శర్మ కాలక్షేపంకబుర్లు-భోజనం దేహి రాజేంద్రా

భోజనం దేహి రాజేంద్రా

దరిద్రుడు తలగడిగితే వడగళ్ళవానెదురొచ్చిందనీ, దరిద్రుడు ఏ రేవుకెళ్ళినా ముళ్ళపరిగే పడిందనీ,అదృష్టం లేకపోతే అంట వలసినది అంటదు, ముట్టవలసినదీ ముట్టదు అని , అదృష్టం లేకపోతే ఆముదం రాసుకుదొల్లినా బూడిద కూడా అంటుకోదనీ సామెతలున్నాయి. వీటి విశేషం చూదాం , ఒక చిన్న కథ చెప్పుకుందాం…

భోజరాజు, కాళిదాసు ఒకరోజు సాయంత్రం వాహ్యాళిలో కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుండగా, ఒక బిచ్చగాడు దూరంగా నడచిపోతున్నాడు. అది చూచిన భోజరాజు ”మహాకవీ! నేను తలచుకుంటే ఆ బిచ్చగాడిని ధనవంతుడిని చెయ్యగలను” అన్నారు. దానికి కాళిదాసు “మహరాజా! అది మీవల్లకాని పని సుమా” అనేటప్పటికి భోజరాజుకి కోపం వచ్చింది, ఇద్దరూ వారి వారి మాటలకి కట్టుబడిపోయారు, ఇద్దరికి పంతం వచ్చేసింది, సాయంత్రమయింది, ఎవరి గూటికి వారు చేరుకున్నారు.

తెల్లారింది, కాళిదాసుగారు రాలేదు, భోజరాజుకి, ఏమయిందీ తెలియలేదు, కాళిదాసు ఇంటికి కబురు చేస్తే ’లేర’ని వార్తొచ్చింది. భోజరాజుకి తోచడం మానేసింది, కాళిదాసులేక, మరి అంతటి ఆప్త మిత్రులు కనక. రోజులు గడుస్తున్నాయి, కాళిదాసు జాడలేదు, భోజరాజు వెతికించటం మానలేదు,తపన పెరిగిపోయింది, కాళిదాసు కనపడలేదు, భోజరాజుకి చింత పట్టుకుంది.

ఇదిలా ఉండగా, కాళిదాసు నగరు విడచి రాజ్యంలోని పల్లెలలో తిరుగుతూ, ఒక రోజు ఒక బ్రాహ్మణుని ఇంటి పంచకు చేరారు, మధ్యాహ్నమయింది, గుమ్మంలో కాళిదాసును చూచిన ఆ ఇంటి ఇల్లాలు, కాళిదాసును సగౌరవంగా ఆహ్వానించి అతిధి సేవలు చేసి, తమగురించి చెబుతూ ”ఇదొక యాయవారపు బ్రాహ్మణుని ఇల్లు, నేనాయన ధర్మపత్నిని, ఇంటి యజమాని యాయవారానికి వెళ్ళేరు, వచ్చే వేళయింది,” తమ ఆతిధ్యం స్వీకరించమనీ కాళిదాసును వేడుకుంది. ఈలోగా యాయవారం బ్రాహ్మడు రానే వచ్చాడు, భార్య చెప్పిన మాటా విన్నాడు, కాళిదాసుకు ఆతిథ్యం ఇచ్చారు, భోజనాల తరవాత మాటలలో బ్రాహ్మడిని ఏమి చదువుకున్నావని అడిగేరు కాళిదాసు. తన శ్రుత పాండిత్యమే చెప్పేడు బ్రాహ్మడు. సరే ఒక శ్లోకం రాసి భోజరాజు దగ్గరకి పట్టుకుపోతే రాజు సన్మానం చేస్తారని దరిద్రం తీరుతుందని చెప్పేరు, కాళిదాసు. అప్పుడు ఆ బ్రాహ్మడు ఇదిగో ఇలా

భోజనం దేహి రాజేంద్రా ఘృతసూప సమన్వితం
( మహరాజా! పప్పూ,నేతితో అన్నంపెట్టించవయ్యా!)

