శర్మ కాలక్షేపంకబుర్లు-యాచకో…

యాచకో…

యాచకో యాచకః శత్రుః అంటే యాచకునికి యాచకుడే శత్రువు. అదేంటి అడుక్కునేవాడికి మరో అడుక్కునేవాడెందుకు శత్రువనికదా అనుమానం. ఊరు మొత్తం మీద అడుక్కోడానికి ఒకడే ఉన్నాడనుకోండి, అబ్బ ఎంత సుఖం ఏఇంటికెళ్ళినా ఏదో ఒకటి పారేస్తారు గనక కోట్లు కూడబెట్టుకోవచ్చు. మరొకడు తయారయ్యాడనుకోండి అదే ఊళ్ళో అడుక్కోడానికి, అప్పుడు వీడికి పెట్టేవాళ్ళు లేదనచ్చు, పెట్టకాపోవచ్చు, ఏమైనా జరగచ్చు, అందుకు మరో బిచ్చగాడు ఉండకుండా చూసుకుంటాడు, అదే పోటీ లేకుండా. ఇదొకటేనా అబ్బో ఇలా చూస్తే చాలానే ఉన్నాయి లోకంలో మనం పట్టించుకోం అంతే.

జ్ఞాతికి కంటిలోనూ పాముకి పంటిలోనూ విషం ఉంటుందని నానుడి. నిజమేగదా! అదే తల్లితండ్రుల పిల్లలైన ఇద్దరు అన్నదమ్ములూ సుందోప సుందుల్లా కొట్టుకు ఛస్తూనే ఉంటారు. ఎందుకంటే తండ్రి సంపాదించి ఇచ్చినది పంచుకున్నపుడు ఎక్కడో ఒకచోటైనా కలసి ఉండకా తప్పదు, వాడిని చూస్తే వీడికి మంట, వీడిని చూస్తే వాడికి కారం రాసుకున్నంత సుఖం. వాడింట్లో అశుభం జరిగింది, ఇంకేం వీడు చంకలు గుద్దేసుకుంటాడు. రేపు వాడికీ ఇంతకంటే పెద్ద ఆపదొస్తుందనుకోడు, వాడి కాలిరిగితే వీడింట్లో పచ్చిపాలతో పాయసం చేసుకుంటాడు. ఇదే లోకతీరు.

ఒక లాయర్ ని చూడండి పక్కవాడు మంచి కేస్ నెగ్గాడంటే వీడికి కడుపు రవిలిపోతుంది. అయ్యో! మంచి పాయింట్ పట్టేడు కేస్ నెగ్గేడనుకోడు, దొంగ సాక్ష్యం సృష్టించేడంటాడు, వీడు చేసే పనీ అదే.

ఒక కవి మంచి రచన చేసేడనుకోండి పక్క రచయిత ఎక్కడనుంచి ఎత్తిపోతలో అంటాడు, అదేకాదా తను చేసేపని. పాపం ఈ విషయంలో చామకూర వేంకన్నే గుర్తొస్తాడు నాకు, ఏ గతి రచించినన్ సమకాలికులెవ్వరు మెచ్చరేగదా అని వాపోతాడు.

మన బ్లాగుల్లో చూడండి, ఒకరు వరసగా టపాలు రాస్తున్నారనుకోండి, ఇదంతా నిజమంటావా అంటారు మరొకరు, ఎత్తిపోతలేమో అని కామెంట్ తారు మరో మేధావి.. ఒకరో బ్లాగులో కామెంటేరనుకుంటే వారి వెనకబడి మరొకరు మీకేం తెలుసని కామెంట్ తారు. ఖండించే మేధావులు సృజించలేరు పాపం, మరి సృజించేవారిని చూస్తే కడుపు మండదా? 🙂 బ్లాగుల్లో కొస్తే నేర్చుకునేది, చదివేది దుమ్మెత్తి పోసుకోడం, ఒకరినొకరు తిట్టుకోడం ఇదీ … యాచకో…..

