శర్మ కాలక్షేపంకబుర్లు-”నేను” ఎవరు?

”నేను” ఎవరు?

భారతీయులందరిలోనూ ఎంతో కొంత పరతత్వ వివేచన ఉంటుంది,చదువుకోకపోయినా. నాలాటి సామాన్యుని కి ”నేనెవరు?” అన్న ప్రశ్నకి సమాధాన ప్రయత్నమే ఇది…

“ఎవరదీ?” తలుపు కొడితే వచ్చే ప్రశ్న, లోపలి నుండి.
“నేనే” అని, సమాధానం.
“నేనంటే?” ప్రశ్న వేస్తారు, మరలా లోపలనుంచి.
అప్పుడు నేనూ “శర్మని”, ఇది సాధారణ సంభాషణ.
”నేనెవరు?” మనం, మనలోపలనుంచి వేసుకోవలసిన ప్రశ్న,
శరీరభాగాలా?
న+ఇతి=నేతి=ఇది కాదు, ఇది కాదు అని చెప్పుకుంటూ పోతే ఈ శరీరం నేను కాదని తేలిపోయింది.
ఐతే ”మనసే” ”నేనా?”
మెలకువలో మనసుంది,కలలో మనసుంది, సుషుప్తిలోనూ మనసుంది. తెలిసి కొంత, తెలియక కొంత అజ్ఞానంలో పడిపోయి, ఈ శరీరమే నేను అనుకుంటున్నా. కాని మనసు సంకల్ప వికల్పాలలో కొట్టుకుంటూంది. ఈ శరీరం దానితోపాటు ఈ మనసూ నశిస్తోంది. నశించిపోయేది నేనెలా అవుతాను? అసలు నశింపులేని దొకటుంది కదా! అదే ఆత్మ. ఈ శరీరం వదలి మరో శరీరం తీసుకుంటుంది కాని నశించదు కదా!, అందుచేత నశించే మనసూ నేను కాదు.
”ఆత్మ” అదెక్కడుంది? ఎలా ఉంది?
ఈ శరీరం నేను కానపుడు నేను ఈ శరిరం కంటే వేరుగా ఉన్నాను, ఎక్కడున్నాను?
ఈ శరీరంలోనే ఉన్నాను.
శరీరం లో ఉన్నాను,ఎక్కడ? ఎలా ఉన్నాను.

HYNN ON LORD NARAYANA
 (TRANSLATION BY SRI SWAMI KRISHNANANDA)
सहस्र शीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवम् ।
विश्वै नारायणं देवं अक्षरं परमं पदम् ॥

 This universe is the Eternal Being (Narayana), the imperishable,
the supreme, the goal, multi-headed and multi-eyed (i.e.,omnipresent
and omniscient), the resplendent, the source of delight for the whole universe. 
विश्वतः परमान्नित्यं विश्वं नारायणं हरिम् ।
विश्वं एव इदं पुरुषः तद्विश्वं उपजीवति ॥

 This universe is the Supreme Being (Purusha) alone; hence it subsists
on That, the Eternal which transcends it (in every way), -the omnipresent
Absolute which destroys all sins. 
पतिं विश्वस्य आत्मा ईश्वरं शाश्वतं शिवमच्युतम् ।
नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् ॥

 The protector of the universe, the Lord of all Souls (or Lord over Self), the
perpetual, the auspicious, the indestructible, the Goal of all creation, the
Supreme object worthy of being known, the Soul of all beings, the Refuge
unfailing (is He). 
नारायण परो ज्योतिरात्मा नारायणः परः ।
नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः ।
नारायण परो ध्याता ध्यानं नारायणः परः ॥

 The Lord Narayana is the Supreme Absolute; Narayana is
 the Supreme Reality; Narayana is the Supreme Light; Narayana
is the Supreme Self; Narayana is the Supreme Meditator; Narayana
is the Supreme Meditation. 
यच्च किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयतेऽपि वा ।
अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणः स्थितः ॥

 Whatever all this universe is, -seen or heard of, -pervading all this from
inside and outside alike, stands supreme the Eternal Divine Being (Narayana). 
अनन्तं अव्ययं कविं समुद्रेन्तं विश्वशम्भुवम् ।
पद्म कोश प्रतीकाशं हृदयं च अपि अधोमुखम् ॥

