శర్మ కాలక్షేపంకబుర్లు-ఏకం సత్

ఏకం సత్

ఏకం సత్ విప్రా బహుధా వదంతి. భగవంతుడొక్కడే కాని బుధులు వివిధరకాలుగా చెబుతారు. ఎందుకు? భగవంతుని దర్శించడానికి ఒక్కొకరికి ఒకో మార్గం ఇష్టం కావచ్చు, అందుకు. అందరకి ఒకే మార్గం ఉండాలనడం ఇచ్చగించదగినదా?

శివశక్తుల కలయికే భగవంతుడు అందాం. మనకు ఒక ఆలంబం కావాలి కనక. నిరాకారుణ్ణి ఊహించడం అంత తేలిక కాదు కనక. నిజానికి ఆయన /ఆమె/అది నిరాకారమైన అనంత శక్తి. మనకోసం శివశక్తుల కలయికగా, అర్ధ నారీశ్వరులుగా భావిద్దాం. [ ఇదే (శివ+శక్తి) ;(+veఽ-వve); (Potential Energy+Kinetic Energy); (అణువులోని రెండు భాగాలు Proton+Nutron)].

ఈ అనంత శక్తి నుంచి పుట్టినవే త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు, వాటి ప్రతినిధులే బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుడు. ( వీరి గతి శక్తి సరస్వతి,లక్ష్మి,పార్వతి ).  వీరు మువ్వురు సృష్టి,స్థితి, లయాలకి కారకులు. వీరి అంశ అవతారాలు, పూర్ణావతారాలే మిగిలినవారు. భాగవతం ఈ అవతారాలు 21  అంటోంది( దశావతారాలతో కలిపి).

ఇక దేవతలు అనేవారు ముప్పది మూడు సమూహాలవారు. ఇవన్నీ పదవులు. పుణ్యం ఆచరించినవారు ఈ పదవులలో చేరుతారు, వారి పుణ్యం పూర్తయిన తరవాత ఆ పదవి నుంచి స్వర్గం నుంచి మరల భూమికి పంపబడతారు. మానవుల కోర్కెలను తీర్చేది దేవతలే.

చివరిగా మళ్ళీ మొదలుకొస్తే భగవల్లక్షణాలు నిరాకార, నిర్గుణ, అనంత. ఈ స్వరూపాలు స్వభావాలు అన్నీ మనకోసం సగుణాకారంగా దృష్టి నిలపడానికి చేసుకున్న ఏర్పాట్లు. భగవంతుడు సగుణుడు, నిర్గుణుడు కూడా….

ఇంకా చాలా ప్రశ్నలూ మిగిలిపోతాయి……అది తెలిస్తే……

మాధవరావుగారి ప్రశ్నకు సమాధానంగా నాకు అనిపించినవరకు…

ప్రకటనలు

19 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఏకం సత్

 1. రమాపతి రావు గారు,
  మీ వ్యాఖ్యలకి సంతసం. తెనుగులో ఉండి ఉంటే మరికొంత ఆనందించేవాడిని. మీ అనుమతితో ఒక టపా రాస్తున్నా.
  ధన్యవాదాలు.

  • Sir,
   The reason for choice of English is more out of convenience than love for that language. In fact, the nuances of Vedanta cannot, at times, be expressed precisely in English.

   Your posting is very good from transcational (vyavaharika) point of view. Even in the case of your example of Shiva & Shakti/Maya, just like the Shakti of Shaktivaan is not different, Shakti/Maya is not different from Shiva/Ishvara. Itihasas and Puranas do teach Vedanta to some extent that way. But then, the ultimate reality of Brahman cannot be ascertained by direct perception (pratyaksha pramaNa). Because of that understanding the ultimate cause of this universe through Prasthana-Traya is imperative.

