శర్మ కాలక్షేపంకబుర్లు-అన్నమయకోశం

అన్నమయకోశం.                                                        వివేకచూడామణి-3                           

”నేనెవరు?” అనే ప్రశ్నకి సమాధానం ఆత్మ ఐతే, ఆత్మ ఎక్కడుంది? ఈ శరీరమే ‘నేను’ అనే ‘ఆత్మ’ యా?శరీరం పంచకోశ నిర్మితం, ఆ ఐదు కోశాలూ 1.అన్నమయ కోశం2.ప్రాణమయ కోశం 3.మనోమయ కోశం 4.విజ్ఞానమయ కోశం 5.ఆనందమయ కోశం. మరి ఈ పంచకోశాలేంటీ?

అన్నం నుంచి పుట్టిన ఈ శరీరమే అన్నమయ కోశం, ఇందులో అస్థి,మజ్జ,మాంసం,మేద,రక్తం, మూత్రం, పురీషం మొదలైనవన్నీ ఉంటాయి.

అన్నమయ కోశం :- అన్నం ఎలాపుడుతోంది? ’పర్జన్యాదన్న సంభవః’ అన్నారు, భగవానులు. అంటే మేఘం వలన అన్నం పుడుతుంది. ఉత్తిమాటలా ఉందా, అవునా? అలాగే అనిపిస్తుంది. చాలా పెద్ద విషయాలను చిన్న మాటలలో ఇమిడ్చి చెప్పడం, అవి నిత్య వ్యవహారంలో వాడుకలో ఉండటమే భారతీయత లక్షణం. సూర్యుడు సముద్రపు నీటిని ఆవిరి చేసి మేఘంగా తయారు చేస్తాడు. దానిని గాలి తరిమితే అనుకూలమైన చోట వర్షం పడుతుంది. విత్తనం, నీటితో పాటు మిగిలిన నాలుగు భూతాల సంయోగంతో మొలకెత్తితే పంట పండుతుంది, ఈ పండిన పంటను ’ఓషధి’ అంటాము. దీనిని జీవులు తింటాయి. ఇది అన్ని జీవులకూ ఉన్నదే, మానవులకూ ఉంది. ఇంతటి విషయాన్ని ’పర్జన్యాదన్న సంభవః’ అని చిన్నమాటలో చెప్పెసేరు.

అన్నం నుంచి ఈ శరీరం పుట్టింది.అన్నంతోనే పెరుగుతుంది, అన్నం లేకుంటే మరణిస్తుంది. ఎముకలు, మజ్జ,మాంసము, మలమూత్రాలతో కూడిన ఈ శరీరము ఆత్మ కాజాలదు. ఈ శరీరం నియమింపబడుతోంది. నియమింపబడేది ఆత్మ ఎలా అవుతుంది?మూఢులు ఈ శరీరమే ఆత్మ అనుకుంటారు, చదువుకున్నవారు జీవుడే ఆత్మ నుకుంటారు కాని విజ్ఞానం కలవారు మాత్రం సత్యమైన ఆత్మయందే ”నేను”అనే భావం కలిగి ఉంటారు.ఎంత చదువుకున్నవారైనా ఈ శరీరమే నేను అనే భావాన్ని వదలనంత కాలమూ మోక్షం అనేదే లేదు. మన నీడ మనం కానట్టు, ఛాయాచిత్రమే మనము కానట్టు ఈ శరీరమే నేను అనే ఆత్మకాదు.

మరి ఈ అన్నమయకోశం మానవుల పుట్టుకకు ముందులేదు, మరణం తరవాతా లేదు, అందుచేత ఇది ఆత్మ కాదు, ఆత్మ అన్నది పుట్టుక చావూ లేనిది కదా! అందుచేత ఈ కోశంలో ఆత్మ లేదు.

ఈ అన్నమయకోశానికి ఎన్నో! ఆకలి,దప్పిక, జర,రుజ, మోహం,శోకం, మరణం. ఇవికాక పూతలు, అందాలు, సొగసులు వీటికోసం శ్రమ, మరొకరితో పోలిక. ఇంకా మానం, అవమానం, ఎవరో అందంగా ఉన్నావంటే ఆనందం, ముక్కుబాగోలేదంటే డొర్ర ముక్కులా ఉందంటే అవమానం, ఎన్ననీ. చీకిరికళ్ళలా ఉన్నాయంటే కళ్ళు పెద్దవి చేసుకోడానికి పడరాని పాట్లు, అందాలకోసం ప్లాస్టిక్ సర్జరీలు. కొత్త కొత్త అనుభవాలకోసం తపన. ఇలా ఎన్నెన్నో, వీటితో నిందిపోయి కోరికలపుట్టగా ఉండేదే ఈ అన్నమయ కోశం.
అంతెందుకు? దూషణ,భూషణ,తిరస్కార,అలంకార,మమకారాలూ, సర్వ అనుభవాలూ నేనే అనుకుంటుందీ అన్నమయ కోశం,ప్రాణ, మనోమయ కోశాలతో కలసి. దీని ప్రజ్ఞ మెలకువలోనే. మిగిలినవి తరవాత. బోర్ కొడితే మానేస్తా…  🙂

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అన్నమయకోశం

 1. “కోశం” లో పడ్డారు 🙂

  వెల్కం బెక బెక !

  అల్ ది బెష్టు 🙂

  చూద్దాం ఆత్మా రాముణ్ణి ఏ ‘కోశం’ లో నిర్దారిస్తారో 🙂

  చీర్స్
  జిలేబి

  • జిలేబిగారు,
   నిరాశలో కూరుకుపోను, అదేనాకు భగవంతుడిచ్చిన వరం.
   ఆత్మ ఎక్కడున్నది ముందెకెళ్ళితేగాని తెలీదు కదా!
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s