శర్మ కాలక్షేపంకబుర్లు-రాజధాని ముహూర్తం-ఫలితాలు

Full Amazing Moon in Cable Beach, Broome, WA Australia

Cable beach, Broome,W.Australia. Photo Courtesy:Owner.

రాజధాని ముహూర్తం-ఫలితాలు

ముహుర్తం “స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ మన్మథనామ సంవత్సర జ్యేష్ట బహుళ చతుర్థీ స్థిరవారం, కర్కాటక లగ్నం ఉదయం 8.46 ని”.ఆ సమయానికున్న గ్రహ సంపుటి

లగ్నం కర్కాటకం.
లగ్నంలో గురు,శుక్రులు,
తృతీయంలో రాహువు,
పంచమంలో శని,
షష్టమంలో చంద్రుడు,
నవమంలో కేతువు,
ఏకాదశం లో రవి,బుధ, కుజులున్నారు.

౧. లగ్నం కర్కాటకం గురు పాలితం.
౨. లగ్నం లో గురువు మిత్రక్షేత్రం, బలంగా ఉన్నారు, శుక్రుడు శత్రు క్షేత్రం లో లగ్నం లో గురునికి లొంగి ఉన్నారు.అందు చేత ప్రతిపక్షం లొంగి ఉంటుంది, ఎప్పుడూ, పాలక పక్షానికి.ఏ ప్రభుత్వమైనా స్థిరంగా ఉండే ప్రభుత్వాలే వస్తాయి.
౩. శని లగ్న పంచమం లో గురునికి కట్టుబడి ఉన్నారు. అది శత్రు క్షేత్రం కూడా.ప్రతిపక్షం మాట చెల్లదు..
౪. అష్టమ ( ఆయుస్థానం ) స్థానం శని పాలితం కనక రాజధానికి దీర్ఘాయువు.
౫. రవి ఏకాదశం లో  ఉండటం మూలంగా ఉద్యోగస్తులది ఆడినది ఆట పాడినది పాట. వీరిని పట్టుకోగలవారుండరు.
౬. నవమ స్థానం లో కేతువు మూలంగా అధ్యాత్మిక చింతన ఉంటుంది.నవమ స్థానాన్ని గురువు చూస్తున్న మూలాన, అది గురుపాలిత క్షేత్రం కనుకా, ప్రతి పక్షానికి మాట చెల్లదు., నిత్య వ్యవహారాలలో కూడా.
౭. చంద్రుడు షష్టమ స్థానం లో ఉండటం మూలంగా అప్పులే ఉంటాయి.
౮. మొత్తానికి చూస్తే గురుని ఆధిపత్యం అన్నిటిలోనూ చెల్లుతుంది.
౯. రాజకీయంగా కూడా ప్రతిపక్షం ఎప్పుడూ పాలక పక్షానికి లొంగి ఉంటుంది, ఇక ముందుకూడా.
౧౦. ప్రజలికి అప్పులు, తిప్పలు తప్పవు.
౧౧. ఇక సైన్యాధిపతి, యువత ప్రతినిధి కుజుడు రవితోనూ బుధునితోనూ కలిసి ఉండటం మూలంగా పరిపాలనా సంబంధమైన చిక్కులే తప్పించి మరేమీ కనపడదు. బుధునితో కలిసి ఉండటం మూలంగా టెక్నికల్ ప్రదర్శన ఎక్కువా, అసలు పని తక్కువా కనపడుతుంది. రక్షణ గాలిలో దీపమే, చేతులడ్డం పెట్టకపోతే.
౧౨.శని తనకు సప్తమస్థానం లో ఉన్న రవి,బుధ, కుజులను చూడటం మూలంగా రక్షణ, పరిపాలన ప్రజలకు చేరువకాదు, మందకొడిగానూ సాగుతుంది.

మిత్రులొకరు రాజధాని గురించిన శంకుస్థాపన ముహూర్తం గురించి రాయమంటే సరదాగా రాసినది, నాకిందులో పెద్ద ప్రవేశం లేదు సుమా.

