శర్మ కాలక్షేపంకబుర్లు- కల్తీ బాబూ! కల్తీ!! కల్తీ!!!

కల్తీ బాబూ, కల్తీ,కల్తీ

శ్రీ విన్నకోట నరసింహారావుగారొక మెయిలిస్తూ కల్తీలని గుర్తించడమెలా అని తెలిపారు, దాని స్ఫూర్తితో ఈ టపా. పాతరోజుల్లోనూ కల్తీ ఉందిగాని ఇంత దారుణంగా లేదనిపిస్తుంది.నేటి రోజుల్లో కల్తీ దారుణమైన స్థితికి చేరిపోయి ఆరోగ్యాలు చెడి కేన్సర్లకి కారణం అవుతోంది. ఘనతవహించిన ప్రభుత్వాలు నిమ్మకి నీరెత్తినట్టున్నాయి. వ్యాపారస్థులదే రాజ్యం.

పాతరోజుల్లో బియ్యంలో రాళ్ళు,బెడ్డలు కల్తీ చేసేవారు, నేడు బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కల్తీ చేసేస్తున్నారు, వీటిని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారట. చూడటానికి ఇవి మామూలు బియ్యం లాగానే ఉంటాయట, ఉడుకుతాయట కూడా, తింటే మాత్రం కేన్సర్లొస్తాయట.

కందిపపులో కేసరిపప్పు, మిగిలిన పప్పులన్నిటిలోనూ ఏదో ఒక పప్పు కల్తీ చేస్తూనే ఉన్నారు.

పంచదారలో నూక కల్తీ, టీపొడిలో రంపపుపొట్టు, కాఫీలో చింతగింజలపొడి, కారంలో గుర్రపు లద్దె ఎండబెట్టి కలిపేస్తున్నారట, కాదేదీ కల్తీ కనర్హం?

నూనెలో జరిగే కల్తీ ఇక మరేదానిలోనూ జరగదంటున్నారు, ఇందులో చనిపోయిన జంతువులనుంచి తీసిన కొవ్వును కూడా నూనెగా కల్తీ చేస్తున్నారు. నేతిలో,వెన్నలో కల్తీ.

వీటి సంగతెలాగూ ఇంతే అనుకుంటే పచ్చి కాయగూరలలో కల్తీ, ఆనప,పొట్ల, పుచ్చ, దోస లాటి కాయలు బాగా పెరగడానికి ఇంజంక్షన్లు చేస్తున్నారు.అన్ని కాయగూరలమీదా పురుగు మందుల అవశేషాలే.

పళ్ళు! అమ్మో పళ్ళంటేనే వణుకు పుట్టే పరిస్థితి వచ్చేసింది. మామిడి, జామ, దానిమ్మ లాటివాటి మీద మెరుపు పూత పెడుతున్నది విషమే.ప్రజలు వీటినే కొంటున్నారు, తింటున్నారు కూడా. కాయలు పక్వానికి రాకుండా కోస్తున్నారు, వాటిని ముగ్గబెట్టడానికి కార్బైడ్ పిచికారీ చేస్తున్నారు. ఈ పళ్ళు చూడ్డానికి బాగుంటాయి, తింటే బాగోవుగాని, హానికర పదార్ధాలు శరీరంలో చేరిపోతున్నాయి, కేన్సర్ కారకాలుగా.అరటిపళ్ళు మరీ దారుణం. చిన్న స్ప్రేయర్ లో కార్బైడ్ ద్రావణం గెలలమీద కొడతారు. మా దగ్గర అలాచేస్తుంటే వద్దని చెప్పేను, కేన్సర్లు వస్తాయన్నా, వినలేదు, నాకు వేరుగా ఇలా ద్రావణం కొట్టనివి కావాలంటే కోసిస్తూ ”ఇవ్వి ముగ్గవండి ఎన్నాళ్ళయినా” అన్నాడు. నిజంగానే అవి ముగ్గలేదు, కుళ్ళిపోయాయి, పారేశాం.ఊరి మొత్తం మీద మీకు ఇలా మందుకొట్టని అరటిపళ్ళు దొరకనే దొరకవని చెప్పాడు మా కొట్టతను, అతను చెప్పినమాట నిజమే.   ఈ ద్రావణం కొట్టిన అరటిపళ్ళు మచ్చలొస్తాయి. మచ్చ వచ్చినంత మేర మిగల ముగ్గిపోతుంది. నిజంగా విషం కొద్ది కొద్ది మోతాదుల్లో మింగడమే, అరటి పండు తినడం అంటే. చూసేనాధుడు, పట్టించుకున్నవారు లేరు. ఏం చేయాలో తోచదు, దీని గురించి చెప్పినా పక్కనున్నవారెవరూ మాటాడరు, నవ్వేసి వెళిపోతారు, అదేదో నా ఒక్కడికోసమే అన్నట్టు..