   Regards,

   Ramapathi Rao Kondamudi

   • రమాపతి రావుగారు,
    మీ సౌకర్యాన్ని కాదనను కాని, మాది కొంత స్వార్ధం కదండీ! అదనమాట.
    వేదాంత పరిచయం చేసుకోవాలనుకునేవారు, ముందుగా ప్రత్యక్ష ప్రమాణం ఉన్న వానితో మొదలెట్టాలి, లేకపోతే అదొక పెద్ద డొంక ఐపోతుందని మీకు తెలియనిదా? గుర్తు చేశానంతే! పరోక్ష, అనుమాన ప్రమాణాల దగ్గరికి వచ్చేటప్పతికి కొంత అవగాహన అవుతుంది కదండీ!
    ఏదయినా గురుముఖతః నేర్చుకోవలసిందే!
    ధన్యవాదాలు.

   • వేద వేదాంగాల పఠనంలో గురువు ప్రాముఖ్యత స్పష్ఠంగా వుంది. అందులో అణుమాత్రం కూడా సందేహం లేదు. ఆమాటకొస్తే చాలా ఉపనిషత్తులలో మంత్రాలు గురు-శిష్య సంవాదంగా నడుస్తాయి. నాకున్న ఈ పరిమిత జ్ఞానం కూడా గురుప్రసాదమే.
    ఇక రెండవ విషయానికి వస్తే, ఆగమప్రమాణం కూడా ప్రత్యక్షప్రమాణానికి అనుగుణంగానే వుండాలి..ఽందుకనే వుంటుందికూడా. ప్రత్యక్షప్రమాణానిని అందుకనే నిరంకుశప్రమాణం అంటారు. అయితే… తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పినట్లు (యతోవాచో నివర్తంతే, ఆప్రాప్య మనసా సహా:) ఒకస్తితి తరువాత ఇంద్రియ ప్రమాణాలకు అందనిచోట ఆగమప్రమాణమే శరణ్యం.

   • రమాపతిరావుగారు,
    కష్టమైనా మా కోసం తెనుగులో రాసినందుకు, ధన్యవాదాలు.
    ఇదే ప్రత్యక్ష ప్రమాణం కదూ 🙂
    ధన్యవాదాలు.

 2. Dear Madhava Rao Garu,

  You have raised the moot question ‘Who is Jeeva?”
  In Adhyasa Bhashya of Brahmasutra Bhashyam by Adi Shankaracharya, in the beginning itself he says “Yushmad Asmad Pratyaya Gocharayo, Vishaya-VishayiNo, Tamah-Prakasha Tad Viruddha Swabhavayo………”

  Basically we all know the difference between Kshetra and Kshetrajna. Yushmad (Sharira or Jagat) being Kshetra and Asmad (Jeeva) being Kshetragna. In the Jagrat Avastha, the Jeeva is called Bahishpragna, during which state, without knowing who he is, he attributes himself to the body and looks for ananda outside. This wrong knowledge is called Adhyasa. After the indriyas (except Manas) get tired, he goes into Swapna Avastha, where this jeeva is called Antahpragna. Here, the Manas plays the role of both knower and knowee. Even after the Manas also gets tired, he goes into the next state Sushupti, where the Jeeva is in just a state of knowing nothing about himself. This ignorance is called Avidya. With attaining the knowledge that he is not the Sharira, a Gnani gets to know he is ever pervading Atman only. When Krishna talks about Him, it is that Atman, which is devoid of that Avidya also.

 3. Karma is a concept in Hinduism which explains causality through a system where beneficial effects are derived from past beneficial actions and harmful effects from past harmful actions, creating a system of actions and reactions throughout a soul’s reincarnated lives forming a cycle of rebirth.
  In Buddhism, karma specifically refers to those actions of body, speech or mind that spring from mental intent (“cetana”),[21] and bring about a consequence or fruit, (phala) or result (vipāka).

