శర్మ కాలక్షేపంకబుర్లు-నెల తక్కువైనా…

నెల తక్కువైనా…

నెల తక్కువ వెధవా అని తిట్టడం తెనుగునాట అలవాటే. నెల తక్కువేంటీ?

శిశువు జన్మించాలంటే తల్లి గర్భం లో తొమ్మిది నెలలు అనగా 270 రోజులుండాలి. మడతని పుట్టడమంటారు, అదేమంటే ఒక సారి గర్భం ధరించి బిడ్డను కన్న తరవాత మరలా నెల వారీ ఋతువు వస్తేగాని రెండవ సారి గర్భం రాదు, కాని కొంతమందికి ఈ నెలవారీ ఋతువు రాకుండానే మరల గర్భవతులవడం జరుగుతుంది, దీనినే తెనుగులో మడతన కడుపున పడటం అంటారు. అలా పుట్టినవాళ్ళు కూడా కొంతమంది నెల తక్కువవాళ్ళుంటారు. కాని కొంత మంది 240రోజులకే పుడతారు. వీరినే నెల తక్కువ వాళ్ళు అని అంటారు. ప్రి మెచూర్ బేబీ. వీళ్ళలో రెండు రకాలు ఎనిమిదో నెలని పుట్టినవాళ్ళు, ఏడవ నెలనే పుట్టినవాళ్ళూ ఉంటారు. ఎనిమిదో నెలలో పుట్టినవారిని నెల తక్కువ వాళ్ళు అని అంటారనుకున్నాం కదా! అంటే తెలివి తక్కువ వాళ్ళు అని అర్ధం. కాని ఏడో నెలని పుట్టిన వాళ్ళకి తెలివితేటలు చాలా ఎక్కువుంటాయి 🙂 ఎందుకంటే అవసరం,ప్రకృతి, బతకాలనే కాంక్ష వీరికి తెలివి తేట్లనిస్తాయి. ఇప్పుడంటే ఇంక్యుబేటర్లు లో పడుకోబెడుతున్నారు కాని, పాత రోజుల్లో ఆ సావకాశాలు లేక ఎనిమిదవ నెలని పుట్టినవాళ్ళు బతికినా, ఏడవ నెలని పుట్టినవాళ్ళు ఎక్కువగా చనిపొయేవారు. బతికి బట్టకట్టినవాళ్ళు మాత్రం చాలా తెలివిగలవారై ఉంటారు, అనుమానం లేదు. మరో సామెత కూడా ఉంది ”నెలతక్కువైనా కోమటింట పుట్టాల”ని. నిజానికి నాటిరోజులలో కోమట్లు మాత్రమే ధనవంతులై ఉండేవారు, నెల తక్కువగా పుట్టినా ఆ బిడ్డని సాకే అవకాశాలు ఎక్కువ ఉండేవి. అదీ ఈ సామెత సంగతి.

నాటి రోజుల్లో సామెత నెల తక్కువైనా కోమటింట పుట్టాలని కాని నేడు సామెతని మార్చుకోవాలనుకుంటా, అనుకుంటూ కునుకులోకి జారిపోయా, కలొచ్చింది. కలలో దేవుడు కనపడ్డాడు,వరమడగమంటే, బతికినంత కాలం ఎలాగూ బతకబోం కనక, మళ్ళీ జన్మకైనా సుఖంగా బతకాలనిపించింది, అందుకిలా వేడుకున్నా, ”స్వామీ! మళ్ళీ జన్మలో భారత దేశం లోనే రాజకీయనాయకుల ఇంట పుట్టించు, లేదంటే కనీసం రాజకీయ నాయకుల కుటుంబంలో అల్లునిగానైనా చెయ్యి స్వామీ, దింపుడు కళ్ళం ఆశ కోడలుగానైనా చెయ్యి …..”
ఇంతా విని దేవుడు ”ఎందుకూ?” అన్నాడు…
”అయ్యో! పిచ్చి దేవుడా!! నీకేం తెలుసు భారత దేశం సంగతి, అందునా రాజకీయ నాయకుల సంగతి…నువ్వు పుట్టించు తరవాత సంగతి నేను చూసుకుంటా” అన్నా.
నేను చూసుకుంటా అంటున్నారు ఎవరినీ అని ఇల్లాలు అంటే మెలుకువొచ్చేసింది.

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నెల తక్కువైనా…

  • మిత్రులు శ్యామలరావు గారు,
   నిజమే అది తెలుస్తూనే ఉంది కదూ! ఏడవ నెలని పుట్టిన వాళ్ళు మేధావులుట. 🙂
   నేనేమో మడతని పుట్టేనుట,అందుకు మా అమ్మగారు బుఱ్ఱలేదు నెలతక్కువ వెధవా అని మా అమ్మగారు నిర్ణయం చేసి చెప్పేసేరు 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s