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-రాజధాని ముహూర్తం-ఫలితాలు

 1. यहाँ पर कुच जबरदस्त सवासौव करोड़ कामेंट आया होगा करके आयी ! प्छ पछ ! परेशान होगई ! क्या होगया तेलुगु ब्लागु लोकम को ! सवाल लगाने से भी कोई हिला जुला नहीं !

  चियर्स
  जिलेबी

  • జిలేబిగారు,
   ఏండలు మండిపోతున్నాయి కదూ! వడ కొట్టినట్టుంది,
   అధ్యక్షా!
   చంద్రబాబు, మోడీల దుష్టపాలన మూలంగానే ఎండలు మండిపోతున్నాయి, దీనిని ఖండిస్తున్నాం, ప్రజలకి వడకొడుతోంది, సూర్యుడు ఇలా చెలరేగిపోడానికి చంద్రబాబు, మోడీలే కారణమని నొక్కి వక్కాణిస్తున్నాను అధ్యక్షా! మా జిలేబిగారికి వడకొట్టి అర్ధం కాని భాషలో మాటాడుతున్నారు. 🙂
   ధన్యవాదాలు.

  • kinghari010 గారు,
   నారదునికి నారాయణా అనడం అలవాటు, జిలేబిగారికి నారదా అనడం అలవాటు 🙂
   ధన్యవాదాలు.

 2. జిలేబీగారూ,ఈ విషయంలో శర్మగారి బాధ్యత ఏమీలేదు.నేను అడిగితేనే రాసారు.అదీ జ్యొతిష్యంలో తనకి ఎక్కువ పాండిత్యం లేదనిచెప్పారు.ఇక మూఢనమ్మకాలనుకొంటే పట్టించుకో నక్కరేలేదు.కాని పెళ్ళిళ్ళకీ,గృహప్రవేశాలకీ ,ప్ర్రయాణాలకీ ఇంకా ఎన్నిటికో ముహూర్తం చూడకుండా ఉండేవాళ్ళు ఎంతమంది?మన సినిమా వాళ్ళకీ, రాజకీయనాయకులకూ,ఈ నమ్మకాలు మరీ ఎక్కువ.రాష్ట్రరాజధానికి శంకుస్థాపనకి ముహూర్తం చూడకుండా చేస్తారా?ఐతే దైవబలంతోబాటు మానవప్రయత్నం కూడా చాలా ముఖ్యం.ప్రభుత్వం,ప్రజలూ నిజాయతీగా,కష్టపడి పనిచేస్తే మన ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందగలదని,అమరావతి గొప్పరాజధాని కాగలదనీ నమ్ముతున్నాను.

  • మిత్రులు రమణా రావుగారు,
   నేను భయపడలేదు,బాధా పడలేదు, మీ అభిమానానికి ధన్యవాదాలు.
   నిజానికి నేను చెప్పినవన్నీ రోజూ అందరూ అనుకునేవే, చిత్రంగా గ్రహ స్థితి చూస్తే అవే ఫలితాలు కనపడ్డాయి. ఏమైనా జ్యోతిషాన్ని నమ్మము అనేవారు దానిని నిజజీవితం లో అమలు పరచిన దాఖలాలు కనపడవండి.
   నేనసలు ముహూర్తం వైపు చూడలేదు, మీరు కదిలించిన తరవాత చూడాలనిపించింది, ఈ విద్యను వదిలేసీ చాలా కాలమే అయింది. మిత్రులడిగారు కదా అని ఒక సారి గుర్తు చేసుకున్నా. కొన్ని పొరపాట్లు చెప్పానేమో అనుకున్నా, ఎవరూ మాటాడలేదు. నేను చెప్పిన పొరబాటేమైనా ఉంటే సరి చేస్తే ధన్యుడను.
   ధన్యవాదాలు.

 3. ఏమండీ కష్టే ఫలే వారు,

  దీనికి మించి స్వయం కృషి ని రాష్ట్రం నమ్ముకోవాలి గాని అన్నీ ఇట్లా ‘fated’ గా అనుకుంటే ఎట్లా అండీ ??

  ఈ విషయాలు జరిగితే ఆ హా మేం ఆ రోజే చెప్పాం అంటారు !

