శర్మ కాలక్షేపంకబుర్లు-గుమ్మడి గింజలతో………

DSCN0041

గుమ్మడి గింజలతో………

గుమ్మడి లో రెండు రకాలు, ఒకటి సూరేగుమ్మడి లేదా కూర గుమ్మడి, రెండవది బూడిద గుమ్మడి.ఇప్పుడు సూరే గుమ్మడి గురించి చూదాం.

సూరేగుమ్మడి కాయలు చాలా చిన్నవాటినుంచి పెద్దవాటిదాకా దొరుకుతాయి. మేమయితే ఇదివరలో పెద్ద గుమ్మడి కాయించేవాళ్ళం. ఈ మధ్య చిన్న గుమ్మడి కాయిస్తున్నాం. ఇది శీతకాలపు పంట.

ఒక గుమ్మడి కాయను తీసుకోండి. కొద్ది పొడుగైన పదునైన చాకుతీసుకుని గుమ్మడి కాయ ముచిక చుట్టూ ఒక అంగుళం దూరంగా ముచికచుట్టూ లోపలికంటా కోయండి. ఇప్పుడు ముచికను పట్టుకుని లాగండి. ముచిక ఊడి వస్తుంది. దీనిని జాగ్రత్త పెట్టండి, దీని పనుంది.ముచిక తీసిన గుమ్మడి కాయలోకి చెయ్యిపెట్టి లోపలి గింజలు,గుజ్జులాటిదానిని తీయండి. పారేయక జాగ్రత్త పెట్టండి, వీటి గురించీ చెబుతా. ముచిక తీయబడిన గుమ్మడి కాయలోకి మెత్తగా దంచి ఉంచుకున్న బెల్లంలోకి కొద్దిగా ఏలకులపొడి చేర్చి, గుమ్మడి కాయలో కూరండి, నిండుగా. ఇప్పుడు జాగ్రత్త పెట్టిన ముచికను దాని స్థానం లో ఉంచండి. దీనిని పక్కగా ఉంచి, మెత్తటి నల్లమట్టిని తీసుకోండి, నీళ్ళుపోసి తడిపి చేజారుగా తయారు చేయండి. ఇలా తయారు చేసిన మట్టిని మందంగా బెల్లం కూరివుంచిన గుమ్మడి కాయమీద మేగండి, కిందా,మీదా, పూర్తిగా. ఇప్పుడు దీనిని చలికి వేసే నెగడు లో పెట్టి ఉంచండి, రాత్రి పెట్టినది, ఉదయం తీసి, చల్లారిన తరవాత పై మట్టిని చేతితో తొలగించండి. మట్టి పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా ఉందనుకుంటే ఊదేయండి, నీళ్ళు మాత్రం పోయ్యకండి. మట్టి తొలగించిన గుమ్మడి కాయను ముక్కలుగా కోసుకుని కరిగిన నేతిలో ముంచుకుని తింటే……

ఛీ! ఇదేం తిండీ అనద్దు. పల్లెలలో, గిరి జనులకు ధాన్యం,జొన్నలు వగైరా పంట తక్కువ సంవత్సరాలలో ఇలా గుమ్మడిని తయారు చేసుకుని ఆహారంగా తీసుకునే అలవాటుంది. ఇది చాలా పుష్టికరమైన ఆహారం. ఒక సారి ఇది తింటే ఒక రోజు ఆహారం మరి అక్కరలేదు. సావకాశాలు లేవా? నేనేం చెయ్యలేను…. వీలున్నవారు ప్రయత్నించచ్చు.

ఇక ఇందాకా జాగ్రత్త పెట్టిన గుమ్మడి గింజలని కచికల బూడిద లో కలపండి, దీనిని పొలపడం అంటాం. గుమ్మడి గింజలమీదున్న జిగురుకు ఈ బూడిద అంటుకుపోతుంది. కొద్ది సేపు అలా వదిలేయండి. ఆ తరవాత గింజలు తీసుకుని ఒలుచుకు తినచ్చు. కమ్మహా ఉంటాయి. ఇలా ఒలుచుకు తినేప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. గుమ్మడి గింజ ఒలచిన తరవాత ఒక పొర ఉంటుంది, పచ్చగా. ఆ పొరను చేత్తో తీసేసి మాత్రం తినాలి, తెల్లగా ఉన్నది. చిన్న తనంలో గుమ్మడి గింజలు జేబులో పోసుకుని ఒలుచుకుంటూ తింటూ బడికి పోవడం ఒక అనుభూతే! ఇలా ఒలిచిన గింజలను ముదురు బెల్లపు పాకంలో వేసుకుని అచ్చు చేసుకుని నిలవ చేసుకోవచ్చు, బాగుంటుంది.మంచి చిరుతిండే కాక గొప్ప ఔషధం కూడా. స్త్రీ, పురుషుల పునరుత్పత్తి అవయవాలకి మందుగా ఉపయోగిస్తుంది, అందునా ముఖ్యంగా పురుషులకు ఉపయోగపడేదే…