పాలల్లో నీళ్ళు కల్తీ సత్యకాలపు కల్తీ. ఇప్పుడు అమోనియా యూరియాతో పాలు తయారు చేస్తున్నారు, వాటిని మామూలు పాలలో కలిపేస్తున్నారు, వీటి మూలంగా రోగాలొస్తున్నాయి. పశువులు ఎక్కువ పాలివ్వడానికి హార్మోన్ ఇంజక్షన్లు చేస్తున్నారు. పశువు ఎక్కువ పాలిస్తుంది, ఈ హార్మోన్లు పాలలో ఉండిపోతున్నాయి. ఈ పాలు తాగిన పిల్లలూ పెద్దలకూ పెరుగుదల సమయప్రకారం ఉండటం లేదు. చిన్న తనం లోనే అనేక పెద్దవారి లక్షణాలు వచ్చేస్తున్నాయి, గడ్డం రావడం, ఆడపిల్లలలో పది సంవత్సరాలూ ఆలోపులేనే ఋతువురావడం జరుగుతోంది.

మనుషుల మనసుల్లో కల్తీ,ఎదురుగా ‘తాతగారు నమస్కారం; అంటున్నారు, వెనక ‘దొంగ ముండా కొడుకు’ అని తిట్టుకుంటున్నారు, వారెవరో కూడా నాకు తెలుసు. 🙂 భార్యభర్త మధ్య డబ్బు కల్తీ, కొడుకు తండ్రి, తల్లి బిడ్డ మధ్య డబ్బు కల్తీ తో మనసు కల్తీ జరుగుతోంది. ఈ కల్తీ సరుకులు తిని ఆడ మగ తొందరగా ఉద్వేగాలకూ లోనవుతున్నారు.

అంతెందుకు తల్లిపాలల్లో కల్తీ! ఆగండి ఆగండి, ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నారే, తల్లిపాలల్లో కల్తీయా? నిలదీశారొకరు, నిజమండి బాబూ, సత్యప్రమాణంగా నిజం, ఒట్టు, అమ్మతోడు, ఎలాగో చెబుతా వినండి మరి. తల్లి తినే ఆహారంలో అన్నిటి మీద పురుగుమందుల అవశేషాలున్నాయి, అవన్నీ తల్లిపాలల్లో కనపడుతున్నాయి. ఇది నా సొంత కవిత్వం కాదు, ఘనతవహించిన ప్రభుత్వం వారు ప్రకటించినదే.

కల్తీ ఎవరు నిరోధించాలి? ప్రభుత్వంవారే, గొప్ప చట్టం కూడా ఉంది, కల్తీ చేస్తే మూడేళ్ళు కఠిన కారాగారం విధించచ్చు, కాని ఎక్కడా దీన్ని అమలు పరచిన దాఖలా మాత్రం కనపడదు. సామాన్యుడు ఏదైనా కేస్ పెట్టాలంటే ముందు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారిని పట్టుకోవాలి, అమ్మో భగవంతుడినైనా వెతకి పట్టుకోవచ్చేమో గాని వీరు మాత్రం దొరకరు, ఒకవేళ ఖర్మ కొద్దీ దొరికినా, మనం కేస్ బుక్ చేయాలనుకునేదగ్గరికి మనకంటే ముందు కబురు చేరిపోతుంది. కాదని కష్టపడి వీరిని తీసుకొచ్చి కేస్ బుక్ చేయడానికి సేంపిల్ తీసుకుంటే, ఆ సేంపిల్ లేబ్ కి వెళ్ళాలి, ఇదక్కడికి చేరేలోగానే మారిపోతుంది, ఒకవేళ అదీ జాగ్రత్త పడినా లేబ్లో మారిపోతుంది. అక్కడా గట్టిగా పట్టుకుని రిపోర్ట్ ఆ సరుకు కల్తీ అని రిపోర్ట్ వచ్చినా కేస్ పెట్టి అది ఋజువయి వర్తకునికి శిక్ష పడేటప్పటికే పదేళ్ళో, పదిహేనేళ్ళో పట్టావచ్చు, నాలాటివాడైతే పైకీ పోవచ్చు, లేదా ఇటువంటి కేస్ పెట్టించి ఇంత పట్టుదలగా చర్య తీసుకోవాలనుకున్నందుకు నాకే వర్తకసంఘం వారు శిక్షా విధించి పైకీ పంపేయచ్చు. సామన్యులకి ఇంత ఓపికా, సమయం,డబ్బు ఖర్చూ చేయగలరా? చేయలేరనే వర్తకుల నమ్మకం, నిజం కూడా. అందుచేత ఇవేవీ జరిగే పనులుకావు, ప్రభుత్వానికి తెలియదా? మరేం చేయాలి? దీనికి మార్గం…..చెప్పండి, కొనకపోడమే అనకండి, సాధ్యం కాదు…మరేం చేయాలి?

