శర్మ కాలక్షేపంకబుర్లు-తెలగపిండిపొడి.

తెలగపిండిపొడి.

తెలగపిండిపొడినే నువుపిండి అని కూడా అంటారు. తెలగపిండి అంటే నూనె తీయగా మిగిలిన నువ్వుల చెక్క. ఈ రోజుల్లో ముడి నువ్వుల నూనెతీసి దానిని బ్లీచ్ చేస్తున్నట్టుంది. అలా ముడినువ్వుల నుంచి నూనె తీయగా మిగిలినది మాత్రం కాదని మనవి. నువ్వులు దంచి పొట్టు తేసిన తరవాత వచ్చే తెల్లనువ్వులు ఆడించగా మిగిలినదే తెలగపిండి, మన వాడకానికి ఉపయోగపడేది. ఇందులో ఇంకా కొద్దిగా నూనె ఉంటుంది. పాతరోజులలో నువుపప్పులో నూనె తీసిన తరవాత దానిని పశువులకు పెట్టేవారు, దానిలో ఎక్కువగా ఇసక ఉండేది. కొద్దిపాటి నువ్వులను మాత్రం ఇసకలేకుండా చేసుకుని నూనెతీసి మిగిలిన తెలగపిండిని వాడుకునేవారు. నువు పప్పునే వాడుకోవచ్చుగా అనే ప్రశ్న వేయచ్చు. నువ్వులలో నూనె ఉండిపోవడం మూలంగా ఇలా చేసినది ముద్ద అయిపోతుంది, అందుకు చేయరు. నువ్వులను అన్ని కూరలలోనూ వేసివండుతారు, చాలా బాగుంటుంది కూడా. నువుపిండి+పొట్లకాయ, నువుపిండి బీరకాయ, నేతి బీరకాయ ఇలా కలగలుపుగా కూరలు చేస్తారు. ఇలా కూరలు ఒక రోజువే మరి ఎక్కువ కాలం నిలవ ఉంచి వాడుకునేదే నువుపిండి.

నువుపిండి తయారీకి నేటికాలంలో నూనెతీసిన, ఇసకలేని నువుపిండిపొడి అదే తెలగపిండిపొడి బజారులో పాకెట్ లలో దొరుకుతోంది. దీనిలో కావలసిన ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. జీలకర్రకారం, వేయించినదాన్ని కలుపుకోవాలి, వెల్లుల్లి కూడా కొద్దిగా నూనెలో వేయించినవాటిని కచ్చా పచ్చాగా దంచి కలుపుకుంటే నిలవకి బాగుంటుంది. అన్నంలో కలుపుకుని కొద్దిగా నువ్వులనూనెవేసుకు కలుపుకుతింటే……..అహో! అదుర్స్…

ఇలా తినలేమన్నవారికి, కందిపొడిలో ఇలా తయారు చేసినదాన్ని కలుపుకుని వాడుకుంటే ఇంకా బాగుంటుంది.

నువ్వులతో వండుకునేవి, తయారు చేసుకునేవన్నీ కూడా ఔషధాలే! ఎందుకెందుకు పనికొస్తాయో చూదాం.

పక్క తడిపే అలవాటున్న పిల్లలకి కొద్దిగా చిమ్మిలి పెట్టడం ప్రారంభించండి. కొద్దిరోజుల్లోనే ఆ అలవాటు తప్పుతుంది. ఋతువు సరిగా రాని ఆడపిల్లలకి చిమ్మిలి మందు. మధ్య వయసుస్త్రీలకి కూడా చిమ్మిలి మందే. పురటాలికి నువ్వుపొడితో భోజనం పెడితే పాలు పడతాయి సమృద్ధిగా. గర్భాశయం కూడా సరిపడుతుంది కాన్పు తరవాత. వెల్లుల్లితో వాడకం మంచిది. మగవారిలో శీఘ్రస్కలనం తో బాధపడేవారు ఈ నువుపిండి పొడివాడుతుంటే తేడా కనపడుతుంది. ఇక పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వగైరాలకు కూడా మంచిదే,పెద్దవాళ్ళకి ముఖ్యంగా స్త్రీలకి ఎముకలు గుల్లబారడం తగ్గుతుంది.. ఒక్కరోజులో మార్పురాదు, రోజూ కొద్దికొద్దిగా వాడుకుంటుంటే మార్పు కనపడుతుంది. ఇందులో కాల్షియం వగైరా ఔషధాలున్నాయట, నాకు తెలియదుగాని వాడుకుంటే కలిగే ఫలితాలు మాత్రం తెలుసు. ఇది అనుభవ వైద్యం.

శుభం భూయాత్.                                   _/\_

3 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తెలగపిండిపొడి.

 1. Ennela10 June 2015 at 04:46
  ఆహా ఏమి రుచి….ఇటు రెసిపీలతో పాటు అటు వైద్యం కూడా…బాగుంది. ఈ సారి చూస్తా.

  ReplyDelete
  Replies

  sarma19 June 2015 at 04:23
  Ennela గారు,
  మనం తినేవన్నీ వైద్యానికి పనికొచ్చేవేనండి. ఈ తెలగపిండి పశువులే తింటాయనుకుంటాం, అలాకాదు మనమూ తినచ్చు. ప్రయత్నించండి.
  ధన్యవాదాలు.

  Delete
  Reply

 2. కందిపప్పు పొడి బద్దలు,తెలగపిండి కూరను ఎక్కువ కరివేపాకు,వెల్లుల్లి రెబ్బలు,జీలకర్ర మరింత జతచేసి చేసిన కూరలో నువ్వుల పప్పు నూనెతో వేడి అన్నంతో ….తరువాత చెప్పాలా శర్మగారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s