శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరి ఏడుపు వాళ్ళే ఏడవాలి…..

ఎవరి ఏడుపు వాళ్ళే ఏడవాలి…..                                                  వివేకచూడామణి-2

 

ఎవరి ఏడుపు వాళ్ళే ఏడవాలి…..
ఎవరిచావు వాళ్ళే చావాలిగాని మధ్యలో మనకెందుకూ! అనిగాని ఎవళ్ళచావు వాళ్ళు చస్తారులెద్దూ! అనడంగాని వింటుంటాం, ఇదేంటి?

…..నెత్తిమీద బరువుంటే మరొకరు సాయం చేసి దింపచ్చు, తండ్రి ఋణం చేస్తే కొడుకులు తీర్చచ్చు, కాని షడూర్ములు అనగా ఆరు ఊర్ములు మాత్రం, ఎవరివి వారే తీర్చుకోవాలి, మరొకరు సాయం చేయరు, చేయలేరు. అవి ఆకలి, దప్పిక, మోహం,శోకం,జర (ముసలితనం), మరణం,ఎవరివి వారే అనుభవించాలి, తప్పదు.

నాకు ఆకలేస్తే, మీరుతింటే, నా ఆకలి తీరుతుందా? మీకు దాహమేస్తే, నేను మంచినీళ్ళు తాగితే, మీ దాహం తీరుతుందా? కుదరదు, ఒకరికి కలిగిన మోహం మరొకరు అనుభవిస్తే, వీరి మోహం తీరుతుందా? తీర్చగలరా? ఎవరి ముసలితనం వారే అనుభవించాలి. ఎవరి ఏడుపు వారే ఏడవాలి, ఎవరిచావు వారే చావాలి. అలాగే ఎవరి మటుకువారు స్వప్రయత్నంతో భవబంధాలు తొలగించుకోవాలిగాని, మరొకరు సాయం చేయలేరు. అనారోగ్యం చేసినవారు ఔషధం నియమంగా తీసుకుంటే ఆరోగ్యం కలుగుతుంది, మరొకరు ఔషధం తీసుకుంటే వీరి రోగం కుదురుతుందా? .చంద్రుడెలా ఉంటాడో ఎవరి కళ్ళతో వారు చూసి తెలుసుకోవలసిందే కాని ఇతరులు ఎంత వర్ణించినా తెలుస్తుందా? జ్ఞానేంద్రియాలతో అనుభవించేవన్నీ ఎవరిమటుకువారు అనుభవించవలసినవే. ఆత్మ స్వరూపాన్ని ఎవరిమటుకు వారు జ్ఞాననేత్రంతో చూడాలే తప్పించి, ఎవరూ ఎరుకపరచలేరు. అజ్ఞానము, కోరిక మూలంగా కలిగే బంధనాలను ఎవరిమటుకువారు తొలగించుకోవాలికాని మరొకరు తొలగించలేరు.

ఎవరి ఆత్మానుభవం వారే పొందాలి తప్ప మరొకరు ద్వారా పొందలేరు. ఇంతటి గొప్ప వేదాంత విషయాన్ని ఒక వాక్యంలో ఇమిడ్చి చెప్పేరు, మనకు, వాడుకలో, కాని దానిని దుర్వినియోగమే చేస్తున్నామేమో అనిపిస్తుంది…అదీ ఎవరి ఏడుపు వారే ఏడవాలి అంటే

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరి ఏడుపు వాళ్ళే ఏడవాలి…..

  1. బాగుందండీ !

    ఇంతకీ ఈ ఏడుపు – పుట్టి నప్పటి నించి ఆఖరి క్షణం వరకు వదిలి బెట్టని నేస్తం 🙂
    అదేమి చోద్యమో గాని ఈ ‘ప్రాణ’నేస్తం మరీ మానవాళికి నచ్చని ప్రాణి 🙂

    జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s