శర్మ కాలక్షేపంకబుర్లు-శతకోటి దరిద్రాలకి…..

శతకోటి దరిద్రాలకి…..

శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు, ఇది మన తెనుగునాట చెప్పుకునే నానుడి.

నిజంగానే దరిద్రాలు శతకోటే కాని ఉపాయాలు మాత్రం అనంతకోటే. ఈ విషయంలో భారతీయుల తరవాతే ఎవరైనా సరే, ప్రపంచం మొత్తం మీద. వద్దన్న పని చెయ్యడానికే ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు కూడా , ఇది మన భారతీయులకే ప్రత్యేకం.

బంగారం దొంగచాటుగా తేవద్దు అది మన ఆర్ధిక వ్యవస్థని బలహీనపరుస్తుందని ప్రభుత్వం చెబుతోంది, ఎవరు మానేరు? తేవడం, ఆఖరికి మర్మ స్థానాలలో కూడా పెట్టుకుని తెస్తూనే ఉన్నారు. ఇంకా చిత్రం మత్తు మందులు స్మగుల్ చేసేవారు వాటిని కేప్సూల్స్ లాగా చేసుకుని మింగి ఇక్కడికొచ్చాకా వాటిని బయటికి మలద్వారం గుండా తెచ్చుకుని బయట అమ్ముతున్నారు. మొన్నటికి మొన్న నీలి వెబ్ సైట్ లని బేన్ చేస్తే గోల గోల చేశారు,స్వాతంత్ర్యం, మరేదో హక్కులూ అంటూ. నిజానికి ఆ బేన్ చేసిన వెబ్ సైట్లు కూడా మరో పేరుతో కనపడుతున్నవే.

ఒకప్పుడు ఆంధ్రాలో శారదా చట్టం తెచ్చేరు, పదునాలుగేడులలోపు ఆడపిల్లలకి వివాహం చేయ కూడదూ అని, ఏం చేశారు మనవాళ్ళు? పక్కనే ఉన్న యానాం ఫ్రెంచ్ వారి ఆధీనం లో ఉండేది, అక్కడికిపోయి, పెళ్ళిళ్ళు చేసేరు, ఇప్పటికి యానాం లో వేంకటేశ్వర ఆలయానికి కల్యాణ వేంకటేశ్వర ఆలయమనే పేరు.

నేటి కాలానికి మరో ఉపాయం, హైదరాబాదులో డ్రంక్ అండ్ డ్రైవ్ బాగా పరిశీలిస్తూ, కేస్ లు బుక్ చేస్తున్నారు. కొందరు పెద్దలకు కూడా శిక్షలు పడ్డాయి. దీనికి ఒక విరుగుడు కనిపెట్టేరు. ఎలాగో తెలుసా? డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్న చోటికి కొద్ది దూరంలో ఒకరు కారు ఆపుతారు, సదరు కారు నడుపుతున్న వ్యక్తి కనక తాగి ఉంటే ముందుకెళితే పోలీస్ కేస్ వగైరా జరుగుతుంది, చెక్ ఉంది అని చెబుతారు. చెక్ దాటిపోయేదాకా తాను ఆ కార్ డ్రైవ్ చేస్తాడు, అందుకుగాను వందో రెండు వందలో పుచ్చుకుంటాడు, అతనికి సొమ్ము, కార్ యజమాని శిక్ష తప్పించుకున్నట్టే. మరి అలా ఒకే వ్యక్తి అనేక కార్లలో వస్తుంటే మరి పోలీస్ ఎందుకు గుర్తించటం లేదో తెలీదు, బహుశః ఈ ఏర్పాటు పెద్దల ఆశీర్వాదం తోనే నడుస్తోందేమో! శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు కదా!!

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-శతకోటి దరిద్రాలకి…..

 1. < "వీళ్ళు మళ్ళీ తొందరలో మరలా మరో గొప్ప ఐడియాతో తిరిగిరారూ…"
  తప్పకుండా తిరిగొచ్చే అవకాశాలే ఎక్కువ. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అని ఉన్నదే కదా 🙂
  అన్నట్లు శుభవార్త. మీ బ్లాగ్, కామెంట్లు మళ్ళీ "మాలిక" లో కనిపిస్తున్నాయండోయ్.