  చాలా ఆసక్తి కరం గా ఉంది ! చర్చ !
  కర్మ సిద్ధాంతం , హిందూ ధర్మ రీత్యా , బుద్ధ ధర్మ రీత్యా , వేరు వేరు గా ఉంది !
  చరిత్ర లో అనేక దేశాలు , అనేక ఇతర దేశాలను యుద్ధాలు చేసి కబళించాయి!
  అనేకమంది నియంతలు , శక్తి హీనులైన ప్రజల కనీస హక్కులను , కాల రాసి , పాలిస్తూ ఉన్నారు , ఇప్పటికీ !
  ప్రపంచం లో అనేక కోట్ల మంది ప్రజలు , ఇప్పటికీ , ఆకలితో అలమటిస్తున్నారు !
  అనేక లక్షల మంది ప్రజలు ,అనేక అత్యాచారాలకు గురి అవుతున్నారు !
  అనేక లక్షల మంది మానవులు ,అనేక అనారోగ్యాలకూ , వ్యాధులకూ , ప్రకృతి వైపరీత్యాలకూ గురి అవుతున్నారు !
  అనేక పాపాలు చేస్తున్న వారు , వారి ‘ కర్మ ఫలాలను ‘ ఆనందం గా అనుభవిస్తున్నారు !
  సర్వజ్ఞుడూ , శక్తి మంతుడూ అయిన దేవుడు , కేవలం ఇవన్నీ చూస్తూ ఉండడం దేనికి ?
  బాధలు అనుభవిస్తున్న వారికి ‘ ఇది కేవలం జగన్నాటకం ‘ అన్న వాక్యం రుచించదు కదా , పుండు మీద కారం పోసినట్టు ఉంటుంది !
  సారాంశం : ఈ ప్రపంచం లో , మానవుల అనేక బాధలకు , ఇతర మానవుల కర్మలే , ప్రధాన కారణం ! ఈ విషయాన్ని
  బుద్ధుడు ‘ జ్ఞానోదయం ‘ తరువాత తెలుసు కున్నాడు ! కానీ కాలాంతరం లో, ఆశ్చర్యకరం గా , బుద్ధుడు కూడా భగవంతుడిగా కొలువ బడుతున్నాడు ,తానూ మానవ మాత్రుడినే నని తెలియజేసినప్పటికీ !
  నా పరిణితి , ఇంతగానే పరిమితమయింది ! సహించగలరు !

  • సుధాకర్ జీ,
   లేదు లేదంటూనే చాలా వివరించారు.
   ఎదుటివాడు కొడుతూ నీ కర్మ కనక నేను కొడుతున్నాను, నువ్వు పడు అనేది బాగుండదు. వైరుధ్యాలు కనిపిస్తాయి, సమన్వయ పరచుకోడం లోనే ఉంది. ఇలా సమన్వయ పరచే వారే గురువు. పుస్తకాలలో ఉన్నదానికి మస్తకాలలో ఉన్నది చేర్చకపోతే, పూర్తి అర్ధం కాదు.
   ధన్యవాదాలు

  • Sudhakar Garu,
   Let us see your interpretation from two angles. Firstly, one should be able to distinguish the fine-line between Karma and Karma-phala. In a general sense that I cite an example: If ‘A’ gives a donation to ‘B’, you can distinguish that ‘A’ has performed his karma and ‘B’ got his karma-phala. But actually it is not as simple. Nevertheless, you cannot brush it aside with a sweeping statement.

   Secondly, what is ‘pleasure’ and what is a ‘pain’ can you elaborate? If pleasure is there in Apple, everybody should enjoy it and should enjoy it endlessly. If it is not so, then pleasure is not located in Apple. In that pattern you may search try to locate it. The resultant analysis leads to the fact that the jeeva himself is Ananada-maya (full of bliss). This pleasure is coming from within and not from extraneous factors. You will find it from your experience in Sushupti (deep sleep).

   To understand the Sanatana-Dharma, you need to study the Shastras through a competent Guru. Mere inference through a superficial knowledge will not help.

   Please forgive me if I am harsh, but the fact remains that many of us get carried away by our limited understanding and miss the truth.

 4. శ్రీ శర్మగారికీ, శ్రీ జిలేబీ గారికి, నమస్కారములు.