అని రాసి ఊరుకున్నారు, ఇక ముందేం రాయాలో తోచలేదు. కాళిదాసూ మాటాడలేదు, రాత్రికి బస ఇచ్చారు కాళిదాసుకు, తెల్లవారింది శ్లోకమూ పూర్తి కాలేదు, అప్పుడు కాళిదాసు ఆ శ్లోకాన్ని ఇలా పూర్తి చేసి ఇచ్చి భోజరాజు దగ్గరకు వెళ్ళమని చెప్పి పంపించారు.

మాహిషంచ శరశ్చంద్ర చంద్రికా ధవళం దధి”
(శరత్కాలపు వెన్నెలలా తెల్లనైన గేదె పెరుగు కూడా సుమా)

అప్పుడు, బ్రాహ్మణుడా శ్లోకం తీసుకుని రాజువద్దకుపోయి శ్లోకం వినిపించాడు. అది విన్న భోజరాజు భ్రాహ్మణునికి భోజనం పెట్టించి, భోజనం తరవాత అడిగారు, ఆశ్లోకం లో రెండవపాదం ఎవరు పూర్తిచేశారని. అది విన్న బ్రాహ్మణుడు నిర్ఘాంతపోయి, తన ఇంటికి వచ్చిన ఒక బాటసారి దానిని పూరించినట్టు చెప్పేడు. అది విన్న భోజరాజు వెంఠనే అది కాళిదాసు పూరణగా గుర్తించి, బ్రాహ్మణునితో బయలు దేరి బ్రాహ్మణుని ఇంటికి చేరుకున్నారు. బ్రాహ్మణుని భార్య, ఆ ఆగంతకుడు అప్పుడే వెళిపోయాడంటే రాజు వెతకడానికి వెళుతూ, బ్రాహ్మణుని మరునాడు కొలువుకు రమ్మని చెప్పి, వెళ్ళి, కాళిదాసును వెతికిపట్టుకుని సగౌరవంగా నగరుకు తోడ్కొనిపోయారు.

మర్నాడు ఉదయమే బ్రాహ్మణుడు కొలువుకు చేరాడు. భోజరాజు ఆ బ్రాహ్మణునికి ఒక పెద్ద గుమ్మడికాయను ఇచ్చి పంపేరు. దానిని చూస్తూనే బ్రాహ్మణుడు నీరుగారిపోయాడు. రాజుగారిచ్చిన గుమ్మడికాయ కనక తప్పక చంకనపెట్టుకు బయలుదేరాడు, బ్రాహ్మణుడు, బరువుగా అనిపించి భుజానికి ఎత్తుకున్నాడు, ఎండ మాడుతోంది, చెమటలు కారుతున్నాయి,కాళ్ళూ మాడుతున్నాయి, గుమ్మడికాయ బరువే అనిపించింది, భుజాలనుంచి నెత్తికి ఎత్తుకుని నడుస్తున్నాడు. ఈ లోగా ఒక సెట్టిగారు కలిశారు, ఆయన బ్రాహ్మణుడు పడుతున్న అవస్థ చూసి అడిగాడు, బ్రాహ్మణుడు జరిగినది చెబితే, తనకు గుమ్మడికాయ ఇస్తే, ఒక వరహా ఇస్తానన్నాడు, సెట్టిగారు. బ్రహ్మణుడు అంగీకరించి గుమ్మడికాయను సెట్టిగారికిచ్చి, బరువు దిగినందుకు ఆనందించి, వరహాతో ఇల్లు చేరాడు. ఆశగా ఎదురు చూస్తున్న భార్య కళ్ళతోనే ప్రశ్నించింది, బ్రాహ్మణుడు జరిగినది చెబితే, తమకంతే ప్రాప్తం ఉందని సరిపెట్టుకుంది.

