శర్మ కాలక్షేపంకబుర్లు-ఉన్నఊరువాడికి కాటిభయం……

ఉన్నఊరువాడికి కాటిభయం……

“ఉన్న ఊరువాడికి కాటిభయం, పొరుగూరు వానికి నీటి భయం” అని నానుడి. ఉన్నవూరువాడికి ఆ ఊళ్ళో ఉన్న వల్లకాడంటే భయం, పొరుగూరివాడికి ఎక్కుడున్నదయినా చెరువు, నదులలో దిగడమంటే భయం. దీనికి కారణాలు విశ్లేషిద్దాం.

ఏవూళ్ళో ఉన్నవాడికి, ఆఊరు శ్మశానం ఎక్కడుందో తెలిసి ఉంటుంది. చిన్నప్పటినుంచి ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు చనిపోయినవారిని అటుగా తీసుకుపోయి ఉంటారు కనక. మరి శ్మశానం అంటే భయమెందుకు? అందరికి తెలిసినదే! ఏదో ఒక రోజు అందరూ అక్కడికి చేరవలసినవారమే, అని, కాని ఎప్పటికి ఉండిపోయేవారిలాగా మానవులు చనిపోయినవారికోసం ఏడుస్తూ ఉంటారన్నాడు, ఇదే లోకంలో వింత అని చెప్పేడు ధర్మరాజు యక్షుని ప్రశ్నకు సమాధానంగా. ఊరివాడు పగలు కూడా శ్మశానానికి వెళ్ళడు, తప్పకపోతే తప్పించి, అది మనసులో గూడు కట్టుకున్న భయమే, ఇక రాత్రి అసలు వెళ్ళడు అక్కడున్న దయ్యాలు పీక్కుని తింటాయని. నిజానికి దయ్యాలు లేవని తెలుసు కాని, భయమే ఒక దయ్యం. శ్మశానం లో ఏమీ లేదని తెలిసిన జ్ఞానంతో కలిగిన భయం. ఇక పొరుగూరువాడికి పగలైతే అది శ్మశానమని గుర్తులు తెలుస్తాయి, దూరంగా తొలగిపోతాడు, అదే రాత్రయితే ఏమీ కనపడదు కనక, చీకటి అజ్ఞానం, ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది కనక భయపడడు, శ్మశానం లో కూడా. ఇది చీకటి, ఇది అజ్ఞానం వలన కలిగిన నిర్భయత. ఒకే సందర్భంలో ఒకరికి తెలిసి అంటే జ్ఞానం కలిగి భయమూ, మరొకరి తెలియనితనం వలన అదే అజ్ఞానం వలన నిర్భయతా కలుగుతున్నాయి, అంటే భయమన్నది మనసులొ ఉన్నదే.

పొరుగూరువానికి నీటిభయం చూదాం. ఉన్న ఊరువాడు ఆ ఊరి చెరువు కాని నదిలో కాని నిత్యమూ నియమిత ప్రదేశంలో దిగుతూనే ఉంటాడు, స్నానానికో, మంచినీళ్ళకో. అందుచేత ఊరివానికి ఆ నీటిలోతెంత? నేల స్వభావం, ఉన్న జలచరాల వివరాలు తెలిసి ఉంటాయి, అందుచేత నిర్భయంగా నీటిలో దిగుతాడు. మరి పొరుగూరువాడికి ఆ నీటిలో ఏ రకమైన ప్రమాదకర జలచరముందో తెలియదు, ఊబినేలా, వరకమా అనగా ఒక్కసారిగా బాగాలోతుగా ఉండటమా, ఇలా అక్కడి నీటిలోపలి స్వభావం తెలియక భయపడతాడు. ఇది జ్ఞానం లేమివల్ల వచ్చిన భయం.

ఇప్పుడు తేలిందేమంటే జ్ఞానం వలన ఎప్పుడూ నిర్భయమే, కాని అజ్ఞానం వలన ఒకప్పుడు భయమూ మరొకప్పుడు నిర్భయమూ కలుగుతున్నాయి. ఇదీ పొరుగూరివాని నీటిభయం, ఉన్నఊరువాని కాటి భయం….

ప్రకటనలు

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఉన్నఊరువాడికి కాటిభయం……

 1. నేనుకూడా వృద్ధుడనే.80 దాటినా పిల్లల దగ్గర సఖ్యం గానే ఉంటున్నాము.అందరి కేసులూ ఒకే రకంగా ఉండవు గాని నాకుతోచిన సలహాలు నా అనుభవం మీద చెప్తున్నాను.
  1.వృద్ధాప్యంలో ఖర్చులకి కొంత దాచుకోవాలి.అన్నిటికీ పిల్లల మీద ఆధారపడకూడదు.
  2.వాళ్ల సంసారవిషయాలు ,వ్యక్తి గతవిషయాలలో జోక్యం,పెద్దరికం(అడుగుతే తప్ప)
  కలగచేసుకోకూడదు.
  3.కొడుకే కాదు,కోడలి తో కూడా సామరస్యం గా ఉండాలి.
  4.ఇలా ఉన్నా పిల్లల స్వభావాన్నిబట్టి వాళ్ల తో ఉండడం కుదరకపోతే వేరుగా ఉండడం మంచిది.

 2. ఒకపెద్దాయన 60 ఏళ్ళ వయసుదాట గానే చనిపోవాలి లేదా ఆత్మహత్య చేసుకోవాలి .
  అన్నారు . పిల్లలతో నిర్లక్ష్యం చేయ బడ్డ ఆయన మాట నాకు చాల బాధ కలిగించింది
  వృద్దాప్యంలో ఇలాంటి సమస్య తలెత్తకుండా ,పిల్లలతో ఎలా మసలు కోవలంటారు ?
  మీరు అనుభవజ్ఞులు కనుక అందరికి తెలియచేయగలరు .

  • అంజలితనూజ గారు,
   మరణమే సమస్యకు పరిష్కారం కాదు. డాక్టర్ గారు కొన్ని చిట్కాలు చెప్పేరు. ఒక టపా రాయడానికి ప్రయత్నిస్తా. ఇదివరలా ఉత్సాహం లేక టపాలు వెనకబడుతున్నమాట నిజం.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s