శర్మ కాలక్షేపంకబుర్లు-కర్తరి?-కార్మిక సంక్షేమం.

కర్తరి?-కార్మిక సంక్షేమం.

వేసవి వచ్చేసింది.కర్తరి, కత్తిరి అంటారు, ఏవో పనులూ చెయ్యద్దు,అన్నారుష అంతా ఛాదస్తం …….

మనకు 27 నక్షత్రాలు, పన్నెండు రాశులు తెలుసు! ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు.అంటే మొత్తం 27 X 4=108 పాదాలు. 12 రాసులతో భాగిస్తే ఒక్కోరాశికి 9 పాదాలొస్తాయి, ఇప్పుడు వాటిని సమానంగా అన్ని రాశులలో పంచగలం! రాశులలో మొదటి రాశి మేషం, సాధారణం గా ఒక రోజు తేడాలో ఏప్రిల్ 14 వ తేదీని సూర్యుడు ఈ రాశిలో ప్రవేశిస్తాడు. దీనినే సూర్య సంక్రమణం అంటాం. ఇది సంవత్సరారంభం కొందరికి, ఉదాహరణ తమిల్ వారికి ఇది నూతన సంవత్సరారంభం. సూర్యుడు భరణి నక్షత్రంలో 3,4 పాదాలలో ఉన్నపుడు డొల్లు కర్తరి అని, ఆ తరవాత కృత్తిక నక్షత్రం లో ఉండగా అగ్ని కర్తరి అని అంటాం. వీటినే చిన్న కత్తిరి, పెద్ద కత్తిరి అని కూడా అంటాం.

సూర్యుడు ఒక రాశిలో 30 రోజులుంటాడు, ప్రతిరాశి ప్రవేశాన్ని సంక్రమణం అంటారు. రాశికి నక్షత్ర పాదాలు 9, అంటే ఒక్కో నక్షత్ర పాదంలో సుమారుగా 3 రోజుల 8 గంటలుంటాడు, సుమారుగా. భరణి మూడు నాలుగు పాదాలకి ఎప్పటికొస్తాడు? ఏప్రిల్ 14 న అశ్వినిలోకి వస్తాడు కదా. నాలుగు పాదాలూ నడచేటప్పటికి 13 రోజులవుతుంది అనగా ఏప్రిల్ 27 అవుతుంది. ఆ తరవాత భరణిలో ప్రవేశం రెండు పాదాలు నడచేటప్పటికి దగ్గరగా 7 రోజులు గడుస్తాయి అంటే మే 4 వ తారీకు నాటికి డొల్లు కర్తిరిలేదా చిన్న కర్తిరి ప్రారంభం అవుతుంది.అది మే 11 నాటికి ముగుస్తుంది. ఆ తరవాత కృత్తిక నాలుగు పాదాలులో అగ్నిలేకపెద్ద కత్తిరి నడచేటప్పటికి మే 24,25 తారీకులొచ్చేస్తాయి. అదిగో అప్పుడు రోహిణీ కార్తె ప్రాంభమవుతుంది. సాధారణం గా ఒక రోజు ఇటు అటు తేడాలో ఈ కార్తెలు ఈ తారీకులకే వస్తాయి, ఎప్పుడూ.