జరుగుతున్నదంతా చూసిన కాళిదాసు మనిషి, మొత్తం సమాచారం కాళిదాసుకు చేరవేశాడు.మరునాడు భోజరాజు తాను ఆ యాయవారపు బ్రాహ్మడిని ధనవంతుని చేశానని చెబుతారు. దానికి కాళిదాసు ”మీవల్ల కాలేదని” చెప్పేరు, ”అదెందుకు జరగదు, నేను,నిన్న ఆ బ్రాహ్మణుడికి ఒక గుమ్మడికాయనిండా బంగారం కూరి ఇచ్చాన”న్నారు. కాళిదాసు నవ్వి విషయం కనుక్కోమన్నారు.

బ్రాహ్మణునికి కబురెళ్ళింది, ఆయన వచ్చాడు, నిన్నను ఏమిజరిగినది చెప్పమన్నారు, మహరాజు. బ్రాహ్మణుడు జరిగినది చెప్పేడు.మహారాజు నిర్ఘాంతపోయాడు.  దైవానుగ్రహం లేకుంటే, ఏదీజరగదని అనుకుని, కాళిదాసు చెప్పినది నిజమని అంగీకరించారు. అమ్మ కృప ఇతని పట్ల నిన్న లేదు అందుకే మీరు బంగారంతో ఇచ్చినా గుమ్మడికాయను బరువనుకుని వరహాకి అమ్ముకున్నాడు, నిన్న అతనికి యోగం లేదు కనకనే మీరు అతనికి తిన్నగా సొమ్మివ్వక గుమ్మడికాయలో పెట్టి ఇచ్చారు, అని చెప్పేరు కాళిదాసు.ఈ రోజు ఇతని పట్ల అమ్మదయ ఉంది అని చెప్పడంతో బ్రాహ్మణునికి అక్షరలక్షలు బహుమానమిచ్చి పంపేరు, మహరాజు.

అందుకే శంకరులన్నారు మూకం కరోతి వాచాలం, పంగుం లంఘయతే గిరిం ( మూగవానికి మాటొస్తుంది, కుంటివాడు పర్వతం దాటేస్తాడూ అని.
అమ్మదయ ఇంతే ఉన్నట్టుంది…
శలవు.

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-భోజనం దేహి రాజేంద్రా

  1. శ్రీ శర్మగారికి, నమస్కారములు.

    చక్కటి విషయాల్ని తెలియచేశారు. ఏదీ మన చేతుల్లో లేదు, ఆ నిజం తెలుసుకుని చేసేది చేస్తే….- అక్షరాలా నిజం.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    • మిత్రులు మాధవరావుగారు,
      నిజంగా చాలా అస్వతంత్రులమండీ, ఏదీ మన చేతిలో లేదు, కాని మనమే చేయాలి, యోగం ఎలా ఉందో అలా చేసేలా విధి ప్రేరేపిస్తుంది. అది తెలియక కొట్టుకుంటాం.
      ధన్యవాదాలు.

  2. namaskaram!

    peddalu kabatti namaskaram, maa tatagaru kabatti ,
    kusalama?

    meere chepperukada praptam batti panulu ani..

    mari blog aapadam lanti alochana mee chetilo ledu

    enchakka mokkala madhya kurchuni arogyam punjukuni raseyyandi

    maa tatagari to ro ju kaburlu cheppukovali nenu blog lo

    mee veera abhimani manavaralu
    sreedevi

    పైన ఉన్న దాన్ని తెనుగులో రాస్తే!

    నమస్కారం!

    పెద్దలు కాబట్టి నమస్కారం, మా తాతగారు కాబట్టి ,
    కుశలమా?

    మీరే చెప్పేరుకదా ప్రాప్తం బట్టి పనులు అని..

    మరి బ్లొగ్ ఆపడంలాంటి అలోచన మీ చెతిలొ లెదు

    ఎంచక్క మొక్కల మధ్య కూర్చుని అరోగ్యం పుంజుకుని రాసెయ్యండి

    మా తాతగారి తో రోజు కబుర్లు చెప్పుకోవాలి నేను బ్లొగ్ లో

    మీ వీర అభిమాని మనవరాలు
    శ్రీదేవి

    • చిరంజీవి శ్రీదేవి,

      దీర్ఘాయుష్మాన్భవ

      వేసవికదా! వయసుతో కొన్ని ఇబ్బందులు, వేసవి ఇబ్బందులతో బాధలు పెరుగుతాయి, తప్పదు అనుభవించడమే, ఏదీ మన చేతులో లేదు, ఆ నిజం తెలుసుకుని చేసేది చేస్తే……

      నీ అభిమానానికి

      ధన్యవాదాలు.