  జరుగ క పోతే అంతా ‘ఈశ్వరేచ్చ ఓ శాంతి శాంతి శాంతి అంటూ మాట దాట వేస్తారు -అంతా మన మంచి కే సుమీ అంటూ !

  అసలు ఈ జాతకాలు, జ్యోతిష్యం గట్రా ల మీద నమ్మకం తో నే దేశాభివృద్ధి కుంటు పడుతుందేమో !

  ఇట్లాంటి మూఢ నమ్మకాలు ఎంత దాక భారద్దేశం భరించాలి ? (ప్రశ్న – దీనికీ ప్రశ్న వేసే చూస్తా మంటారేమో మరి !)

  నిజంగా నే ఈ ముహూర్త బలం గట్రా లు ఉన్నాయా ? అసలు ఇవి మూఢ నమ్మకాలే మరి . హుష్ కాకీ ?

  జిలేబి
  (హమ్మయ్య ! భుక్తా’ ఆయాసం; తీరింది నారదా!)

  • 1. దీనికి మించి స్వయం కృషి ని రాష్ట్రం నమ్ముకోవాలి గాని అన్నీ ఇట్లా ‘ఫతెద్’ గా అనుకుంటే ఎట్లా అండీ ??

   అవును.మీ దృష్టిలో జ్యోతిషం మూఢనమ్మకం. రోజు CNBC TV.18 లో, షేర్ మార్కేట్ లో షేర్ ల ధరలు పెరిగి పోతాయని విశ్లేషణలు చేసే వారు ప్రొగ్రెసివ్ పండితులు. భలే.

   ఇంతకి షేర్ మార్కేట్ లో అనలిటిక్స్ పండితులు చెప్పినవి ఎన్నిసార్లు నిజమయ్యాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ వారు చెప్పినవి నిజమే అయి ఉంటే ప్రజలందరు ఇళ్ళమ్ముకొని ,షేర్ లు కొనుకొని అంబాని తో సమానం గా కోటిశ్వరులు అయ్యుండేవారు కదా! 🙂

   2. నిజంగా నే ఈ ముహూర్త బలం గట్రా లు ఉన్నాయా ? అసలు ఇవి మూఢ నమ్మకాలే మరి .

   ముహుర్త బలం లేదు అని మీరు నమ్మితే, మూఢనమ్మకాలను పారద్రోలాలంటే, మీ మనవరాళ్ళ, మనుమళ్ల పెళ్ళిళు, మహళాయ అమవాస్య,ఆదివారం, అర్దరాత్రి 12గంటలకు చేయండి. ఐదేళ్ల తరువాత వారి కాపురం ఎలా ఉందో రాయండి 🙂

   3. ఈ జాతకాలు, జ్యోతిష్యం గట్రా ల మీద నమ్మకం తో నే దేశాభివృద్ధి కుంటు పడుతుందేమో !

   సామాన్యుడి బాషలో దేశాభివృద్ధి అంటే ఆర్ధిక పరిస్థితి మెరుగవ్వటం. మీరొక పనిచేయండి. మీదగ్గర ఉన్న బంగారు ఆభరణాలను మీ ఇంట్లో, పక్కిళ్ల లో ఉన్న పనిమనుషులకు, మోడి పేరు చెప్పి, సమానంగా పంచండి. వారి ఆర్ధిక పరిస్థితి కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత మెరుగు పడిందనుకొంటారు 🙂

   • శ్రీ గారు,
    బాగా చెప్పేరు. జ్యోతిషాన్ని వ్యతిరేకించేవారెవరూ నిజ జీవితం లో ఆచరించరు 🙂 మనలాటివారెవరేనా ఇదేమని అడిగితే మాత్రం కుంటి సాకులే చెబుతారు, అదంతే.
    ధన్యవాదాలు.

  • జిలేబిగారు,
   మానవులు తమతో పాటే జ్యోతిషాన్నీ వృద్ధి చేసుకున్నారు. ప్రతి విషయంలో నూ స్వార్ధపరులు చేరినట్టు ఇందులోనూ చేరేరు, మరొకరు కుహనా మేధావులు, వీరికి ఏదీ భారతీయమైనది నచ్చదు, అదో తెగులు వారికి,ఏ చేస్తాం, పాపమనుకోడం తప్పించి.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s