కర్తరి అంటే కర్త+అరి=కర్తరి అనగా పని చేసేవానికి శత్రువు అని అర్ధం.పని చేసేవానికి శత్రువేంటీ? పని చేసేవానికి శత్రు కాలం. చిన్న కర్తిరి మే 4,5 తారీకుల్లో ప్రారంభం, ఈ సమయంలో పెద్దగా ఇబ్బంది లేదన్నారు, అప్పటికి ఎండలుంటాయిగాని జాగరతలు తీసుకుని పని చేసుకోవచ్చు. ఆ తరవాత పెద్ద కత్తిరి లేదా అగ్ని కర్తిరి అన్నది సుమారుగా మే 11,12 తారీకుల్లో వస్తుంది. అప్పటికి ఎండలు బాగా ముదురుతాయి. ఈ సమయంలో ఏ పనులు చెయ్యద్దన్నారు? చెట్లు నరకద్దు,వ్యవసాయ పనులు ప్రారంభం,నూతులు,బావులు,చెరువులు తవ్వడంమొదలైన పనులు చేయద్దన్నారు. చాదస్తులు కదా! అప్పటికి ఎండ మండుతో ఉంటుంది, వద్దన్న పనులన్నీ ఎండనపడి చేయవలసినవే, అలా ఎండనపడి పని చేయడం మూలంగా పని చేసేవారు శరీరంలో నీటి శాతం తగ్గి మరణించే, లేదా ప్రమాదం కలిగే సావకాశాలున్నాయి, అందుకు కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని పెద్ద కర్తిరిలో ఈ పనులు చేయద్దన్నారు తప్పించి ఛాదస్తం కాదు, ఇది నిజానికి మన పెద్దలు ఏర్పాటు చేసిన కార్మిక సంక్షేమం. ఈ తరవాత మే 25 నాటికి రోహిణీ కార్తె వచ్చేస్తుంది, ఉదయమే 7 గంటలకే సూర్యుడు రయ్ మని వచ్చేస్తాడు, భరించలేని వేడి ఉంటుంది. అందుకు ఈ పదిహేను రోజులూ కూడా పై చెప్పిన పనులు వద్దన్నారు, అందుకే చేయరు. మరో సంగతి పెళ్ళిళ్ళు, గర్భాదానాలు,గృహ ప్రవేశాలు చేసుకోవచ్చన్నారు.

స్వతంత్రం వచ్చి అరవై ఏళ్ళు దాటిన తరవాత కూడా నేటికీ ప్రభుత్వాలు మంచినీళ్ళివ్వలేకపోతున్నాయి, పట్నాలలోనూ పల్లెలలోనూ కూడా, ఎండాకాలం. తాగు నీటిని వ్యాపారం చేసేస్తున్నారు, సొమ్ము సంపాదించుకుంటున్నారు.నాటి రోజుల్లో మంచినీటి వనరు ఏర్పాటు చెయ్యడం పుణ్యం అన్నారు,వేసవిలో చలివేంద్రాలూ వేసి మంచినీరు ఇచ్చేవారు, ఉచితంగా. ఇప్పుడు మంచినీళ్ళు అమ్ముకోడం లాభసాటి వ్యాపారం. ప్రభుత్వాలు వీరినే పెంచి పోషిస్తున్నాయి.

DSCN2955

Courtesy:http://sreeslifeinpictures.blogspot.in/2012/04/wk16dy1106-april-15-taabeti-kaaya.html

పాతరోజుల్లో తాబేటి కాయలని నాలుగైదు లీటర్ల నీరుపట్టేవి మట్టితో చేసినవి ఉండేవి. ఇప్పుడు ఎక్కడా కనపట్టం లేదు. తాబేటి కాయలు నిజంగా తాబేలులాగే ఉంటుంది. పీకి సన్నంగా ఉంటుంది, దానికోతాడు కట్టి, నిండా నీళ్ళుపోసుకుని, మూతికి బిరడాగా కఱ్ఱముక్కపెట్టుకుని, చేపాటి కఱ్ఱ చివర తగిలించుకుని భుజాన కఱ్ఱ వేసుకుని చులాగ్గా నడచేవారు. ఇలా భుజాన కఱ్ఱ వేసుకోడం లో మూడవ తులాదండ సూత్రం మనవారు జీవితంలోకి తెచ్చుకున్నారు. మనవాళ్ళకి సయిన్స్ తెలుసా? తెలియదా? ఇప్పుడు మూడవ తులాదండ సూత్రం ఎవరికేనా గుర్తుందా, చెప్పండి? వాడుకుంటున్నారా? ఈ తాబేటి కాయలో నీళ్ళూ చల్లగా ఉండేవి, రైతు రోజంతా వాడుకునేవాడు, వేసవిలో కూడా. ఇప్పుడు ప్లాస్టిక్ సీసాలో మంచినీళ్ళు పట్టికెళ్తే అవి కాస్తా వేడెక్కిపోయి తాగడానికి పనికిరాని పనయిపోయింది. ఈ రోజునాటికి కూడా చాలా సంస్థలు పనిచేసేచోట మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేయటం లేదంటే అబద్ధం కాదు. మరో చిత్రం, బాగా చల్లటినీటిని అనగా ఫ్రిజ్ లో పెట్టిన నీటిని తాగితే ఈ వేసవిలో చాలా ప్రమాదం చేస్తుంది. ఫ్రిజ్ లో నీళ్ళు తాగద్దు, రోగం కొని తెచ్చుకోవద్దు.

