శర్మ కాలక్షేపంకబుర్లు-వడియాలూ పచ్చిపులుసూ.

వడియాలూ పచ్చిపులుసూ.

గుమ్మడి వడియాలు వేయించుకోవాలి. పక్కనపెట్టి ఉంచుకోవాలి. చింతపండు పులుసు పిసికి పల్చగా చేసుకోవాలి, ఉప్పేయాలి, చిటికెడు పసుపేయాలి, అందులో ఒక మిరపకాయ పోపూ పెట్టాలి, దానిలో వేయించి ఉంచుకున్న వడియాలని చిదిపి వేసుకోవాలి, కొన్ని వడియాలలాగానూ వేసుకోవచ్చు. ఇప్పుడు వడియాల పచ్చిపులుసు తయార్. కొద్ది సేపటికే వడియాలు మెత్తబడిపోతాయి, అన్నం లో కలుపుకు తింటే అదుర్స్.దీనికో చిన్న జోడింపు నీరుల్లిపాయ కొరుక్కుతినడం, నీరుల్లిపాయలోనూ బళ్ళారి పాయ కాక చిన్నపాయైతే అబ్బో చెప్పేదా………..

మామిడి పండు, రసం పిడుచుకుని తింటాం, సాధారణం గా భోజనం తో పాటే మామిడి పండూ తింటాం. పాత రోజుల్లో ఐతే పంక్తి మీద మామిడి పండు వేసే అలవాటూ ఉండేది.దీనికోసం ప్రత్యేకంగా కావు కూడా వేయించేవారు. ఇలా పిడుచుకుతినే మామిడి పండు రసాన్ని కంచం లో పిండుకుని, వేడి అన్నం కలుపుకుని తింటే….. ఇలా రసం అన్నంలో కలుపుకు తినేందుకు అనువైన మామిడి రకాలు, పంచదార కలశ, కొత్తపల్లి కొబ్బరి, చిన్న రసాలు మాత్రమే బాగుంటాయి. నేటి కాలం లో మామిడి పండు అంటే ముక్కలు కోసుకు తినడమే అనుకుంటారు, పిడుచుకుని కాయపళంగా రసం లోపలికి పుచ్చుకోవడమో గొప్ప ఆనందం. మరో సంగతి, మామిడిపండు పిడుచుకుని తినేవి ముచిక దగ్గరనుంచి తింటాం, సాధారణంగా, కొన్ని రకాలు ముచిక దగ్గరనుంచి తినకూడదు, వస ఉంటుంది, అదిగో అటువంటి దానిలో మొదటిది పాపయరాజు గోవా రకం.

ఈ సంవత్సరం కూడా పళ్ళకోసం ముగ్గేసేం, పండేయి, బలే బాగున్నాయి, మరి చుట్టు పక్కలవారికి పెట్టడం అలవాటు కదా, పెట్టేం.  ఎవరైతే తినాలని అనుకున్నానో, వాళ్ళకి చేరలేదు, దగ్గర వాళ్ళు, పళ్ళు కావాలో అని గొడవ,ఏ చేస్తాం లేవు మరి 🙂

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వడియాలూ పచ్చిపులుసూ.

  1. అలా పిడుచుకు తినే మామిడి పండ్లు నాకు చాలా ఇష్టం.కానీ ఆ రకాలు ఈ సంవత్సరం మాకు ఇక్కడ దొరకలేదు.మీరిలా వాటిని గుర్తు చేసి నోరూరించటం అసలేం బాగు లేదండీ.

  2. ఇట్లా రోజు రోజుకీ సరి కొత్త ”వాంట్’ డాట్ కాం’ (వంటకం – వాంట్ డాట్ కామ్”) తో నోరూ రించేస్తూంటే ఇక ఆవురావురు మని లాగించేస్తూ లావు లావు అయి పోతా మే మో నని భయ్యం !!

    జిలేబి

    • జిలేబి గారు,
      అన్నీ తినాలి, మితంగా తినాలి. లావెక్కిపోరు, అందమూ చెడిపోదు 🙂
      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s