శర్మ కాలక్షేపంకబుర్లు-మదనోత్సవం,వసంతోత్సవం అనే యువ జనోత్సవం

మన్మథ
నామ సంవత్సర యుగాది
శుభకామనలు.

యుగాది కృద్యుగావస్తో….అదృశ్యో వ్యక్త రూపశ్చ..సహస్రజిదనంతజిత్… ……..విష్ణు సహస్రనామాలు.

యుగాలను సృష్టించేది, యుగాలను ఆవృత్తి చేసేది, అదృశ్యమైనది, వ్యక్త రూపమైనది సహస్రం, అనంతం….ఎవరు?….

అనంతం.
ఆది అంతం లేనిది.
పుట్టుక, చావు లేనిది
గుణము,దోషము లేనిది.
రూపం కలది, రూపం లేనిది
తెలిసినది, తెలియనిది. …..ఎవరు భగవంతుడు. అస్తి, నాస్తి కూడా భగవంతుడే…..అదే ఎవరు? కాలం.

ఇదీ సనాతన ధర్మం లో కాల సంకీర్తన,నిత్యమూ.

శ్రీమహవిష్ణూరాజ్ఞేయ ప్రవర్తమానస్య, ఆద్యబ్రహ్మణో, ద్వితియ పరార్ధే, శ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశతి మహాయుగే, కలియుగే ప్రథమపాదే దశాధిక పంచ సహస్రతమే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన మన్మథనామ సంవత్సరే ఉత్తరాయణే,వసంతఋతౌ,చైత్రమాసే,శుక్లపక్షే,పాడ్యమ్యాం, స్థిరవాసర ఏవంగుణ విశేషణ విశిష్టాయాం……..

దీనిని వివరించాలంటే చాలా ఉంది….కాలమనే మహా సముద్రంలో మానవ జీవితం, వంద సంవత్సరాలూ జీవిస్తే, అది ఒక చిన్న నీటి బిందువులాటిది. ఇంత చిన్నదైన జీవితంలో ఈర్ష,అసూయ,ద్వేషం, కోపం, తాపం,కక్ష, కార్పణ్యం,సాధింపు…ఏమిటీ చిత్రం, విచిత్రం…బతికినన్నాళ్ళు సుఖంగా బతకలేమా?

పుట్టుక, చావు; ఆది,అంతం;గుణము,దోషము,కనపడేది,కనపడనిది..ఇలా అన్ని ద్వందాలూ సర్వమూ  ఇముడ్చుకున్నది కాలం. ఈ కనపడే సర్వ చరాచ సృష్టి కాలానికి లోబడినదే. కాలంలో వచ్చి కాలం వెళ్ళిపోయేదే. ఇదే, జాయతే గఛ్ఛతే ఇతి జగం.ఈ అనంత కాలాన్ని కొన్ని భాగాలు చేసుకున్నాం మనకోసం,కాదు కాలమే విభాగాలూ చేసింది. అది కూడా ప్రకృతి చేసినదే! ప్రకృతి అనేది లక్ష్మీ దేవి మొదటి పేరు. ప్రకృతితో సహజీవనం చేయడమే మన, కాదు, మానవ లక్షణం. అనంతమైన కాలం యుగాలుగా ప్రకృతి చేతనే విభాగింపబడింది. యుగానికి ఆరు ఋతువులు. వసంతమే మొదటిదెలా? మానవుల జీవితం మొదలు పుట్టుకతో, అందుకే కొత్త చివురుతో సంవత్సరప్రారంభం, ఆకురాలుతో సంవత్సరాంతం. ప్రతి ఋతువు చివర పదేనురోజులూ రాబోయే ఋతు చిహ్నాలు కూడా కలసి ఉంటాయట. అలాగే రాబోయే వసంతం శిశిరంలో కలసి పండుగ ప్రారంభమవుతుంది.