 He is the Limitless, Imperishable, Omniscient, residing in the ocean
of he heart, the Cause of the happiness of the universe, the Supreme end
of all striving, (manifesting Himself) in the ether of the heart which is
comparable to an inverted bud of the lotus flower. 
अधो निष्ठ्या वितस्त्यान्ते नाभ्याम् उपरि तिष्ठति ।
ज्वालामालाकुलं भाती विश्वस्यायतनं महत् ॥

 Below the Adams apple, at a distance of a span, and above the navel
(i.e., the heart which is the relative seat of the manifestation of Pure
Consciousness in the human being), effulges the Great Abode of the universe,
as if adorned with garlands of flames. 
सन्ततं शिलाभिस्तु लम्बत्या कोशसन्निभम् ।
तस्यान्ते सुषिरं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् ॥

 Surrounded on all sides by nerve-currents (or arteries), suspends
the lotus-bud of the heart in an inverted position. It is in a subtle space
(a narrow aperture, the Sushumna-Nadi), and therein is to be found the
Substratum of all things. 
तस्य मध्ये महानग्निः विश्वार्चिः विश्वतो मुखः ।
सोऽग्रविभजन्तिष्ठन् आहारं अजरः कविः ॥

 In that space within the heart resides the Great Flaming Fire,
undecaying, all-knowing, with tongues spread out in all directions,
with faces turned everywhere, consuming food presented before it,
and assimilating it unto itself. 
तिर्यगूर्ध्वमधश्शायी रश्मयः तस्य सन्तता ।
सन्तापयति स्वं देहमापादतलमास्तकः ।
तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थिताः ॥

 His rays, spreading all around, side ways as well as above and below,
warm up the whole body from head to foot. In the center of That (Flame)
abides the Tongue of Fire as the topmost of all subtle things.
(Note: Due to the attachments and entanglements of the Jiva in worldly
enjoyment and suffering, the Consciousness is enshrouded in potential
as well as expressed objectivity, and hence it appears like a tiny streak
of flame within the dark clouds of ignorance. But when the Jiva rises above
worldliness the Consciousness is realised as he Infinite.) 
नीलतोयद-मध्यस्थ-द्विद्युल्लेखेव भास्वरा ।
नीवारशूकवत्तन्वी पीता भास्वत्यणूपमा ॥

 Brilliant like a streak of lightning set in the midst of the blue rain-bearing
clouds, slender like the awn of a paddy grain, yellow (like gold) in colour,
in subtlety comparable to the minute atom, (this Tongue of Fire) grows splendid. 
तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ।
स ब्रह्म स शिवः स हरिः स इन्द्रः सोऽक्षरः परमः स्वराट् ॥

 In the Middle of That Flame, the Supreme Self dwells. This (Self) is
Brahma (the Creator), Siva (the Destroyer), Hari (the Protector), Indra (the Ruler),
the Imperishable, the Absolute, the Autonomous Being. Prostrations again and
again to the Omni-Formed Being, the Truth, the Law, the Supreme Absolute,
the Purusha of blue-decked yellow hue, the Centralised-Force, Power, the All-Seeing One. 
ऋतं सत्यं परं ब्रह्म पुरुषं कृष्ण पिङ्गलम् ।
ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ॥

 Prostrations again and again to the Omni-Formed Being, the Truth, the Law,
the Supreme Absolute, the Purusha of blue-decked yellow hue, the Centralised-Force,
Power, the All-Seeing One. 
ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि ।
तन्नो विष्णुः प्रचोदयात् ॥

 We commune ourselves with Narayana, and meditate on Vasudeva,
may that Vishnu direct us (to the Great Goal). 
ॐ शान्ति शान्ति शान्तिः ॥

 Om. May there be Peace, Peace, Peace 
(Edited by: अलकनन्दा)