      • Namaskaram Taragaaru,

        “Meeru chesedi cheste..” Annarukada

        Adi nakanti vallaki ila abhimanam panchadam!

        Enno yellyga chaduvutunnavila meeku rayaledu. Manasuloncheppesi urukodame..

        Kanii kalavalani, meeto , mamma gariro kaburlu cheppukovalani boldanta anukuntune untaanu.

        Meeku nenu chesi pettalani kuda. Nenu kuda bagane vanta cheyyagalanu.. Pata kalam, kottavi.. Anni

        Kavalante test cheyyandi:-))

        పైన ఉన్నదాన్ని తెనుగులో రాస్తే

        నమస్కారం తాతగారు,

        “మీరు చేసెది చెస్తె..” అన్నారుకదా

        అది నాలాంటి వాల్లకి ఇలా అభిమానం పంచడం!

        ఏన్నో ఏళ్ళుగా చదువుతున్నా ఇలా మీకు రాయలేదు. మనసులొ చెప్పేసి ఊరుకొడమె..

        కాని కలవాలని, మీతో , మామ్మ గారితో కబుర్లు చెప్పుకోవాలని బొల్డంత అనుకుంటునే ఉంటాను.

        మీకు నేను చేసి పెట్టాలని కూడ. నేను కూడ బాగానే వంట చెయ్యగలను.. పాత కాలం, కొత్తవి.. అన్ని

        కావాలంటె టెస్ట్ చెయ్యండి:-))

    • చిరంజీవి శ్రీదేవి,

      ఈ భూమి మీద ఏమూలనో ఉన్న నన్ను, అభిమానించినందుకు ధన్యవాదాలు.

      నువ్వు ఎక్కడ ఉన్నా, కుటుంబం,భర్త, పిల్లలతో ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో తులతూగాలని మా ఆకాంక్ష.

      మేము కోరేది మీ యోగక్షేమాలే, వాటి గురించిన వార్త కోసం ఎదురు చూస్తాం, కాని మడి మాన్యాలు కాదు. ”మిమ్మల్ని కలవాలునుకుంటున్నా”మన్న వారి జాబితా చాలా పెద్దదేనమ్మా! అలా అన్నవారు, ఆ తరవాత ఎలా ఉన్నది, కబురు కూడా చెప్పక ముఖం చాటేసిన వారెందరో! తొందరపడి ఆ జాబితాలో చేరిపోకూ! 🙂 మా కుటుంబాన్ని అభిమానించిన వారందరికి మా తరఫున ఎప్పుడూ ఆహ్వానమే. మేము కలిగినవారం కాకపోవచ్చు, చదువుకోని వాళ్ళం, పల్లెటూరి వాళ్ళం, కాని మనసు కలిగినవారమే సుమా!

      చిట్టితల్లీ! మాకేమీ చెయ్యద్దుగాని మేము పెట్టేది తిని వెళితే మా కడుపులో చల్లపోసినంత ఆనందం కదమ్మా!

      నీ అభిమానానికి మరొక మారు ధన్యవాదాలు. నీకు ఇదే మరోసారి ఆహ్వానం, కాకపోయినా తల్లీ తాతని చూడ్డానికి మనవరాలికి అనుమతికావాలా? 🙂

      ధన్యవాదాలు.

      • “మిధునం” కథ చదివాము. సినిమా చూసాము. ప్రత్యక్షంగా కూడ చూడాలని ఉంది. ఎప్పుడు వీలైతే అప్పుడు చెప్పాపెట్టకుండా వచ్చేస్తాము.

      • నమస్కారం తాతగారూ ,మామ్మ గారూ ,

        ఇలా తెలుగు లో రాయడం కోసం ఆలస్యం అయిన్ది. ఆఫీసు సిస్టం లో సెక్యూరిటీ వాళ్ళ
        కుదరదు ఇంట్లో సిస్టం వాడె టైం కాస్త ఇరుకు.