Ways To Spot Adulterated Food

Be it milk, paneer, tea or oil, nothing comes in its purest form. Until the time it reaches you it is adulterated and it then becomes harmful. Therefore, here are 13 tricks to spot the golmaal that happens with your daily food items.
1. Tea

unnamed

tea
Image Credit: midwestteafest.com
The chai you’re drinking isn’t coming straight away from the Assam fields.
How to spot fake: In order to check whether the chai powder is pure, put a teaspoon of it in cold water; if the cold water turns brown then your chai is adulterated!
2. Frozen peas

unnamed (1)

green peas
Image Credit: catalystcooks.com
We stock frozen peas in our refrigerators because they come in handy. However, some packets consist a dye compound called ‘malachite green’, which can trigger stomach related ailments.
How to spot fake: Take water in a kadhai and put some peas and stir. If the water turns green, then immediately discard the packet as they are unsafe to consume.
3. Cinnamon sticks

unnamed (2)

cinammon sticks
Image Credit: sheknows.com
You can find out if you have bought authentic cinnamon sticks.
How to spot fake: Smash the sticks with your hands, if your hands get coloured then they are authenticate, if not then they aren’t.
4. Turmeric root

unnamed (3)

turmeric
Image Credit: authoritynutrition.com
Even if you’re crushing the turmeric roots and consuming it, the roots can be fake.
How to spot fake: Take a turmeric root on paper and pour cold water over it. If the root leaves colour, it’s a polished one and is impure.
5. Apples

unnamed (4)

wax apples
Image Credit: reddit.com
A polished apple will not keep you away from the doctor, but will take you to one. Did you know that apples are polished with wax to give them a ‘fresh’ look?
How to spot fake: To see if your apple isn’t wax covered, take a knife and slowly scrape the skin of your apple. If the knife extracts white, then that’s wax!
6. Black Pepper

unnamed (5)

pepper
Image Credit: premiumgroup.co.in
Even pepper can be adulterated with mineral oil!
How to spot fake: An adulterated pepper would shine and emit kerosene smell.
7. Cumin seeds

unnamed (6)

jeera
Image Credit: YouTube
Cumin seeds (jeera) are very essential part of cooking as we use it in our tadka daily. They can be coloured with charcoal dust.
How to spot fake: Crush the seeds in your palm, if your palm turns black then they contain charcoal.
8. Milk

unnamed (7)

milk
Image Credit: nutritioncare.net
Our milkman not only fools by adding water to it. Milk can be adulterated with detergent and synthetic milk too.
How to spot fake: Mix 10 ml of water and milk in the same proportion. If you notice foam or lather, then the milk contains detergent. To detect synthetic milk, boil the milk. If a yellowish lather forms, then the milk is synthetic milk.
9. Coriander powder

unnamed (8)

coriander
powder
Image Credit: fooddrink.photography
There could be sawdust in your coriander powder.
How to spot fake: Put some coriander powder in the water, the flakes of sawdust will float on water.
10. Coconut oil

Liquid and solid coconut oil on palm leaf .

