శర్మ కాలక్షేపంకబుర్లు-పోయేకాలం.

పోయేకాలం.

జాయతే గఛ్ఛతే ఇతి జగం. వచ్చేది పోయేది, ఏం పోయేది? ఏం వచ్చేది?, ఈ సృష్టిలోని సర్వస్వమూ కాలం తో పాటు ఈ ప్రపంచంలోకి వస్తుంటాయి, వాటికి పోయేకాలం వచ్చేటప్పటికి పోతుంటాయి. నాటకంలో పాత్రధారి తన పాత్ర అయిపోయిన వెంటనే తెరవెనకకి వెళ్ళినట్టు. ఏదీ ఈ లోకం లో శాశ్వతంగా ఉండదు, ఉండకూడదు కూడా. కొంత కాలం శాశ్వతంగా ఉండేది మాత్రం మంచిమాట. అది కూడా రాని వారి బతుకెందుకో…….పోనివ్వండి.”పోగాలము దాపురించినవారు దీప నిర్వాణగంధమును,అరుంధతిని, మిత్రవాక్యమును; మూర్కొనరు,కనరు, వినరని పెద్దలు చెప్పుదురు”. ఇది చిన్నయసూరి నీతిచంద్రికలో చెప్పినమాట.

నిమిషానికి పదునాల్గు ఊపిరులు తీసుకునే మానవుల జీవితం నూరేళ్ళు. దీనిని పనిగట్టుకుని పాడుచేసుకుంటున్నాం,చాలా రకాలుగా. అందుకే ఏభయి వచ్చేటప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చేస్తోంది, తుఫాను హెచ్చరికలాగా. ఆ తరవాత అరవైనుంచి ప్రతి ఐదేళ్ళకి ఒక ప్రమాద హెచ్చరిక, గంటగంటకీ తుఫాను హెచ్చరికల్లా వస్తూనే ఉంటాయి, పట్టించుకోం. అదేంటి ఉండము, ఎవరైనా పోవలసిందే, అన్నారుగా, ఇక హెచ్చరికలు పట్టించుకోకపోతే వచ్చే నష్టం ఏమని కదా తమరి ప్రశ్న. అవును హెచ్చరికలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పోవడం మాత్రం ఖాయం. ఐతే హెచ్చరిక పట్టించుకుంటే కాలూ చెయ్యీ ఆడుతుండగా దాటిపోవచ్చునని ఆశ, లేకపోతే మంచాన బడితే చేసేవారు లేక చూసేవారు లేక, మూల పారేస్తే పిలవడానికి నోరు పడిపోయి, చలేస్తే ఉన్న దుప్పటీ కూడా కప్పుకోలేక, ఉక్కబెడితే ఫేన్ కూడా వేసుకోలేక,….  అవస్థ, నరకం వేరే ఎక్కడో లేదు, ఈ భూమి మీదే అనుభవించలేక, తిట్టుకోడానికి, (తనని తాను, భగవంతుణ్ణి కూడా,) ఓపికలేక మంచంలో మలమూత్రాలలో ఈదులాడుతూ, ఏదో ఒక రోజు పోతే, చూసేవారు లేక శవం కూడా అలాగే ఉండిపోతే, ఎప్పుడో ఎవరికో దయగలిగి బయట పారేస్తే, ఇదంతా చేయలేనివారు ఏ హాస్పిటల్ లోనో పారేస్తే, అక్కడ ప్రత్యక్ష నరకం క్షణ క్షణమూ అనుభవిస్తూ, శవానికి కూడా వైద్యం చేసి డాక్టర్లు బిల్లు పుచ్చుకుని బయట పారేస్తారు. ఇది  అన్నం తో పుట్టి అన్నంలో పెరిగి అన్నసారం తో ఒళ్ళు మరచి నోటికొచ్చినట్టు పేలే, ఒళ్ళు తెలియని వెధవపనులు చేసే, అన్నమయ కోశం ఆఖరి అవతారం.