  మీ సమాధానాలకి ధన్యవాదములు. నా ప్రయత్నం నేను చేస్తూనేవున్నాను. ఆ ప్రయత్నంలో నాకు సమాధానాలు దొరికి, జ్నానోదయం అవుతుందని ఆశిస్తున్నాను. ధ్యానం, యోగా నా అలవాట్లు.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • మిత్రులు మాధవరావుగారు,
   మనసు నొచ్చుకునేలా మాటాడి ఉంటే మన్నించండి. నా ఉద్దేశం ప్రకారం.
   అందరూ పుస్తకాలలో ఉన్నవే చెబుతారు. సమన్వయ పరచే వారే అసలు గురువులు, వారు దొరకడం కష్టం. ఇక పఠనం, శ్రవణం, మననం ఇవి ఎప్పుడూ చేస్తూనే ఉండాలి, ఎప్పటికో మన్కే ఆ విషయం సుబోధకం కాగలదు. తపస్సు,( ముక్కు మూసుకు కూచోడమే కాదు, ఆ విషయం మీద నిరంతరం తపించడమే తపస్సు అని నా ఉద్దేశం) ధ్యానం సర్వోత్తమం చెప్పిన దానిలో పొరపాట్లుంటే పెద్ద మనసుతో మన్నించండి.
   ధన్యవాదాలు

 5. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

  నాయందు అభిమానంతో మీరు చక్కని టపాని వ్రాసి మంచి వివరాలను అందించారు. ధన్యవాదములు.
  ఇక నాదగ్గర మిగిలిపోయిన ప్రశ్నలు, మీదగ్గర మిగిలిపోయిన ప్రశ్నలను కలిపి వాటి సమాధానాలకోసం కొంత వెతికితే ఏదైనా కొంత లాభం కలుగుతుందేమో!! మీనుంచీకూడా ప్రయత్నించగలరు. నా సందేహాలు ఇవి:-

  1. శ్రీమద్భవద్గీతలో, 10వ అధ్యాయం: విభూతియోగం: 39వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు:` …సమస్త ప్రాణికోట్లకు ఏది మూలకారణమై యున్నదో అదియు నేనే అయియున్నాను. బీజమును అయియున్నాను. వెయ్యేల, సమస్త స్థావరాజంగమాత్మకమైన వస్తువు ఏదియునూ నాకంటే వేరుగలేదు’. ఇక్కడ ఒక ఉదాహరణను తీసుకుంటే:- ఒక మామిడి టెంకను నెలలో పాతిపెడితే, దానినుంచి మామిడి మొక్కవచ్చి, పెరిగి పెద్దది అయిందనుకోండి. ఆ చెట్టునుగురించి చెప్పేటప్పుడు, మామిడి టెంక, మామిడి మొక్క, మామిడి చెట్టు, మామిడి కొమ్మలు, మామిడి ఆకులు, మామిడి పూత, మామిడి కాయలు అనే స్పష్టంగా చెబుతాము. అలాగే, సమస్త ప్రాణికోట్లకు బీజమును నేనే అయివున్నాను అని భగవానుడు స్పష్టంగా చెప్పినప్పుడు, సమస్త ప్రాణులు, ముఖ్యంగా మనుషులను తీసుకుంటే, మానవులందరూ ఆ భగవంతుని స్వస్వరూపములేకదా!! ఈ విషయాన్ని కొంతసేపు ప్రక్కనపెట్టి;

  2. క్షేత్రక్షేత్రజ్న విభాగయోగం: 13వ అధ్యాయం: 2, 3వ శ్లోకాలలో: జడమైన సమస్త క్షేత్రములందును నన్ను క్షేత్రజ్నునిగా లేదా పరమాత్మగ తెలుసుకొనుము అని చెబుతూ, జడమగుదానిని, జడమగునది తెలుసుకోలేదుకాబట్టి, ప్రజ్నయే లేదా పరమాత్మయే అట్టిదానిని తెలుసుకోగలదుకాబట్టి, అట్టి జడమైన శరీరములలో వున్నట్టి ఇంద్రియములను ప్రకాశింపజేసి తెలుసుకోవటం జరుగుతున్నది అని చెబుతూ, దానిని నిర్ధారిస్తూ, ఈ 15,16,17,18 వ శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఇట్లా చెప్పాడు: ` ఆ బ్రహ్మము సమస్తములైన ఇంద్రియములయొక్క గుణములను ప్రకాశింపజేయునదియు; ప్రాణులను సృష్టించునదియు …. అయివున్నది”. పై రెండు అధ్యాయములద్వారా ప్రాణులైన మానవుల సృష్టికి మూలకారణము తానేనని చెప్పటం జరిగింది. అంతేకాకుండా, తాను `బీజమును’ అయివున్నాను అని చెప్పటంద్వారా, మనమంతా భగవంతుని స్వరూపాలమేనని తెలుస్తునది;