Liquid and solid coconut oil on palm leaf .

coconut oil
Image Credit: corewalking.com
Coconut oil can be adulterated with other cheap oils.
How to spot fake: Put the coconut oil bottle in refrigerator, the solidified layer is coconut oil, whereas the liquid oil is an adulterant.
11. Honey

unnamed (10)

honey
Image Credit: fairtradeusa.org
To find granules of sugar is not a foolproof way to check the purity of honey.
How to spot fake: Take a cotton wick and dip it in honey. Then try to burn it. If the wick burns readily then the honey is pure, and if it crackles then it’s not.
12. Paneerunnamed (11)

paneer
Image Credit: food.sulekha.com
That paneer in your paneer mutter is not really paneer. It’s starch. Paneer is one of the most adulterated items in our country.
How to spot fake: Take water and put a cube of paneer and boil it. Once it cools down, put some drops of iodine solution on it. If the paneer turns blue, then the starch is present in it.
13. Chilli powder

unnamed (12)

chilli powder
Image Credit: whatscookingwithdoc.com
Did you know you could be eating brick instead of chilli powder? That’s because crushed red brick looks exactly like chilli powder and therefore it is put in your masala.
How to spot fake: Put a teaspoon of chilli powder in a glass of water. If the solution emits colour then your chilli powder is adulterated.

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- కల్తీ బాబూ! కల్తీ!! కల్తీ!!!

 1. కల్తీ గురించి , చక్కని టపా వేశారు ! ధన్య వాదాలు !
  ఇక కర్తవ్యం ! ? అది ప్రతి ఒక్కరిదీ !
  ఎందుకంటే , దేశం లో ప్రజా స్వామ్యం ఒకటి ఉంది కనుక !
  ” ఎవరో వస్తారని , ఏదో చేస్తారని , ఎదురు చూసి మోసపోకు మా !
  నిజం మరచి నిదుర పోకు మా ! ”
  అన్నాడు ఏనాడో , మహాకవి శ్రీ శ్రీ !

  • సుధాకర్జీ,
   మనకెందుకు, ఇదెవరిదో సమస్య అనుకునే మనస్తత్త్వం మారాలండి. ఇది ప్రచారం చేయాల్సిందే, తప్పదు. హైకోర్ట్ తీసుకుంది కనక ఇప్పుడు ఆ వేడిని చల్లారనివ్వక చూసుకోవాలి.
   ధన్యవాదాలు.

 2. శర్మ గారు, త్వరగా ముగ్గించేసి, త్వరగా అమ్మేసుకుని, త్వరగా లాభాలు చేసేసుకోవాలనే వర్తకుల ఆత్రం అర్ధమవుతోందనుకోండి. కానీ తెలుసుకోవాలనే కుతూహలంతో (జనరల్ నాలెడ్జ్ కోసం అనుకోండి) అడుగుతున్నాను – అరటి గెలలు కోసి, త్వరగా పండడానికి కాయల మీద కార్బైడ్ ద్రావణం కొడుతున్నారు కదా – దాని బదులు చెట్టునుండి దింపకుండా గెలల్ని చెట్టు మీదే వదిలిస్తే కాయలు వాటంతటవే ముగ్గవా సహజంగా ?

  • విన్నకోట నరసింహారావుగారు,
   ఈ సమస్య మీద మొన్న పేపర్లో వార్త వచ్చిందట. దానిని సుమోటో గా హైకోర్ట్ తీసుకుని ప్రబుత్వాలకి నోటీస్ లు ఇచ్చిందట. శుభం. వేడి చల్లారనివ్వక పట్టుకోడమే కావలసినది.
   అలా గెలలను వదిలేయకూడదండి. ముగ్గించడానికి సంప్రదాయ పద్ధతులున్నాయి, అవి మంచివి. వీటి గురించి మరొక టపా బాకీ పెట్టించేసేరు నాచేత 🙂
   పదిరోజులనుంచి నెట్ వస్తూ పోతూ చిత్రహింసపెడుతోంది.
   ధన్యవాదాలు.