ఇదంతా ఎందుకంటే మొన్న ఆదివారం పళ్ళు కట్టించుకోడానికి డాక్టర్ దగ్గరకెళ్ళి వచ్చినప్పటినుంచి, బాగోలేదు. ఉన్నటపాలు వేసేసి ఉయ్యాలలో కూచునిపోయాను, ఒళ్ళూ తెలియలేదు, ఇలా రెండు రోజులున్నా. తెప్పరిల్లుకున్నాకా, భయం కలిగింది, పోతాననికాదు, చావంటే భయం లేదు, నిండు జీవితం గడిపేశాను, తృప్తితో గడిపేశాను, అసంతృప్తి ఏనాడూ లేదు.ఎవరినైనా ఏదైనా మాట అంటే కూడా వారి మంచికోసమే, బాగుకోసమే తప్పించి, నాకు వారిపై ద్వేషం, కోపం, పగ  ఉండవు. ఎవరికైనా నాపై అటువంటి భావాలుంటే అదివారి చిత్తం.  ఇక నాకు కావలసిందేం లేదు, ఇహబంధాలు తెంచుకుంటున్నా, ఇప్పటికే చాలా వదిలించుకున్నా, ఇదొకటి ”తా దూర సందులేదు, మెడకో డోలన్నట్టు” ఉండిపోయింది. కాలూ చెయ్యి బాగోకపోతే, నా పని నేను చేసుకోలేకపోతే ఉండే బాధ మాత్రమే కలగ చేయద్దని భగవంతుని ప్రార్ధిస్తున్నా, .

స్పందించినవారందరికి ధన్యవాదాలు, వేరు వేరుగా సమాధానం ఇచ్చే ఓపిక లేదు.

…. …..ఆరోగ్యం కుదుట పడేదాకా శలవు…..
స్వస్తి.

ప్రకటనలు

23 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పోయేకాలం.

  • మిత్రులు రమణారావు గారు,
   పెద్దలకి నమస్కారం, పెద్దలనుంచి ఇటువంటి మాట మళ్ళీ జీవం పోస్తుంది, ఉత్సాహాన్నిస్తుంది. మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

  • అసలే కొంచెం నలతగా ఉన్న పెద్దమనిషిని ఆయనకి అలవాటులేని భాషలో పరామర్శించడం దేనికండి, జిలేబీ గారూ? మీరు అంటున్నదేమిటో అర్ధంకాక శర్మ గారు తల పట్టుకోవడానికా?

   ( మీరు వ్రాసినది తమిళులు అలవాటుగా వేసే “సౌక్యమా” అనే కుశలప్రశ్న అయ్యుంటుంది – బహుశా. ఆ లిపి నాకు రాదులెండి, అందుచేత ఈ ఊహాగానం. కరక్టేనా? )

   • నరసింహారావు గారు,
    జిలేబి గారా మజాకా 🙂 ఏడ్చేవాళ్ళని నవ్విస్తారు, నవ్వేవాళ్ళని ఏడ్పిస్తారు…అమ్మో ఇంకా చాలా ఉన్నాయి కదా :)….అంతా విష్ణుమాయ..
    ధన్యవాదాలు.

 1. ఈమద్య పిల్లల చదువుల ద్యాసలోపడి బ్లాగులు చూడటంకుదరలేదు.మీరు త్వరగా కోలుకోవాలని ఆ పరమాత్మని కోరుకుంటున్నా.మళ్ళీ మీ నుంచి ఎన్నో మంచి విషయాలు తెలిసికోవలని వుంది.

 2. Sarma ji,

  Dont get discouraged. You will be alright.Just get inspired from Stephen Hawkings.
  I dont have that qualification to give advice still want to solace you.

  Glad to infrom you that i am blessed with baby girl on Sunday evening(26th,Dasami).

  Kindly suggest a name for her.

  Regards,
  Kiran Prasad

 3. ఆరోగ్యం కొంచెం డీలాగా ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు రావడం మామూలే కదా. అయినప్పటికీ ఈ టపా కి వేరేదైనా పేరు పెడితే నయం.
  మీ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని, రెట్టింపు మానసికోల్లాసం కలగాలనీ కోరుకుంటున్నాను.

  • మిత్రులు నరసింహారావు గారు,
   నిన్నటి నుంచి నెట్ వస్తూ పోతూ ఉంది 🙂 మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

 4. కాలక్షేపం వారు,

  సమం.

  సమయం తీసుకుని ఆరోగ్యం కుదుట బద్దాకే మళ్ళీ మొదలెట్టండి ! వీలున్నప్పుడే ! ఆరోగ్యం జాగ్రత్త .

  జాయతే ‘న’ గచ్చతి ఇదం …
  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s