  • విన్నకోట నరసింహా రావు గారు,
   మళ్ళీ తిరిగొస్తారు, తప్పదండి. శతకోటి దరిద్రాలకి….నిజంకదా 🙂
   వారం కితం భరద్వాజ గారికో మెయిలిచ్చా. పాపం పనిలో ఉండి కూడా సమాధానమిచ్చారు, సరిచూస్తున్నామని. భరద్వాజ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మళ్ళీ కామెంట్లు మాలిక లో కనపడుతున్నాయి 🙂
   ధన్యవాదాలు.

   • మాలికలో వచ్చే , బ్లాగిల్లు లో పోయే రామా హరే ! 🙂
    నేనేమి చేతునో కృష్ణా హరే ! ముకుందా హరే !

    విష్ణుమాయా హరీ 🙂

    జిలేబి

   • జిలేబి గారు,
    బ్లాగిల్లు సెప్టెంబర్ తో ఏదో మార్పొస్తుందని శ్రీనివాస్ అన్నారు. అదేదో జరిగుంటుంది.

    ధన్యవాదాలు.

 2. శతకోటి దరిద్రాలకి …………… అనే సామెతకి మీరు చెప్పిన డ్రంకెన్ డ్రైవింగ్ కేసులనుంచి తప్పించుకోవడానికి కనిపెట్టిన మార్గం మాత్రం తలమానికంలాంటి ఉపాయం శర్మ గారు, హ హ్హ హ్హ. నిజంగా మనిషి తెలివితేటలు వక్రమార్గాలు వెదకడానికి ఎంతగా ఉపయోగపడుతున్నాయో కదా 😦 ఈ ఉదాహరణ ఇస్తూ మీరు వెలిబుచ్చిన – అదే వ్యక్తి / ఒకే బాచ్ వ్యక్తులు వెంటవెంటనే అనేక కార్లల్లో వస్తున్నారంటే దీనికి పెద్దల ఆశీస్సులు ఉన్నాయా – అనే సందేహం సత్యదూరం కాకపోవచ్చు.
  మేరా భారత్ మహాన్.
  “నా జన్మభూమి ఎంత ……….. నా సామిరంగా”.

  • విన్నకోట నరసింహారావు గారు,
   మనదేశం లో ఏదైనా సాధ్యమేనండి. అంతెందుకు వేంకన్న బాబుకే శఠగోపం పెడుతున్నారు, సామాన్య భక్తులు, అదెలాగో చూడండి.

   శ్రీవారు వైకుంఠం ద్వారా తనని దర్శించేవారికి ఉచిత లడ్డూ టొకెన్ ఇస్తారు. ఇంకెందుకూ ఆలస్యం. ఒక ముఠా ఏర్పడిపోయింది, దానికో నాయకుడూ తయారయ్యాడు. వీరు రోజూ ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు వైకుంఠం ద్వారా దర్శనం చేసుకుని ఒక లడ్డూ టోకెన్ తెచ్చుకుని బయట నాయకుడికి అమ్మేస్తారు. నాయకుడు ఈ టోకెన్లతో లడ్డూలు తీసుకుని బయట అమ్ముతాడు. పెట్టుబడిలేని లాభసాటి వ్యాపారం. ఇదిగో ఇది పట్టుకుని వారి వేలి ముద్రలు తీసుకుని పోలీస్ కి అప్పగించారట. వీళ్ళు మళ్ళీ తొందరలో మరలా మరో గొప్ప ఐడియాతో తిరిగిరారూ…ఆశావాదులం కదా 🙂 శతకోటి దరిదరిద్రాలకి…
   ధన్యవాదాలు.

 3. దీన్నే, ‘స్టార్ట్’ అప్, స్టాండ్ అప్ ‘ అన్న స్కీమ్ క్రింద మన ఆంధ్ర దేశం పరిగణించాలని, ‘ఇన్నోవేటివ్ ఆంధ్రాస్’ అవార్డ్ వారికి ప్రధానం మన గవర్నమెంటు వాళ్ళు వారికి కితాబు లివ్వాలని ఈ పంచ దశ లోకం మూలం గా అధ్యక్షా గవర్నమెంటు వారిని కోరుతున్నా 🙂

  జిలేబి

  • Zilebi గారు,
   భారదేశం లో ఏదైనా సాధ్యమేనండి, అందునా మీలాటివారు తలుచుకుంటే అసాధ్యమా? వారికి తప్పనిసరిగా భారత రత్నలే ఇవ్వాలండి. 🙂 వెంకన్నబాబుకే శఠగోపం పెడుతున్నారు, అది విన్నకోటవారి కామెంట్ లో చెబుతా.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s