 3. మిరియాలల్లో మరో రకం కల్తీ కూడా జరుగుతుందని విన్నాను – వాటిల్లో ఎండబెట్టిన బొప్పాస కాయ గింజలు కలుపుతారట. శతకోటి దరిద్రాల కి …..
  ఇక్కడ సూచించిన పరీక్షలు గమనించారా ? అవి చాలా వరకు సరుకు కొనుక్కుని షాపు నుంచి ఇంటికి తెచ్చుకున్న తర్వాత చేసేవి (నీళ్ళల్లో కలిపడమో, కాల్చడమో, కత్తితో కొయ్యడమో చెయ్యమంటున్నారు కాబట్టి). అప్పటికే మన డబ్బులు షాపువాడికి ఇచ్చేసుంటాం.
  ఇహ చెయ్యగలిగినది గవర్నమెంట్ శాఖకి ఫిర్యాదు ఇవ్వడం, వారు శాంపుల్ని లాబ్ కి పంపడం, ఆ ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషించే అవినీతి, రాజకీయ నాయకుల జోక్యం, వగైరా వగైరా – ఆ భాగోతమంతా మీరు వర్ణించినట్లుగానే ఉంటుంది.
  ప్రస్తుతం అన్ని రంగాల్లోను మనదేశాన్ని కమ్మేసిన వ్యాపారసంస్కృతి అన్ని విలువలకీ తిలోదకాలిచ్చేసింది. ఈ వాతావరణంలో సామాన్య మానవుడు ఏం చెయ్యాలి / చెయ్యగలడు అన్నది పెద్ద ప్రశ్నే 😦 ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చెయ్యకపోవడం మనదేశంలో చాలా మామూలే కదా.
  మనదేశం గురించి మనమే అనుకోవలసి రావడం దురదృష్టకరమే గానీ అనక తప్పదు – ఇది దారి తప్పిన దేశం:(

  • విన్నకోట నరసింహారావుగారు,
   ఇదొక ప్రజా ఉద్యమం కావాల్సిందే. మనకి దెబ్బలాడుకోడానికే సమయం సరిపోటం లేదు, ఇటువంటి సమస్యలు కనపడతాయా? 🙂 దారి తప్పిన దేశంని నిస్పృహ పదద్దు, దారికి తెచ్చుకుందాం, కృషితో నాస్తి దుర్భిక్షం
   ధన్యవాదాలు.

   • మీ ఆశావాదం మెచ్చదగినదే శర్మ గారు. అలాగే ఉండాలి కూడాను. అయితే 1961 లో అమెరికా అధ్యక్షుడు అయిన జాన్ కెనెడి గారు అన్న peace in our lifetime అనే మాట గుర్తొస్తుంటుంది. ఇప్పుడు వారి ప్రస్తావన ఎందుకయ్యా అంటారేమో? ప్రస్తుతం దారి తప్పి నడుస్తున్న మనదేశం ఎప్పటికో తిరిగి దారిలోకి వస్తుందేమో; అయితే అది మన జీవితకాలంలో (in our lifetime) జరుగుతుందా – అంటే మనం చూడగలుగుతామా – అనిపిస్తుంటుంది. సర్లెండి ఎప్పటికి జరిగినా సంతోషమేగా.

   • మిత్రులు విన్నకోట నరసింహారావుగారు,
    నిన్నను ఏమీ చేయలేమనే అనుకున్నాం, మరి నేడు హైకోర్ట్ స్పందించింది కదా! ఆశ మానవుడికి ఆలంబన, అదిలేనిరోజు అభివృద్ధి లేదు. జీవనం ఆగినట్టే. మనం చూడ లేకపోవచ్చు, మార్పు, నాకైతే పోరాడాలనే ఉంది, ఈ వయసులో కూడా. ఇది జీవన్మరణ సమస్య, ఒకరిదికాదు అందరిది. ఎవరో చేస్తారనుకుంటే ఎలా?

    అమ్మేవాడికి చెబుతూనే ఉంటా, నన్ను పిచ్చివాడిలా చూసినా సరే, కార్బైడ్, పూతలు పెట్టి వాడు అలా తయారుచేసి ఉండకపోవచ్చు, కాని వాటి న్గురించిన నిజాలు ఆ అమ్మేవాడికి ఒక క్లాసు పీకడం,అలవాటే నాకు. ఏమవుతుంది? ఏమీ కాకపోవచ్చు, ఏదో ఒక రోజు నా మాట వాడికి గుర్తు రాకపోదా? విషం అమ్ముతున్నామని
    ధన్యవాదాలు.

