శర్మ కాలక్షేపంకబుర్లు-చేతకానివాళ్ళు.

చేతకానివాళ్ళు.

చెల్లాయ్! కాఫీ అమ్మా అంటూ ప్రతిపక్షంలా అరిచాడు మా సత్తిబాబు వస్తూనే,

రా రా కూచో అంటుండగా,

సంవత్సరం పరిపాలన చేసేరు ఏం ఊడపొడిచారు, ప్రభుత్వం ఖర్చులు తగ్గించేరు, రక్షణ ఖర్చు తగ్గించేరు, ఆయుధాలు కొనడం మానేసి. బొగ్గు క్షేత్రాలు, టుజి వగైరాలు వేలాలేసేరట…ఏం చేసేరు….. ఎందుకు పనికొస్తారు, ఎవరు బాగుపడ్డారు…ఎవర్ని బాగుచేసేరు?

అదేంటయ్యా! రక్షణ శాఖలో టుజి వగైరాలలో, బొగ్గులో ఎక్కువ డబ్బులొచ్చాయట కదా అని అనుమానం వెలిబుచ్చా!

చేతకాని వాళ్ళ కి పరిపాలనొస్తే ఇలాగే ఉంటది, వీళ్ళకి సున్నా మార్కులు కూడా వెయ్యక్కరలేదు అని ఈసడించాడు.

అసలు మార్కులేసేవాళ్ళకి, మార్కులేసేందుకున్న పరిపాలనా అర్హతేంటో అని అనుమానం వెలిబుచ్చా!

యువరాజుకి అనుభవమెందుకండీ! తరతరాల రక్తం లోనే ఉంటేనూ… అసలు మీకేం తెలుసు…ఎండలెందుకు మండిపోతున్నాయో తెలుసా? చంద్రబాబు, మోడీల దుష్పరిపాలన వల్ల కదూ! వాళ్ళ పాపం ప్రజల్ని ఇలా బాధ పెడుతోంది తెలుస్కోండి అంటూ కాఫీ తాగి వెళిపోయాడు.

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-చేతకానివాళ్ళు.

 1. ఇష్టారాజ్యంగా డబ్బులున్నాయని ఏసీలు, ఫ్రిడ్జులు వాడకం ఎప్పుడైతే ఎక్కువైందో ఈ ఎండలు మండడం కూడా అప్పుడే ఎక్కువైందేమో అనిపిస్తుంది నాకు. దానికితోడు చెట్లు కొట్టి అపార్ట్మెంట్లు కట్టడం, రోడ్ల వెడల్పులో కొట్టేసిన చెట్లకి బదులు వేరే చోటైన చెట్లు నాటకపోవడం, ఇవన్నీ మన స్వయంక్రుతాపరఢలే 2013 లో ఇంటికి వచ్చినప్పుడు ఒక పని మీద 3-4 సార్లు విజయవాడ వెళ్ళాల్సొచ్చింది, రోడ్ మీద ఒక్క అయిదు నిమిషాలు నిలబడితే, షాపుల లొనుంచి వచ్చే ఏసీల ఎక్జాస్టర్ల గాలికి మా మొఖాలు మాడు చిప్పలు అయ్యాయి.

  • అరుణ్ పారుపల్లి గారు,
   ఇలా ఎండ కాయకపోతే వర్షం ఉండదండి, కాని మనవాళ్ళు అభివృద్ధి పేరుతో చెట్లు కొట్టి పారేస్తున్నారు తప్పించి, పెంచటం లేదు, ప్రభుత్వాలు కూడా పొరబాటు చేస్తున్నాయి. చెట్టు పెంచు, అవసరానికి కొట్టు అనటం లేదు, నోటితో మాత్రం చెట్లు పెంచండి అంటున్నాయి. సమతుల్యం చెడింది. చెట్టు సామాన్యుడి Renewable energy. Our Govts. are forgetting it. సామాజికంగా పెంచవల్సిన చెట్లు అధోగతిలో ఉన్నాయి, ఇదీ బాధ. సమాజానికి చెందినది పెద్దలు భోజనం చేస్తున్నారు, అడవులతో సహా.
   ధన్యవాదాలు.

 2. దువ్వూరి వేణు గోపాల్గారు,
  వీళ్ళు పుష్కరానికోసారి అధికారంలో కొస్తారు, వీళ్ళ కూడా కరువు అనావృష్టి తోడుగా వస్తాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అడవౌలు లెక్కప్రకారం కొట్టేయబడుతున్నాయి, ప్రభుత్వాలకి అక్కర లేదు, ’చిప్కో’ లాటి ఉద్యమాలు దేశమంతా వస్తేగాని బాగుపడదు.
  ధన్యవాదాలు.

 3. దురదృష్టం భాజపా ను తేదేపా ను వెంటాడు తోంది. చంద్రబాబు వచ్చినప్పుడల్లా వర్షాలు లేక వచ్చినా పంటమీద ఉండగా వచ్చి వ్యవసాయం తగలడిపోతోంది. దానికి తోడు ఇదివరలో ఆయన వ్యవసాయం మీద బాగుపడ్డదెవరు మీ పొలాలమ్ముకోండి అని అన్నాడాయే.
  అటల్ సమయంలో గోల్డెన్ క్వార్డ్రాంగిల్ అని రోడ్లు వెడల్పు చేసే కార్య క్రమం చేసారు దానిలో లక్షలాదిగా చెట్లు కూలాయి. వాటి స్థానంలో కొత్తమొక్కలు వేసిన దాఖలాలు లేవు. వేసినా అవి ఎదగడానికి ఎంత సమయం పడుతుందో! వీటన్నిటి పర్యవసానమే ప్రస్తుతం వేడిగాలులు. చెట్లు పెంచండోయ్ బాబూ చెట్లు పెంచండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s