలోచించాను. కాని అంశం కొద్దిగా అవసరమైనదని ఉంచాను. ఇటువంటిదే మరొకటపాతో వీటికి తుదిపలుకు చెప్పేస్తున్నాను. ఇది చెప్పాలనుకుంటునే ఉన్నా, సమయం సందర్భం కుదరలేదు.
   నేను మట్టి మనిషిని, సామాన్యుడిని, సామాన్యులు నా బ్లాగుకు దూరమైపోతున్నారని గుర్తించాను కూడా. 🙂
   ధన్యవాదాలు.

 2. మిత్రులు శర్మగారు,

  పార్లమెంట్ లోని అతిపెద్ద రాజకీయపార్టీ నేతకు చోటు కల్పించాలా వద్దా అనా? లేదా
  పార్లమెంట్ లోని అతిపెద్ద ప్రతిపక్ష రాజకీయపార్టీ నేతకు చోటు కల్పించాలా వద్దా అనా? మీ‌ప్రశ్న.
  ఒకవేళ మనం ఆ ప్రతిపక్ష అన్న మాటను వాడకపోతే అప్పుడు ఎలాగూ పార్లమెంట్ లోని అతిపెద్ద రాజకీయపార్టీ అన్నది అధికారపక్షమే అవుతుంది కాబట్టి, మీరు పార్లమెంట్ లోని అతిపెద్ద ప్రతిపక్ష రాజకీయపార్టీ నేతకు చోటు గురించే మీ‌ ప్రస్తావన చేసారని నిర్థారించుకుంటూన్నాను.

  అతిపెద్ద ప్రతిపక్షపార్టీగా అవతరించిన పార్టీకి కనుక పార్లమెంటులో చెప్పుకోదగ్గస్థాయిలో సంఖ్యాబలం లేనప్పుడు కొన్ని చిక్కులు వస్తాయి. ప్రస్తుత లోకసభలో పతిపక్షపార్టీలలో ఒకటి ఐన కాంగ్రెసుకు పదిశాతం సీట్లు కూడా లేవు. కించిత్ న్యూనే న్యూనం! పోనీలే అని ఈ సందర్భంలో కొద్ది కొఱతనూ గణించక ఆ కాంగ్రెసుకు ప్రతిపక్షపార్టీగా ఆ హోదా యేదో ఇచ్చాశారే అనుకుందాం. అప్పుడు మనం ఒక కొత్త సంప్రదాయాన్ని సృజించిన వారం అవుతాం, సంఖ్యాబలం దామాషాలతో పనిలేకుండా ప్రతిపక్షపార్టీని గుర్తించాలీ అని తీర్మానించి.

  అసలే మనది బహుళపక్ష ప్రజాస్వామ్యవ్యవస్థ. మంఛిది. గ్రహపాటున ఒక ఎన్నికలో లోకసభలో అతిపెద్ద ప్రతిపక్షపార్టీబలం పదిశాతం కాదు కేవలం పదిలోపు సీట్లైతే? అప్పుడు కూడా మన కొత్త సంప్రదాయం ప్రకారం,అది ప్రతిపక్షపార్టీ హోదాలో గుర్తించబడి, ఇలాంటి పానెళ్ళలో ప్రముఖ పాత్రను పోషించటాన్ని అంగీకరించవలసి వస్తుంది. అది అమోదయోగ్యం కాదు. ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించిన పార్టీకి అటువంటి అవకాశాలు ఇవ్వరాదు కాక ఇవ్వరాదు. కాదు ఇవ్వటం మంచిదే అనుకున్న పక్షంలో అతిపెద్దప్రతిపక్షపార్టీకి పదిలోపు సీట్లు వచ్చే సందర్భాలలో అలాంటి ప్రజామోదం ఏమాత్రమూ లేని పార్టీలు కూడా ప్రజలకు ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించే అవకాశం – ఒక్కోసారి తమకు ఓటేయని జనం మీద కక్షతీర్చుకునే అవకాశం – అప్పగించటం అనే పొరపాటుకు తెరలేపుతున్నవారం అవుతున్నాం.

  (జిలేబీగారూ, పెద్ద దుమారం లేపగల ప్రశ్నలనే పెద్దప్రశ్నలు అందురా? అలా అనుకుంటే అటువంటి వాటిపై మాత్రమే కొందరికి ఆసక్తి ఉండటాన్ని తప్పుబట్టలేం కదండీ. అటువంటి దుమారాల్లో చిక్కుకోవటం సుళువే కాని మాటలు పడకుండా బయటికి రాగలగటం మాత్రం కష్టం. పోనివ్వండి మీరు మాత్రం మీ‌జాగ్రత్తలో మీరుండండి.)

  • శ్యామలరావు గారు,
   పొరపాటు సరి చేశాను, ‘ప్రతిపక్ష’ చేర్చాను.. మీరు చెప్పిన అంశాలూ చూశాను. చర్చిద్దాం.
   ధన్యవాదాలు.

 3. ఇట్లాంటి చిన్న చిన్న సమస్య ల కి మేము మేము అభిప్రాయాలు గట్రా చెప్ప మండీ

  ఓన్లీ పెద్ద పెద్ద సమస్యల కే ఉదాహరణ కి – గీత లో శ్లోకానికి అర్థ మేమిటి ? రామాయణం నిజంగా జరిగిందా లేక బూటక మా ? మహాభారతం నిజంగా జరిగిందా వగైరా పెద్ద పెద్ద ప్రశ్నల్ని మాత్రమె చీల్చి చెండాడ గల ‘గళం’ ఉన్న వాళ్ళం !!

  ఇప్పటి దాకా ఒక్క కామెంటూ లేక పోతేనూ !!

  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s