ఫాల్గుణ శుక్ల చతుర్దశి కామ దహనం శంకరునిచే, అమ్మ కరుణచే మదనుడు అనంగునిగా హోళికా పూర్ణిమనాడు జననం. ఇదే రోజు లక్ష్మీదేవి జననం. ఆ మరుసటిరోజు అనగా  ఫాల్గుణ బహుళ పాడ్యమితో మదనోత్సవం,వసంతోత్సవం అనే యువ జనోత్సవం ప్రారభమయ్యేది, తెనుగునాట. ఆ రోజున చూత కుసుమ భక్షణ తో, ఈ యువజనోత్సవాలు ప్రారభమయేవనుకుంటా. అలా ప్రారంభమైన మదనోత్సవం ఫాల్గుణ బహుళ అమావాస్యనాడు అంతమై, చైత్ర శుక్ల పాడ్యమినాడు యుగారంభంగా శోభిల్లింది,మదనోత్సవం,వసంతోత్సవం అనే యువ జనోత్సవం. ఈ మదనోత్సవ విశేషాలు శ్రీనాధుని క్రీడాభిరామంలో వర్ణింపబడినట్టుంది.

పదిహేను రోజుల కితం ఒక పండగ చేసుకున్నాం, అదే కామ దహనం,హోలీ, కామ జననం కూడా! అయ్య కామాన్ని, మన్మధుని దహిస్తే, అమ్మ మన్మధుని ఆయుధాలు స్వీకరించింది, మన్మధుని అనంగుని(శరీరం లేనివాడు) చేసింది. ఆవిడెవరు శక్తి స్వరూపిణి, ఆకీటబ్రహ్మ జనని అంటే కీటకం నుంచి బ్రహ్మ వరకు అందరకు తల్లి, ఆవిడే ప్రకృతి శక్తి. ఇదెప్పుడు ప్రారంభమవుతుంది? మన్మధుడు అనంగుడై మనసులో చేరినపుడు (
మదనోత్సవం ) చూత కుసుమ (మామిడి పువ్వు) భక్షణతో ప్రారంభమై నింబ కుసుమ (వేప పువ్వు) భక్షణతో పండగ పూర్తవుతుంది. అదే యుగాది. ఇప్పుడు ప్రకృతి పులకరిస్తూ, పలకరిస్తూ ఉంటుంది, మానవుల మనసు పులకిస్తూ వుంటుంది. మనకు బాగున్నపుడే కదా పండగ, అదే ఇప్పుడే పండగ, అదికూడా భూమధ్య రేఖకు ఉత్తారాని ఉన్నవారికే. మరి దక్షణాన ఉన్నవారు ఇందుకోసం మరో ఆరునెలలాగాలి, ఇప్పుడు వారికి చలి ప్రారంభమవుతుందికదా! అదే ఆస్ట్రేలియా, దక్షణ అమెరికా, దక్షణాఫ్రికా వగైరా దేశాలు.ప్రకృతితో సహజీవనం చేయడమే మానవునికి అవసరం. ఇప్పుడు చూత కుసుమభక్షణం లేదు, మదనోత్సవం లేదు, ఒక ఉగాది మాత్రం చేస్తున్నాం. మామిడి పూత తినడం కూడా ఆరోగ్యం లో ఒక భాగం. ఈ సంవత్సరం మరొక ప్రత్యేకత. మార్చ్ 21 న సూర్యుడు భూమధ్య రేఖ మీద ఉంటాడు, ఈ రోజును విషువత్తు అంటారు Equinox అనగా రాత్రి పగలు సమయం సమానంగా ఉండే రోజు, ఆ రోజే ఉగాదిరావడం విశేషం. యుగాది అందరికి శుభం కలగాలని కోరుదాం.

శత్రువులకు, మిత్రులకు శుభం. తిట్టినవారికి,దీవించినవారికి శుభం. కోపగించినవారికి, ఆదరించినవారికి శుభం. ఛీ కొట్టినవారికి, భళా అన్నవారికి శుభం. పలుకుబంగారం దాచుకున్నవారికి, పలుకుబంగారం దోచుకున్నవారికి, పలుకు బంగారం పంచినవారికి శుభం. తలలోతు కష్టంలో ఉన్నవారికి,శత్రువుకు కూడా శుభం కలగాలి. మూతి ముడుచుకుని,మనసు మూసుకున్నవారికి శుభం, మనసుతెరచి మాటాడినవారికి శుభం. పిన్నలకు పెద్దలకు అందరికి శుభం.

సర్వే జనాః సుఖినో భవంతు.

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మదనోత్సవం,వసంతోత్సవం అనే యువ జనోత్సవం

  1. మీరీవ్యాసం నా మనసులో మాట తెలుసుకుని వ్రాసినట్లుంది. blog వ్రాతగాల్లల్లో మీరు రారాజు. మీకివే నా శతకోటి వందనాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s