  3. క్షేత్రక్షేత్రజ్న విభాగయోగంలో 6, 7వ శ్లోకాల్లో క్షేత్రమనగా కేవలము స్థూల దేహమేకాదు; సూక్ష్మ శరీరము, పంచమహాభూతములు, మనస్సు, బుద్ధి, మూల ప్రకృతి, వాటిచే కలుగు సమస్త వికారములుకూడా కలిపినదే అని చెప్పటం జరిగింది. పదవ అధ్యాయం:విభూతియోగము: 22వ శ్లోకములో: ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యమూనూ లేదా తెలివిని నేనే అయియున్నాను అని చెప్పటం జరిగింది.

  4. కర్మాసన్యాసయోగము: 14వ శ్లోకములో: కర్తృత్వము, కర్మఫలము ప్రకృతి సంబంధము వలన కలిగిన జన్మాంతర సంస్కారమే అని చెబుతూ, 15వ శ్లోకములో: పరమాత్మ, యెవని యొక్క పాపమునుగాని, పుణ్యమునుగాని స్వీకరింపడు. అది జీవుల భ్రమ, అజ్నానము.

  5, క్షేత్రక్షేత్రజ్న విభాగయోగం: 9వ శ్లోకములో: ` జన్మ, మృత్యు, జరా ఇత్యాదివన్నీయు దోషములుగా చెప్పబడినవి.

  ఇప్పుడు నా సందేహములు ఏమిటంటే:
  1. మానవుని శరీర సృష్టికి (సమస్త ప్రాణులయొక్క సృష్టికి కూడా) మూలమైన బీజమును నేనే అయివున్నాను; మానవుని ఇంద్రియములలో మనస్సును, బుద్ధిని లేదా తెలివిని లేదా చైతన్యమును నేనే అయివున్నాను అని చెబుతూ, జడములైన ఆయా ఇంద్రియములను ప్రకాశింపచేసెదీ నేనే అయివున్నాని చెబుతూ, పరమాత్మనైన నేను యెవనియొక్క పాపములనుగానీ, పుణ్యములనుగానీ స్వీకరించను; అది జీవుడే భరించాలి అని చెప్పటములో ఆంతర్యము ఏమిటి? అసలు జీవుడు ఎక్కడనుంచి వచ్చాడు? జడమైన శరీరము పరమాత్మచే సృష్టింపబడినదే; దానిని ప్రకాశింపచేస్తున్నదీ పరమాత్మే; శరీరములో వుంటున్నదీ పరమాత్మే. ఒక ప్రక్క చేయించేదీ, చేసేదీ అన్నీ నేనే చెబుతూ, జీవుడు కర్మఫలాల్ని అనుభవించాల్సిందే అని చెప్పటములో అర్ధం ఏమిటి? ఈ జీవుడు ఎవరు? జన్మముకూడా దోషముతోకూడినదే అని చెప్పిన ఆ పరమాత్మ, అట్టి దోషభూయిష్ట మైన శరీరములో ఎందుకు సాక్షీభూతుడిగా వుండాలి? వుండాల్సివస్తున్నది? నాశరహితమైన పరమాత్మ తన ఉనికిని ఎందుకు తెలియజేసుకోవాలి? ఎవరికోసం తెలియచేయాలి? తన ఉనికి తెలియజేసుకోవటానికి దోషభూరితమైన ఈ శరీరాన్ని ఎందుకు ఎంచుకోవాలి? — ఇవన్నీ నా ప్రశ్నలే, సందేహాలే!!

