శర్మ కాలక్షేపంకబుర్లు-ఏమీ సయించటం లేదంటే….

ఏమీ సయించటం లేదంటే….

”భోజనానికి లేవమని గంటనుంచి చెబుతున్నా! ఇదుగో అదిగో అంటున్నారుగాని లేవరు. భోజానానికొచ్చి మూడు మెతుకులు తింటే ఆ తరవాత, నీరసమో అనడం అందరిమీద కోపాలు తెచ్చుకోవడం, ఏంటిదంతా చిన్న పిల్లల్లాగా?” అని సముదాయించింది ఇల్లాలు.

”ఏదీ నోటికి సహించటం లేదోయ్! ఎలా మింగను? తినబుద్ధి కావటం లేదని” గునిశాను.

”ఆ మాట చెప్పచ్చుగా, చెప్పకపోతే ఎదైనా ఎలా తెలుస్తుందేం, మీ మనస్సులో దూరి చూస్తానా?” అని ఉతికి ఆరేసింది. కోపమొచ్చిందిగాని ”పేదవానికోపము పెదవికి చేటని”పించి, కాకపోయినా ఇల్లాలు తప్పించి మరెవరు అనగలరులే అని సద్దుకుని బోజనానికి లేచా.

కలగలుపు పప్పు వేసింది, ఎదో ఇలా వేస్తూ ఉంటుందిలే అనుకుని వదిలేస్తే. ”పప్పు కలుపుకు తిని చూసి చెప్పండి” అంది. ఏంటబ్బా అంత ప్రత్యేకంగా చెబుతోందీ అని కలిపి తిన్నా, పుల్లపుల్లగా కమ్మ కమ్మగా బాగుంది, మరి కాస్త వేయించుకు తిని లేచా. ”పప్పు చాలా బాగుంది, దేనితో కలగలుపు” అని ఆరాతీశాను. ఆవిడ ఇలా చెప్పింది.

DSCN0002

వీటిని కమ్మర కాయలంటారు, వేరు ప్రాంతాలలో మరో పేరుతో పిలవచ్చు వీటిని. లేతగా ఉన్నపుడు ఇవి కొద్ది తియ్యగా పుల్లగా ఉంటాయి. ముదిరితే మాత్రం పులుపే. ఇవి చెట్టుకు కాస్తాయి, గుత్తులుగా. పచ్చడి కూడా చేసుకోవచ్చుగాని, నీటి శాతం ఎక్కువ అందుకు పప్పులో వేసుకోడమే బాగుంటుంది.  పప్పుతో బాటే ఉడకబెట్టు కోవచ్చు, ఆ తరవాత ఉప్పు,చిటికెడు పసుపు వేసి, పోపు పెట్టుకుంటే చాలు.

వీటిని పచ్చడి చేసుకోవాలంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. నీరెక్కువుంటుంది కనక చిన్న ముక్కలే మంచిది. కొద్దిగా నూని వేసి వేపుకోవాలి, నీరు ఇగిరేదాకా. కొద్దిగా పసుపేసి ఉప్పు చేర్చి, తగినపోపు వేసుకుని కొద్దిగా చింత కాడ పడేసి ఒక తిప్పు తిప్పేస్తే పచ్చడి బాగుంటుంది. ఇష్టాన్ని బట్టి ఇంగువ వేసుకోవచ్చు పోపులో. పోపులో మరి కొంచం మినపపప్పు ఎక్కువేసుకుంటే పచ్చడి కమ్మహా ఉంటుంది.

షీకాయ ఆకు పచ్చడి చేస్తా, రేపు ఆదివారం సంతలో షీకాయ ఆకు తెద్దాం, గుర్తు చెయ్యండి అంది.  రుచి లేక ఆహారం తీసుకోడానికి ఇబ్బంది పడుతున్న సమయాలలో వెల్లుల్లిపాయ కారప్పొడి,కరివేపాకు పచ్చడి చాలా బాగుంటాయి, ఆకలి పుట్టిస్తాయి, లోపల జ్వరం లాటిది ఉన్నా తగ్గిపోతుంది, ప్రయత్నించండి.

కరివేపాకు పచ్చడి.

చాలా తేలిగ్గా చూసేది కరివేపాకునే. అందుకే ”కూరలో కరివేపాకులా ఏరిపారేశారు” అనటం అలవాటు. కూరలో వేసిన కరివేపాకును కూడా మనవాళ్ళు ఏరిపారెయ్యడమూ అలవాటే. కాని కరివేపాకు చాలా గొప్ప ఉపకారం చేస్తుంది. దీనిలో ఇనుము ఉంది రక్త హీనతకి మంచి మందు. రుచికరంగా ఉంటుంది, పచ్చడి చేసుకోడం ఇలా…

కరివేపాకును కడిగి ఆరబెట్టండి, ఎండబెట్టడం కాదు, దీనిని కొద్దిగా నూని వేసి వేయించండి, సరిపడిన పులుపుకు చింతపండు, పోపు, చిటికెడు పసుపు చేర్చండి. పోపులో కొద్దిగా ఎక్కువగా మినపపప్పు వేయండి. వీటన్నిటిని మిక్సీ లో వేయండి, కొద్దిగా అవసరానికి నీరు చేర్చక తప్పదు. ఇది ఎక్కువకాలం నిలవ ఉండదు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s