శర్మ కాలక్షేపంకబుర్లు-ఏ కోశానా……

ఏ కోశానా……

…..ఏ కోశానా లేదు అనే వాక్యానికి ముందు విశేషణం ( భయమూ,భక్తీ; సిగ్గు,శరము ఇలా) తగిలించి వాడేస్తాం. అసలీ వాక్యం అర్ధమేంటీ? కోశము అంటే పెట్టి, సంచి, విభాగము అని అర్ధాలు చెప్పుకోవచ్చనుకుంటా.

నేనెవరు? అనే ప్రశ్నకి సమాధానంగా, ఈ శరీరమే నేను అంటాం, కాని

దేహోఽహమిత్యేవ జడస్య బుద్ధి
ర్దేహే చ జీవే విదుషస్త్వహంధీ
వివేకజ్ఞానవతో మహాత్మనో
                                          బ్రహ్మాహమిత్యేవ మతిస్సదాత్మని……..వివేక చూడామణి…162

జడులైన పురుషులకు దేహమునందు ’ఈ దేహమును నేను’ అను అహం బుద్ధి కలుగును. ఆ యహం బుద్ధి విద్యావంతునకు జీవునియందుండును. వివేకము,విజ్ఞానము గల మహాత్మునకు సత్యమైన ఆత్మయందే ’నేను బ్రహ్మమును’ అను అహం బుద్ధి ఉండును.

జడబుద్ధి కలిగినవారు ఈ దేహమే ‘నేను’ అనుకుంటారు, విద్యావంతులు ఈ శరీరంలో ఉన్న జీవుడే ‘నేను’ అనుకుంటారు, విజ్ఞానము కలిగినవారు మాత్రమే ఆత్మయే ‘నేను’ అనుకుంటారు అన్నారు ఆది శంకరులు. అది చూస్తే ఈ దేహం పంచకోశ నిర్మితం. ఇందులో ఐదుకోశాలున్నాయి. అవి

1.అన్నమయకోశం.2.ప్రాణమయకోశం.3.మనోమయ కోశం.4.విజ్ఞానమయ కోశం.5. ఆనందమయ కోశం. ఈ ఐదుకోశాలలో నేను అనే ఆత్మ ఉన్నదా?

ఇదిగో ఈ టపామొదలెడితే అదికాస్తా వివేకచూడామణి దగ్గర తేల్చింది, అదీ కత. పంచ కోశాలలో ఆత్మ లేదు, ఈ పంచకోశాలూ ఆత్మ కాదు, అది నిత్య వ్యవహారంలో చెప్పడమే ఏకోశానా లేదు అన్నమాట…..ఇలా అపభ్రంశమైపోయింది….ఈ కోశాలేంటో వివరంగా తరవాత చూదాం……

15 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఏ కోశానా……

 1. సద్యో ‘అన్నది నేను కొత్తగా ,ఇప్పుడిప్పుడే అన్న సందర్భానికి అన్వయించుకోగలరు కాని ‘.బ్లాగ్’ కు కాదు.క్లిక్ చేసేక నాకూ అనిపించింది.కాని slip between the click and (can’t)check కదా! —– సుమన్ లత

 2. నాది కూడా అదే ఎజెండా. అన్నీ వేదాల్లో ఉన్నాయిష అని ఊరుకోక వాటిని అందరికీ అందుబాటులోకి తేవడమే మన తక్షణ కర్తవ్యం .ఒకో సారి నిరాశగానూ అనిపిస్తు ఉండటం సహజం.. నేను సద్యోబ్లాగ్ వాడుకరిని.అందుకు లైబ్రరీ లో పాత పుస్తకాలు చదివే అలవాటు వలన వీలయినన్ని పాత టపాలు చూసుకునే ౬౨ సంవత్సరాల విశ్రాంత ఆచార్యురాలిని..ప్రసంగాలు హిందీ-తెలుగు లలో ఇస్తూ ఉంటాను.అదిగో అలాటప్పుడే ఇవి చెప్పగలిగే సదవకాశం లభిస్తుంది. ————-డా .సుమన్ లత రుద్రావఝల

  • “సద్యోబ్లాగ్” అంటే ఏమిటండి? “సద్యో” ప్రయోగం వేరే సందర్భంలో విన్నాను గాని బ్లాగులకి సంబంధించి “సద్యో” ఏమిటో తెలియక అడుగుతున్నాను.