  2. ఇప్పటివరకూ కొంతమంది పెద్దలను అడిగినా, ఉపన్యాసాలద్వారా పెద్దలు చెప్పినది విన్నా, అవంతా పుస్తకాలలో చెప్పినదానిని యధాతధంగా చెబుతున్నారేమో అని అనిపిస్తున్నదిగానీ, నా మనస్సుకు తృప్తి కలిగేలా సమాధానాలు దొరకటంలేదు; లేదా, వారి సమాధానాలు నా బుద్ధికి అందటం లేదేమో మరి!! దయచేసి వివరించగలరు.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • మిత్రులు మాధవరావుగారు,
   నిజానికి నేను అజ్ఞానినన్న సంగతి తెలిసీ అప్పుడప్పుడు అహం ప్రకోపించి ఏదో అంటుంటాను.
   మీరు వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం అంత తేలికా కాదు. పెద్దలయినవారు వివరించినా అర్ధం కావడం కష్టం. నేటి తర్క, సయిన్స్ దృష్టితో ఆలోచించే మనసుకి సమాధానాలు దొరకడమూ కష్టమే. భగవత్తత్వం నిరాకారము, సాకారము అని ఎలా అనుకుంటున్నామో, అలాగే జీవుడు కూడా కొన్ని విషయాలలో స్వతంత్రుడు, మరొకిన్ని విషయాలలో అస్వతంత్రుడని అనుకుంటా. ఇదెలా కుదురుతుందనచ్చు. అది అర్ధం చేసుకోగలిగితే చిదానందమే.
   ధన్యవాదాలు.

   • మాధవ రావు గారు,

    మీ ప్రశ్న లకి సమాధానం చదవటం తో రాదు .

    ధ్యాన మార్గమే శరణ్యం .

    కాదూ కుదరదంటే , ఆ పై వాడే ‘ఫ్లాష్’ ఇవ్వాలి .

    ఇదీ కాదూ కుదరదు అనుకుంటే ప్రళయం దాకా వేచి చూడాలి .

    ఇదీ కాదూ కుదరదూ అనుకుంటే …

    ఆ పై నాకూ తెలీదు !!!

    జిలేబి

  • Dear Madhava Rao Garu,

   You have raised the moot question ‘Who is Jeeva?”
   In Adhyasa Bhashya of Brahmasutra Bhashyam by Adi Shankaracharya, in the beginning itself he says “Yushmad Asmad Pratyaya Gocharayo, Vishaya-VishayiNo, Tamah-Prakasha Tad Viruddha Swabhavayo………”

   Basically we all know the difference between Kshetra and Kshetrajna. Yushmad (Sharira or Jagat) being Kshetra and Asmad (Jeeva) being Kshetragna. In the Jagrat Avastha, the Jeeva is called Bahishpragna, during which state, without knowing who he is, he attributes himself to the body and looks for ananda outside. This wrong knowledge is called Adhyasa. After the indriyas (except Manas) get tired, he goes into Swapna Avastha, where this jeeva is called Antahpragna. Here, the Manas plays the role of both knower and knowee. Even after the Manas also gets tired, he goes into the next state Sushupti, where the Jeeva is in just a state of knowing nothing about himself. This ignorance is called Avidya. With attaining the knowledge that he is not the Sharira, a Gnani gets to know he is ever pervading Atman only. When Krishna talks about Him, it is that Atman, which is devoid of that Avidya also.

   • మీ టపా చదివేకే , ఆ జ్ఞానం కలిగింది !!

    Mostly when we talk of Truth, (Sat) there is already an eliment of two (dvaya). so beyond that is IT ?

    జిలేబి

   • జిలేబిగారు,
    మీరన్న మాటను (IT) పొరపాటుగా అర్ధం చేసుకునా, ఇప్పుడు అర్ధమయింది, Every thing consists of duality in one form. It is said as Siva and Sakti, the undivisible, appearing in one form
    ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s