శర్మ కాలక్షేపంకబుర్లు-మనసు.

మనసు.

పుట్టిన ప్రతి జీవికి తల ఉంటుంది. తల ఉన్న ప్రతి జీవికి మెదడుంటుంది. మెదడున్న ప్రతిజీవికి మనసుంటుంది. ఆహారము, నిద్ర,భయము, మైధునము ఈ నాలుగు సర్వ జీవులకు సమానం. ఇవి గాక మరో రెండు కూడా అన్ని జీవులూ ప్రదర్శిస్తాయి, అవే ప్రేమ, కోపం.

ఒక్క మానవులకు మాత్రమే వీటికి అదనంగా కామ,క్రోధ, మోహ,లోభ, మద, మాత్సర్యాలనేవి అదనంగా ఉంటాయి.ఏంటొగాని వీటిని వైరి వర్గాలూ అన్నారు. ఇవన్నీ మనసు యొక్క భిన్న రూపాలే. వీటిని పరిశీలించే ఓపిక, సమయమూ ఉండటం లేదు. మరిన్ని కూడా ఉన్నాయి వీటిని ఊర్ములు అంటారు. ఆకలి, దప్పిక,శోకము,మోహము, జరా మరణాలు. ఇవన్నీ శరీర ధర్మాలు. వీటిలో కూడా కొన్ని ఇతర జీవులకూ ఉంటాయి కాని మానవులలో ఇవన్నీ ప్రస్ఫుటంగా ఉంటాయి, అదనంగానూ ఉంటాయి.

మానవులకే అదనమైన కామ,క్రోధాదులతో చిక్కులు పడుతూంటారు. చిక్కులు పడుతున్నాం, వీటితో అని తెలిసి కూడా వీటిలో బలవంతంగా చిక్కుకుంటూ ఉంటారు. చిక్కుకున్నామని శోకిస్తుంటారు. ఇవి కాక మానవులలో ఉన్న మరొకటి గుర్తింపు సమస్య. దీని గురించి చెప్పేదే లేదు. ఇది చదువుకోని వారి కంటే చదువుకున్నవారిలో బహు ప్రబలంగా ఉంటుందిట. మానవులు ఊర్ములకు ఎలా తాళలేరో ఈ గుర్తింపు లేకునికి అలాగే తాళలేరట 🙂 … దురద దీనినే సంస్కృతం లో కండూతి అందురు, ఇది కూడా అన్ని జీవులకు ఉండునుగాని, మానవులకు ఇది ప్రత్యేకమని శాస్త్ర కారుల ఉవాచ. శారీరిక మైన కండూతికి అంతముండునుగాని, మానసిక కండూతికి అంతులేదష… కామ క్రోధాదులు,ఊర్ములు,కండూతి అన్నియును మనసు విభవములే అందురు.

ఇహ పోతే, ఈ ప్రేమ అనుదానిని మానవులు శారీరకం చేసిపారేసి దాని విలువ తగ్గించేస్తున్నారోయ్ అని పెద్దల మాట, కాదు బాధ. మరీ అన్యాయంగా, ప్రేమలో తగుల్కోడం, చిక్కుకోడం అని అంటారు. ఇదేమోగాని చిత్రమే ఒకరిపై కలిగిన ప్రేమ ఎందుకు నశించదో తెలియదు.అలాగే మరికొందరిపై కలిగిన ద్వేషమూ నశించదు. కాలంతో అవి నశిస్తాయంటారు కాని నిజం కాదనే అనిపిస్తుంది. అసలైన ప్రేమకు మరపు, మరణం లేవు. కొన్ని కొన్ని ప్రేమలు అవసరానికి పుడుతుంటాయి, అవి మాత్రం నసిస్తాయి, కొంతమందిలో. ఇలా వ్యక్తులపై కలిగిన ప్రేమ వలన మనసు అందులో తగుల్కొని బయటకు రాక బాధ పడుతుంటుంది, బాధ పెడుతుంటుంది కూడా. మరచిపోలేని తనమే దీని లక్షణం, అదేమి చిత్రమో గాని ఇలా అటువంటి మరచిపోలేని ప్రేమను భగవంతుని పై మళ్ళించమంటే మాత్రం మనసు వినదు. ఈ మనసు పారేసుకోవడం అన్ని వయసులవారికి సమానమే కాని యువతలో దీని ప్రేరణ,చర్యలు మరి కొంచం ఉధృతంగానే ఉంటాయి. మన ప్రేమను పొందినవారు నిజంగా అందుకు అర్హులా అనే ప్రశ్న వేసుకోడానికి కూడా మనసు ఒప్పుకోదు, ఇదీ అసలు చిత్రం. అందువలన, అందుచేత, అందు కొరకు మనసును పారేసుకోకండి, పారేసుకున్న మనసు ఎదురుగానే కనపడుతూ ఉంటుంది కాని మనతో రానంటుంది…తస్మాత్ జాగ్రత.

పొద్దుటే పైత్య ప్రకోపంతో…….. 🙂

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మనసు.

  1. మనసు గతి ఇంతే ,
    మనిషి బ్రతుకింతే !
    మనసున్న మనిషికీ
    సుఖము లేదంతే !
    ( ఆచార్య ఆత్రేయ ‘ ప్రేమ నగర్ ‘ )

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s