శర్మ కాలక్షేపంకబుర్లు-కంద పెసరట్టు

కంద పెసరట్టు

కంద ఎరగనివారుండరని నా నమ్మకం. కందలో రెండు రకాలు. పాటి కంద, తియ్యకంద. ఈ పాటికంద అంటే దేశవాళీ కంద, ఇది దురద పుట్టిస్తుంది, ఉడికినా కూడా, ఇక తియ్య కంద మనకి మార్కెట్ లో దొరికేదే! కందని ముక్కలుగా చేసుకోవాలి, కందని ముక్కలుగా చేసేటప్పుడు పల్చని మజ్జిగలోకి తరుక్కుంటే బాగుంటుంది. ఉడకపెట్టాలి. మామూలుగా ఉడకపెడితే కంద ఉడకదు, ఇప్పుడు కుక్కర్లో అన్నీ ఉడుకుతున్నాయనుకోండి. సాధారణంగా కంద, పప్పు బాగా ఉడికిన నీళ్ళయితే మంచి నీళ్ళని అభిప్రాయం. ఇదివరకు కొత్త చోటికి ఇల్లు మారుతుంటే ఇంటివారు మా నూతి నీళ్ళకి కంద, పప్పు ఉడుకుతాయండీ అని చెప్పడం ఒక విశేషం కూడా. ఉడికిన కంద ముక్కల్ని ’ఎనుపు’కోవాలి. ఎనుపుకోవడం మాట కొత్తగా ఉందా? ఎనుపుకోవడమంటే మెత్తగా చేసుకోవడం. ఇప్పుడు ఈ ఉడికిన కందను రుబ్బి ఉంచుకున్న పెసర పిండిలో కలుపుకుని అట్టు వేసుకోడమే. అట్టుతో పాటు అల్లము, జీలకర్ర, పచ్చి మిర్చి, ఉల్లిపాయ యధావిధిగా వేసుకుంటే బాగుంటుంది.

అసలు పెసరట్లకి పిండి తయారు చేసుకోడానికి రెండు విధాలు. ఒకటి పచ్చి పెసలు రుబ్బుకోవడం. దీనిని కటికి పెసల పెసరట్లు అంటాం. ఇక రెండవది పెసలు నానబోసి కొద్దిగా మొలకవచ్చేదాకా ఉంచుకుని రుబ్బుకోవడం. ఏది ఇష్టమైనవారు అలా తయారు చేసుకోవచ్చు.

పెసరట్లు పల్చగా వేసుకోడం కొంతమందికి అలవాటు, కొంతమందికి దళసరిగా వేసుకోడం అలవాటు, ఎలాగైనా పెసరట్టు బాగుంటుంది. ఇలా వేసుకున్న పెసరట్లు చెల్లకపోతే మాత్రం పెసరట్ల కూర చేసుకుంటే బలే బాగుంటుంది. కూర చేసుకోడానికి వేసుకునే పెసరట్లు దళసరిగానే బాగుంటయి (ష)

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కంద పెసరట్టు

  • శిశిర గారు,
   మీ దర్శనమే మహా భాగ్యం. వర్డ్ ప్రెస్ బ్లాగులవాళ్ళమూ మంచివాళ్ళమేనండి…:)
   పాటికందకి దురద ఉంటుంది కదండీ అందుకు ఉడికిస్తాం, తియ్యకందకా బాధ లేదు కనక అలాగే వేసి కటికిపెసలే రుబ్బచ్చు.
   ధన్యవాదాలు.

   • శిశిర19 May 2015 at 14:59
    శిశిర గారు,
    మీ దర్శనమే మహా భాగ్యం. వర్డ్ ప్రెస్ బ్లాగులవాళ్ళమూ మంచివాళ్ళమేనండి…:)<<<<

    హహ్హహ్హ.. శర్మగారూ.. శిశిర ప్రక్కన ఆ గారు తీసేయండి ముందు. పెద్దవారు. దీవించాలి కానీ మన్నించకూడదు.
    నేను మీ బ్లాగుని రోజూ దర్శిస్తూనే ఉంటానండీ. వర్డ్‌ప్రెస్ బ్లాగులో కామెంట్ వ్రాయగలగడం నా శక్తికి మించిన పని. అందుకే మా బ్లాగ్‌స్పాట్‌లో దొరికారు కదా అని ఇక్కడ పలకరించా. 🙂

    ReplyDelete
    Replies

    sarma19 May 2015 at 20:06
    ఏంటో ఎలా మొదలెట్టాలో తెలీటం లేదు, ఇటువంటి పరిస్థితి ఇదివరలో కలగలేదు,

    చిరంజీవి శిశిర,

    మనపరిచయమే బహు తక్కువ కదా! అందుకు గారు అని సంబోధించాను. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలనేది నా అభిలాష, ఎప్పుడూ. ఆత్మీయులని సంబోధించడానికి ఇబ్బంది ఉండదు, మరి అంతటి ఆత్మీయత మనకిదివరలో లేకపోయింది 🙂
    ఇప్పుడు చెప్పడంతో ఆత్మీయత పెరిగింది:) చిరంజీవికి ఆశీర్వచనం, "దీర్ఘాయుశ్మాన్భవ"

    వర్డ్ ప్రెస్ బ్లాగుల్లో చాలామంది కామెంట్ రాయరు, ఎందుకోనాకు తెలుసు. అదొక వరమూ శాపమూ కూడా. అనవసరం కామెంట్లు రావు మాకు,అదే వరం, కాని మీలాటి ఆత్మీయులు కూడా మమ్మల్ని భయంగా చూడటం బాధనిపిస్తుంది, ఇది శాపం. నాకు నూట ఏభయి మంది కామెంట్ ఫాలోయర్స్ ఉన్నారు, ఏ ఒక్కరిని భయపెట్టలేదు సుమా 🙂 శిశిర కూడా భయపడక్కరలేదు.

