శర్మ కాలక్షేపంకబుర్లు-స్త్రీ స్వావలంబన

స్త్రీ స్వావలంబన

Women empowerment అంటే ఏంటో నాకైతే అర్ధం కాలేదు మొన్నటిదాకా. కాని మొన్ననే జ్ఞానోదయమైనట్లు అది అర్ధమయింది…

మాకు బాగా కావలసినవారు,కొడుకు వరస, కూతురుని తీసుకుని “చిన్నబ్బాయి పెళ్ళి” అని పిలవడానికి వచ్చారు. మనవరాలు బలే చురుకైనది, సీమ మిరపకాయే… ఇరవై ఒకటికి సి.ఎ పూర్తిచేసేసింది…ఫస్టూ వచ్చింది…”ఏంచేస్తున్నావే?” అని అడిగింది ఇల్లాలు, దానిని. ఆ ప్రశ్నకి వాళ్ళనాన్న, “మొన్నటిదాకా బెంగుళూరులో ఉద్యోగం చేసింది, పగలు పదకొండుకుపోయి రాత్రి రెండుకు వస్తోంది,నెలకి అరవై వేలు తెచ్చుకుంటోంది, అన్న గారి దగ్గరుంది, నేనే మానిపించేసేను” అన్నాడు. దానికి ఇల్లాలు “అదేం?” అని ప్రశ్నించింది. అతను “అబ్బాయి పెళ్ళి , నా తమ్ముడు కొడుక్కి కూడా పెళ్ళి, ఇదొకత్తే ఇంటికి ఆడపడుచు, అందుకని ప్రస్థుతం ఉద్యోగం మానిపించేసేను” అని సమాధానమిచ్చాడు. దానికి ఇల్లాలు, “బాగానే ఉంది, ఇదేదో అయిన తరవాత దీనికి మంచి సంబంధం చూసి పెళ్ళి చేసి, ఉద్యోగం లో చేర్చు” అని సలహా ఇచ్చింది, కొంత సందేహం వెళ్ళగక్కుతూ మాటలో. అదేగాక మనవరాలిని దగ్గరికి తీసుకుని,తగ్గు స్వరంతో,నెమ్మదిగా ఆరా తీసింది”ఏమే మళ్ళీ ఉద్యోగం చేస్తావా? మానేస్తావా?మీ నాన్న గాని బలవంతంగా మానిపించాడా? చెప్పు, ఎవరినైనా ప్రేమించావా? ఉన్నమాట చెప్పు, తప్పేం లేదు, భయపడకు, ప్రేమించడం తప్పూ కాదు, పాపమూ కాదు,నేరం అంతకన్నా కాదు, లేకపోతే మీనాన్న చూపించిన మంచి సంబంధం చూసి పెళ్ళి చేసుకో అని ఉపదేశం చేసింది.” దానికి మనవరాలు, “మామ్మా! ప్రేమించాలని ఉన్నా ఖాళీ దొరకలేదే! ఎవరిని ప్రేమించలేదు, పెళ్ళి తప్పక చేసుకుంటా, నువ్వు చెప్పినట్టు మళ్ళీ ఉద్యోగం లో చేరతాను, మానెయ్యనేం” అని చెప్పి వాగ్దానం చేసింది, ఇల్లాలికి. ఆ తరవాత ఇల్లాలు అతనితో “అబ్బాయి! పెళ్ళికి తప్పక వస్తాముకాని, దీనిని మళ్ళీ ఉద్యోగానికి పంపడం మానకు,మంచి సంబంధం చూసి పెళ్ళి చేసెయ్యి, పాతికేళ్ళొచ్చేయ్ కదూ!” అని ఉచిత సలహా పారేసింది. దానికతను “ఉద్యోగం మానిపించను పిన్నీ!! పని గంటలు ఇబ్బందిగా ఉన్నాయనీ, ఇంట్లో పెళ్ళిళ్ళగురించి మాన్పించాను తప్పించి, మరేం కాదని చెప్పి, పెళ్ళికి రావాలని” మరీ మరీ చెప్పాడు. మామ్మ తాతలకి నమస్కారం పెట్టి, మామ్మ చేతిలో పెట్టిన బ్లౌజ్ పీస్ పుచ్చుకుని బొట్టు పెట్టించుకుని “శీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తు” అని ఆశీర్వచనం తీసుకుని , మామ్మని గుచ్చి కౌగలించుకుని,మామ్మ చేత ముద్దు పెట్టించుకుని కదిలింది. సీమ మిరపకాయకి ఎవరు చెప్పేరు? తరతరాల సంప్రదాయం కదూ…..

స్త్రీ స్వావలంబనకి, ముందు ముఖ్యంగా స్త్రీలలో మార్పు కావాలన్న మాట నిజమేననిపించింది, ఆవిడ సలహా విన్న తరవాత,డబ్బు సంపాదనొకటే స్వావలంబనకాదు, జీవితంలో సుఖపడటమూ, భర్తతో, అతని కుటుంబంతో కూడా కలిసి జీవించే గుణం అలవాటు చెయ్యడమూ దీనికిందకే వస్తాయా?. ఏమీ చదువుకోని, లోకం తెలియని, పల్లెదాటి బయట కాలుపెట్టి ఎరుగని, డెభ్భయి ఏళ్ళ ముసలమ్మకి, స్త్రీ స్వావలంబన గురించి ఎలా తెలిసిందబ్బా…….!!!

పెళ్ళికి ఎలాగా రాలేమని అతనికీ తెలుసు, దూరాభారంలో పెళ్ళికనక, మరీవేళ రిసెప్షన్ కి వెళ్ళాలి…..ప్రయాణానికి కాబోలు శ్రీమతిగారు పిలుస్తున్నారు…..మళ్ళీ కలుస్తా…

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-స్త్రీ స్వావలంబన

  1. శర్మ గారూ ,

    నమస్తే , శుభోదయం .

    ” ఏమీ చదువుకోని, లోకం తెలియని, పల్లెదాటి బయట కాలుపెట్టి ఎరుగని, డెభ్భయి ఏళ్ళ ముసలమ్మకి, స్త్రీ స్వావలంబన గురించి ఎలా తెలిసిందబ్బా…….!!! ”

    ఆశ్చర్యపోయారు కదూ . దీనికి జవాబు మీకు తెలియనిదేమీ కాదు , కాకుంటే పాఠకులకు ఎంతవరకు తెలుసుకోవాలనే ఈ టపా లోని అంతర్యుద్దేశం అనుకుంటున్నా .

    అవే క్దండి , మన పూర్వీకుల పెంపక నైపుణ్యం , జన్యు కణాల ప్రభావం .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s