        మామ్మగారి అటుకులు చిట్కాలు చాల బాగున్నాయి ..

        మీ ఆసిస్సులకి చాల సంతోషించేను . అవే కోట్ల వరహాలు !
        మేము వాషింగ్టన్ à°¡à°¿ సి దగ్గర ఉంటాం . భర్త, ఒక బుజ్జిగాడు 🙂

        నేను జూన్ లో ఇండియా కి వస్తాను . మీరు ఎక్కడ ఉంటారో తెలియచేస్తే కలవడానికి
        ప్రయత్నిస్తాను. నేను హైదరాబాద్ కి వస్తాను .
        చెన్నై కూడా వెళ్తాను ..సంగీతమ్ కోసం ..
        మా ఇంట్లో సంగీతం, సాహిత్యం రెండు ఉపిరితిత్తులు .మా మాతామహులు నుంచి వచ్చిన
        వరం అది. బుజ్జి గాడు కూడా పడుతాడు, వయోలిన్ వాయిస్తాడు ..
        మీకు ఓపిక ఉన్నప్పుడు ఈ లింకులు చూడండి .

        చూసేక మీకు ఒంట్లో బాగులేకపోతే నన్ను క్షమించండి కానీ చూడక తప్పదు! తాతగారు
        కదా![?]

        చదువు, పల్లెటూరు ..ఇవన్నీ ఇంకెప్పుడు అనకండి .హన్నా !!

      • 2015-05-19 9:26 GMT-04:00 Sreedevi Dhawala :

        > నమస్కారం తాతగారూ ,మామ్మ గారూ ,
        >
        > ఇలా తెలుగు లో రాయడం కోసం ఆలస్యం అయిన్ది. ఆఫీసు సిస్టం లో సెక్యూరిటీ వాళ్ళ
        > కుదరదు ఇంట్లో సిస్టం వాడె టైం కాస్త ఇరుకు.
        >
        > మామ్మగారి అటుకులు చిట్కాలు చాల బాగున్నాయి ..
        >
        > మీ ఆసిస్సులకి చాల సంతోషించేను . అవే కోట్ల వరహాలు !
        > మేము వాషింగ్టన్ à°¡à°¿ సి దగ్గర ఉంటాం . భర్త, ఒక బుజ్జిగాడు 🙂
        >
        > నేను జూన్ లో ఇండియా కి వస్తాను . మీరు ఎక్కడ ఉంటారో తెలియచేస్తే కలవడానికి
        > ప్రయత్నిస్తాను. నేను హైదరాబాద్ కి వస్తాను .
        > చెన్నై కూడా వెళ్తాను ..సంగీతమ్ కోసం ..
        > మా ఇంట్లో సంగీతం, సాహిత్యం రెండు ఉపిరితిత్తులు .మా మాతామహులు నుంచి వచ్చిన
        > వరం అది. బుజ్జి గాడు కూడా పడుతాడు, వయోలిన్ వాయిస్తాడు ..
        > మీకు ఓపిక ఉన్నప్పుడు ఈ లింకులు చూడండి .
        >
        > చూసేక మీకు ఒంట్లో బాగులేకపోతే నన్ను క్షమించండి కానీ చూడక తప్పదు! తాతగారు
        > కదా![?]
        >
        > చదువు, పల్లెటూరు ..ఇవన్నీ ఇంకెప్పుడు అనకండి .హన్నా !!
        >
        >
        >
        >

      • చిరంజీవి శ్రీదేవి,
        పొద్దుటినుంచి నెట్ వస్తూపోతూ ఉన్నది, ఇప్పుడూ అదే పరిస్థితి, నిన్నటిదాకా తెంగ్లీష్ లో రాస్తే తెలుసుకోగలిగా! ఇప్పుడీ భాష అర్ధం కాలేదు 🙂
        ఇక మామూలుగానే కవిని కదా ఇక యు ట్యూబ్ లో ఏం వినగలను. 🙂
        ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s