శర్మ కాలక్షేపంకబుర్లు-నూరు సిగలైనా ………..

నూరు సిగలైనా ………..

”నూరుసిగలైనా ఇముడుతాయి కాని మూడు కొప్పులు ఇమడవు” అని నానుడి. ఈ కొప్పేంటీ, సిగేంటీ అని అనుమానం కదూ!.

పూర్వకాలంలో మగవారు కూడా స్త్రీలలా జుట్టు పొడుగుగా పెంచుకుని దానిని తలపై మధ్యకు చేర్చి ముడి వేసుకునేవారు, ఇప్పుడు చెప్పాలంటే నారదుని వేషానికి అలా చేస్తున్నారు. అదే సిగంటే. మగవారు తలపైన వేసుకునే ముడే సిగ, సిగలో పువ్వులు కూడా పెట్టేవారు. సిగపట్లగోత్రాలని, మగవారి దెబ్బలాటలకి పేరు. ఇక కొప్పు అంటే ఆడవారు తమపొడుగైన కబరీ భరాన్ని వెనుకకు దువ్వి దానిని ముడిగా అమర్చుకోవడమే కొప్పు. ఇందులో చాలా రకాలూ ఉన్నాయి, పూర్వపు రోజులలో ఇది ఒక కళగానే అభ్యాసం చేశారు కూడా. సైరంధ్రి అనే వృత్తి పేరు కలిగినవారు ఈ పనిలో నిష్ణాతులై ఉండేవారు,  మనవారు కళాపోషకులే….

ఐతే మన నానుడిలో నూరు సిగలైనా ఇమడటమంటే నూరు మంది మగవారైనా ఒకమాట మీద ఉంటారేమోగాని ముగ్గురు ఆడవారు మాత్రం ఒక మాట మీద ఉండరని, ఉండలేరని ఈ నానుడి ఉవాచ… ఆ ముగ్గురు ఎవరో చెప్పగలరా?……….అ……ఆ….ఓ…

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నూరు సిగలైనా ………..

 1. మరి సిగ ‘రెట్టంటే’ అంత ఈజీ యా మరి 🙂

  ఆ ముగ్గురు ఎవరో చెప్పగలరా?

  చెప్పగలము జి లే బి

  జిలేబి

  • జిలేబి గారు,
   బిలేజి అనేస్తే సరిపోతుందా? అక్కడికి కొస అందించినా చెప్పలేకపోయారోచ్
   ధన్యవాదాలు.

 2. నమస్కారం శర్మ గారు, సామెత పాతదే అయినా, నేటికీ నిత్యనూతనమే. ఇకపోతే, మా ఇంట్లో, మూడు కాదు, నాలుగు కొప్పులున్నాయి ఇప్పుడు (భార్య, భార్య చెల్లెలు, అమ్మ, అత్తగారూనూ). నాలాంటి వాడిని చూసే కాబోలు “ఇంటి కంటే గుడి పదిలం” అన్నారు 🙂

  • ,అరుణ్
   గారు,
   ఐతే రెండు ఆటం బాంబులు రెండు హైడ్రోజన్ బాంబుల మధ్య బతుకుతున్నారనమాట. 🙂 సరదాగా అన్నానండోయ్, మరటువంటపుడు ఇంటి కంటే గుడి “ఆఫీస్” పదిలం.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s