Courtesy:http://sanskritdocuments.org/doc_vishhnu/narayana-sukta.html?lang=sa

అక్కడ పరమాత్మ ఉన్నాడని చెబుతోంటే..
అయ్యో! ఆ పరమాత్మే ”నేను”, నేనే పరమాత్మ సుమా!
అదెలా?
ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగిస్తే?
రెండు దీపాలు అదీ తెలీదా?
దీపాలు రెండే కాని వానిలో జ్యోతి ఒకటే కదా!
అదెలా?
బంగారపు వస్తువులని చూసి ఏమంటున్నావు, గాజులు, కంటె, కాసులపేరు వగైరా పేర్లతో చెబుతున్నావు కాని అందులో ఉన్నదేమి?
బంగారం,
అన్ని వస్తువులలోనూ ఉన్న బంగారంలాగే పరమాత్మా అందరిలోనూ అలాగే ఉన్నాడు. నీనుంచి మరొకరు పుడుతున్నారు కదా! వారెవరు?
నా ప్రతిరూపం, నీవే నీప్రతిరూపంగా చెబుతున్నపుడు, నీవు పరమాత్మ ప్రతిరూపంకాదా? నేను పరమాత్మ ఒకటే.
ఉన్నాడని నమ్మకమేమి?
గాలి ఉందా?
ఉంది.
ఎలా తెలిసింది?
అనుభవిస్తున్నాము, శ్వాసిస్తున్నాము కనక.
అలాగే పరమాత్మా నీలో ఉన్నాడు.
కనబడలేదే?
ఎక్కడున్నాడో చెప్పేరు కదా! సామాన్య మాంస నేత్రానికి కనబడడు, ఉన్నాడనడానికి నీలోని చైతన్యమే సాక్షి.
ఆ చైతన్యమే నేనా?
చైతన్యం నువ్వెలా అవుతావు? చైతన్యం నీవు అనేదాని యొక్క ఒక అంగం….
ఇంతకీ నేనెవరు?
అహం బ్రహ్మస్మి….

నేను చదువుకున్నవాడిని కాను, ఇదంతా శ్రుతపాండిత్యమే, తప్పులుంటే మన్నించి సరిచేయకోర్తాను.వేదాంతం తెలుసుకోగోరునపుడు ప్రత్యక్ష ప్రమాణాన్ని కొంత కాలం అనుసరించాలి, ఆ తరవాతే పరోక్ష, అనుమాన ప్రమాణాలు చూడాలి తప్పించి, ముందే వాటిని చెబితే వేదాంతం అంతా తలతిక్క, అబద్దం ఆనుకునే ప్రమాదం ఉంది.అందుకే గురు ముఖతః తెలుసుకోవాలి, ఒక అభిప్రాయానికి రావాలన్నదే నా ఊహ.

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-”నేను” ఎవరు?

  • YAMA SHEKHER గారు,
   విషయమా చాలా పెద్దది, పరిజ్ఞానమా పరిమితం, చోటూ పరిమితమే, గురుముఖతః నేర్చుకోవలసినదే! మరికొంత చెప్పడానికి ప్రయత్నం చేసాను. ఇప్పటికే చాలా విషయాలను క్లుప్తీకరించాను, వాటిలో కొంత వివరించడానికి ప్రయత్నిస్తాను,
   ధన్యవాదాలు.

  • శ్యామలీయం వారు,
   చూశాను, మీ టపాలలో బాగుంది అనడం తప్పించి మరో మాట అనడానికి ఉండదు, అదీ ఇబ్బంది. విషయాన్ని చిన్నగా చెప్పేరుకదూ
   ధన్యవాదాలు.

 1. మీరెవరో టపా పైనే చెప్పుకున్నారు కదండి.
  ఇన్ని చక్కటి కబుర్లు చెప్తున్నారు. ఇంకా చదువుకోలేదంటారేమిటండి? డిగ్రీలతో ఉద్యోగాలకి అర్హత మాత్రమే వస్తుంది కాని విద్య రాదు.
  శృత పాండిత్యం అంటే వివరిస్తారా?

 2. నారాయణ సూక్తం మీద పడ్డారూ !

  ఇంతకీ వితస్త్యాన్తే అంటే ఏమిటండి ??

  (సూక్తం లో అప్పుతచ్చులు సరి జేయ గలరు ! మీ టపా కి ఇన్ని అప్పు తచ్చులు ఒప్పుకోము ! )

  జిలేబి

  • జిలేబిగారు,
   తప్పులు వచ్చేయి, మన్నించాలి, అందుకే నారాయణసూక్తం మార్చేశాను, తరవాత శుద్ధప్రతి తెనుగులో దొరికింది, మరలా మార్చడం ఇష్టం లేక మార్చలేదు. వితస్త్యాన్తే అంటే Adam’s apple అని మీరే ఒకప్పుడు చెప్పేరు.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s