  • Dr.R.SumanLata గారు,
   …ష అనుకోడం కాదండి, పది మందికి తెలియాలి, దాని గొప్పతనం. అదీ నా ఆకాంక్ష. మీరన్నట్లు నిరాశలో కూరుకుపోతుండటం బయటకు రావడం జరుగుతూనే ఉందండి. మీ ప్రసంగాలలో ఉపయోగించుకోడానికి ఇంకా ఇటువంటివి చాలానే ఉన్నాయండి, నా బ్లాగులో ఒక సారి మొదటి నుంచి చూడగలరు.
   బ్లాగ్ కొత్తగా మొదలెట్టారా? 🙂 బ్లాగ్ లింక్ ఇవ్వమని అభ్యర్ధన.
   ధన్యవాదాలు.

 3. మీ కబుర్లు చాలా బాగుంటాయి,మొన్న బ్లాగులు వ్రాయాలని ఏ కోశానా లేదు, చదవాలని లేదు సుఖంగా గడపాలని ఉంది అని మీరు వ్రాస్తే, మీ సుఖం మీరు చూసుకుంటే ఎలా అని అడిగాను కదా ?
  మీరే మమ్మల్ని మీ బ్లాగు నుండి బయటికి తోలేస్తారేమో గానీ మేము మాత్రం మీ బ్లాగు ని అందరికీ పరిచయం చేయాల్సిందే ! మీరు వ్రాస్తూనే ఉండండీ, వీలు చూసుకుని పుస్తకం గా ప్రచురించుదాం.
  అందరూ పురాణాలు చెపుతారు. మీరు, చాగంటి గారు ఇప్పటికాలానికి వాటిని ఎలా అన్వయించుకోవాలో చెపుతారు. మీవంటి వారికి చెప్పగలిగేదాన్ని కాదు కానీ ఎవరు చదివినా చదవకపోయినా మనం చేయాలనుకున్న పని చేసుకుంటూపోవడమే ! ఎవరో గుర్తించనవసరం లేదు,తగిన సమయం వస్తే భగవంతుడే గుర్తిస్తాడని మనం నమ్ముతున్నాం కదా ?

  • భగవంతుడు అందరినీ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాడండీ ఆయనవైపు మనం అడుగులు వేయటం మాత్రం మనచేతిలోనే ఉంది! అయనకు మన ధనకనకవస్తువాహనాదులు ఏమీ అవసరం లేదు. కేవలం మన మనస్సు మాత్రం ఆయనకు ఇస్తే చాలును. అంత అల్పసంతోషి!

   • మిత్రులు శ్యామలరావుగారు,
    భగవంతుడు మడులు,మాన్యాలూ,భోగాలూ అడగడండి, మనసు పెట్టరా ఇక్కడ అంటాడు, ”ఆ ఒక్కటీ అడక్కూ”అటాం మనం అదీకత. 🙂
    ధన్యవాదాలు.

  • నీహారికగారు,
   నాకైతే అలాగే అనిపిస్తోంది, కాని అమ్మ అలా అనటం లేదు 🙂
   ఎవరినీ బ్లాగులనుంచి తరిమేసే శక్తి,ఆసక్తి లేవండి. ముఖే,ముఖే సరస్వతి అన్నది నమ్మినవాణ్ణీ,లోకో భిన్నరుచిః అన్నదీ ఆదరించేవాడిని, కాని భిన్న రుచి పేర ’అతి’చేస్తే బాధ పడేవాడిని. , అంతే 🙂
   పుస్తకం ఇదో కథ 🙂 ఒకప్పుడు బ్లాగులో చోరీ జరిగితే ఒకరు అభిమానంతో పుస్తకంగా వేస్తామన్నారు, సరే అన్నా! ఆ తరవాత పుస్తకంగా వేస్తాము అనుమతివ్వండీ అన్నారు కొండలరావుగారు, ఒకరికి అనుమతిచ్చానండీ అన్నా! అనుమతి తీసుకున్నవారు మరిచిపోయారు, వీరికి అనుమతి ఇవ్వడమూ జరగలేదు, ఉభయ……. అదండి సంగతి 🙂
   చాగంటివారితో పోల్చారు, భయమేసిందండి.
   మానవులం కనక రాగద్వేషాలకు అతీతులం కాదు, అతీతుడను అని నేను చెప్పుకోను, నేను చెయ్యాల్సినపని అమ్మ చేయమంది,చేస్తున్నా అంతే
   ధన్యవాదాలు.