    నా మనసు విప్పడానికి సావకాశం ఇచ్చినందుకు, మీ ఆత్మీయతకి

    ధన్యవాదాలు.

    Delete
    Reply

    శిశిర20 May 2015 at 14:47
    భయం కాదు శర్మ గారూ. 2009 లో అనుకుంటా బ్లాగుల్లోకి వచ్చాను. వచ్చిన కొత్తల్లో వర్డ్‌ప్రెస్ బ్లాగుల్లో ఒకటి రెండు కామెంట్లు రాశాను. ఆ శల్య పరీక్ష నచ్చలేదు. అంతే. అప్పటి నుండి బ్లాగర్ బ్లాగుల్లో తప్ప కామెంట్లు వ్రాయడం మానేశాను. మిమ్మల్ని బ్లాగర్ లో చూసి మాత్రం చాలా ఆనందించాను. అప్పుడప్పుడైనా మాట్లాడవచ్చని 🙂

    మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. నమస్సులు.

  • శిశిర గా…పొరపాటు చిరంజీవి శిశిర,

   “ఎవరో జ్వాలను రగిలించారు, మరియెవరో దానికి బలిఐనారు” ఒక అభ్యర్ధన, నాకోసం ఆ నిబంధన కొద్దిగా సడలించరాదా 🙂 ప్లీస్,ప్లీస్, ప్లీస్,
   “రండి రండి రండి దయచేయండి తమరిరాక మా కెంతో సంతోషం సుమండీ”
   వర్డ్ ప్రెస్ బ్లాగులూ కామెంట్లూ ఆగ్రిగేటర్లలో కనపడక బ్లాగ్ స్పాట్ ని కూడా ఆశ్రయించా, వర్డ్ ప్రెస్ లో రాయడమంటేనే మక్కువ మరి.. “అర్ధం చేసుకోరూ…”(భాను ప్రియ)
   ధన్యవాదాలు.

  • తాడిగడప శ్యామలరావుగారు
   నిజమేస్మీ! దీనికి తోడు జీడిపప్పు ఉప్మా సరిజోడీ.
   ధన్యవాదాలు.

 1. ఏవిటో శర్మ గారూ ఇంకా “ఎనపటం” అనే పదాన్నే వాడుతున్నారు మీరు 🙂 తెలుగు టీవీ ఛానెళ్ళ భాషలో (తెలుగింగ్లీషే లెండి) ఉడికిన దుంపముక్కల్ని “స్మాష్” చెయ్యాలిట (మాష్ mash కి వచ్చిన తిప్పలు) 🙂

  టీవీ వాళ్ళ పరిభాషలో ఇంకోటుందండి. అదే “దగ్గరపడటం”. ఉడకబెడుతున్న పదార్ధాన్ని “దగ్గరపడేంత వరకు” ఉడకబెట్టాలి(ట). చిక్కబడటం అనే మాట వీళ్ళకి తెలియదల్లే ఉంది. పాపం, ఎవరికి ఏమిటి దగ్గరపడటమో 🙂

  • విన్నకోట నరసింహారావుగారు
   పల్లేటూరివాళ్ళం కదండీ అదీ సంగతి 🙂
   వాళ్ళకి అన్నీ దగ్గరపడుతూనే ఉంటాయండి. 🙂
   తెలుగింగ్లీష్ కి పేరెట్టేరండి ”టెంగ్లిష్”
   నా టి.వీ ఎప్పుడూ మూకీయే నేను కవిని కదా! అందుకని నాకీ విషయాలు తెలియవు లేకపోతే ఈ పాటికి ఒక టపా…….
   ధన్యవాదాలు.

 2. >>>పెసరట్లు చెల్లకపోతే !!

  ఈ చెల్లని పెసరట్లేవి టండీ కష్టే ఫలే వారు

  జిలేబి !

  • పెసరట్టు..’అట్టు’ రూపంలో చెల్లకపోతే (మిగిలిపోతే) వాటినే ‘కూర’గా (పెసరట్టు కూర) చేసుకోవడం…ఐనా “సర్వజ్ఞులు” మీకు తెలీపోతుందా ‘జిలేబి’గారూ!!!
   చీర్స్
   ఎస్ ఎస్ కె 🙂
   (సోమ సుందర కుమార్)

   • బోనగిరిగారు,
    పెసరట్టు చల్లారనిస్తే ఎలా? వేడి వేడిగానే లాగించెయ్యాలి.
    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s