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గుమ్మడి గింజలతో………

 1. అహ ఎంత కమ్మహ ఉందో…లేని పోని విషయాలు ఇలా చెప్పకండి…ఎక్కడో నిద్రపోతున్న ఆత్మారాముణ్ని లేపారూ..హిప్పుడీ ingredients ఎక్కడ దొరుకుతాయో ఏంటో

  • Yallapragada hyma kumarగారు,
   గుమ్మడి కాయలు బాగానే దొరుకుతాయనుకుంటానండి! ఈ సంవత్సరమే మాకు కాపు తగ్గింది. బంకమట్టీ దొరుకుతుంది,చాకు సరే 🙂 ఇక నెగడు కదా ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఫైర్ ప్లేస్ లు కడుతున్నారు, చలికాలం ఇల్లు వెచ్చగా ఉంచుకునేందుకు, అందులో పెట్టేసుకోవచ్చు. మనసుంటే మార్గం లేదా చెప్పండి 🙂
   కుదరకపోతే మా వూరొచ్చెయ్యండి తయారు చేసి పెడతాం, ముందు చెప్పండేం
   ధన్యవాదాలు.

 2. శ్రీ శర్మగారికి, నమస్కారములు.
  ఎప్పుడూ వినని విషయాన్ని మీద్వారా విన్నాను. బాగుంది. ఇక ఎండిన గుమ్మడి గింజలను (పొట్టు తీసిన) వక్కపొడిలో వేసుకోవచ్చును; కూరల్లోనూ వేసుకోవచ్చును.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • మిత్రులు మాధవరావుగారు,
   ఒలిచిన గుమ్మడి గింజలు కూరల్లో వేసుకోవచ్చు కాని ఎందుకో వేయరు. వేసుకోడం మంచిదే. ఇక వక్కపొడిలో చారపప్పు అని దానిని వేస్తారు, బాగుంటుంది కూడా. గుమ్మడిగింజలూ మంచివే. చార పప్పు, గుమ్మడి గింజలు పురుష హార్మోనల్ను ఉత్పత్తి చేయడమో ప్రేరేపించడమో చేస్తాయన్నారు.
   నేను చెప్పినది కొద్ది ప్రాంతానికి పరిమితమేమో చెప్పలేను.
   ధన్యవాదాలు.

 3. మీరు పరహిత వైద్యులే నిజ్జం గా !

  Wish you had got those things from your previous generation ! Long before I remember reading you mentioned about how the tradition continued … Now doing great job through these articles
  Wisdom through wordpress!

  cheers

  zilebi

  (నల్ల మట్టి, బూడిద, చలికి వేసే నెగడు, పోలపడం వగైరా ‘వీరంతా’ ఎవరు ! వివరించుడీ జేకే !)

  • జిలేబిగారు,
   పనిలేని మంగలి పిల్లి తల గొరిగాదని సామెత. ఊరు బలాదూరు తిరిగి రెండు మెతుకులు తిని పడుకుని లేచి ”మా చిన్నప్పుడూ అని మొదలెట్టి ప్రజల్ని చంపుకు తినకపోతే ఏమయ్యింది?” అని కూడా అంటున్నారు, మీరే మో పరహితమంటున్నారు. అంతా దైవలీల.
   నల్లమట్టి= బ్లమైన మట్టి అనగా సూర్య రశ్మి బాగా సోకినది, పొలం మట్టి.
   బూడిద= పిడకలు కాల్చగా వచ్చినవాటిని కచికి అంటారు. వాటిని నలిపితే వచ్చేదే బూడిద.
   నెగడు= చలికోసం పల్లెలలో గ్రామం మధ్య కర్రలతో వేసే మంట.
   పొలపడం= ఒక వస్తువును మరఒకదానితో పూర్తిగా కలిసేలా కలపడం
   ధన్యవాదాలు.

   • నల్లమట్టి, బూడిద, నెగడు గురించి ఆవిడ అడగటం, నిజమే కాబోలనుకుని మీరు వివరించడం, ఎంత అమాయకులండీ శర్మ గారూ 🙂 జిలేబీ గారికి నిజంగా తెలియకనా? ఆవిడ అలా చమత్కారాలు చేస్తుంటారు అని తెలిసిన విషయమే కదా 🙂

  • మిత్రులు నరసింహారావు గారు,
   చిన్నపుడే అమ్మ బుర్రలేని వాణ్ణని చెప్పింది, ఈ అమ్మ మరో సారి ఋజువు చేశారంతే. ఎంతయినా పల్లెటూరివాళ్ళం కదండీ 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s