 4. కొసమెరుపు ఏదంటే ఆర్గానిక్ పంటల పేరుతొ ఆర్థిక దోపిడీ కూడా పక్కనే కాసుకుని ఉందని కూడా మనకు అవగతమే! ———– డా-సుమన్ లత

  • Dr>R.SumanLataగారు,
   మీరన్న ఈ మాట నిజమే, ఇక్కడ డబ్బు ఒకటే పోతోంది, అక్కడ డబ్బు ఆరోగ్యం కూడా పోతున్నాయి.
   ధన్యవాదాలు.

 5. మీరు చెప్పినవన్నీ సత్యాలే కానీ మనం ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి .వీటిలో ఏవి మానెయ్యగలం చెప్పండి?అందుకే తిండి అంటే విరక్తి తొందరరగా వచ్చేస్తోంది.ఇప్పుడు’ అన్నమయినా మరి సున్నమయినా ‘……… అని తత్త్వం పాడాలా లేక భారతీయుల కర్మ సిద్ధాంతం ప్రకారం “మనఖర్మ” అనుకోవాలా లేక నిష్కామ కర్మ లా భోజనం చెయ్యటం కూడా’ ఒక పని అయింది బాబూ ‘అనుకుంటూ చేతులు కడుక్కోవాలా అన్న పెద్ద సందేహం పట్టి పీడిస్తోంది..ఇలా రాసేనంటే ఎంత ఆవేదన పడుతున్నామో అందరికీ అర్థం అవుతుంది కదా! దయచేసి అన్యథా భావించ వద్దని మనవి. ఇవన్నీ ప్రాథమిక అవసరాలే తప్ప విలాస వస్తువులు కావు కదా! ఈ కల్తీ చేసే శాల్తీల కు వేరే శిక్ష ఎందుకు?ఈ సామాన్లన్నిటినీ బలవంతంగా వారి చేత, వారి కుటుంబ సభ్యుల చేత తినిపించాలి., డా.ఆర్.సుమన్ లత

  • Dr>R.SumanLata గారు,
   మన ఖర్మ అనుకుని వదిలేస్తే చివరికి అందరం ములిగిపోతాం. అదే చెప్పేను మా అరటిపళ్ళ కొట్టువాడికి. అతని తండ్రి ఇలా కేన్సర్ తోనే చనిపోయాడీ మధ్య. అప్పుడు చెప్పేనతనికి, బాధపడ్డాడు, ఏం చేయనండి అందరూ చేస్తున్నారు, నేనొక్కణ్ణీ అంటే కుదురుతుందా అని. మార్పు రావాలి ఎక్కడో ఒకచోట మొదలవాలి.
   ధన్యవాదాలు.

 6. చాలా useful information ఇచ్చారు.నేను కూడా పత్రికల్లో ,పుస్తకాల్లో చదివాను.కాని ఇలా ప్రతీ వస్తువూ, సరుకూ పరీక్ష చెయ్యడానికి టైమూ,ఓపిక ఎంతమందికి ఉంటుంది?ఒకవేళ తీరా కల్తీ అని తేలాక మీరు చెప్పినట్లు చేసేదేముంది?ఈ మధ్య organic foods అని వస్తున్నాయి. వాటి ఖరీదు ఎక్కువైనా ,వాటిని కొని వాడుతే మంచిదేమో.

  • మిత్రులు రమణారావుగారు,

   నిజమే మీరన్నమాట. దానికో ఉదాహరణ మేమే. మొన్న వేసవిలో మామిడికాయలు అమ్మేం, పెరటి చెట్టువి, ఎగబడి కొనుక్కుపోయారు. చివరగా ఒకరు పది కాయలు కావాలని చాలాబతిమాలి, కోయలేం వెతికి, అన్నా వదలకపట్టుకెళ్ళేరు. మొన్న తెలిసింది కారణం. మేము చెట్టు మీద కీటక నాశనులుగా వేప, జిల్లేడు వగైరాలతో తయారు చేసిన ద్రావణం జల్లుతాము. అందుకు టెంకకి కాయకి పురుగు పట్టదు. మార్కెట్ లో వచ్చిన అన్ని కాయలకి పుచ్చు ఉందిట. అందుకు ఎగబడి కొనుక్కుపోయారు. ఇదో చిన్న ఉదాహరణ కదా!
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s