మనవాళ్ళుట్టి పిచ్చాళ్ళు, ప్రకృతితో సహజీవనం చేస్తూ,సుఖంగా బతకడమెలాగో కనుగొన్నారు……

 

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కర్తరి?-కార్మిక సంక్షేమం.

 1. అప్పటివాళ్ళకి తెల్సింది ప్రకృతి సహజమైన సైన్సు, ఇప్పటివాళ్ళకి తెలిసింది, వ్యవస్థ నేర్పేది – బిజినెస్ సైన్సు.
  కుండలు, కూజాల ఫొటోచూస్తుంటే చల్లటి నీళ్ళతో నిజంగా సేదతీరడం, చిన్నప్పటి వేసవులు, పరీక్షలు, సెలవులు .. గుర్తొచ్చి … ప్చ్ 😦

  • సయిన్సో, సయిన్సో అని అరుస్తున్నవారు వీటిని ఎందుకు ఉపయోగించటం లేదో తెలియదు, చిత్రం కదండి, వీటిని పని కట్టుకుని పాడు చేసేదాకా నిద్రపోటం లేదు. నాటివారు సయిన్స్ జీవితానికి ఉపయోగించుకున్నారు, నేటివారు సయిన్స్ పేరు చెప్పి నెత్తిన దుమ్ముపోసుకుంటున్నారు.
   ధన్యవాదాలు.

 2. >>> చేస్తుంది. ఫ్రిజ్ లో నీళ్ళు తాగద్దు, రోగం కొని తెచ్చుకోవద్దు. ….

  హన్నా ! ఎంత మాట ఎంత మాట ! మా బిజినెస్సులు ఏమి కాను ! ఈ శర్మ గారి మీద కేసు బనాయించుడీ !!

  బాగు బాగు కర్తరి ‘కర్ట్’ హరి !!

  జిలేబి

  • రమణాజీ,
   మనవాళ్ళు సుఖంగా బతికేందుకు మార్గాలు కనుక్కున్నారు, మనం వాటిని పని కట్టుకుని నాశనం చేసుకుంటున్నాం.
   ధన్యవాదాలు.

 3. Sarma gaaru,

  Not related to this post. But useful information. Please go through it.
  ______________________________________

  How To Gift Your Domestic Help A Pension Plan As Easily As Shopping Online

  Gftapension.com is an online platform launched by Delhi-based non-profit Micro Pension Foundation, which enables domestic workers—cooks, maids, drivers and nannies—plan for their lives after 60. Ideally, the role of the employer is to just enrol, which has a one time convenience fee of Rs300.

  The employee can make monthly contributions through the Micro Pension prepaid card provided in the welcome kit, or use their bank accounts, if they have active accounts that they are willing to use.

  “There are 40 million domestic help in India. We can change the life of one million this weekend. All we have to do is decide to change the life of that one person.” said Parul Seth Khanna, program director at Micro Pension Foundation.
  The non-profit is promoted by Invest India Micro Pension Services Pvt Ltd, whose focus is on creating pension plans for informal sector workers, comprising 94 percent of India’s 487 million workforce.

  http://www.huffingtonpost.in/2015/02/05/giftapension-to-domestic-help_n_6620734.html?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s