శర్మ కాలక్షేపంకబుర్లు-పనసపండు పెచ్చు/జీడి మామిడి పండు, పులుసు/కూర.

పనసపండు పెచ్చు/జీడి మామిడి పండు, పులుసు/కూర.

పనసపండు కోసుకుని తొనలు తీసుకున్న తరవాత పెచ్చులు పారేస్తాం, నిజానికి ఈ పెచ్చులు కూర వండుకుంటే చాలా బాగుంటాయి, పులుసు పెట్టుకుంటారు అదింకా బాగుంటుంది..

పనస పండు పెచ్చు తీసుకుని, పీచు, గరి తీసేసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కొద్దిగా చింతపండు పులుసు పిసుక్కుని అందులో ఈ ముక్కలేసి ఉడకబెట్టాలి, బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది, కొద్దిగా వరిపిండి వేయాలి,చిటికెడు పసుపు, సన్నటి సెగమీద ఉడకనిచ్చి ఉప్పు చేర్చి పోపు పెట్టుకుంటే పులుసు అదుర్స్…
………………………………………………….

పనసపెచ్చు కూరకి, పెచ్చుని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి, మెత్తగా ఉడికిన ముక్కలికి కొద్దిగా చింతపండు పులుసు,చిటికెడు పసుపు, తగిన ఉప్పు చేర్చి ఉడకనిచ్చి ఆ తరవాత పోపుపెట్టుకుంటే బాగుంటుంది. బెల్లం వేసుకుంటే ఇంకాబాగుంటుంది. బెల్లం చింతపండు పులుసు, ఉప్పు చేర్చేటపుడు చేర్చుకోవాలి, కొద్దిగా వరిపిండి కూడా వేసుకుంటే కూర చాలా బాగుంటుంది…..

………………………………………………….

సాధారణంగా పనసతొనలు తిని, గింజలు పారేస్తారు వీటిని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. వేయించుకుని తినచ్చు. కొద్దిగా నెయ్యి వేసి వేయించి ఉప్పూ కారం జల్లుకుని తినచ్చు.   పై పొరవలిచి గింజలని ఉడకపెట్టి మెత్తగా చేసుకుని కొద్దిగా చింతపండు పులుసు,ఉప్పూ, వరిపిండి చేర్చి పోపు పెట్టుకుంటేకూరగా బాగుంటుంది.

………………………………………………….
గిరిజనుల ప్రధాన ఆహార పదార్ధాలలో ఈ పనస గింజలు కూడా ఒక భాగమే. పనసగింజలను అన్ని కూరలలో ముఖ్యంగా వంకాయ కూరలో వేసుకుంటే బాగుంటుంది.

………………………………………………….

download

అన్ని గింజలూ పండు లోపలుంటాయి కాని జీడి మామిడి గింజ జీడి గింజలు పండు అడుగునకాస్తాయి. ముదిరిన తరవాత పండు కోసి గింజ వేరు చేసి పండు పారేసేవారు. ఈ పండు ఎక్కువ తినరు, కారణం గొంతు నుసపెడుతుంది, దగ్గూ వస్తుంది. ఈ దగ్గు, నుసా కలిగించే వాటిని వేరు చేసి ఈ పండు పానీయం అమ్ముతున్నారట. పండు తీసుకుని ముక్కలుగా కోసుకొని చింతపండు పులుసులో వేసి ఉడకపెట్టి కొద్దిగా, బెల్లం, చిటికెడు పసుపు, తగిన ఉప్పూ చేర్చి, పోపు పెట్టుకుంటే, సన్నటి సెగను కాస్తే ఈ పులుసు బ్రహ్మాండం.

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పనసపండు పెచ్చు/జీడి మామిడి పండు, పులుసు/కూర.

 1. జీడిపళ్ళు తిని ఏనాడయ్యిందో…మళ్ళీ గుర్తుచేశారు, శర్మగారూ! పసుపు పండు, ఎర్రటి పండు…ఈ రెంటి రుచి చాలా వేరుగా ఉండేది. మా తాతయ్య, అమ్మమ్మ రెడ్డిసీమలో ఉండేవారు కాబట్టి నాకు ఈ జీడిచెట్లతో అనుబంధం ఎక్కువే! పెరట్లో జీడిచెట్టునుంచి అప్పటికప్పుడు కోసి లేత జీడి గింజలతో చేసిన కూర రుచి అమోఘాతి అమోఘం. మా అమ్మమ్మా వెళ్ళిపోయింది, దానితోనే ఆ ఇల్లూ ఆ జీడిచెట్లు కూడాను. కానీ కొన్ని వందలసార్లు తిని మరిగిన ఆ రుచి, అది కలిగించిన మధురానుభూతులు మస్తిష్కంలో ఇంకా చెక్కుచెదరలేదు. ఆజన్మాంతం చెదరబోవు కూడాను! మళ్ళీ ఆ తలపుల్ని తట్టిలేపినందుకు ధన్యవాదాలు, శర్మగారూ!

  • వర్మాజీ,
   ఒకప్పుడు చాలా ఇష్టం గా తిన్నవి ఇప్పుడు ఎందుకు కనపడకపోతున్నాయో తెలియదు. మొన్న సంతలో చూశా ఎవదో సీమ చింతకాయలు బండి మీద పెట్టి అమ్ముతున్నాడు.
   జీడి పండులో రకాల గురించి చెబితే మరీ ఇబ్బందేమోనని మానేశా. మీ పాత జ్ఞాపకాలు కదిలించాననమాట
   ధన్యవాదాలు.

 2. శిశిర20 May 2015 at 14:49
  ఎప్పటి వంటలో. అమ్మమ్మ చేసేది. ఇప్పుడన్నీ ఆధునిక తిళ్ళు అయిపోయాయి. అమ్మమ్మ, తాతల్ని గుర్తు చేస్తున్నారు. ధన్యవాదాలు. 🙂

  • చిరంజీవి శిశిర,

   పాతకాలపు వాణ్ణి కదా అందుకు ఆ వంటలే చెబుతున్నా. పెద్దలని గుర్తుకు తేగలిగినందుకు
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s