అన్నట్టు దుమ్మెత్తిపోయడం అంటే తెలుసా? పాత రోజుల్లో ప్రతివారు ఉదయం నదిలో, కాలవలో, చెరువులో స్నానం చేసి మూడు దోసిళ్ళ నీళ్ళు సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేవారు. ఒకవేళ ఉదయ సంధ్యా సమయంలో స్నానం చేయలేనపుడు మూడు దోసిళ్ళ మట్టిని సూర్యునికి ఎదురుగా పోసేవారు. అలాగే సనాతన ధర్మంలో చాలామంది చనిపోయినవారిని తగులబెడతారు. అలా తగులబెట్టగా వచ్చిన బూడిదను, అస్థికలు వగైరా ఏరి వేసిన తరవాత, నీటిలో కలుపుతారు, చేటతో ఎత్తి. చేటలోకి బూడిద ఎత్తద్దు అంటారు,అలాగే చేటని బోర్లించి కూడా ఏమీ దగ్గరకు తీయద్దంటారు. ఈ రెండు పనులూ శ్మశానంలో మాత్రమే చేస్తాం కనక. ఇందుకే. ఆ ఒక్కసారి మాత్రమే చేటలోకి బూడిద ఎత్తుతారు. ఉదయ సంధ్యలో చేసే కార్యక్రమాన్ని ఇలా మార్చేశారు, కాలంలోమనవాళ్ళు, అదీ సంగతి…దుమ్మెత్తి పోయడమంటే…

అంతెందుకు నిన్నగాక మొన్న జరిగిన రాజమంద్రి సంఘటనలో కాంగ్రెసుల వారికి చంద్రబాబు రాజీనామా చేయాలన్నదే గుర్తొచ్చింది తప్పించి, మరోమాట గుర్తురాలా ! మధ్య తరగతి మేధావులంతా పోలీసుల్ని తప్పు పట్టేరు, మరి సామాన్యులంతా యాత్రీకుల్ని తప్పు పట్టేరు,ఇది తిలాపాపం తలాపిడికిడూనూ… చూశారా లోకం తీరు, అదే! చిత్రం….

ఒక అందమైన అమ్మాయికి మరో అందమైన అమ్మాయే శత్రువు. ఒక బాగాచదువుకునే అబ్బాయికి మరోబాగా చదివేవాడే శత్రువు. రాజకీయనాయకుడుకి రాజకీయనాయకుడు, దొంగకి దొంగ, మేధావికి మేధావి మాత్రమే శత్రువులు. వ్యాపారికి వ్యాపారి, స్త్రీకి స్త్రీ, పురుషునికి మరొక పురుషుడు శత్రువులు. ముల్లును ముల్లుతోనే తీయాలని నానుడి కదా! మరి ముల్లుకు ముల్లే శత్రువు. ఇన్ని చెప్పేరుకదా మీ శత్రువెవరని కదా అనుమానం, నాకు ఆరుగురు శత్రువులున్నారు, బయటికి కనపడరు 🙂 ఒకే పార్టీని మోస్తున్నా పేపర్లు, మీడియాలు సొమ్ముల దగ్గరకొచ్చేటప్పటికి ఎవరి గోలవారిదే ఒకరికొకరు శత్రువులే. నలుపో తెలుపో రూపాయి రూపాయే! అదే అసలు శత్రుత్వానికి కారణం..

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-యాచకో…

  1. మనిషికి తన అహమికయే అసలు శత్రువండీ. నేను ప్రత్యేకం అనుకోగానే కథ మొదలు అవుతుంది. నాది అన్న మాటా మనిషి భాషణలో చేరుతుంది. తనపర బేధాలు తన్నుకు చావటానికే తప్ప (పరానికి)పనికి వచ్చేవి కావు. అందరికీ ఈ సంగతి బాగా తెలుసు. కాని ఎవరి మనస్సులోనూ ఈ సంగతి అస్సలు సరిగా నిలవదు. అదే తమాషా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s