 4. ఏమండీ కష్టే ఫలే వారు,

  ‘ఏకో’ , శానా చోట్ల లేదంటారు అంతే నా ?

  ఏకః ఆశీత్ !

  చీర్స్
  జిలేబి

  • జిలేబిగారు,
   “ఏకం” అదే ఆత్మ,పరమాత్మ, ఏకోశానా అనగా పంచకోశాలలో (అన్నమయ,ప్రాణమయ,మనోమయ,విజ్ఞానమయ,ఆనందమయ కోశాలలో)లేదు/లేడు/..ఆది శంకరుల నేతి నేతి (న+ఇతి=నేతి ఇదికాదు, ఇదికాదు) అని నిర్ణయించుకోవడంలో,నేను అనే ఆత్మకాదు, ఈ శరీరం.
   ధన్యవాదాలు.

  • మిత్రులు తాడిగడప శ్యామలరావు గారు,
   మంచి బ్లాగ్ ను పరిచయం చేశారు, ఇన్నాళ్ళు ఈ బ్లాగ్ ను ఎలా దాటిపోయానొ తెలియదు, టపా చూశాను బాగుంది, మిగిలినటపాలు చదవలేదు, వాటి ప్రభావం నామీద పడచ్చునని. నాకు తోచినట్టు నేను చెప్పిన తరవాత వారిటపాలు చూస్తాను.
   ధన్యవాదాలు

 5. ఇంటిలో అందరి అన్నమయ కోశాన్ని సంతృప్తి పరిచే ఏర్పాట్లు చేసి మరీ మీకు కామెంట్ రాస్తున్నాను. మీ బ్లాగ్ లో విశేషాలతో నాకయితే కడుపు నిండి పోయింది.మనోమయ,విజ్ఞానమయ కోశాలు నిండితే అంతే కదా! చక్కని వివరణలకు ధన్యవాదాలు.మీరు చెప్పిన విషయాలను నేను ఎక్కడయినా ఉటంకించి తే మీకు అభ్యంతరం ఉండదని భావిస్తున్నాను.- డా.సుమన్ లత

  • Dr.R.SumanLata గారు,

   ఆత్మ ఏ కోశానా లేదు అన్నమాట సామాన్య జనం కూడా చెప్పేటందుకు, తెలిసేటందుకు, సామాన్య జనం వాడుకలోకి ఈ మాట తెచ్చేరు మన పెద్దలు.
   ఆది శంకరులు వివేకచూడామణి అనే గ్రంధాన్ని, మణి పూసని, మన జాతికిచ్చారు, ఆత్మ వివేచనకోసం, వైరాగ్యం సాధించుకోడం కోసం. అందులో వస్తాయివి. వివేక చూడామణి చెబుతానంటే ఎవరికి కావాలి, భయపడి బ్లాగునుంచే పారిపోతారని, ఇదిగో ఇలా పరిచయం చేశాననమాట.
   చాలామంది చదివారు, ఎవరూ స్పందించలేదు, మీరు తప్ప. మరికొన్నిటపాలూ రాశాను, వేయనా వద్దా అన్న విచికిత్సలో ఉన్నా.
   వేదాంతాన్ని సామాన్యభాషలో, ఆదిశంకరులు చెప్పినది, చెప్పాలని కుతూహలం.
   నేను చెప్పినది మన జాతి ఉమ్మడి ఆస్థి, మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు, అదినాకు గర్వకారణం కూడా.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s