శర్మ కాలక్షేపంకబుర్లు-శోకో నాశయతే ధైర్యం…….

శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతంః
శోకో నాశయతే సర్వం నాస్తి శోకో సమో రిపుః…రామా..అయో.కాం…సర్గ..63..15

శోకం దైర్యాన్ని నాశనం చేస్తుంది, వివేకాన్ని పోగొడుతుంది, శోకం సర్వాన్నీ పోగొడుతుంది. శోకాన్ని మించిన శత్రువులేడు.

జరిగినదానికి ఏడ్చి ఉపయోగం శూన్యం, జరగబోయేది సరిగా చేస్తే శోకం లేదు, ఫలితం మన చేతులో లేదు కనక, పని చిత్తశుద్ధితో చేయడమే కావలసినది, ప్రస్తుతం లో. Past perfect, present continuous, Future tense. Past is perfect, as we cannot change it. Future is always tense, as we don’t know what is in store for us and it is only present, which is continuous.ఒక పని చేస్తున్నాం, చేస్తున్న పని తప్పని బుద్ధి చెబుతోంది. ఐనా ఎవరూ చూడటం లేదులే, అనుకుని చేసేసేం. ఎవరో చూడనే చూశారు. అయ్యో రామా! చూసారే మన తప్పును, అనే  భయం పట్టుకుంది. ఇప్పటివరకు నీతి నియమాలని ఉపన్యాసాలిచ్చాం, తలెత్తుకు తిరిగాం, ఇప్పుడెలా అనేదే శోకం. ఈ శోకం కలగటం తో ఇదివరలోలా తలెత్తుకు తిరగలేక పోతున్నాం, ఎందుకూ! ధైర్యం చచ్చింది కనక, ఎవరేనా మన తప్పు ఎత్తి చూపుతారనే భయం. దానికేం చేసేము? మన తప్పు తెలిసినవారిని తప్పించుకు తిరగడమూ, వారిపై లేని నిందలు వేయడం మూలంగా వివేకం నశించింది. విషయం వద్దనుకున్నా నలుగురికీ తెలిసిపోయింది, మన చర్య ద్వారానే. అప్పుడేమయింది, ధైర్యం చచ్చింది, వివేకం చచ్చింది, మర్యాదా చచ్చింది, గౌరవం మొదలే పోయింది, పూర్తిగా సర్వమూ పోగొట్టుకున్నాం. దేనివల్ల? శోకం వలన. శోకం ఎందుకు కలిగింది? తప్పు చేయడం వలన, అంటే తప్పు చేయక ధర్మాన్ని అనుసరించి ఉంటే బాధలుండేవి కావు. అందుచేత ధర్మాన్ని అనుసరించాలి.

ఒకవేళ తెలిసి, తెలియక తప్పు చేసి ఉంటే అది చూచినవారితో తప్పు జరిగినట్టుగా చెప్పుకుని పశ్చాత్తాపం, నిజంగా పొంది ఉంటే సమస్య మొదటిలోనే త్రుంచ బడేది. కాని ఏమనుకున్నాం? ఎవరూ చూడలేదు కదా! తప్పు చేసినా తప్పులేదనుకున్నాం, ఇది తప్పుకదా! ఎవరు చూసినా చూడకున్నా తప్పు చేయకపోవడమే ధర్మం….తప్పెందుకు జరిగింది పంచేంద్రియాల ప్రలోభం….

శత్రువు మన ధనం మీద దెబ్బ తీస్తాడు లేదా మన మీదే దెబ్బతియ్యచ్చు, శత్రువు మనకు కనపడతాడు,కాని శోకమనే శత్రువు కంటికి కనపడదు కాని, సర్వాన్నీ నశింపచేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన ధైర్యాన్ని నశింపచేస్తుంది. శోకంలాటి బలమైన శత్రువు మరొకరు లేరు.

శ్లో. దుఃఖం దదాతియోஉన్యస్య ధ్రువం దుఃఖం స విందతి
తస్మా న్న కస్యచిత్ దుఃఖం దాతవ్యం దుఃఖ భీరుణా.
క. దుఃఖమితరులకుఁ గొలిపిన,
దుఃఖంబతనికిని కలుగు తోడనె, కానన్
దుఃఖముగొలుపడొరులకిల
దుఖమునకు వెఱయు వాడు తోయజ నేత్రా.
భావము:- ఇతరులకు ఎవడు దుఃఖం కలిగిస్తాడో అతడు నిశ్చయంగా దుఃఖాన్ని పొందుతాడు.అందువల్ల దుఃఖానికి భయపడే వాడెవ్వడూ ఎవరికీ దుఃఖం కలిగించకూడదు.

Coutesy:Andhraamrutam blogspot.com

ఎప్పుడూ ఇతరులకు శోకం కలిగించ కూడదు. ఇతరులకు శోకం కలగచేస్తే అది మనలనూ వేధిస్తుంది, మనకూ చుట్టుకుంటుంది. పై విషయంలో ఇతరుల తప్పు చూసినవారు వారికీ విషయం చెప్పి ఊరుకోవాలేగాని పదిమందిలో ఎదుటివారి పరువుతీస్తే వీరికీ మిగిలేది శోకమే….

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-శోకో నాశయతే ధైర్యం…….

  1. రాజ్య లక్ష్మి గారు,

    సామెత పొరపాటు చెప్పేరు. తాతలు తాగిన బోలి తలవాకిట్లో ఉంది, మంచిమాట నచ్చినందుకు.
    ధన్యవాదాలు.

  2. తాతలనాడు తాగిన పాలు తలవైపునే ఉంటాయి అంటారు కదండీ,అదే జరుగుతుంది.మనం శోకమో,నష్టమో ఎదుటివారికి మిగిలిస్తే చివరకు మనకు మిగిలేది అదే.చాలా బాగాచెప్పారు.ధన్యవాదాలు శర్మగారు.మీనుంచి ఇలాంటి మంచివ్యాక్యలు వింటూ మా నాన్నను కొంత మరువగలుగుతున్నా.కొంచెం ఉపశమనం దొరుకుతోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s